Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: త్యాగాలు.. ఎమోషన్లు.. ఏడిపించేసిన కంటెస్టెంట్స్! ఇదో మినీ ఫ్యామిలీ వీక్!

2 hours ago

Bigg Boss Season 10 Day 17 Episode: టెంప్టేషన్స్ వర్సెస్ టెన్షన్లో భాగం టెన్షన్‌ తీసుకున్న వాళ్లు తమ ఫ్యామిలీలను మిస్ అవుతూ ఏడ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Bigg Boss Season 10 Letest Episode: బిగ్‌బాస్ సీజన్ 10 రోజు రోజుకీ మంచి మంచి ఆసక్తికరంగా సాగుతుంది. ఈ రోజు సెప్టెంబరు 23వ తేదీ బిగ్‌బాస్ మొదలై 17వ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో.. ఎలాంటి ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయో.. బిగ్‌బాస్ హైలెట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ముకేశ్‌కి ఫోటో..

దేబ్‌జానీ తన లెటర్ పోయినందుకు ఏడుస్తుంది. రాంప్రసాద్, నరేశ్ దేబ్జానీని లెటర్‌లో ఇలా రాశారు అలా రాశారు అని చెప్పి నవ్విస్తారు. ముకేశ్‌ కో దూర్ హై.. నో నియర్.. దూరం పెట్టు దూరం పెట్టు అని అంటాడు. దేబ్జానీ నవ్వేస్తుంది. దేబ్‌జానీ దగ్గరకు వెళ్లి రాంప్రసాద్‌, నరేశ్ హగ్ చేసుకుంటారు. ఇక రోహిత్ అక్కడికి వచ్చి లెటర్ మొత్తం క్రాష్ అయిపోయింది ఏం తెలీడం లేదు.. కానీ ఆ అక్షరాలు చూస్తే చిన్న పిల్లల రైటింగ్‌లా ఉంది.. మీ చెల్లి రాసినట్లు ఉంది.. అని చెప్తాడు. ఇలాంటివి చాలా బాధ కదా బ్రో అంటూ అమన్ అంటాడు. ముకేశ్ దేబ్జానీ దగ్గరకు వెళ్లి సారీ చెప్తాడు. ఇక ముకేశ్‌కి ఫొటో వస్తుంది. ముకేశ్ చాలా హ్యాపీగా ఫీలవుతాడు. మా నాన్నతో నాకు పెద్ద ఫొటో ఉండాలి అనుకున్నా అందుకే ఇలా సెల్ఫీలు తీసుకునే వాడిని ఈ ఫొటో నాకు చాలా ఇష్టం అని ఎమోషనల్ అవుతాడు.  

 

మా చెల్లిని బాగా చూసుకో..

ఇక దేబ్జీనీ, నరేశ్, రాంప్రసాద్, రోహిత్ కలిసి ఓ చోట కూర్చొంటారు. దేబ్జానీకి రోహిత్‌కి పెళ్లి చూపులు అంటూ నలుగురు సరదాగా మాట్లాడుకుంటారు. రాంప్రసాద్ సరదగా ముందు నీకు త్రిగుణ్‌తో పరిచయం ఉంటే చెప్పు ఇప్పుడే పెళ్లి క్యాన్సిల్ చేసేద్దాం అని అంటాడు. ఇక నీకు జీతం ఎంత మా చెల్లికి నెలకి రెండు లక్షలు కావాలి.. ఖర్చులకు నువ్వు ఇక సోఫాలో పడుకో.. అంటూ సెటైర్లు వేస్తాడు. దానికి దేబ్జానీ నా గుండెల్లో చోటు ఇస్తా పడుకో అని అంటుంది.

 

వంశీనే చేస్తున్నాడు..

వర్షిణి, సుధీర్, ఝాన్సీలు త్రిగుణ్ గురించి మాట్లాడుకుంటూ ఏది  పడితే అది అనే ఛాన్స్ త్రిగుణ్‌కి ఇవ్వకూడదు అని అనుకుంటారు. తర్వాత నరేశ్, అమన్, సుధీర్, వర్షిణిలు సరదాగా మాట్లాడుకుంటారు. ఇక రాంప్రసాద్, రోహిత్ ఓ చోట కూర్చొని మాట్లాడుకుంటారు. వంట చేస్తే బెటర్ అని రాంప్రసాద్ అంటే ఇప్పుడు వంట డ్యూటీ వంశీ, దేబ్జానీనిది.. ఆ పిల్లకి ప్రతీ సారి వంట గురించి చెప్పాలి.. ఎనభై శాతం పని వంశీ చేస్తున్నాడు అని త్రిగుణ్ చెప్తాడు. 

 

ప్లాస్టర్ వేయమను..

ఝాన్సీ వంట చేస్తున్న వంశీ పక్కనే ఉన్న త్రిగుణ్‌తో వంట చేసే టైంలో మాట్లాడొద్దు అని అంటుంది. మాట్లాడొద్దు అంటే  నోటికి ప్లాస్టర్ వేయాలి అని త్రిగుణ్ వాళ్లు అంటారు. బిగ్‌బాస్ ప్లాసర్ట్ పంపండి లేదంటే వీళ్లు పనిష్మెంట్ తీసుకోరు అని ఝాన్సీ అడగటంతో బిగ్‌బాస్ ప్లాస్టర్ పంపుతారు. వెంటనే ఝాన్సీ ఇద్దరి నోటికి ప్లాస్టర్ వేసేస్తుంది.  

 

ముకేశ్, దేబ్జానీ దూరం..

టాస్క్ మొదలవుతుంది. ముకేశ్ కంటెండర్ అయినందుకు అతనికి, లెటర్ పోయినందుకు దేబ్జానీకి బజర్ కొట్టడానికి వీల్లేదు అని చెప్తారు. ఇక లివింగ్ రూంలో వర్షిణి బజర్ కొడితే గార్డెన్ ఏరియాలో అమన్ బజర్ కొడతాడు. రోహిత్ దగ్గర త్రిగుణ్ ఝాన్సీ నిన్ను ముకుశ్ వాళ్ల గేమ్‌ కోసం త్వరగా వాళ్లని తినేయమని చెప్పింది ఇప్పుడు మేం తింటాం అన్నా టాస్క్ ఉంది అంటుంది.. పార్శియాటిలీ చూపిస్తుంది అని అంటాడు. ఆ విషయం ఝాన్సీకి తెలిసి సుధీర్, వర్షిణి వాళ్లతో చెప్తే త్రిగుణ్ మాటలు వదిలేయ్ స్క్రీన్ స్పేస్ కోసం అలాంటివి చేస్తున్నాడు అని వర్షిణి అంటుంది. ఇక త్రిగుణ్, వంశీ, శ్రిష్టిలతో నరేశ్‌ని పొట్టోడు అంటున్నారు నాకు నచ్చడం లేదు అని అంటాడు. 

 

గెలుపు కొమ్మలు..

వర్షిణి, అమన్‌కి గెలుపు కొమ్మలు అని ఆట పెడతారు. స్విమ్మింగ్ పూల్ నుంచి చిన్న మూటలు తెచ్చి ఓ స్టాండ్ మీద విసరాలి.. అయితే అమన్ మూడు మూటలు వేసి రెండు వేసి మూడో మూట వర్షిణి వేసే టైంకి అమన్ ఆ బ్యాగ్ తీసుకొని ఇవ్వకుండా ఆపుతాడు. ఆ టైంలో వర్షిణిని హగ్ చేసుకుంటాడు. దేబ్జానీ వాళ్లు అది తప్పు అని చెప్తారు. అమన్ తన టీంకి ఆ విషయం చెప్తే ఆడపిల్లని ఇబ్బంది పెట్టాడు అనే పాయింట్ తీయాలని చూస్తున్నారు అని త్రిగుణ్ అంటాడు. ఇక వర్షిణి చాలా బాధ పడి అమన్ దగ్గరకు వెళ్లి ఇదంతా ఆట అని తెలుసు కానీ ఆడపిల్లతో ఆడేటప్పుడు కొంచెం జాగ్రత్త అని ఏడుస్తుంది. 

 

రోహిత్‌కి టెన్షన్..

అమన్‌కి బిగ్‌బాస్ పిలిచి గెలిచినందుకు నీకు మీ అమ్మ వండిన ఫుడ్ వస్తుంది. దీంతో పాటు కంటెండర్ అవుతాడు. అయితే దీని కోసం నువ్వు షాలినికి తన అక్క రాసిన లెటర్ దూరం చేయాలి.. లేదంటే రోహిత్‌కి తన అక్క అమ్మ రాసిన లెటర్ దూరం చేయాలి.. ఎవరికి టెన్షన్ ఇస్తావు అని అడుగుతారు. దాంతో అమన్ రోహిత్‌కి టెన్షన్ ఇస్తాను అని చెప్తాడు. తర్వాత రోహిత్‌కి ఈ విషయం చెప్తాడు. రోహిత్ లెటర్ చింపేసేటప్పుడు చాలా బాధ పడతాడు. ఇక అమన్‌కి ఇంటి నుంచి ఫుడ్ రావడంతో అందరికీ పంచి తింటాడు.  

 

సుధీర్, శ్రిష్టికి టాస్క్..

సుధీర్, శ్రిష్టి బజర్ నొక్కుతారు. ఇద్దరికీ స్మాస్ ఇట్ బిల్డ్ ఇట్ అని టాస్క్ ఇస్తారు. ఈ టాస్క్‌కి రోహిత్ సంచాలకుడు. ఈ టాస్క్‌లో సృష్టి గెలుస్తుంది. ఇక సృష్టి రోహిత్‌తో సుధీర్‌ని అలా అన్నందుకు గిల్టీగా ఉంది మాట్లాడటానికి ప్రయత్నిస్తే అవాయిడ్ చేస్తున్నాడు అని అంటుంది. ఇక రోహిత్ సృష్టితో షాలిని కోసం మాట్లాడుతాడు. తనకి వాళ్ల అక్క రాసిన లెటర్ ముఖ్యమా.. లేదంటే మా ఇంట్లో మొదటి బిడ్డ పుట్టబోతుంది అని ముఖ్యమా తను తన విషయంలో వస్తే సెల్షిష్‌గా చేసింది అని అంటాడు.

 

త్రిగుణ్‌కి ఆ ఛాన్స్ దూరం..
సృష్టితో బిగ్‌బాస్ మాట్లాడి.. త్రిగుణ్, వంశీలకు వాళ్ల భార్యలు లెటర్లు రాశారు ఎవరికి ఆ లెటర్ దూరం చేసి కంటెండర్ షిప్ నుంచి దూరం చేస్తారు అని అడుగుతారు. సృష్టి త్రిగుణ్‌కి టెన్షన్ ఇస్తానని చెప్తుంది. తర్వాత త్రిగుణ్కి విషయం చెప్పడంతో నువ్వు మంచి నిర్ణయమే తీసుకున్నావ్ అని చెప్తాడు. అయితే తన భార్యని కూతుర్ని మిస్ అవుతున్నా అని ఏడుస్తాడు. ఇక సృష్టికి లెటర్ రావడంతో తన లెటర్ చదువుకొని ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.                                                 

Click here to Read More
Previous Article
AP Cabinet social media influencer policy: సోషల్ మీడియాలో 10K ఫాలోవర్లు ఉన్నారా? ఏపీ ప్రభుత్వం నుంచి నెలకు రూ.15,000 వరకు సంపాదించే ఛాన్స్!
Next Article
100 Percent Ethanol: ఇథనాల్ ఇంధనంపై కేంద్రం కీలక నిర్ణయం.. 100 శాతం ఇథనాల్‌తో దూసుకెళ్లనున్న కార్లు

Related బిగ్‌ బాస్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment