100 Percent Ethanol: ఇథనాల్ ఇంధనంపై కేంద్రం కీలక నిర్ణయం.. 100 శాతం ఇథనాల్‌తో దూసుకెళ్లనున్న కార్లు

2 hours ago

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ E100 ఇంధన నిబంధనలకు ఆమోదం తెలిపారు. దాంతో కొన్ని రోజుల్లోనే 100 ఇథనాల్‌తో నడిచే వాహనాలు భారత రోడ్లపై దూసుకెళ్లనున్నాయి.

దేశంలో 100 శాతం ఇథనాల్‌ను ఇంధనంగా ఉపయోగించడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలకు చట్టపరమైన ఆమోదం తెలిపింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పుడు దేశంలో పెట్రోల్, డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించడంలో భాగంగా ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్లకు మార్గం సుగమం సుగమమైంది.

ఈ చారిత్రాత్మక నిర్ణయం తర్వాత మారుతి సుజుకి, హ్యుందాయ్, టొయోటా వంటి దిగ్గజ కార్ల తయారీ సంస్థలు వచ్చే ఏడాది నుంచి 100 శాతం ఇథనాల్‌తో నడిచే వాహనాలు మార్కెట్లోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజలకు ప్రయోజనం  చేకూరుతుందో వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. 

ప్రభుత్వ నిర్ణయంతో ఏం జరుగుతుంది

ఇప్పటివరకు వాహనాల్లో ప్రభుత్వం పెట్రోల్‌లో ఇథనాల్ కలిపే పరిమితిని స్పష్టం చేసింది. E20 పెట్రోల్.. ఇందులో 80 శాతం పెట్రోల్, 20% ఇథనాల్ కలుపుతారు. అయితే ప్రభుత్వం ఆమోదించిన కొత్త నిబంధనల ప్రకారం వాహనాల్లో E100 ఇంధనం, అంటే 100 శాతం స్వచ్ఛమైన ఇథనాల్‌ను ఉపయోగించవచ్చు.

ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీ కలిగిన ఈ కొత్త వాహనాలు పూర్తిగా ఇథనాల్‌ ఇంధనంతో నడుస్తాయి. లేదా అవసరమైతే పెట్రోల్, ఇథనాల్ ఏ మిశ్రమంతోనైనా సులభంగా వెళ్తాయి. రాబోయే రోజుల్లో ఇంధన కొరత లేకుండా దేశంలోని మూలమూలలా ఇథనాల్ ఫ్యూయల్ స్టేషన్లను ఓపెన్ చేయాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది.

మారుతి, టొయోటా, హ్యుందాయ్ ఏం చేయనున్నాయి

కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆటోమొబైల్ కంపెనీలు ఇథనాల్ కార్లను తీసుకురానున్నాయి. మారుతి సుజుకి ఇప్పటికే తన అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ కార్ వాగన్ ఆర్ (WagonR) ఫ్లెక్స్-ఫ్యూయల్ ప్రోటోటైప్ మోడల్‌ రూపొందించింది. ఇది 20% నుంచి 85% కంటే ఎక్కువ ఇథనాల్ మిశ్రమంతో దూసుకెళ్తుంది. ఇప్పుడు దీనిని 100 శాతం ఇథనాల్‌కు అనుకూలంగా మార్చి వచ్చే ఏడాది లాంచ్ చేయనుంది. 

మరోవైపు, టొయోటా భారత్‌లో తన ప్రసిద్ధ సెడాన్ కార్ ఇన్నోవా హైక్రాస్ (Innova Hycross) ఆధారంగా ప్రపంచంలోనే తొలి 100 శాతం ఇథనాల్‌తో నడిచే ప్రోటోటైప్ మోడల్‌ను తీసుకురానుంది. ఈ కారు ఇథనాల్‌తో నడవడమే కాకుండా, ఇందులో హైబ్రిడ్ ఎలక్ట్రిక్ టెక్నాలజీ వాడుతున్నారు. ఇది దీనిని బాగా అడ్వాన్స్‌డ్‌గా మారుస్తుంది. హ్యుందాయ్ తమ వాహనాల ఇంజిన్లను సాంకేతిక లోపాలు లేకుండా 100 శాతం ఇథనాల్ తో వెళ్లేలా పూర్తిగా అప్‌డేట్ చేస్తోంది.

ప్రజలకు ప్రయోజనం ఉంటుందా..

పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న క్రమంలో సామాన్య ప్రజలకు ఇథనాల్ చౌకైన ప్రత్యామ్నాయంగా మారనుంది. పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ ధర తక్కువ అని కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు. ప్రతి నెలా ఇంధన ఖర్చు కొంతమేర తగ్గుతుంది. 100% ఇథనాల్ అనేది ఒక గ్రీన్,  స్వచ్ఛమైన ఇంధనంగా లభిస్తుంది. దాంతో హానికారక పొగ, కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. గాలి కాలుష్యం తగ్గడం ప్రజల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 

భారత్ తన అవసరానికి కావలసిన ముడి చమురులో 80 శాతం కంటే ఎక్కువ విదేశాల నుంచి కొనుగోలు చేస్తుంది. దీని కోసం బిలియన్ల కొద్దీ రూపాయలను ఖర్చు చేస్తుంది. దేశంలో ఇథనాల్ ఉత్పత్తి పెరిగితే భారత్ ఆత్మనిర్భర్‌గా మారే ఛాన్స్ ఉంది. మన కరెన్సీ విలువ నిలకడగా ఉండటానికి వీలవుతుంది. 

Click here to Read More
Previous Article
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: త్యాగాలు.. ఎమోషన్లు.. ఏడిపించేసిన కంటెస్టెంట్స్! ఇదో మినీ ఫ్యామిలీ వీక్!
Next Article
AP TG Heavy Rains: కళింగపట్నం వద్ద తీరందాటనున్న తీవ్రవాయుగుండం.. ఏపీలో ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక, తెలంగాణలో అతి భారీ వర్షాలు

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment