Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రెండో అవతారం.. నామినేషన్లలో రెచ్చిపోయిన కంటెస్ట్ంట్స్.. నామినేషన్‌లో ఉంది వీళ్లే!

21 hours ago

Bigg Boss Season 10 Day 8: నామినేషన్లు మొదలవడం కొత్తగా గేమ్ పెట్టి నామినేషన్లు చేసుకోమని బిగ్‌బాస్ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Bigg Boss Season 10 Letest Episode: బిగ్‌బాస్ సీజన్ 10లో 8వ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో.. ఎలాంటి ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయో.. బిగ్‌బాస్ హైలెట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఐలవ్యూ ముఖేశ్..

బిగ్‌బాస్ దేబ్‌జానీకి కాఫీ పంపిస్తారు. కేవలం ఒకరితోనే పంచుకోమని చెప్తారు. ఇక దేబ్‌జానీ ముఖేశ్‌ వల్లే వచ్చింది అని ముఖేశ్‌కి ఐలవ్యూ చెప్తుంది. ఇంతలో త్రిగున్‌ వచ్చి తనతో కాఫీ షేర్ చేసుకోమని అడుగుతాడు. కిచెన్లో వంశీ పని చేస్తుంటే ఝాన్సీ సాయం చేయడం లేదా అని అడుగుతాడు త్రిగున్‌ దానికి వంశీ ఈ మధ్య మేడం సిన్సియర్‌గా పని చేయడం లేదు.. ముచ్చట్లకు అలవాటైపోయింది అని చెప్తాడు. ఇక రోహిత్ నాగ్‌ సార్ ఇచ్చిన ఎంగిలి కప్పులు కడిగి పనిష్మెంట్ పూర్తి 
చేసుకుంటాడు. 

 

క్రష్ అని కావాలనే చెప్పింది..

వర్షిణి, సుధీర్‌ ఇద్దరూ దేబ్‌జానీ గురించి మాట్లాడుకుంటారు. ముఖేశ్ మాటలకు బెండ్ అవ్వడు అని దేబ్‌జానీ క్రష్ అని కాఫీ షేర్ చేసుకుంటా అని చెప్పిందని వర్షిణి చెప్తుంది. ఆలోచించాల్సిన విషయమే అని సుధీర్ అంటాడు. ఇక బిగ్‌బాస్ సుధీర్‌కి ఉన్న పవర్ గుర్తు చేస్తారు. అది వచ్చే వారం ఎవరినైనా డైరెక్ట్ నామినేషన్‌లో ఉండేలా చేయొచ్చు.

 

నామినేషన్లు షురూ..

నామినేషన్ల ప్రక్రియలో బిగ్‌బాస్ పిలిచినప్పుడల్లా ఇద్దరు కంటెస్టెంట్స్ పాత్వే నుంచి వెళ్లి తర్వత ఉన్న ఓ స్పోల్ ఎంచుకొని దానికి ఉన్న తాడు మొత్తం తీసి అప్పుడు అక్కడ ఉన్న రెండు గొడ్డళ్లు.. సిల్వర్, గోల్డ్‌లలో ఒకటి ఎంచుకోవాలి. సిల్వర్ ఎంచుకుంటే ఒకర్ని నామినేట్ చేసే అర్హత ఉంటుంది. గోల్డెన్ ఎంచుకుంటే ఇద్దరిని నామినేట్ చేయొచ్చు.. ఓడిపోయిన వాళ్లకి ఆ రౌండ్లో ఒక నామినేషన్ ఓటు పడుతుంది అని.. గొడ్డల్ని అందుకున్న వాళ్లు ఆ రౌండ్లో ఓడిపోయిన వాళ్లతో సహా ఎవరినైనా నామినేట్ చేయొచ్చని అంటారు. 

 

సుధీర్, ఝాన్సీ..

ఝాన్సీ, సుధీర్ ఇద్దరూ గేమ్ ఆడుతారు. సుధీర్ గెలిచి గోల్డెన్ గొడ్డలి పట్టుకుంటాడు. మొదట త్రిగుణ్‌ని నామినేట్ చేస్తాడు. త్రిగుణ్ తన దగ్గర ఒక మాట మాట్లాడి రోహిత్‌ దగ్గర మరొకటి చెప్పాడు అని ఒక్కొక్కరి దగ్గర ఒక్కో మాట చెప్తున్నాడు..చైత్ర విషయంలోనూ తన ఆట చూడకుండా కత్తితో పొడిచావని చెప్పి నామినేట్ చేస్తాడు. తర్వాత రెండో నామినేషన్ షాలినికి వేస్తాడు. షాలినికి వాష్‌రూం క్లీనింగ్ ఇస్తే దాన్ని తీసుకోలేక దాన్ని నీ పవర్ వాడుకోవడం నాకు నచ్చలేదు అని అంటాడు. ఆది నా స్టాటజీ అని షాలిని అంటుంది. 

 

కృష్ణుడు, దేబ్‌జానీ..

కృష్ణుడు, దేబ్‌జానీ ఇద్దరూ గేమ్ ఆడితే దేబ్‌జానీ గెలుస్తుంది. దేబ్‌జానీ సిల్వర్ గొడ్డలి తీసుకొని త్రిగుణ్‌కి నామినేట్ చేస్తుంది. ఏమైనా ఉంటే డైరెక్ట్‌గా చెప్పడం లేదు పక్కవాళ్ల దగ్గరకు వెళ్లి చెప్తున్నావ్.. సుధీర్ గురించి నాకు చెప్పడం నచ్చలేదు అంటుంది. 

 

వర్షిణి, రోహిత్..

వర్షిణి రోహిత్‌లలో రోహిత్ గెలిచి గోల్డెన్ గొడ్డలి పట్టుకుంటాడు. మొదటి నామినేషన్ త్రిగుణ్‌కి వేస్తాడు. ప్రపంచం తెలిసిన నువ్వు నన్ను స్టారాయిడ్స్ బాడీ అనడం నచ్చలేదు.. అక్కడో మాట ఇక్కడో మాట నాకు గురించి చెప్పడం నాకు ఇష్టం లేదు.. ఇక ముఖ్యమైనది నాకు అస్సలు నచ్చలేదు.. చాలా చెత్త మేటర్ అది.. నేను సృష్టిని సుధీర్ మీదకు పంపాను అని అన్నారు.. ఓ ఆడపిల్ల విషయంలో మీరు అలా అనడం లేదు నాకు అస్సలు నచ్చలేదు అని రోహిత్ అంటాడు. రోహిత్ అన్నింటికీ వాధిస్తే అనవ్నీ నాకు వద్దు.. నేను సృష్టిని సుధీర్ మీదకు పంపాను అన్నారు దానికి సమాధానం చెప్పండి అని రోహిత్ అడుగుతాడు. రోహిత్ రెండో నామినేషన్ ఝాన్సీకి వేస్తాడు. సేఫ్ గేమ్ ఆడటం మానేయ్.. అని అంటాడు. దానికి ఝాన్సీ నాకు నా స్టాటజీ ఉంది.  నువ్వే చాలా సార్లు వాళ్లు ఏం అనుకుంటున్నారో చెప్పు అని అడిగావ్ అని ఝాన్సీ అంటుంది. నేను ఎప్పుడడిగా అని రోహిత్ వాధించి నువ్వు ఈ గేమ్‌లో నాకు ఎక్కడా కనిపించడం లేదు అని అంటాడు. ఝాన్సీకి త్రిగుణ్ సపోర్ట్ చేయడంతో రోహిత్ త్రిగుణ్ గొడవ పడతారు.

 

నరేశ్, షాలిని..

నరేశ్, షాలినిలో నరేశ్ గెలిచి సిల్వర్ గొడ్డలి తీసుకొని షాలినిని నామినేట్ చేస్తాడు. గేమ్ సీరియస్‌గా తీసుకున్నారు..  మీరు ఓడిపోతే తీసుకోలేరు. చైత్ర గారిని మీరు హర్ట్ చేసి తనతో గొడవ పడి చివరకు తనతో క్షమాపణ చెప్పించారు.. ఎప్పుడూ బిగ్‌బాస్ పిలిచిన  వెంటనే రారు.. మీకు ఇప్పుడే వార్నింగ్ కూడా వచ్చింది అని అంటాడు. రాం ప్రసాద్ అన్న కూడా పడున్నాడు అని కుక్కలు మొరిగాయి అని మీరు చెప్పడం లేదు నాకే చెప్పారు అని షాలిని గొడవ పడుతుంది. బిగ్‌బాస్ మీకు వార్నింగ్ ఇచ్చారు తనకి ఇవ్వలేదు అని నరేశ్ అంటాడు.

 

షాలిని, త్రిగుణ్..

షాలిని, త్రిగుణ్‌ ఇద్దరిలో త్రిగుణ్ గెలిచి గోల్డెన్ గొడ్డలి పట్టుకుంటాడు. త్రిగుణ్ మొదటి ఓటు సుధీర్‌కి వేస్తాడు. ఏమైనా నేను ఒప్పుకుంటా కానీ వెన్నుపోటు పొడిచావ్ అంటే నేను తీసుకోలేను.. నువ్వే వచ్చి నాది సృష్టిది హైట్ సరిపోతుంది.. అంటూ తనని నువ్వే నాతో మాట్లాడావ్ నేను ఎవరికీ ఈ విషయాలు చెప్పలేదు.. తోముతున్నారు అన్న విషయంలో నేను ఎప్పుడూ తప్పుడు మీనింగ్‌తో అనలేదు.. నాకు ఐదుగురు చెల్లెళ్లు ఉన్నారు అని త్రిగుణ్ అంటాడు. ఇక చివరిగా నాతో ఫైట్ చేస్తే బాగా కనిపిస్తావ్ అని నాతో పెట్టుకున్నావ్ నాకు తెలుసు అని సుధీర్‌ని అంటాడు. సుధీర్ చాలా మాట్లాడుతాడు వాటికి త్రిగుణ్ సైలెంట్ అయిపోవడంతో మౌనం అర్థంగీకారం అని సుధీర్ అంటాడు. త్రిగుణ్ రెండో నామినేషన్ రోహిత్‌కి వేస్తాడు. నువ్వేదీ స్పోర్టివ్‌గా తీసుకోవడం లేదు.. పని చేయవు పని చేసే వాళ్లకి చేయనివ్వడం లేదు అని త్రిగుణ్ అంటాడు. రోహిత్ గ్రూప్స్ గురించి చెప్తూ మీ గ్రూప్స్ వైబ్ అవుతున్నప్పుడు మేం వైబ్ అయితే గ్రూప్స్ అన్నారు అని రోహిత్ అంటాడు.. ఈ టైంలోనే వర్షిణి, షాలిని గట్టిగా గొడవ పడతారు. వర్షిణి షాలినిని తోసేస్తుంది. ఫిజికల్‌గా అవ్వడం తప్పు అని రోహిత్, సృష్టి, షాలిని గొడవ పడతారు.

ముఖేశ్, అమన్..
ముఖేశ్, అమన్ హోరాహోరీగా జరుగుతుంది. అమన్ గెలిచి గోల్డ్ గొడ్డలి పట్టుకొని మొదట రాంప్రసాద్‌ని నామినేట్ చేస్తాడు. నరేశ్‌తో ఓడిపోయావ్ అని నాకు ఓటు వేయడం నచ్చలేదు అని అంటాడు. తర్వాత ఝాన్సీకి నామినేట్ చేసి మొదట నా గేమ్ బాగుంది అని చెప్పి అందరి దగ్గర నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావ్ అనడం నచ్చలేదు అని అంటాడు. 
 
రాంప్రసాద్, వంశీ..
రాంప్రసాద్, వంశీలలో వంశీ గెలిచి గోల్డెన్ గొడ్డలి అందుకుంటాడు. వంశీ మొదటి ఓటు దేబ్జానీకి ఇస్తాడు. నువ్వు ఓ పదం వాడావు నాకు అది నచ్చలేదు ఆ పదం ఇప్పుడు కూడా నాకు మాట్లాడాలి అని లేదు అని అంటాడు. ఈ పదం వాడకూడదు అని నాకు తెలీదు.. మేం జిమ్‌లో వాడుతుంటాం.. వర్షిణి ఆ పదం వాడకూడదు అని చెప్పడం వల్ల నాకు తెలిసింది అని దేబ్‌జానీ అంటుంది. ఇక వంశీ రెండో నామినేషన్ ముఖేశ్‌కి వేస్తాడు. ముఖేశ్ ఇంట్లో గడ్డం గీసుకోవడం తనకి ఇబ్బందిగా అనిపించింది అంటాడు. ఇవీ ఈ వారం నామినేషన్లు.. నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్.. నరేశ్, ముఖేశ్, త్రిగుణ్, దేబ్‌జానీ, వర్షిణి, కృష్ణుడు, సుధీర్, ఝాన్సీ,  అమన్, షాలిని, సృష్టీ. 

 

Click here to Read More
Previous Article
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: బ్లాక్‌ కీ దక్కించుకొని పవర్ పోగొట్టుకుందెవరు? ఎలిమినేషన్ జరిగిందా! రేపటి నుంచి రెండో అవతారం!
Next Article
Tim Cook Net Worth: Apple మాజీ సీఈవో టిమ్ కుక్ నికర ఆస్తి విలువ ఎంత? సంస్థలో ఇక నుంచి కొత్త ఇన్నింగ్స్

Related బిగ్‌ బాస్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment