శనివారం హుండీ ఆదాయం: రూ.3.50 కోట్లు ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 72,019 తలనీలాలు సమర్పించినవారు: 25,431

1 hour ago

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. అందులో భాగంగా మరో 12 కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.

అమరావతి, సెప్టెంబర్15: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. అందులో భాగంగా మరో 12 కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఈ మే రెండు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. ఫారం 1 నోటీసుతో పాటు వార్డుల వారీ ఫొటో ఓటర్ల జాబితాలను సెప్టెంబర్ 22న ప్రకటించాలని పేర్కొన్నారు. 2026 జనవరి 1వ తేదీన అర్హత తేదీగా పరిగణించి.. తాజా అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా రూపొందించాలని సూచించారు.

విజయనగరం కార్పొరేషన్‌లో వార్డుల పునర్విభజన ప్రక్రియ ముందుగా పూర్తి అయింది. దీంతో సెప్టెంబర్ 3 నాటికే ఓటర్ల జాబితా ప్రచురణ పూర్తయింది. అలాగే రాష్ట్రంలో 106 పురపాలక, నగర పంచాయతీల్లో డిలిమిటేషన పూర్తయిన 58 చోట్ల కూడా సెప్టెంబర్ 3నే జాబితాలను వెల్లడించారు. మిగిలిన 12 కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియ సెప్టెంబర్ 14 నుంచి 17 మధ్య పూర్తి కానుంది.

అందుకు సంబంధించిన ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఇప్పటికే ఎన్నికల సంఘానికి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి లేఖ రాశారు. ప్రభుత్వ విజ్ఞప్తిని పరిశీలించిన ఎస్‌ఈసీ.. సెప్టెంబర్ 22ను ప్రచురణ తేదీగా ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఓటర్ల జాబితాల ప్రచురణతో ఆయా పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సిద్ధమవుతోంది.

 

 

Click here to Read More
Previous Article
శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు
Next Article
ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలి

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment