Prithvi Shaw Engagement Broken: నిశ్చితార్థం జరిగిన ఆరు నెలలకే పృథ్వీ షా బ్రేకప్.. ఫియాన్సీ ఆకృతి తో విడిపోతున్నట్లు వెల్లడి

1 hour ago

Indian Batter Prithvi Shaw Ends Relationship With Akriti Agarwal:  భారత క్రికెటర్ పృథ్వీ షా వ్యక్తిగత జీవితంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. తన కాబోయే భార్య, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, నటి ఆకృతి అగర్వాల్‌తో అతడు విడిపోయాడు. ఎంగేజ్‌మెంట్ జరిగిన కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ఈ జంట తమ బంధానికి స్వస్తి పలికింది. ఈ విషయాన్ని ఆకృతి అగర్వాల్ గురువారం తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అధికారికంగా ధ్రువీకరించింది. భవిష్యత్ లక్ష్యాలు, ప్రస్తుత పరిస్థితులు వేర్వేరుగా ఉండటం వల్ల తాము పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామని ఆమె పేర్కొంది. ఈ కష్ట సమయంలో తమ ప్రైవసీని గౌరవించాలని, విడిపోవడానికి గల కారణాలపై ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేయవద్దని నెటిజన్లను కోరింది. ఈ ప్రకటన వచ్చిన వెంటనే పృథ్వీ షా తన సోషల్ మీడియా ఖాతా నుంచి గతంలో పెట్టిన నిశ్చితార్థ ఫొటోలను పూర్తిగా తొలగించాడు.

బరువెక్కిన హృదయంతో ఆకృతి పోస్ట్.. 
తమ బ్రేకప్ గురించి ఆకృతి సోషల్ మీడియాలో సుదీర్ఘమైన ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. "చాలా బరువెక్కిన హృదయంతో ఈ విషయాన్ని పంచుకుంటున్నాను. భవిష్యత్తు కోసం మాకున్న వేర్వేరు లక్ష్యాలు, పరిస్థితుల కారణంగా నేను నా కాబోయే భర్త విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. ఒకరిపై ఒకరికి ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నప్పటికీ, మా ప్రయాణాలు కలిసి సాగేవి కావని అర్థం చేసుకున్నాం. ప్రస్తుత బాధ్యతలు, పరిస్థితుల దృష్ట్యా పరస్పరం చర్చించుకుని మా దారులు మార్చుకున్నాం. ఇద్దరి భవిష్యత్తు బాగుండాలని, ప్రశాంతత లభించాలని కోరుకుంటున్నాను. ఈ క్లిష్ట సమయంలో మా వ్యక్తిగత జీవితానికి గౌరవం ఇచ్చి ఎలాంటి ఊహాగానాలకు తావు ఇవ్వరని భావిస్తున్నాను" అని ఆమె రాసుకొచ్చింది.

Read Also: 

మార్చిలో ఘనంగా నిశ్చితార్థం.. 
ఈ ఏడాది మార్చి 8న పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్ ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ సమయంలో షా మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేసిన ఫొటోలతో పాటు రింగ్స్ చూపిస్తూ దిగిన రొమాంటిక్ చిత్రాలను అభిమానులతో పంచుకున్నాడు. మైదానంలో సిక్సర్లు కొట్టడం నుంచి జీవితంలో సరికొత్త భాగస్వామ్యం మొదలైందంటూ, ఆమె తన పర్ఫెక్ట్ ఇన్నింగ్స్ అని అప్పట్లో రాసుకొచ్చాడు. అయితే ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవకపోవడం అభిమానులను విస్మయానికి గురిచేసింది.

కెరీర్ ఒడిదొడుకుల నడుమ వ్యక్తిగత షాక్.. 
2018లో వెస్టిండీస్‌పై అరంగేట్రం టెస్టులోనే సెంచరీ బాది ప్రపంచ దృష్టిని ఆకర్షించిన పృథ్వీ షా, ఆ తర్వాత ఫామ్ కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్ 2026 వేలంలో ఆరంభంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ యాక్సిలరేటెడ్ రౌండ్‌లో 75 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. అయితే ఆ సీజన్‌లో అతడికి ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం రాలేదు. గతంలో ముంబై రంజీ జట్టు నుంచి తప్పించడంతో 26 ఏళ్ల ఈ బ్యాటర్ ప్రస్తుతం మహారాష్ట్ర తరఫున దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. కెరీర్‌లో పుంజుకునేందుకు కష్టపడుతున్న సమయంలోనే ఈ వ్యక్తిగత బంధం ముగియడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Click here to Read More
Previous Article
Frequent Foot Swelling : పాదాల్లో పదే పదే వాపు వస్తోందా? ఈ ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు.. నిర్లక్ష్యం చేయొద్దు
Next Article
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment