Alla Nani Passes Away: ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

13 hours ago

ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని మృతి పట్ల ఏపీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

విశాఖపట్నం: ఏలూరు జిల్లా రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని (57) కన్నుమూశారు. విశాఖలోని ఆయన నివాసంలో గుండెపోటుతో మృతిచెందారు.  గుండెపోటుకు గురైన ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మృతిచెందారని డాక్టర్లు ధృవీకరించారు.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉప ముఖ్యమంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా సేవలు అందించారు. ఆయన మరణవార్తతో ఏలూరు జిల్లాతో పాటు ఏపీ రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది. 2024 ఎన్నికల తరువాత కొంతకాలానికి ఆళ్ల నాని వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసి, తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆళ్ల నానికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరూ అమెరికాలో ఉంటున్నారు.

కాంగ్రెస్ నుంచి టీడీపీ దాకా రాజకీయ ప్రస్థానం
30 డిసెంబర్ 1969 లో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించిన ఆయన చదువు మధ్యలోనే ఆపివేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఆళ్ల నాని రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీతో ప్రారంభమైంది. 1994, 1999 ఎన్నికల్లో ఏలూరు నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. తొలుత కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన, ఆ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా వైఎస్సార్‌సీపీలో చేరారు. వైసీపీ ప్రభుత్వంలో అత్యంత కీలక బాధ్యతలు నిర్వర్తించారు. డిప్యూటీ సీఎంగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సేవలు అందించారు. కరోనా సమయంలో చాలా యాక్టివ్ గా పనిచేశారు. ఏలూరు నియోజకవర్గంపై బలమైన పట్టున్న నేతగా ఆయన గుర్తింపు పొందారు.

ఏలూరు నుంచి 3 సార్లు విజయం

ఆళ్ల నాని (ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌) ఏలూరు నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 2017లో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టారు. మారిన రాజకీయ పరిణామాలతో వైసీపీలో చేరిన ఆళ్ల నాని 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు నుంచి మరోసారి గెలుపొందారు. అప్పటి సీఎం వైఎస్ జగన్‌ ఆయనకు వైద్య ఆరోగ్యశాఖ శాఖతో పాటు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అప్పగించారు. కరోనా సమయంలో అందుబాటులో ఉంటూ అధికారులను పరుగులు పెట్టించారు.

 

2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు.ఆళ్ల నాని మీద టీడీపీకి చెందిన బడేటి రాధాకృష్ణయ్య (చంటి) విజయం సాధించారు. ఆ ఎన్నికల తరువాత రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్న ఆళ్ల నాని వైసీపీకి రాజీనామా చేశారు. ఫిబ్రవరి 2025లో టీడీపీలో చేరారని తెలిసిందే.

Click here to Read More
Previous Article
ల్యాప్‌టాప్‌ను ఎక్కువసేపు ఒడిలో పెట్టుకుంటే వెలువడే వేడి.. తొడలు, పొట్ట దిగువ భాగంలోని చర్మంపై ప్రభావం చూపొచ్చు. ఎక్కువసేపు వేడి తగలడం వల్ల చర్మంపై మచ్చలు లేదా రంగు మారడం వంటి సమస్యలు రావచ్చు.

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment