Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముకేశ్ కారణంగా వెక్కి వెక్కి ఏడ్చేసిన దేబ్‌జానీ! ఆ లెటర్ ఇక లేనట్లే!

1 hour ago

Bigg Boss Season 10 Day 15 Episode: టెంప్టేషన్ వర్సెస్ టెన్షన్‌లో భాగంగా ముకేశ్ రోహిత్తో గేమ్ ఆడి గెలిచి దేబ్జానీకి ఇంటి నుంచి వచ్చిన లెటర్‌ని తనకి దూరం చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Bigg Boss Season 10 Letest Episode: బిగ్‌బాస్ సీజన్ 10 రోజు రోజుకీ మంచి మంచి ఆసక్తికరంగా సాగుతుంది. ఈ రోజు సెప్టెంబరు 22వ తేదీ బిగ్‌బాస్ మొదలై 15వ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో.. ఎలాంటి ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయో.. బిగ్‌బాస్ హైలెట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
 సృష్టిని నామినేట్ చేయ్..

రాంప్రసాద్ నరేశ్‌తో అవకాశం వస్తే సృష్టిని నామినేట్ చేయ్.. అని చెప్తాడు. నాకు పాయింట్స్ లేవు అని నరేశ్ అంటే అంత పెద్ద పాయింట్ ఉంటే లేదు అంటావ్ ఏంటి.. బిగ్‌బాస్ హౌస్‌లో ఒకర్ని కొడతా.. తంతా అనడం ఎంతపెద్ద తప్పో తెలుసు కదా ఇదే పెద్ద పాయింట్ ఆ పాయింటె మీద నామినేట్ చేయ్ అని అంటాడు. తర్వాత ముకేశ్, సుధీర్, ఝాన్సీ, వర్షిణిలతో మీలో ఎవరికి అవకాశం వచ్చినా నరేశ్ పేరు చెప్పండి అని అంటాడు. తర్వాత రాంప్రసాద్ సుధీర్, నరేశ్ మాట్లాడుకుంటారు. నాగ్ సార్ కనిపించడం లేదు అని చెప్పారని ఇంత సీన్ చేసింది పళ్లు రాలగొడతా ఇలాంటి మాటలు అవసరం లేదు.. సృష్టి మాటలు అస్సలు నచ్చలేదు అని రాంప్రసాద్ అంటాడు.

అందరూ నన్ను వాడుకుంటున్నారు..

శ్రిష్టి త్రిగుణ్‌ దగ్గర ఏడుస్తూ అందరూ నాన్ను వాడుకుంటున్నట్లు అనిపిస్తుంది. లైఫ్‌లో అదే అనిపిస్తుంది అని ఏడుస్తుంది. ఇక త్రిగుణ్ గురించి ఝాన్సీ, సుధీర్, ముకేశ్, రోహిత్ మాట్లాడుకుంటారు. మొదటి వారం నన్ను చాలా హీనంగా చూశాడు.. చాలా ఇబ్బంది పెట్టాడు.. ప్రతీ చిన్న విషయాన్ని పాయింట్ చేసి.. కుక్కర్ ముఖం మీద వేశాడు.. త్రిగుణ్ నిజంగా శకునినే.. ముందు ఆడడు.. వెనక నుంచి ఆడిస్తారు. వంశీని ఎలా  పపెట్ చేశాడు.. ఇప్పుడు శ్రిష్టిని కూడా అలాగే తన దారిలోకి తెచ్చుకుంటున్నాడు.. శ్రిష్టి కూడా వెళ్లిపోతుంది అని రోహిత్ అంటాడు. అవును అవును అంటూ ఝాన్సీ అంటుంది.

 

చరణ్‌ని నామినేట్ చేసిన ముకేశ్..

చరణ్‌లో కొంచెం మేచ్యూర్డ్‌గా ఉన్న పర్సన్ అని చూస్తానేమో అనుకున్నా. కానీ గేమ్‌కి వచ్చేసరికి  లైట్గా తీసుకుంటున్నాడేమో అనే నా ఫీలింగ్. ఇక ఇద్దరూ చిక్కకు దొరకకు గేమ్ గురించి మాట్లాడుకొని గొడవ పడతారు. ఇక  వంశీ ముకేశ్‌తో గొడవ పడతాడు. బిగ్‌బాస్ చెప్పేటప్పుడు వినకుండా తప్పు చేశావ్ ప్రక్రియా జరుగుతుంటే మధ్యలో వచ్చి తింటూ ఆడుతున్నారు అని ముకేశ్ని అంటాడు. చరణ్‌ని ముకేశ్ నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావ్ అంటే నేను ఆడియన్‌గా చూసి వచ్చా అని చరణ్‌ అంటే నువ్వు ఆడియన్‌గానే పనికొస్తావ్ అని ముకేశ్ అంటే నువ్వు పడుకోవడానికే పని కొస్తావ్ పోయి పడుకో అని చరణ్ అంటాడు. 

 

చివరి రౌండ్..

చివరి రౌండ్‌లో నామినేట్ చేయడానికి నరేశ్, షాలిని పోటీ పడతారు. షాలినికి అవకాశం వస్తుంది. దాంతో షాలిని వర్షిణిని నామినేట్ చేస్తుంది. ముకేశ్‌ని గైడ్ చేస్తున్నారు.. సంచాలక్‌లా ఫెయిల్ అయ్యారు.. అందరికీ సలహాలు ఇస్తూ గేమ్లో కనిపించాలని ప్రయత్నిస్తున్నారు.. అది అంత అవసరం లేదు అనిపిస్తుంది అని షాలిని చెప్తుంది. ముకేశ్ వర్షిణికి సపోర్ట్ చేస్తే ఇప్పుడు కూడా తనే మాట్లాడుతున్నాడు నువ్వు మాట్లాడలేవా అని షాలిని అంటే దమ్ముంటే తనని నామినేట్ చేయ్ అని వర్షిణి అంటుంది. తర్వాత షాలిని నామినేట్ చేసే అవకాశం శ్రిష్టికి ఇస్తుంది. శ్రిష్టి సుధీర్ని నామినేట్ చేస్తుంది. ఒక్క సారి కూడా వాడుకున్నాను అనిపించలేదా అని శ్రిష్టి అడిగితే దానికి సుధీర్ నేను మొదటి నుంచి అడుగుతూనే ఉన్నాను.. నా వల్ల ఇబ్బంది ఉంటే చెప్పు అని అడిగాను.. ఎవరైనా ఏమైనా అంటే మనం ఫ్రెండ్స్ అని చెప్పు అని కూడా చెప్పాను.. అంటూ వివరిస్తాడు. ఇక నుంచి ఈ ఇంట్లో శ్రిష్టితో అస్సలు మాట్లాడను అని కూడా చెప్తాడు. ఇక ఈ వారం నామినేషన్స్‌లో సుధీర్, షాలిని, అమన్, ఝాన్సీ, త్రిగుణ్, చరణ్, వర్షిణి ఉన్నారు.

 

ఏడ్చేసిన సుధీర్..

సుధీర్ నామినేషన్లు తర్వాత ఏడుస్తాడు. వర్షిణి వెళ్లి మాట్లాడుతుంది. ఏముంది దాంట్లో అన్నింటికీ చప్పట్లు కొడుతున్నాడు త్రిగుణ్.. ఆ అమ్మాయితో ఏమైనా ఉంటే ఓపెన్‌గా చెప్పు అని చెప్పాను.. రేంజ్ అని మాట్లాడుతాడా.. అందరూ ఇక్కడ ఒకటే కదా.. రేంజ్ ఏంటి అని సుధీర్ చాలా ఏడుస్తాడు. శ్రిష్టి నామినేషన్ చేసినప్పుడు చెత్తని సుధీర్ మీద విసిరి విసిరి వేస్తుంది. ఆ విషయం చెప్పుకొని ఇంకా ఏడుస్తాడు. 

 

గేమ్ మొదలు..

బిగ్‌బాస్ మీ వాళ్ల నుంచి మంచి టెంటేషన్ పొందాలి అంటే ఒకరిని టెన్షలో పెట్టాల్సి వస్తుంది. లివింగ్ ఏరియాలో ఒక బజర్, గార్డెన్ ఏరియాలో ఒక బజరు ఉంటుంది. రెండింటిని మొదటి సారి నొక్కి ఇద్దరు సభ్యులకు గేమ్ పెడతారు. గెలిచిన వాళ్లు టెంప్టేషన్ తీసుకొని టెన్షన్ ఒకరికి ఇవ్వాలి. టెన్షన్ తీసుకున్న వాళ్లు నెక్ట్ టైం గేమ్ ఆడటానికి వీల్లేదు అని అంటారు. 

 

పుష్ యువర్ లిమిట్స్..

సైరన్ మోగిన తర్వాత లివింగ్ ఏరియాలో ముకేశ్ బజర్ నొక్కితే.. గార్డెన్ ఏరియాలో రోహిత్ బజర్ నొక్కుతాడు. ఇద్దరికీ పుష్ యువర్ లిమిట్స్ అనే గేమ్ పెడతారు. ఇందులో మూడు పెద్ద బాక్స్‌లను ఇద్దరూ నెట్టుకోవాలి.. ఈ గేమ్‌లో ముకేశ్ విన్ అవుతాడు. ముకేశ్ కెప్టెన్సీ కంటెండర్ అవ్వడంతో పాటు టెంప్టేషన్ కూడా పొందుతాడు. 

 

ముకేశ్‌తో బిగ్‌బాస్ ముచ్చట్లు..

ముకేశ్‌ని బిగ్బాస్ బ్యాక్‌యార్డ్‌కి పిలిచి ఫోన్  చేస్తారు. ముకేశ్ అక్కడున్న ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. బిగ్‌బాస్ ముకేశ్‌తో కాసేపు మాట్లాడుతారు. ఇలాంటి గేమ్ కోసమే వెయిట్ చేస్తున్నా బిగ్‌బాస్.. రోహిత్ మీద గెలవడం చాలా హ్యాపీగా ఉంది.. అని చెప్తాడు. మీ నాన్నని మిస్ అవుతున్నారా అని బిగ్ బాస్ అడిగితే బాగా బిగ్‌బాస్ మా నాన్న చనిపోయి 3 ఏళ్లు అవుతుంది. నాన్న నా సీరియల్ చూశారు.. నాకు అవార్డు వచ్చినప్పుడు నా పక్కనే ఉన్నారు అని ఎమోషనల్‌గా చెప్తాడు. ఇక బిగ్‌బాస్ మీకు టెంప్టేషన్‌గా మీనాన్నతో కలిసి ఉన్న ఫొటో మీకు దక్కుతుంది. దీని కోసం మీరు దేబ్‌జానీకి ఇంటి నుంచి వచ్చిన లెటర్‌ని తనకి దూరం చేయాలి.. రెండు వర్షిణికి తన ఫ్యామిలీ ఫొటో దూరం అవుతుంది. ఎవరికి ఏం దూరం చేసి వాళ్లకి టెన్షన్ ఇస్తారు అని బిగ్‌బాస్ అడిగితే ఇద్దరితో నాకు మంచి బాండ్ ఉంది.. కానీ వర్షిణితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను.. వర్షిణి తనకి ఇద్దరు ముగ్గురు అబ్బాయిలే ఫ్రెండ్స్ ఉన్నారు నన్ను కూడా మంచి ఫ్రెండ్‌ అనుకుంటుంది అని చెప్పి దేబ్‌జానీకి టెన్షన్ ఇస్తా అని అంటాడు. ఈ విషయం దేబ్‌జానీకి చెప్పమని బిగ్‌బాస్ అంటారు.

 

లేటర్ కోసం ఏడ్చిన దేబ్‌జానీ..
ముకేశ్ దేబ్‌జానీకి విషయం చెప్తాడు. నీ కోసం నన్ను టెన్షన్‌లో పెట్టావా వేరే ఎవరి కోసమేనానా అని అడుగుతుంది. వేరే వాళ్ల కోసం అని ముకేశ్ అంటాడు. తర్వాత బిగ్బాస్ ముకేశ్‌కి ఇచ్చిన ఆప్షన్‌ గురించి చెప్పడంతో దేబ్‌జానీ చాలా ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది

 

Click here to Read More
Previous Article
AP liquor scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు.. మనీ ట్రయల్ ముడి పడుతుందా? టార్గెట్ వైఎస్ జగనేనా?
Next Article
Flash Flood Alert: ఏపీ, తెలంగాణలో ఆకస్మిక వరదల ముప్పు.. ఈ జిల్లాలకు IMD రెడ్ అలర్ట్

Related బిగ్‌ బాస్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment