Chiranjeevi: నా రెమ్యూనరేషన్ ముందు ఆ డబ్బెంత? నేను బ్లడ్ అమ్ముకుంటానా? విమర్శలపై మెగాస్టార్ స్పందన

1 hour ago

Chiranjeevi On Allegations: చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ నెలకొల్పి ఎంతో మందికి చూపు తెప్పించారు, రక్తం ఇచ్చి ప్రాణాలు నిలబెట్టారు మెగాస్టార్. అయితే ఆ బ్యాంకుపై వచ్చిన విమర్శల పట్ల తాజాగా స్పందించారు.

Chiranjeevi Opens Up On Blood Bank Allegations: మెగాస్టార్ చిరంజీవికి అశేష సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఆయనకు బోలెడు అభిమాన సంఘాలు ఉన్నాయి. అందులో కీలకంగా పని చేస్తున్న అభిమాన సంఘాల్లో 'మెగా యూత్ ఫోర్స్' (Mega Youth Force) ఒకటి. ఇటీవల వాళ్ళతో చిరంజీవి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆ కార్యక్రమంలో తన 47 ఏళ్ళ సినీ ప్రస్థానం, అభిమానులు అందరితో ఉన్న ప్రేమానుబంధం, 1998 నుంచి నిరంతరాయంగా సాగుతున్న రక్తదాన శిబిరాలు గురించి మాట్లాడటంతో పాటు జీవితంలో విమర్శలను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రక్తదాన శిబిరాలపై వచ్చిన విమర్శల పట్ల మెగాస్టార్ స్పందించారు.

నా రెమ్యూనరేషన్ ముందు ఆ డబ్బులు ఎంత?
కథానాయకుడిగా తనకు ఎంతో పేరు ప్రఖ్యాతలు ఇచ్చిన అభిమానులు, ప్రేక్షకుల కోసం ఏదైనా మంచి చేయాలనే ఆలోచనతో 'చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ రీసెర్చ్ అండ్ డెవెలప్‌మెంట్ సెంటర్' నెలకొల్పారు మెగాస్టార్. ఆయన ఇచ్చిన పిలుపుతో ఎంతో మంది అభిమానులు ముందుకు వచ్చి రక్తదానాలు చేశారు. తమ మరణానంతరం కళ్ళు దానం చేసిన అభిమానులు సైతం ఉన్నారు. తద్వారా ఎంతో మంది చూపు వచ్చింది. రక్తదానాల వల్ల ఎందరో ప్రాణాలు నిలబడ్డాయి. అయితే ఆ బ్లడ్ బ్యాంకుపై విమర్శలు వచ్చాయి. చిరంజీవి రక్తం అమ్ముకుంటున్నాడని ఆరోపణలు చేశారు కొందరు. వారిపై చిరు స్పందించారు.

''నాకు అవమానాలు లేకుండా ఉన్నాయని అనుకుంటున్నారా? బ్లడ్ బ్యాంకు విషయానికి వస్తే... బ్లడ్ అమ్ముకుంటున్నాడని అన్నారు. నాకు వచ్చే పారితోషికం (రెమ్యూనరేషన్)తో పోల్చుకుంటే, ఎన్ని ప్యాకెట్ల రక్తం అమ్మితే ఆ డబ్బుకు సమానం చెప్పండి? వాళ్ళు అనే మాట ఎంత మూర్ఖంగా ఉన్నాయి? నేను ఎక్కడా చెయ్యి చాచి డొనేషన్లు తీసుకోకుండా నా కష్టార్జితంతో బ్లడ్ బ్యాంకు నడుపుతున్నాను. దాని వెనుక నేను ఖర్చు చేసేది కొంత. మీరు (ఫ్యాన్స్) సహకరించేది ఎంతో. దాన్ని వేల కట్టలేం. అటువంటి విమర్శలను పట్టించుకోను. నేను అదృష్టాన్ని నమ్మను. కష్టాన్ని నమ్ముకుంటా'' అని అభిమానుల సమావేశంలో చిరంజీవి పేర్కొన్నారు.

"నేను శ్రీకారం చుట్టిన సేవా యజ్ఞాన్ని అభిమానులు తమ భుజ స్కంధాలపై వేసుకొని శ్రీరాముడి మాటను లక్ష్మణ భరతులు విన్నట్లుగా నిర్వహిస్తున్నారు" అని  చిరంజీవి పేర్కొన్నారు. తన విజయాలు, అవార్డుల కంటే అభిమానులు సమాజానికి చేసే రక్తదాన సేవలు, సత్కార్యాల ద్వారా పొందే మానసిక సంతృప్తి, ఆనందమే తనకు ఎంతో మిన్న అని మెగాస్టార్ స్పష్టం చేశారు. ''ఓ జాడీలో ముందుగా ఇసుక వేస్తే... అందులో పెద్ద రాళ్లకు చోటు ఉండదు. ఇక్కడ పెద్ద రాళ్లు మన జీవిత లక్ష్యాలు, గమ్యాలు కాగా... ఇసుక రేణువులు అవమానాలు, నెగెటివిటీ, చిన్న చిన్న నిరాశలు. నెగెటివిటీ అనే ఇసుకతో మన మనస్సును నింపేస్తే ప్రధాన లక్ష్యాలను సాధించలేం" అని అభిమానులకు సలహా ఇచ్చారు చిరంజీవి.



Click here to Read More
Previous Article
ACB Raids NIMS Doctor: ఏసీబీకి చిక్కిన నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్‌.. ఆయన ఆస్తుల చిట్టా ఇదే
Next Article
Magnesium Deficiency : నిద్రలోపానికి మెగ్నీషియం కూడా కారణమే.. లోపాన్ని తగ్గించుకునేందుకు ఈ ఫుడ్స్ తినండి

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment