సూర్య, చంద్రప్రభ వాహనాలపై శ్రీవారి అభయం

1 hour ago

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఏడోరోజు సోమవారం మలయప్పస్వామి సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలపై కొలువుదీరి భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య...
తిరుమల, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఏడోరోజు సోమవారం మలయప్పస్వామి సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలపై కొలువుదీరి భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య...వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, కళాబృందాల ప్రదర్శనలు, కర్పూర హారతులు, గోవిందనామస్మరణలతో సూర్యప్రభ వాహన సేవ వైభవోపేతంగా సాగింది. రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య చంద్రప్రభ వాహనంపై మలయప్పస్వామి భక్తులను అనుగ్రహించారు. కాగా, బ్రహ్మోత్సవాల్లో మరో ప్రధాన వాహనమైన మహారథోత్సవం మంగళవారం ఉదయం జరగనుంది. రాత్రి జరిగే అశ్వవాహనంతో బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలు ముగుస్తాయి.
తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌ కేంద్రాల్లో నిత్యం జారీ చేసే శ్రీవారి సర్వదర్శన టోకెన్లను మరో నాలుగు రోజులపాటు నిలిపివేయనున్నారు. తొలుత ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు టోకెన్ల జారీ నిలిపివేస్తున్నట్టు టీటీడీ అధికారులు ప్రకటించారు. తాజాగా మరో నాలుగు రోజులు అంటే 24వ తేదీ వరకు టోకెన్ల జారీ ఉండదని సోమవారం ప్రకటించారు. 25వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకెన్లను 24న ఇవ్వనున్నట్టు తెలిపారు.

Click here to Read More
Previous Article
టాటా నుంచి మరో కొత్త సెడాన్‌.. Tigor ప్లేస్‌లోకి Aeris.. ఇవే హైలైట్స్‌!
Next Article
శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment