Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఇరుముడి To తుడక్కమ్... ఒకే రోజు 12 సినిమాలు స్ట్రీమింగ్

1 hour ago

Friday OTT Streamings : సెప్టెంబర్ 18న శుక్రవారం ఒకే రోజు దాదాపు 10 సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు డిఫరెంట్ ఓటీటీల్లో అందుబాటులోకి వచ్చాయి. మరి ఏ మూవీస్ ఎందులో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఓసారి చూస్తే...

Friday OTT Movies Web Series Complete List : వినాయక చవితి స్పెషల్ వీక్‌లో భాగంగా ఈ శుక్రవారం ఓటీటీల్లో బ్లాక్ బస్టర్ మూవీస్‌తో పాటు థ్రిల్లింగ్, హారర్, కామెడీ వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఒక్క రోజే దాదాపు 10 సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. మరి ఆ మూవీస్ ఏంటి... ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఓసారి చూస్తే...

ఇరుముడి (Irumudi) : మాస్ మహారాజ రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ఇరుముడి (Irumudi). శుక్రవారం నుంచి ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్‌లో (Netflix) తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించగా... చైల్డ్ ఆర్టిస్ట్ నక్షత్ర కీలకపాత్ర పోషించారు. అలాగే, సాయి కుమార్, అజయ్ ఘోష్, స్వాసిక తదితరులు కీలకపాత్రలు పోషించారు.

తుడక్కమ్ (Thudakkam) : మలయాళ స్టార్ మోహన్ లాల్ కుమార్తె విస్మయ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ తుడక్కమ్. ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్' (Jio Hotstar)లో మలయాళంతో పాటు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది.

మొద రాత్రి (Modharathri) : రిషికాంత్, అనిష్మా అనిల్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ రొమాంటిక్ కామెడీ మూవీ మొదరాత్రి. రాజా కరుప్పు స్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ (Netflix) శుక్రవారం నుంచి తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది.

బోల్డ్ థ్రిల్లర్ ఇరుట్టరై : లల్లు, దేబ్నితా కర్ ప్రధాన పాత్రలో నటించిన బోల్డ్ హారర్ థ్రిల్లర్ ఇరుట్టరై (Iruttarai). ఈ మూవీకి నితిన్ కుమార్ దర్శకత్వం వహించగా... HK ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హెమ్లా కృతిక అండ్ టీమ్ నిర్మించారు. డైరెక్ట్‌గా ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా (Aha)లోకే శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ అందుబాటులో ఉంది.

మూవీస్ / వెబ్ సిరీస్ కంప్లీట్ లిస్ట్

  • నెట్ ఫ్లిక్స్ (Netflix) - ఇరుముడి (తెలుగు మూవీ), లస్ట్ స్టోరీస్ (బోల్డ్ అంథాలజీ), మొద రాత్రి (తెలుగు డబ్బింగ్ మూవీ), ద స్కాండల్ (కొరియన్ సిరీస్), జాకీర్ ఖాన్ (హిందీ కామెడీ షో), ఫ్లాయిడ్ మేవెదర్ Vs మేనీ పక్వివో (ఇంగ్లీష్ మూవీ - సెప్టెంబర్ 19), స్టాప్ దట్ ట్రైన్ (సెప్టెంబర్ 20).
  • అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) - రామ్ అండ్ లీలా (తమిళ మూవీ), యూ ప్లస్ మీ : ఎగైనస్ట్ ద వరల్డ్ (ఇంగ్లీష్ మూవీ).
  • జియో హాట్ స్టార్ (Jio Hotstar) - తుడక్కమ్ (తెలుగు డబ్బింగ్ మూవీ), లీ క్రోనిన్స్ ద మమ్మీ, మాబ్ ల్యాండ్ (ఇంగ్లీష్ సిరీస్).
  • ఆహా తమిళ్ (Aha Tamil) - ఇరుట్టరై (బోల్డ్ థ్రిల్లర్ మూవీ).
  • ఈటీవీ విన్ (Etv Win) - తోలుబొమ్మలు (యూత్ కామెడీ సిరీస్).
  • సన్ నెక్స్ట్ (SunNXT) - అంగీకారం (తమిళ మూవీ).
  • యాపిల్ టీవీ ప్లస్ (Apple TV Plus) - స్లో హార్సెస్ సీజన్ 6 (ఇంగ్లీష్ సిరీస్).
Click here to Read More
Previous Article
Domestic Pay Hike: డొమెస్టిక్ మ్యాచ్ అఫీషియల్స్‌కు బీసీసీఐ శుభవార్త.. అంపైర్ల ఫీజులు భారీగా పెంపు, కొత్త గ్రేడేషన్ సిస్టమ్ అమలు
Next Article
Amardeep Chowdary: కొత్త ఇంటిలో అడుగుపెట్టిన అమర్‌దీప్ చౌదరి... గృహప్రవేశంలో తేజస్విని ఎక్కడ? నెటిజన్స్ ప్రశ్నలు?

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment