Amardeep Chowdary: కొత్త ఇంటిలో అడుగుపెట్టిన అమర్‌దీప్ చౌదరి... గృహప్రవేశంలో తేజస్విని ఎక్కడ? నెటిజన్స్ ప్రశ్నలు?

1 hour ago

Amardeep Chowdary New House Gruhapravesam: 'జానకి కలగనలేదు' సీరియల్, 'బిగ్ బాస్' షోతో పాపులరైన నటుడు అమర్‌దీప్ చౌదరి. హీరోగా సినిమాలు, రియాలిటీ షోలు కూడా చేస్తున్నారు. ఆయన కొత్త ఇంటిలో అడుగు పెట్టారు.

Amardeep Chowdary Housewarming Ceremony: తెలుగు బుల్లితెరపై అమర్‌దీప్ చౌదరి పాపులర్. 'జానకి కలగనలేదు' సీరియల్‌తో అతనికి బోలెడు మంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అంతకు ముందు 'సిరి సిరి మువ్వలు'తో పాటు మరికొన్ని సీరియల్స్ చేశారు. 'బిగ్ బాస్' సహా మరికొన్ని రియాలిటీ షోలతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడీ స్టార్ ఓ ఇంటివాడు అయ్యారు... అంటే ఆయన కొత్త ఇంటిలో అడుగు పెట్టారు.

గృహప్రవేశ పూజ చేసిన అమర్‌దీప్ చౌదరి
గురువారం (సెప్టెంబర్ 17వ తేదీన) అమర్‌దీప్ చౌదరి కొత్త ఫ్లాట్ గృహప్రవేశ వేడుక జరిగింది. సోషల్ మీడియాలో గానీ, బయట గానీ పబ్లిక్‌గా కొత్త ఇంటిలో అడుగు పెట్టినట్టు ఆయన చెప్పలేదు. అయితే... గృహప్రవేశ పూజకు టీవీ ఇండస్ట్రీలో తనకు అత్యంత సన్నిహితులు అయినటువంటి కొంత మందికి ఆహ్వానించారు. అందులో మానస్ నాగులపల్లి మదర్ పద్మిని కూడా ఉన్నారు. సోషల్ మీడియాలో అమర్‌దీప్ చౌదరికి కంగ్రాట్స్ చెబుతూ ఆవిడ పోస్టులు చేశారు. దాంతో ఆయన కొత్త ఇంటి విషయం బయటకు వచ్చింది. ఆడియన్స్ అందరికీ అమర్ దీప్ ఫ్లాట్ కొన్నారని అర్థమైంది.
అమర్‌దీప్ చౌదరి భార్య తేజస్విని ఎక్కడ?
అమర్‌దీప్ చౌదరి కొత్త ఫ్లాట్ గృహప్రవేశ వేడుక పూజ వీడియో చూసిన ఆయన ఫ్యాన్స్, బుల్లితెర వీక్షకులకు ఓ డౌట్ వచ్చింది. ఆయన భార్య, నటి తేజస్విని గౌడ ఎక్కడ? అని. అమర్‌దీప్ చౌదరితో పాటు తేజస్విని కూడా బుల్లితెరపై పాపులర్. వినాయక చవితి పూజను ఇద్దరూ కలిసి చేశారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. కానీ, గృహప్రవేశ పూజను అమర్ దీప్ చౌదరి ఒక్కరే చేశారు. దాంతో 'తేజ ఎక్కడ?', 'అమర్ అన్నా వదిన ఎక్కడ?' అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
శోభా శెట్టి, అరియనా సహా ఎవరెవరు వచ్చారంటే?
టీవీ ఇండస్ట్రీలో అమర్ దీప్ చౌదరికి మానస్ నాగులపల్లి క్లోజ్ ఫ్రెండ్. కానీ, ఆయన గృహప్రవేశ వేడుకలో కనిపించలేదు. మానస్ బదులు ఆయన మదర్ పద్మిని వచ్చి శుభాకాంక్షలు అందజేశారు. అలాగే, 'కార్తీక దీపం' సీరియల్ ఫేమ్ శోభా శెట్టి, 'బిగ్ బాస్' ఫేమ్ అరియనా గ్లోరీ, టేస్టీ తేజ సహా పలువురు టీవీ సెలబ్రిటీలు అమర్ దీప్ చౌదరి కొత్త ఇంటి గృహప్రవేశానికి హాజయ్యారు.  

Click here to Read More
Previous Article
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఇరుముడి To తుడక్కమ్... ఒకే రోజు 12 సినిమాలు స్ట్రీమింగ్
Next Article
Frequent Foot Swelling : పాదాల్లో పదే పదే వాపు వస్తోందా? ఈ ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు.. నిర్లక్ష్యం చేయొద్దు

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment