AP TG Heavy Rains: కళింగపట్నం వద్ద తీరందాటనున్న తీవ్రవాయుగుండం.. ఏపీలో ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక, తెలంగాణలో అతి భారీ వర్షాలు

2 hours ago

AP TG Heavy Rains: తీవ్రవాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఇవాళ రాత్రికి వాయుగుండం తీరదాటనుంది.

AP TG Heavy Rains: బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య,వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 5 కి.మీ వేగంతో కదులుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వాయుగుండం ప్రస్తుతానికి గోపాల్‌పూర్‌కు 150 కి.మీ, కళింగపట్నానికి 50 కి.మీ, ఒడిశాలోని పూరీకి 250 కి.మీ, విశాఖపట్నానికి 120 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. బుధవారం రాత్రికు తీవ్రవాయుగుండంగా విశాఖపట్నం- గోపాల్‌పూర్ మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో  ఈరోజు రాత్రి, రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర తీరం వెంబడి 55-65 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

కళింగపట్నం వద్ద తీరం దాటనున్న వాయుగుండం

కళింగపట్నానికి సమీపంలో బుధవారం రాత్రి 8 - 12 గంటల మధ్య తీవ్ర వాయుగుండం తీరం దాటే అవకాశముందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది. తీరం దాటే సమయంలో 50-70 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, తీర ప్రాంతాల్లో ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించింది.   కళింగపట్నం, విశాఖపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ అయింది. 

ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాలకు రెడ్ అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేసింది. ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. గురువారం అల్లూరి, ఏలూరు జిల్లాలకు రెడ్ అలెర్ట్, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కాకినాడ, ఎన్టీఆర్‌, కృష్ణా, పల్నాడు, గుంటూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఈ నెల 25న అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్‌ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.  

రాష్ట్రాలకు బీజేపీ కొత్త ఇన్‌ఛార్జ్‌లు.. ఏపీకి అరవింద్, టీజీకి సునీల్ భన్సల్.. తెలుగు వారికి ఎక్కడంటే!

తెలంగాణలో వాతావరణం 

తీవ్ర వాయుగుండం ప్రభావం తెలంగాణపై కూడా కనిపిస్తుంది. బుధవారం అతి భారీ వర్షాలు, గురు, శుక్రవారాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ వరంగల్, ఖమ్మం జిల్లాలతో పాటు పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్‌తో పాటు నిజామాబాద్, నల్గొండ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. 

Click here to Read More
Previous Article
100 Percent Ethanol: ఇథనాల్ ఇంధనంపై కేంద్రం కీలక నిర్ణయం.. 100 శాతం ఇథనాల్‌తో దూసుకెళ్లనున్న కార్లు
Next Article
The Paradise Review - 'ది ప్యారడైజ్' రివ్యూ: నాని మాస్ మసాలా బిర్యానీ టేస్ట్ ఎలా ఉంది? సినిమా హిట్టా? ఫట్టా?

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment