Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: బ్లాక్‌ కీ దక్కించుకొని పవర్ పోగొట్టుకుందెవరు? ఎలిమినేషన్ జరిగిందా! రేపటి నుంచి రెండో అవతారం!

21 hours ago

Bigg Boss Season 10 Day 7: సృష్టికి అందరూ ఓట్లు వేసి బ్లాక్‌కీ ఇవ్వడం.. తన పవర్ బాక్స్‌ని సుధీర్ దక్కించుకోవడం.. ఈ వారం ఎవరూ ఎలిమినేట్ కాకపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Bigg Boss Season 10 Letest Episode: బిగ్‌బాస్ సీజన్ 10లో 7వ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో.. హోస్ట్ నాగార్జున వచ్చి కం టెస్టెంట్స్‌కి ఎలాంటి సలహాలు సూచనలు చేశారు.. ఎవరి ఆట ఎలా ఉందో చెప్పారా లేదా..  ఎపిసోడ్‌లో ఎలాంటి ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయో.. బిగ్‌బాస్ హైలెట్స్ ఇప్పుడు తెలుసుకుందాం..

తెలుగే మాట్లాడండీ.. చిరాకుగా ఉంది..

షో మొదలవగానే నాగ్‌ ఆడియన్స్‌తో మాట్లాడి ఫేవరెట్ కంటెస్ట్ంట్స్ ఎవరూ అని అడిగి తెలుసుకుంటారు. ఒకరు త్రిగుణ్ అని చెప్తే మరొకరు షాలినీ అని చెప్తారు. ఇక నాగ్ ఈ రోజు బ్లాక్ కీ ఇస్తామని చెప్తారు. తర్వాత కంటెస్టెంట్స్‌తో ఇంగ్లీష్‌లో మాట్లాడి.. అర్థమైందా మీరు ఇంగ్లీష్‌తో మాట్లాడుతుంటే చిరాకుగా ఉంది అని చెప్పి రోహిత్‌, షాలిని, సృష్టి ఎక్కువ ఇంగ్లీష్‌ మాట్లాడుతున్నారు.. తెలుగు వచ్చి కూడా ఇలా మాట్లాడటం నచ్చడం లేదు అని అంటారు. ముగ్గురు సారీ చెప్తారు. తర్వాత అమన్‌ పర్మినెంట్ కంటెస్టెంట్ అని అనౌన్స్ చేస్తారు.

దగ్గర.. దూరం కంటిన్యూ..

నిన్న ఆపేసిన హృదయానికి దగ్గర ఎవరు.. దూరం ఎవరు ఆటని మొదలు పెడతారు. ముఖేశ్ తనకు ఝాన్సీ హృదయానికి దగ్గరగా  ఉందని రోహిత్ హృదయానికి దూరంగా ఉన్నాడు అని చెప్తాడు. కృష్ణుడు దగ్గర దేబ్జానీ, దూరం రోహిత్ అని చెప్తాడు. నరేశ్ హృదయానికి దగ్గర దేబ్జానీ అని హృదయానికి దూరం సృష్టి అని చెప్తే.. షాలిని హృదయానికి దగ్గర రాంప్రసాద్ దగ్గర దూరం అమన్ అని చెప్తుంది. సుధీర్ తన హృదయానికి దగ్గర ముఖేశ్, దూరం వర్షిణి అని చెప్తాడు. వంశీ హృదయానికి దగ్గర అని రోహిత్‌ని చెప్పి.. సుధీర్ దూరం అని చెప్తాడు. హౌస్‌లో చాలా మంది హృదయానికి దగ్గరగా దేబ్‌జానీని పెట్టుకుంటే రోహిత్‌ని హృదయానికి దూరంగా పెట్టుకుంటారు. నాగ్‌ రోహిత్‌తో ఇది నీకు ఓ వార్నింగ్‌ లాంటిది అర్థం చేసుకో అని చెప్తారు.  

 

బ్లాక్‌ కీ ఎవరిది..

సృష్టి దగ్గర తీసుకున్న పవర్‌ని పవర్ రాని నలుగురు దేబ్‌జానీ, రోహిత్, అమన్, సుధీర్‌లలో ఒకరికి దక్కించుకునే అవకాశం ఉందని నలుగురికి టాక్స్ పెడతారు. ఈ టాస్క్‌లో సుధీర్ విన్ అయి పవర్ దక్కించుకుంటాడు. తర్వాత సృష్టి పర్మినెంట్ హౌస్‌మేట్ అని అనౌన్స్ చేస్తారు. సృష్టి తర్వాత నరేశ్ హౌస్ మేట్ అవుతాడు. 

 

సినిమా డైలాగ్స్..

సినిమా డైలాగ్స్‌కి సంబంధించిన ఫన్నీ టాక్స్ పెడతారు. నరేశ్‌కి రెండు టీమ్స్ సెలక్ట్ చేయడంతో ఏ టీంలో రోహిత్, త్రిగుణ్, కృష్ణుడు, రాంప్రసాద్, షాలిని, వర్షిణి, వంశీ  ఉంటే బీ టీంలో మిగతా వాళ్లు ఉంటారు. డైలాగ్ ప్లే అయిన వెంటనే ఏ సినిమాలోని డైలాగే బోర్డు మీద ఉన్న సినిమా పేర్లతో ఆ పేరుని రౌండ్ చుట్టాలి.. తర్వాత అందరూ ఆ సినిమాలోని పాటకి డ్యాన్స్ చేస్తారు. ఈ ఆటలో కృష్ణుడు ఏ టీం విన్ అవుతుంది. విన్ అయిన టీంకి స్వీట్స్ ఇస్తారు. తర్వాత ఝాన్సీ హౌస్‌మేట్ అని చెప్తారు. 

 

నాకు పులిహోర కలపడం లేదు..

దేబ్జానీ తనకి కాఫీ కావాలని అడిగితే అది నీకు కావాలి అంటే ఓ సీక్రెట్ చెప్పాలని నాగ్ అడుగుతారు. నేను ఆరో తరగతి ఫెయిల్ అయ్యాను మళ్లీ చదివాను అని చెప్తుంది. ఇది టాప్‌ సీక్రెట్ కాదు అని నాగ్ అంటే ఎవరికీ తెలీదు సార్ అది అమ్మానాన్నకే తెలుసు అని అంటుంది. సీక్రెట్ లేదు కానీ ఓ ఇంట్రస్టింగ్ విషయం చెప్తా అని అంటుంది. ఏంటి అని నాగ్ అడిగితే తనకి ముఖేశ్ మీద ఇంట్రస్ట్ ఉందని ఇంట్లో ముఖేశ్ నచ్చాడు.. అటు ఇటు పులిహోర కలుపుతున్నాడు కానీ నాకు పులిహోర కలపడం లేదు అని దేబ్‌జానీ క్యూట్‌గా చెప్పడంతో అందరూ చాలా నవ్వుతారు.

 

ఎలిమినేట్ ఎవరు..
హస్‌మేట్స్ అవ్వని కృష్ణుడు, సుధీర్, వర్షిణిలలో ఎవరు హౌస్‌మేట్స్ అవుతారు. ఎవరు ఎలిమినేట్ అవుతారు అని ముగ్గురిని ఓ రూంకి పిలిచి ముగ్గురితో డోర్స్ ఓపెన్ చేయమని చెప్తారు. చాలా సస్పెన్స్ తర్వాత ముగ్గురు హౌస్‌మేట్స్ అని అనౌన్స్ చేస్తారు. ఆల్రెడీ ఇద్దరు ఈ వారంలో ఎలిమినేట్ అవ్వడంతో ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో ఎవరినీ ఎలిమినేట్ చేయలేదు. నాగ్ వెళ్తూ వెళ్తూ ఈ వారం మహా పరీక్ష అయింది ఇక రెండో వారం పవర్ ఆఫ్ పీపుల్ అని చెప్తారు. సోమవారం నుంచి పవర్ ఆఫ్ పీపుల్ మొదలవుతుంది. 14 మంది హౌస్‌మ్మేట్స్ కెప్టెన్స్‌ రేసులో ఉంటారు. ఇవి ఈ రోజు ఎపిసోడ్‌లోని హైలెట్స్.

 

Click here to Read More
Previous Article
Rashmika Mandanna : బేబీ బంప్‌తో రష్మిక లుక్... భర్త విజయ్‌కు హగ్ - రణబాలి సెట్‌లో క్యూట్ మూమెంట్
Next Article
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రెండో అవతారం.. నామినేషన్లలో రెచ్చిపోయిన కంటెస్ట్ంట్స్.. నామినేషన్‌లో ఉంది వీళ్లే!

Related బిగ్‌ బాస్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment