Raaka Guinness Record : అల్లు అర్జున్ రాకా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ - 37 వెనుక సీక్రెట్ రివీల్... స్పెషల్ వీడియో చూశారా?

2 hours ago

Raaka Record : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ మూవీ రాకా అరుదైన ఘనత సాధించింది. ఇండియన్ సినిమా స్థాయిని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో నిలిపింది.

Allu Arjun's Raaka Sets A Guinness World Record : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాాంబో పాన్ వరల్డ్ విజువల్ వండర్ 'రాకా' (Raaka) సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇండియన్ సినిమా స్థాయిని గిన్నిస్ వరల్డ్ బుక్‌లోకి ఎక్కించింది. ఈ విషయాన్ని మూవీ టీం అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.

37 వెనుక సీక్రెట్ ఇదే...

మూడు రోజుల క్రితం 37 అంటూ ఓ సీక్రెట్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే, ఇది ఏమై ఉంటుందా? అంటూ సోషల్ మీడియాలో పలు రకాల ఊహాగానాలు వచ్చాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డుతోనే దీని అర్థం ఏంటో చెప్పేశారు. ఒకేసారి 37 మంది కదలికలను రియల్ టైమ్‌లో చిత్రీకరించినందుకు రాకా గిన్నిస్ రికార్డు నెలకొల్పిందని మూవీ టీం వెల్లడించింది. 

 

'చరిత్ర సృష్టించబడింది. భారతీయ సినిమాను ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లిన ఒక ప్రపంచ విజయం. రాకా చిత్రం 'రియల్ టైమ్‌లో అత్యధిక మంది కదలికలను చిత్రీకరించినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పింది, ఇందులో 37 మంది నటీనటులను ఒకేసారి చిత్రీకరించారు. ఈ చారిత్రాత్మక ఘనతకు గుర్తుగా, శ్రీ అల్లు అర్జున్, శ్రీ అట్లీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్‌ను అందుకున్నారు.' అంటూ ఫోటోస్ షేర్ చేశారు. ప్రస్తుతం ఇవి ట్రెండ్ అవుతున్నాయి. అలాగే, దీనికి సంబంధించి స్పెషల్ వీడియో సైతం రిలీజ్ చేశారు.

ఫస్ట్ గ్లింప్స్ ఎప్పుడు?

అట్లీ బర్త్ డే సందర్భంగా సోమవారం రాకా గ్లింప్స్ వస్తుందని అంతా భావించారు. అందుకు తగ్గట్లుగానే 37 కోడ్‌ను డీకోడ్ చేశారు. అయితే, ఈ విషయంలో బన్నీ ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. 37 వెనుక వరల్డ్ రికార్డును రివీల్ చేసిన మేకర్స్... ఇదే బిగ్ సర్ప్రైజ్ అని చెప్పకనే చెప్పారు. దీంతో గ్లింప్స్ వచ్చేందుకు టైం పడుతుందనే టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై మూవీ టీం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

సినిమాలో అల్లు అర్జున్ సరసన కథానాయికగా బాలీవుడ్ స్టార్ దీపికా పదుకోన్ నటిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో కనిపిస్తారని, ఆ సన్నివేశాలను విదేశాల్లో చిత్రీకరించే అవకాశం ఉందనే టాక్. అలాగే... జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న కూడా నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. రష్మిక నెగిటివ్ రోల్‌లో కనిపించబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 2028 ప్రారంభంలో మూవీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. రెండు పార్టులుగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.

Click here to Read More
Previous Article
Nara Lokesh all ministries intervention: నారా లోకేష్ సకల శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్నారా? - బాధ్యతగానా లేకపోతే అధికారం చెలాయిస్తున్నారా?
Next Article
The Paradise Censor Review : ది ప్యారడైజ్ సెన్సార్ రివ్యూ - నేచరల్ స్టార్ మూవీకి A సర్టిఫికెట్... రన్ టైం ఎంతంటే?

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment