Janasena Politcis: కూటమి బలంగా నిలబడాలి.. జనసేన గౌరవానికి భంగం వాటిల్లకూడదు: పిఠాపురంలో పవన్ కళ్యాణ్

56 minutes ago

కూటమిలో ఎవరి గౌరవం తగ్గకుండా పనిచేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పదవులు వచ్చాక మనవారు మెత్తపడ్డారని త్వరలో దిశానిర్డేశం చేస్తానన్నారు.

Pawan Kalyan Camp Office in Pithapuram | పిఠాపురం: కూటమి ప్రభుత్వంలో అంతా కలిసికట్టుగా పనిచేయాలని, అదే సమయంలో ఎవరి గౌవరం తగ్గకూడదని.. జనసేన పార్టీ గౌరవానికి భంగం వాటిల్లకూడదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తనకు కృతజ్ఞత చూపించేతత్వం చాలా ఎక్కువని, అది తన  స్వభావం అన్నారు. వచ్చే 3, 4 నెలల్లో క్యాంప్ ఆఫీసు పిఠాపురానికి మార్చుతానని, జనసేన నాయ‌కులంద‌రికీ దిశా నిర్దేశం చేయాలన్నారు. ప‌ద‌వులు తీసుకున్న త‌రువాత మన నాయకులంతా మెత్త‌ప‌డ్డారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 


పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే ఏపీ ప్రభుత్వ ప్రధాన సంకల్పమని స్పష్టం చేశారు. పిఠాపురం ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ కాలేజీ స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలబడటమే తన నైజమని పేర్కొన్న ఆయన, పిఠాపురం ప్రజల అవసరాలు తీర్చడమే మొదటి ప్రాధాన్యత అని ప్రకటించారు. ఈ ఏడాది చివరికల్లా పిఠాపురంలో తన క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు పూర్తి కాగా, తాజాగా మరో రూ. 1,500 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశారు. ఇప్పటికే రూ. 200 కోట్లతో 600కు పైగా సీసీ, బీటీ రోడ్లను అందుబాటులోకి తీసుకొచ్చామని పవన్ కళ్యాణ్ వివరించారు. మరో 202 రహదారులను తాజాగా ప్రారంభించినట్లు చెప్పారు. ఉప్పాడ కొత్తపల్లి మండలంలో నాగులాపల్లి రక్షిత మంచినీటి పథకం ఆధునీకరణ ద్వారా 97 వేల మందికి తాగునీరు ఇస్తున్నామని, జల్ జీవన్ మిషన్, అమృత్ 2.0, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ నిధులతో దాదాపు రూ. 460 కోట్లతో గ్రామాలు, మున్సిపాలిటీల్లో తాగునీటి ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు.

ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ రూ. 34 కోట్లతో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రి నిర్మాణం, రూ. 45 కోట్లతో కాకినాడ జీజీహెచ్‌లో ఆంకాలజీ బ్లాక్, పిఠాపురంలో రూ. 100 కోట్లతో ఆయుష్ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే పిఠాపురం పట్టణంలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు రూ. 225 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి ప్లాంట్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు.

ఉప్పాడ తీరప్రాంత ప్రజలను ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న సముద్రపు కోత సమస్యకు శాశ్వత పరిష్కారంగా రూ. 323 కోట్లతో రక్షణ గోడ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిపిన చర్చలు, ఐఐటీ మద్రాస్ సర్వేల ఆధారంగా ఈ ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభం కానుందని తెలిపారు. పీఎం గతిశక్తి కింద రూ. 118 కోట్లతో రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (ROB), అమృత్ భారత్ పథకంలో రూ. 37 కోట్లతో రైల్వే స్టేషన్ ఆధునీకరణ, పాడా (PADA) నిధులతో రూ. 20 కోట్లతో బస్ స్టాండ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. విద్యార్థుల కోరిక మేరకు రూ. 4 కోట్లతో ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ కాలేజీ కొత్త భవనాలను నిర్మిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. పిఠాపురం అభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, సీఎం చంద్రబాబుకి ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

అడ్డుపడి పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ఆపేశారు.. 

సహారా ఫీల్డ్ వర్కర్స్ అండ్ డిపాజిటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ఆపి సమస్యలు విన్నవించారు. ప్రభుత్వాసుపత్రి సెంటర్లో కాన్వాయికి అడ్డంగా సభ్యులు వెళ్లడంతో కాన్వాయ్ ఆపి వారి సమస్యలు విన్నారు పవన్ కళ్యాణ్. సహారా నుంచి కోటి మంది డిపాజిట్ వర్క్స్ కు సంబంధించిన 25 వేల  కోట్లు రావాల్సి ఉందని వినతి పత్రం ఇచ్చారు. డబ్బులు అందక డిపాజిటర్ల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని పవన్ కు విన్నవించారు.  

Click here to Read More
Previous Article
Aortic Dissection : అయోర్టిక్ డిసెక్షన్ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. ఇది గుండెపోటు కంటే ప్రమాదమా?
Next Article
ACB Raids NIMS Doctor: ఏసీబీకి చిక్కిన నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్‌.. ఆయన ఆస్తుల చిట్టా ఇదే

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment