Filters

Channels
Topics
Other Filters

Samantha : ఘనంగా సమంత సీమంతం సెలబ్రేషన్స్ - భర్త రాజ్, ఫ్యామిలీ మెంబర్స్‌తో క్యూట్ మూమెంట్స్

Samantha Ruth Prabhu : స్టార్ హీరోయిన్ సమంత వినాయక చవితి రోజు స్పెషల్ మూమెంట్ షేర్ చేశారు. తన సీమంతం వేడుక ఫోటోలను ఆమె అభిమానులతో పంచుకున్నారు.  

AP Recruitment Age Limit: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు

ఏపీలో నాన్-యూనిఫాం ఉద్యోగాల గరిష్ట వయోపరిమితిని 34 నుండి 44 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సడలింపు 2027 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. AP Government Jobs 2026 | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) తో పాటు ఇతర నియామక సంస్థల ద్వారా భర్తీ చేసే నాన్-యూనిఫాం ఉద్యోగాలకు సంబంధించిన గరిష్ట వయోపరిమితిని ఏడాదిపాటు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ  ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంచిన వయోపరిమితి సడలింపు 2027 సెప్టెంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటుందని వెల్లడించింది. యూనిఫాం పోస్టులకు ఏ మార్పు లేదుఅయితే పెంచిన ఈ వయోపరిమితి సడలింపు కేవలం నాన్-యూనిఫాం పోస్టులకు మాత్రమే వర్తిస్తుందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. పోలీస్, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు, అటవీ, రవాణా శాఖలకు చెందిన యూనిఫాం పోస్టులకు ఈ పెంపు వర్తించదని అధికారులు తెలిపారు. కాగా, ఎస్సీ (SC), ఎస్టీ (ST), బీసీ (BC), ఈడబ్ల్యూఎస్ (EWS) తదితర కేటగిరీల అభ్యర్థులకు ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం లభించే అదనపు వయోపరిమితి మినహాయింపులు యథావిధిగా వర్తిస్తాయని తెలిపింది.

Best Bikes Under Rs 1 Lakh: రూ. 1 లక్ష కంటే తక్కువ ధరలో బెస్ట్ బైక్స్ ఇవే.. మీకు ఏది కావాలో డిసైడ్ చేసుకోండి

Bikes Price Under Rs 1 Lakh : మీరు తక్కువ ధరలో, రోజువారీ వినియోగానికి బైక్ కావాలనుకుంటే TVS Star City Plus తో పాటు Bajaj Platina 110 వంటి మోడళ్లను ఓసారి చెక్ చేసుకోండి. Best Bikes In India | మీరు బైక్ కొనాలని కోరుకుంటూ, రూ. 1 లక్ష రూపాయల వరకు మీ బడ్జెట్ ఉంటే గణేశ చతుర్థీ సందర్భంగా ఈ సెగ్మెంట్‌లో అనేక ఆప్షన్లు ఉన్నాయి. రోజూ ఆఫీస్, మార్కెట్ లేదా ఇతర చిన్నచిన్న పనుల కోసం బైక్‌ను కోరుకుంటే, తక్కువ ధరతో పాటు మంచి మైలేజ్, సులభమైన మెయింటెనెన్స్, నాణ్యమైన ఇంజిన్ చాలా ముఖ్యం. అందుకోసం Honda, TVS, Bajaj తో పాటు Hero కంపెనీలకి చెందిన ఇలాంటి బైక్‌ల గురించి మీకు వివరిస్తున్నాం.   హోండా షైన్ 125 (Honda Shine 125)  మీరు కొరుకునే జాబితాలో మొదటి ఆప్షన్ Honda Shine 125 బైక్. ఇందులో 123.9cc ఇంజిన్ ఇస్తారు. బైక్ సుమారు 10.5hp పవర్, 11Nm టార్క్ ఇస్తుంది. ఈ బైక్ రోజూ ప్రయాణించే వారిని దృష్టిలో ఉంచుకుని రూపొందించారు.  బైక్ ఇంజిన్ సిటీలో రైడ్‌కు సరిపడే పవర్‌ను అందిస్తుంది. అలాగే ఆఫీస్‌కు వెళ్లడం, మార్కెట్ పనులు లేదా రోజువారీ ప్రయాణాల కోసం ఈ బైక్‌ సరిపోతుంది. బైక్‌లో డిజిటల్ డ్యాష్, ట్యూబ్‌లెస్ టైర్లు USB Type-C ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. దీని ధర సుమారు రూ. 82,250 నుంచి ప్రారంభమవుతుంది. ఆయా నగరాలు, రాష్ట్రాల్లో ధరలు భిన్నంగా ఉంటాయి. టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ (TVS Star City Plus) తక్కువ బడ్జెట్‌లో కోరుకునే వారికి TVS Star City Plus కూడా ఒక మంచి ఆప్షన్. దీని ధర రూ. 72,200 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 109.7cc ఇంజిన్ లభిస్తుంది. సుమారు 8.1hp పవర్, 8.7Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. రోజువారీ సులభమైన, చవకైన రైడ్‌ కోసం ఉపయోగిస్తారు. ఇందులో LED హెడ్‌లైట్, USB ఛార్జింగ్ పోర్ట్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లు లభిస్తాయి. బైక్‌లో ఎకో లైట్ కూడా ఇచ్చారు. ఇది ఇంధనం ఆదా చేసే రైడింగ్‌లో హెల్ప్ కావచ్చు. అందువల్ల తక్కువ బడ్జెట్‌లో ఇది బెస్ట్ అవుతుంది.   బజాజ్ ప్లాటినా 110 (Bajaj Platina 110) తక్కువ ధర, రోజువారీ సౌకర్యవంతమైన ప్రయాణం మీ ప్రాధాన్యం అయితే Bajaj Platina 110 కూడా ఒక మంచి ఆప్షన్ కానుంది. ఇందులో 115.45cc ఇంజిన్ ఇస్తారు. ఇది సుమారు 8.60hp పవర్, 9.81Nm టార్క్ ఇస్తుంది. దీనితో పాటు 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఇచ్చారు. బైక్ వెనుక భాగంలో స్ట్రాంగ్ స్ప్రింగ్స్ ఇచ్చారు. ఇవి గుంతల రోడ్లపై వచ్చే షాక్‌లను తట్టుకోవడంలో సహాయపడతాయి. సుమారు 69,284 రూపాయలు ధరతో బైక్ ప్రారంభమవుతుంది. తక్కువ ధర కారణంగా, బైక్‌ను రోజువారీ రాకపోకల కోసం ఉపయోగిస్తుంటారు.  బజాజ్ పల్సర్ 125 (Bajaj Pulsar 125) 1 లక్ష రూపాయల బడ్జెట్‌లో స్పోర్టీ లుక్‌, మంచి పవర్ ఉన్న బైక్‌ను కోరుకుంటే Bajaj Pulsar 125 తీసుకోవచ్చు. ఇందులో 124.4cc ఇంజిన్ ఇస్తారు. ఇది సుమారు 11.8hp పవర్, 10.8Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది ఎక్కువ పవర్ ఇచ్చే బైక్. దీని ధర 79,048 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. దీని డిజైన్ కూడా కమ్యూటర్ బైక్‌తో పోలిస్తే మరింత స్పోర్టీగా.. బెస్ట్ టుక్ ఉంటుంది. లుక్, పనితీరు కూడా కోరుకునేవారికి ఇది ఆప్షన్ కావచ్చు. హీరో సూపర్ స్ప్లెండర్ (Hero Super Splendor XTEC)  ఈ బడ్జెట్‌లో వచ్చే ప్రధాన బైక్ Hero Super Splendor XTEC. దీని ధర సుమారు 86,128 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 124.7cc ఇంజిన్ లభిస్తుంది. ఇది సుమారు 10.7hp పవర్, 10.6Nm టార్క్ జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఇచ్చారు. ఇందులో ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, Bluetooth కనెక్టివిటీ, ఫుల్ LED హెడ్‌లైట్ వంటి సౌకర్యాలు లభిస్తాయి. Bluetooth ద్వారా కాల్, SMS అలర్ట్‌ల వంటి సమాచారం చూడవచ్చు. కమ్యూటర్ బైక్‌తో పాటు మోడ్రన్ ఫీచర్లు కోరుకునే వారికి  సెట్ అవుతుంది.  లక్ష రూపాయల బడ్జెట్‌లో మీకు ఏ బైక్ మంచిది? మీరు తక్కువ ధరలో, రోజువారీ జర్నీకి బైక్ కావాలనుకుంటే Bajaj Platina 110, TVS Star City Plus వంటి మోడళ్లు బాగుంటాయి. అదే ఎక్కువ పవర్, స్పోర్టీ డిజైన్ కావాలంటే Bajaj Pulsar 125 బెస్ట్ ఆప్షన్ కావచ్చు. బ్యాలెన్స్‌డ్ కమ్యూటర్ బైక్ కోరుకునే వారు Honda Shine 125ను చూడవచ్చు. ఫీచర్లపై ఫోకస్ చేసేవారు Hero Super Splendor XTEC పై ఓ లుక్కేయండి. 

Vijay Ajith : అజిత్‌కు ప్రేమతో సీఎం విజయ్ - కోలీవుడ్ స్టార్స్ క్యూట్ మూమెంట్... గిఫ్ట్స్ ఏమిచ్చారో తెలుసా?

CM Vijay Gift : లండన్‌లో కార్ రేస్ సందర్భంగా కోలీవుడ్ హీరో, తమిళనాడు సీఎం విజయ్ అజిత్‌ను కలిసి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. CM Vijay Gifts To Kollywood Star Ajith : కోలీవుడ్ స్టార్స్ విజయ్, అజిత్ బెస్ట్ మూమెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. తమిళనాడు సీఎం హోదాలో లండన్ పర్యటనలో ఉన్న విజయ్... అక్కడ పాపులర్ సిల్వర్ స్టోన్ రేసింగ్ సర్క్యూట్ దగ్గరకు వెళ్లారు. 'మిచెలిన్ లే మాన్స్' కార్ రేస్ సందర్భంగా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ అందులో పాల్గొన్నారు. రేసింగ్ సూట్‌లో ఉన్న అజిత్‌ను చూసిన విజయ్ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆయన్ను హగ్ చేసుకుని విష్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. రేసింగ్‌లో పాల్గొన్న అజిత్‌కు సపోర్ట్‌గా వెళ్లిన విజయ్ అక్కడకు వెళ్లి ఉత్సాహపరిచారు. రేస్ తర్వాత ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు.

YS Jagan AP local polls: ఏపీ స్థానిక పోరులో 34 శాతం బీసీ రిజర్వేషన్ మంటలు - చంద్రబాబు పందెం-జగన్ మైండ్ గేమ్!

34 percent BC quota : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల వివాదం నడుస్తోంది. చంద్రబాబు జీవో, జగన్ విమర్శలు, సుప్రీంకోర్టు 50% సీలింగ్ చట్టపరమైన అంశాలే దీనికి కారణం. 50 percent reservation limit BC quota:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల చుట్టూ  ఉత్కంఠ నెలకొంది.  కూటమి ప్రభుత్వం జీవో జారీ చేసినా ఏపీలో లోకల్ బాడీ ఎన్నికలు జరగవు.. బీసీలకు ఇచ్చిన 34 శాతం రిజర్వేషన్లను కోర్టు కొట్టేస్తుంది, ఆ తర్వాత నెపాన్ని న్యాయస్థానాలపైకి నెట్టి ప్రభుత్వం నాటకాడుతుంది  అని వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరోవైపు,  ఎన్ని న్యాయపరమైన అడ్డంకులు వచ్చినా బీసీలకు 34 శాతం కోటా అమలు చేసి తీరుతాం అని టీడీపీ నాయకత్వం స్పష్టం చేస్తూ 'జయహో బీసీ' సభల ద్వారా తమ బీసీ ఓటు బ్యాంక్‌ను పటిష్టం చేసుకునే పనిలో పడింది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ వివాదం ఏమిటి? చంద్రబాబు సవాలు వెనుక ఉన్న రాజకీయ వ్యూహమేంటి?           ఏమిటీ 34 శాతం బీసీ రిజర్వేషన్ల వివాదం?  స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ  చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం జీవోలు విడుదల చేసింది. అయితే, సుప్రీంకోర్టు గతంలో   పలు తీర్పుల్లో.. ఎస్సీ, ఎస్టీ, బీసీల స్థానిక సంస్థల రిజర్వేషన్ల మొత్తం శాతాన్ని 50 శాతం పరిమితి దాటకూడదని స్పష్టమైన గీత గీసింది. ప్రస్తుతం ఏపీలో ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6% రిజర్వేషన్లు ఉన్నందున, బీసీలకు 34% ఇస్తే మొత్తం రిజర్వేషన్లు 55% నుండి 61% వరకు చేరుకుంటాయి. 2019లో కూడా అప్పటి ప్రభుత్వం 34% ఇస్తే హైకోర్టు ,  సుప్రీంకోర్టులు దాన్ని కొట్టివేశాయి. దీనివల్ల రిజర్వేషన్లు 50% దాటితే న్యాయపరంగా మళ్లీ చిక్కులు వస్తాయన్నది జగన్ వాదనకు ప్రాతిపదిక.  సాధ్యం కాదని తెలిసి కూడా చంద్రబాబు ఎందుకు జీవో ఇచ్చారు?  చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడైన నాయకుడు. కోర్టు తీర్పుల పరిమితి ఆయనకు తెలియనిది కాదు. అయినా 34% జీవో ఇవ్వడం వెనుక మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. 2024 ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు 34% రిజర్వేషన్లు ఇస్తామని కూటమి హామీ ఇచ్చింది.  ప్రభుత్వం తమ వైపు నుంచి 34% అమలుకు సిద్ధపడింది అన్న సందేశాన్ని ప్రజలకు ఇవ్వడం. ఒకవేళ కోర్టు దీనిని అడ్డుకుంటే,  మేము ఇవ్వాలనుకున్నాం కానీ న్యాయస్థానాల పరిమితుల వల్ల కుదరలేదు  అని చెప్పి బీసీల్లో సానుభూతి సాధించడం. సీలు టీడీపీకి సాంప్రదాయ వెన్నెముక. జీవో ఇవ్వడం, సభలు నిర్వహించడం ద్వారా తమ ప్రభుత్వం బీసీల పక్షపాతి అని బలంగా స్థాపించడం.  జగన్ 'ఎన్నికలు జరగవు' అనడం వెనుక మైండ్ గేమ్ ఏమిటి?  వైఎస్ జగన్ విమర్శలు కేవలం న్యాయ సూత్రాల గురించే కావు. దాని వెనుక స్పష్టమైన ప్రతిపక్ష వ్యూహం దాగి ఉంది. 2019-2024 మధ్య వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం 50% పరిమితికి లోబడి బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించి ఎన్నికలు నిర్వహించింది. అప్పట్లో టీడీపీ దీనిని  బీసీల నోళ్లు కొట్టారు  అని విమర్శించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 34% జీవో ఇస్తే, తాము గతంలో చేసింది కోర్టు నిబంధనల కోసమేనని నిరూపించుకోవాల్సిన అవసరం జగన్‌కు వచ్చింది. అలాగే, రిజర్వేషన్ల వివాదం వల్ల ఎన్నికలు ఆలస్యమైతే, కూటమి ప్రభుత్వం ఎన్నికల నుంచి పారిపోతోందని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది వైఎస్‌ఆర్‌సీపీ ఆలోచన.  కోర్టులు ఈ జీవోను అనుమతించే అవకాశం ఉందా?    న్యాయ కోణం నుంచి చూస్తే,  ఎంపిక చేసిన ప్రాతిపదికన ఎంపిరికల్ డేటా అంటే సామాజిక, ఆర్థిక సర్వే డేటా  ఆధారంగా బీసీల వెనుకబాటుతనాన్ని నిరూపిస్తే తప్ప 50% సీలింగ్‌ దాటడం సాధ్యం కాదు. ఈ విషయంపై ఏపీ హైకోర్టు కూడా ప్రభుత్వం వైపు నుంచి ఆధారాలను, ఎంపిరికల్ డేటాను కోరింది. ప్రత్యేక కమిషన్ల నివేదికలు లేకుండా జీవో ఆధారంగా 50% మించి రిజర్వేషన్లు ఇస్తే, గతం తరహాలోనే న్యాయస్థానాలు దానిని నిలిపివేసే  అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏపీ స్థానిక పోరులో బీసీ రిజర్వేషన్ల అంశం చట్టపరమైన సవాలు కంటే రాజకీయ అస్త్రంగా ఎక్కువ ఉపయోగపడుతోంది. 34% కోటాను దక్కించుకోవడం ద్వారా బీసీల గుండెల్లో చెరగని ముద్ర వేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంటే.. ఇది సాధ్యం కాని  రాజకీయ గిమ్మిక్  అని తేల్చిచెప్పడం ద్వారా టీడీపీ-బీజేపీ-జనసేనల ఇమేజ్‌ను దెబ్బతీయాలని వైఎస్‌ఆర్‌సీపీ చూస్తోంది. అంతిమంగా, కోర్టు ఇచ్చే తీర్పు స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ను నిర్ణయించడమే కాకుండా, రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో బీసీ ఓటు బ్యాంక్ ఎటువైపు మొగ్గుతుందో స్పష్టం చేయనుంది.

Dhiraj Bommadevara Wins Gold: స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు

మెక్సికోలో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్‌ ఫైనల్‌-2026 రికర్వ్‌ విభాగంలో స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర, ఈ ఘనత సాధించిన తొలి భారత పురుష ఆర్చర్‌గా చరిత్ర సృష్టించారు. అమరావతి: మెక్సికోలోని సాల్టిల్లోలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్‌ ఫైనల్‌-2026లో భారత్ అద్భుతం చేసింది. తెలుగు తేజం, భారత ఆర్చర్‌ ధీరజ్‌ బొమ్మదేవర స్వర్ణాన్ని సాధించారు. పురుషుల రికర్వ్‌ వ్యక్తిగత విభాగంలో గోల్డ్ సాధించిన తొలి భారత పురుష ఆర్చర్‌గా నిలిచి దేశం గర్వించేలా చేశారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 10వ స్థానంలో ఉన్న ధీరజ్‌ వరల్డ్ కప్ ఫైనల్లో జపాన్‌కు చెందిన నకనిషి జున్యాపై ఉత్కంఠభరిత పోరులో గెలుపొందారు. 5 సెట్ల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో 5-5తో స్కోరు సమం కావడంతో షూట్ ఆఫ్ నిర్వహించారు. విజేతను తేల్చే షూట్‌ఆఫ్‌లో ధీరజ్‌ 10 పాయింట్లు కొట్టగా, ప్రత్యర్థి నకనిషి జున్యా 9 పాయింట్లు నెగ్గడంతో భారత ఆర్చర్ స్వర్ణాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో ప్రపంచ కప్‌ ఫైనల్‌లో పురుషుల రికర్వ్‌ విభాగంలో స్వర్ణం నెగ్గిన తొలి భారత ఆర్చర్‌గా చరిత్ర సృష్టించారు. ధీరజ్ బొమ్మదేవర స్వర్ణం నెగ్గి సరికొత్త చరిత్ర సృష్టించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ ఆర్చరీ సాధన మైదానం నుంచి మెక్సికోలో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్ గ్లోబల్ వేదిక వరకు ఎదగడాన్ని హైలైట్ చేశారు. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్ వ్యక్తిగత విభాగంలో రికర్వ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారత ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర అని కొనియాడారు. సీఎం చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా ధీరజ్ బొమ్మదేవరకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.