The Paradise Censor Review : ది ప్యారడైజ్ సెన్సార్ రివ్యూ - నేచరల్ స్టార్ మూవీకి A సర్టిఫికెట్... రన్ టైం ఎంతంటే?

2 hours ago

The Paradise Review : నేచరల్ స్టార్ నాని ది ప్యారడైజ్ మూవీకి సెన్సార్ పూర్తైంది. ఈ మూవీకి A సర్టిఫికెట్ జారీ చేసిన సెన్సార్ బోర్డ్ 21 మార్పులు సూచించింది.

Nani's The Paradise Gets A Certificate Run Time Details : నేచరల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబో 'ది ప్యారడైజ్' మూవీ సెన్సార్ పూర్తైంది. అందరూ ఊహించినట్లుగానే ఈ మూవీకిి సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ జారీ చేసింది. అంతే కాకుండా వయలెన్స్ ఎక్కువగా ఉన్న సీన్స్ కట్ చేయాలని సూచించింది.

రన్ టైం ఎంతంటే?

'ది ప్యారడైజ్' మూవీలో సెన్సార్ బోర్డు అధికారులు మొత్తం 21 మార్పులు సూచించినట్లు తెలుస్తోంది. వయలెన్స్ ఎక్కువగా ఉన్న కొన్ని సీన్స్‌ను తొలగించడంతో పాటు కొన్నింటిని ట్రిమ్ చేయాలని సూచించింది. ఈ సినిమా రన్ టైం 2 గంటల 54 నిమిషాల 4 సెకన్ల నిడివితో రానుంది. 

 

A సర్టిఫికెట్ రావడంపై స్పందించిన టీం... 'సినిమాలోని ఎమోషన్ అందరి కోసం అయినప్పటికీ... జడల్ సహజత్వం మాత్రం కేవలం పెద్దల కోసమే.' అంటూ ట్వీట్ చేసింది. నాని లుక్‌తో పాటు యాక్షన్ సీన్స్ అదిరిపోయాయని, ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌కు ఆడియన్స్ కనెక్ట్ అవుతారనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

టికెట్ ధరలు పెంపు

ఈ మూవీ టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే, సెప్టెంబర్ 23 (బుధవారం) ప్రీమియర్లకు కూడా పర్మిషన్ ఇచ్చింది. స్పెషల్ ప్రీమియర్ టికెట్ రేట్ రూ.500గా (జీఎస్టీతో కలిపి) నిర్ణయించారు. సింగిల్ స్క్రీన్లలో సెప్టెంబర్ 24 నుంచి 27 వరకూ ప్రస్తుతం ఉన్న టికెట్ ధరకు అదనంగా రూ.48 (జీఎస్టీతో కలిపి), సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకూ రూ.23 (జీఎస్టీతో కలిపి) పెంచుకోవచ్చు.

అదే, మల్టీప్లెక్సుల్లో సెప్టెంబర్ 24 నుంచి 27 వరకూ ప్రస్తుతం ఉన్న టికెట్ ధరకు అదనంగా రూ.94 (జీఎస్టీతో కలిపి), సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకూ రూ.45 (జీఎస్టీతో కలిపి) పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.

10 వేల మంది ఫ్యాన్స్‌తో

సినిమా రిలీజ్‌కు ముందు హీరో నాని ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా భారీగా ఫ్యాన్స్ మీట్ నిర్వహించారు. దాదాపు 10 వేల మంది వచ్చిన ఈవెంట్‌లో వారితో ప్రత్యేకంగా ముచ్చటించారు. సెల్ఫీలు దిగుతూ వారిని ఉత్సాహపరిచారు. అంతే కాకుండా ఫ్యాన్స్ కోసం నాని వెజ్, నాన్ వెజ్ వంటకాలతో ఘనంగా ట్రీట్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

ఈ మూవీలో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించారు. అలాగే, మోహన్ బాబు, సంపూర్ణేశ్ బాబు, రాఘవ్ జుయల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు. 

Click here to Read More
Previous Article
Raaka Guinness Record : అల్లు అర్జున్ రాకా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ - 37 వెనుక సీక్రెట్ రివీల్... స్పెషల్ వీడియో చూశారా?
Next Article
Fridge Food Storage Guide : ఫ్రిడ్జ్‌లో పాలు, కూరగాయలు, మాంసం ఎక్కడ పెట్టాలి? ఏ అరలో ఏది పెట్టాలో తెలుసా?

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment