Rashmika Mandanna : బేబీ బంప్‌తో రష్మిక లుక్... భర్త విజయ్‌కు హగ్ - రణబాలి సెట్‌లో క్యూట్ మూమెంట్

21 hours ago

Ranabaali Jayamma : విజయ్ దేవరకొండ, రష్మిక రణబాలి షూటింగ్ పూర్తైంది. ఈ సందర్భంగా రష్మిక షూటింగ్ సెట్‌లో బెస్ట్ మూమెంట్‌ను షేర్ చేయగా ట్రెండ్ అవుతోంది.

Rashmika Hugs Vijay Deverakonda In Ranabaali Final Shoot : టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక పెళ్లి తర్వాత జంటగా నటిస్తోన్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా రణబాలి (Ranabaali). మూవీలో రణబాలిగాా విజయ్, ఆయన భార్య జయమ్మగా రష్మిక నటిస్తున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా టీం అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.

ఈ సందర్భంగా హీరోయిన్ రష్మిక స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. బేబీ బంప్‌తో ఉన్న ఆమె లుక్ వైరల్ అవుతోంది. తన భర్త విజయ్ దేవరకొండను హగ్ చేసుకుని... బెస్ట్ మూమెంట్‌ను షేర్ చేశారు నేషనల్ క్రష్. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్ అవుతోంది.

మిస్ అవుతున్నా

విజయ్, రష్మిక ఇద్దరూ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యిందని తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. 'జయమ్మ షూటింగ్ పూర్తైంది. సెట్‌లో మిమ్మల్ని మిస్ అవుతాం.' అంటూ రష్మిక షేర్ చేయగా... 'ఈ సినిమా షూటింగ్ పూర్తైందంటే నమ్మలేకపోతున్నా. రణబాలి, జయమ్మ పాత్రలను మిస్ అవుతున్నా.' అని అన్నారు. జయమ్మ పాత్ర అందరి హృదయాలను ఆకట్టుకుంటుందన్నారు.

డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్

రష్మిక జయమ్మ పాత్రపై డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. 'ఈ మూవీలో ప్రతీ రోల్ ఎంతో ఎమోషనల్‌గా రాశాను. హీరోయిన్ క్యారెక్టర్‌కు జయమ్మ అని మా అమ్మ పేరు పెట్టాను. ఆ జయమ్మ నేటి తరం మహిళలకు స్ఫూర్తినిస్తుంది. ఆమె డైలాగ్స్ విషయంలోనూ ఎంతో జాగ్రత్త తీసుకున్నా. రష్మిక ఈ పాత్రకు ప్రాణం పోశారు. ఆమె ఎప్పటికీ జయమ్మగా అందరికీ గుర్తుండిపోతుంది. ఆమె రణబాలి అనురాగానికి ప్రతిరూపం. నిలువెత్తు ధైర్యానికి ఆయువు పట్టు.' అంటూ రాసుకొచ్చారు.

ఈ మూవీలో విజయ్, రష్మికలతో పాటు ఆర్నాల్డ్ వోస్లో విలన్ రోల్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. అక్టోబర్ 16న వరల్డ్ వైడ్‌గా తెలుగుతో పాటు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

Click here to Read More
Previous Article
Samantha : ఘనంగా సమంత సీమంతం సెలబ్రేషన్స్ - భర్త రాజ్, ఫ్యామిలీ మెంబర్స్‌తో క్యూట్ మూమెంట్స్
Next Article
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: బ్లాక్‌ కీ దక్కించుకొని పవర్ పోగొట్టుకుందెవరు? ఎలిమినేషన్ జరిగిందా! రేపటి నుంచి రెండో అవతారం!

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment