DA For Employees: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 2 డీఏలు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

1 hour ago

Telangana Government Employees | ఉద్యోగులకు రెండు డీఏలు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎస్ సంజయ్ జాజు నేతృత్వంలో ఉద్యోగ సంఘాలతో భేటీలో ఈ నిర్ణయం వెల్లడించారు.

Telangana Government | హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు ఇవ్వాల్సిన కరువు భత్యం (DA) బకాయిల్లో 2 డీఏలను ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించినట్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వెల్లడించారు. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధ్యక్షతన ఉద్యోగ సంఘాల నేతలతో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన వేతన సవరణ కమిషన్ (PRC) నివేదికపై ప్రధానంగా చర్చించారు.

పీఆర్‌సీ కమిటీ నివేదిక తుది దశకు చేరుకుందని, సెప్టెంబర్ నెలాఖరు నాటికి రాష్ట్ర ప్రభుత్వం చేతికి వచ్చే అవకాశం ఉందని సీఎస్ సంజ్ జాజు ఈ సమావేశంలో తెలిపారని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఉద్యోగ సంఘాల నాయకులు.. తాము 3 డీఏలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేయగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం 2 డీఏల విడుదలకు ఆమోదం తెలిపిందన్నారు. ఇందులో మొదటి డీఏను 3.46 శాతం, రెండో డీఏను 2.74 శాతంతోను చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించిందని వెల్లడించారు. ఇక మిగిలిన మూడో డీఏను వచ్చే 3 నుంచి 4 నెలల్లో ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
పీఆర్‌సీ నివేదిక అందిన వెంటనే ఉద్యోగుల వేతన సవరణపై తగిన చర్యలు తీసుకుంటామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలాగే సీపీఎస్ (CPS) విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (OPS) అమలు చేయడంపై అధ్యయనం చేయడానికి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో కలిపి ఒక ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ వివిధ రాష్ట్రాల్లో పర్యటించి సమగ్ర నివేదికను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనుంది. గతంలో ఒకటో తేదీన జీతాలు రాక చాలా ఇబ్బందులు పడ్డామని గుర్తుచేస్తూ, ఇప్పుడు నెల ప్రారంభంలోనే క్రమం తప్పకుండా జీతాలు అందుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇదే తీరుగా ఉద్యోగుల అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Click here to Read More
Previous Article
Hyderabad Tank Bund hit and run case: ట్యాంక్‌బండ్‌పై ఘోరం - ఎస్‌ఐని ఢీకొట్టి పారిపోయిన వ్యక్తులు - మృతి - క్లియర్‌గా సీసీ కెమెరా దృశ్యాలు!

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment