Supriya Yarlagadda: సెంట్రల్ సెన్సార్ బోర్డులో నాగ్ మేనకోడలు సుప్రియ - ఛైర్మన్ తెలుగోడే... ఇంకా ఎవరెవరు ఉన్నారంటే?

1 hour ago

CBFC New Board: సెంట్రల్ సెన్సార్ బోర్డుకు కొత్త కమిటీని నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఈసారి ఛైర్మన్ పదవిని తెలుగు వ్యక్తికి అందించింది. నాగ్ మేనకోడలు సుప్రియకు చోటు కల్పించింది. ఇంకెవరెవరు ఉన్నారంటే?

CBFC New Chairman: సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సిబిఎఫ్‌సి - సెన్సార్ బోర్డు)కు ఈ ఏడాది మే నెలలో శశి శేఖర్ వేంపటి (Shashi Shekhar Vempati)ని కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ నియమించింది. ఇప్పుడు 18 మంది సభ్యులతో కూడిన ప్యానెల్‌ను పునర్వ్యవస్థీకరించింది. అందులో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వ్యక్తులకు, టాలీవుడ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులకు సముచిత స్థానం కల్పించింది. ఈ సభ్యుల పదవీకాలం మూడేళ్ళు ఉంటుంది.

సెన్సార్ బోర్డులో నాగ్ మేనకోడలు సుప్రియ
ప్రస్తుత ఏపీ డెప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'తో కథానాయికగా సుప్రియా యార్లగడ్డ (Supriya Yarlagadda) పరిచయం అయ్యారు. అక్కినేని నాగేశ్వరరావు మనవరాలిగా, కింగ్ నాగార్జున మేనకోడలిగా సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారామె. అయితే... కథానాయికగా మొదటి సినిమా తర్వాత మళ్ళీ తెరపై కనిపించలేదు. ఇటీవల అడివి శేష్ 'డెకాయిట్', అంతకు ముందు 'గూఢచారి' సినిమాల్లో కనిపించారు. కానీ, తెర వెనుక పాత్రలు పోషిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. అలాగే, కొన్ని సినిమాల నిర్మాణ వ్యవహారాల్లో ఆమెది కీలక పాత్ర. 

సెన్సార్ బోర్డులో సుప్రియా యార్లగడ్డకు స్థానం లభించడంతో పలువురు చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

ప్రీతి జింటాతో పాటు పంకజ్ త్రిపాఠి, సునీల్ శెట్టి
శశి శేఖర్ వేంపటి సారథ్యంలోని కొత్త సెన్సార్ బోర్డులో సుప్రియా యార్లగడ్డతో పాటు హిందీ సహా ఇతర చిత్రసీమలకు చెందిన ప్రముఖులు, సినిమాలతో పాటు టీవీ రంగం నుంచి కూడా కొందరు ఉన్నారు.
హిందీలో ప్రీతి జింటా పాపులర్ హీరోయిన్. ఇరవై ఏళ్ళ క్రితం పలు హిట్ సినిమాలు చేశారు. తర్వాత ఐపీఎల్ టీమ్ 'పంజాబ్ కింగ్స్' సహ యజమానిగా క్రికెట్ రంగంలో గుర్తింపు పొందారు. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు 'రాజకుమారుడు', విక్టరీ వెంకటేష్ 'ప్రేమంటే ఇదేరా' సినిమాల్లోనూ నటించారు. 

'మీర్జాపూర్'తో ఓటీటీలో సూపర్ హిట్ అందుకున్న నటుడు పంకజ్ త్రిపాఠి (Pankaj Tripathi). 'గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్', 'మసాన్', 'స్త్రీ' సినిమాల్లోనూ నటించారు. తెలుగులో విష్ణు మంచు 'దూసుకెళ్తా'లో విలన్ రోల్ చేశారు. వాళ్ళిద్దరికీ కొత్త సెన్సార్ బోర్డులో చోటు దక్కింది.

ప్రముఖ హిందీ నటుడు, క్రికెటర్ కేఎల్ రాహుల్ మావయ్య సునీల్ శెట్టి, మనోజ్ జోషి, బెంగాలీ నటుడు ప్రసేన్‌జిత్ ఛటర్జీ (Prosenjit Chatterjee), పల్లవి జోషి, రూపాలి గంగూలీ, మరాఠీ నటి నిశిగంధ వాడ్, మలయాళ - హిందీ సినిమాలు చేసిన దర్శకుడు ప్రియదర్శన్, గ్రామీ పురస్కార గ్రహీత - సంగీత దర్శకుడు రిక్కీ కేజ్, గుజరాతీ దర్శకుడు అభిషేక్ జైన్, పంజాబీ జానపద గాయకుడు హాన్స్‌రాజ్ హాన్స్, దర్శకుడిగా జాతీయ పురస్కార గ్రహీత నీల మాధవ్ పాండా, ఫిల్మ్ క్రిటిక్ వినోద్ అనుపమ్, ఇంకా రైటర్ యతీంద్ర మిశ్రా, వామన్ కేంద్రే, రమేష్ పతంగే కొత్త కమిటీలో ఉన్నారు.

Click here to Read More
Previous Article
IPL Auction In India.!: మూడేళ్ల తర్వాత భారత్‌ లో ఐపీఎల్ వేలం.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై పునరాలోచనలో బీసీసీఐ, అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు
Next Article
Hussain Sagar Ganesh immersion rules 2026: ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనాల్లేవ్ - నిషేధం బోర్డులు పెట్టిన అధికారులు - మరి ఖైరతాబాద్ గణేశుడి పరిస్థితేంటి?

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment