Filters

Channels
Topics
Other Filters

Anant Nag : నటుడు అనంత్ నాగ్‌కు ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం - ప్రధాని మోదీ సహా ప్రముఖుల విషెష్

Anant Nag Dadasaheb Phalke : ప్రముఖ నటుడు అనంత్ నాగ్‌కు కేంద్రం అత్యున్నత దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రకటించింది. సినీ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ పురస్కారం అందించనుంది. Actor Anant Nag To Be Honoured With Dadasaheb Phalke Award : ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్‌ను... సినీ రంగంలో అత్యున్నత ప్రతిష్టాత్మక పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. 2024 సంవత్సరానికి ఆయనకు ఈ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారతీయ సినిమాకు అనంత్ నాగ్ అందించిన సేవలు, విశిష్టమైన సినీ ప్రస్థానానికి గుర్తింపుగా ఈ పురస్కారం అందించినట్లు కేంద్రం తెలిపింది. రాష్ట్రపతి చేతుల మీదుగా... గుజరాత్‌లోని కేవడియాలో ఈ నెల 22న జరగనున్న 72వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానోత్సవంలో అనంత్ నాగ్‌కు... రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పురస్కారం అందజేయనున్నారు. కన్నడతో పాటు పలు భాషల్లో దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించారు అనంత్ నాగ్. ఆయనకు అత్యున్నత పురస్కారం దక్కడం పట్ల కన్నడ ఇండస్ట్రీతో పాటు సినీ అభిమానులు, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రధాని మోదీ విషెష్   నటుడు అనంత్ నాగ్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారంతో సత్కరించబడిన ప్రఖ్యాత నటుడు అనంత్ నాగ్ గారికి అభినందనలు. గత కొన్ని దశాబ్దాలుగా, ఆయన సహజ నటన, అద్భుతమైన బహుముఖ ప్రజ్ఞ, అసాధారణమైన కళా నైపుణ్యం భారతీయ సినిమాపై, ముఖ్యంగా కన్నడ చిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేశాయి. ఆయన పోషించిన ప్రతి పాత్రలోనూ సాటిలేని నటనను, జీవాన్ని నింపారు. ఒక గొప్ప కళాకారుడికి ఇది నిజంగా దక్కిన అర్హమైన గౌరవం.' అంటూ పోస్ట్ చేశారు. 5 దశాబ్దాల సినీ ప్రయాణం దాదాపు 5 దశాబ్దాల సినీ ప్రయాణంలో అనంత్ నాగ్... కన్నడతో పాటు తెలుగు, హిందీ, మరాఠీ, మలయాళ, ఇంగ్లీష్ భాషల్లో దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించారు. తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. థియేటర్ నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన... 1973లో కన్నడ మూవీ 'సంకల్ప'తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మంథన్, కొండుర, కల్‌యుగ్ తదితర చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆర్కే నారాయణన్ కథల ఆధారంగా తెరకెక్కించిన ఫేమస్ టీవీ సీరియల్ 'మాల్గుడి డేస్'లో అనంత్ నాగ్ మిఠాయి వాలా పాత్రతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. అలాగే, రాజ కుమార, గాలిపట 2, కేజీఎఫ్, కన్నేశ్వర రామ వంటి మూవీస్ మరింత పేరు తీసుకొచ్చాయి. తెలుగులో భీష్మ, బాలు, అనుగ్రహం, శంఖారావం వంటి చిత్రాల్లో నటించారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం 2025లో 'పద్మ భూషణ్'తో గౌరవించింది. ఇప్పుడు అత్యున్నత దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందించనుంది.

CM Vijay Son Jason Sanjay : మా నాన్న సీఎం... ప్రమోషన్స్‌కు రారు... వద్దు కూడా - విజయ్ కొడుకు జాసన్ రియాక్షన్

Sundeep Kishan Sigma : తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ సంజయ్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్న మూవీ సిగ్మా. సందీప్ కిషన్ హీరోగా చేస్తున్నారు. తెలుగు ప్రమోషన్స్‌లో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. Director Jason Sanjay Reaction On CM Vijay Movies : టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా... తమిళనాడు సీఎం, కోలీవుడ్ స్టార్ విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకత్వంలో రాబోతోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సిగ్మా. ఈ మూవీ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుండగా... తెలుగు ప్రమోషన్స్ కోసం జాసన్ హైదరాబాద్ వచ్చారు. సందీప్ అండ్ టీంతో పాటు ప్రెస్ మీట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సినిమాతోనే ఆయన డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. 'నాన్న సినిమాల ఇంపాక్ట్' 'మీ తండ్రి విజయ్ సినిమాల ప్రభావం మీపై ఎంత వరకు ఉంటుంది?' అని రిపోర్టర్ ప్రశ్నించగా... కచ్చితంగా ఉంటుందని సమాధానమిచ్చారు జాసన్ సంజయ్. 'సిగ్మా మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ ప్రభావం ఎంతవరకూ ఉంటుందో అందరితో పాటు నాకు తెలుస్తుంది. నా యంగ్ ఏజ్ నుంచి ఆయన సినిమాల ప్రభావం నాపై ఉంది. నా తండ్రి సినిమాలనే కాకుండా సాధారణంగా సినిమాలంటే నాకు చాలా ఇష్టం.   అందుకే ఈ రోజు డైరెక్టర్‌గా మారా. యంగ్ ఏజ్‌లో ఓ మూవీ కోసం సెట్స్‌లో ఎంతోమంది కలిసి వర్క్ చేయడం దగ్గరి నుంచి చూశా. అప్పటి నుంచి సినిమా అంటే ఇష్టం పెరిగింది.' అని అన్నారు. ఇక, సిగ్మా మూవీలో సోషల్ ఎలిమెంట్ లేదని... అయితే, ఓ వ్యక్తి తన ఐడెంటిటీ కోసం చేసిన పోరాటమే ప్రధానాంశం అని చెప్పారు. అలాగే, తనకు తెలుగులో మర్యాద రామన్న, మహేశ్ బాబు ఖలేజా మూవీస్ ఇష్టమని తెలిపారు. 'ఆయన సీఎం... ప్రమోషన్స్‌కు రారు' తమిళనాడు సీఎంగా తన తండ్రి విజయ్‌కు ఎన్నో బాధ్యతలు ఉంటాయని... ఆయన సినిమా ప్రమోషన్స్‌కు రారని తెలిపారు జాసన్ సంజయ్. 'సీఎంగా ఆయనకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి. అందుకే ఆయన సినిమా ప్రమోషన్స్‌కు రారు. అయినా వద్దు కూడా. ఆయన ఫ్యాన్సే నాకిచ్చిన సపోర్ట్. చిన్నప్పటి నుంచీ ఆయన సినిమాలు చూస్తూ పెరిగా. డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. అందుకే ఇటువైపు అడుగులు పడ్డాయి. భవిష్యత్తులో హీరోగానూ చేసే ఛాన్స్ ఉంది.' అని అన్నారు. జాసన్ సంజయ్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా రాబోతోంది హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సిగ్మా (Sigma). ఈ సినిమాలో సందీప్ సరసన ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా చేస్తున్నారు. రాజు సుందరం, సంపత్ రాజ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఎస్ థమన్ మ్యూజిక్ అందించగా... లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించారు. అక్టోబర్ 2న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

PM Narendra Modi birthday 2026: ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానం - 'సేవా పఖ్వాడా'తో దేశవ్యాప్త ఉత్సవాలు.. వికసిత్ భారత్ వైపు అడుగులు!

Modi Birthday: ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు. అంతేనా ప్రజాజీవితంలో 25 ఏళ్ల సుదీర్ఘ పాలనా ప్రస్థానం పూర్తయింది. దేశ రాజకీయాల్లో నరేంద్రమోదీది ప్రత్యేకమైన చరిత్ర. PM Modi 25 years in public office Gujarat CM to PM:    భారత రాజకీయ చరిత్రలో సుదీర్ఘ కాలం పాటురాజ్యాంగబద్ధమైన ప్రజాపదవుల్లో బాధ్యతలు నిర్వర్తించిన అరుదైన నాయకులలో ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలుస్తారు. సెప్టెంబర్ 17న ఆయన జన్మదినం సందర్భంగా.. గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి ఇప్పటివరకు వరుసగా మూడుసార్లు భారత ప్రధానిగా దేశాన్ని నడిపిస్తూ ప్రజాజీవితంలో పాతికేళ్లు   పూర్తి చేసుకున్న ఘట్టం ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. పాలకుడిగా, దృఢ సంకల్పం ఉన్న సంస్కర్తగా ఆయన చూపిన నాయకత్వ పాఠవాలు భారతదేశాన్ని అంతర్జాతీయ వేదికపై అత్యంత శక్తివంతమైన దేశంగా నిలబెట్టాయి.  గుజరాత్‌ మోడల్‌తో నరేంద్ర మోదీ రాజకీయ ప్రస్థానం       నరేంద్ర మోదీ రాజకీయ ప్రస్థానం గుజరాత్‌ మోడల్‌తో నూతన బాటలు పరిచింది. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి.. రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం, మౌలిక వసతుల కల్పన, విద్యుత్ రంగాన్ని పటిష్టం చేయడం ద్వారా గుజరాత్‌ను ఒక పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దారు. ఆ తర్వాత 2014లో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి వరుసగా మూడు దఫాలుగా భారత్‌ను నడిపిస్తూ.. సుపరిపాలన , సుస్థిరాభివృద్ధి , చివరి వ్యక్తి వరకు సంక్షేమం  అనే సూత్రాల ఆధారంగా తనదైన ముద్ర వేశారు. గ్లోబల్ సౌత్ నేత మోదీ మోదీ నాయకత్వంలోని 12 ఏళ్ల కేంద్ర పరిపాలన భారతదేశ ఆర్థిక, సామాజిక స్వరూపాన్ని మూలమట్టంగా మార్చివేసింది. డిజిటల్ ఇండియా, జన్‌ధన్ యోజన, ఆయుష్మాన్ భారత్, మేక్ ఇన్ ఇండియా, పిఎం ఆవాస్ యోజన,  బ్‌కా సాత్-సబ్‌కా వికాస్ నినాదంతో చేపట్టిన సంక్షేమ పథకాలు సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను గణనీయంగా పెంచాయి. ఆర్థిక వ్యవస్థ రంగంలో భారతదేశం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడమే కాకుండా, త్వరలోనే మూడో స్థానానికి దూసుకెళ్లేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. గ్లోబల్ సౌత్ నేతగా, జి-20 అధ్యక్షతన సాధించిన దౌత్య విజయాలు మోదీ అంతర్జాతీయ ఇమేజ్‌ను శిఖరాగ్రాన నిలిపాయి. దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు ఈ సందర్భంగా ప్రధాని సేవలను, ప్రజాప్రతినిధిగా ఆయన నిర్వర్తించిన 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా సేవా పఖ్వాడా పేరుతో విస్తృత సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రజాసేవయే పరమావధిగా నిర్వహించే ఈ సేవా పఖ్వాడా ద్వారా రక్తదాన శిబిరాలు, ఉచిత ఆరోగ్య తనిఖీ కేంద్రాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, స్వచ్ఛతా హి సేవా పేరుతో విస్తృత పారిశుద్ధ్య డ్రైవ్‌లను చేపడుతున్నారు. రాజకీయ వేడుకగా కాకుండా  జనసేవయే ప్రభు సేవ అనే స్ఫూర్తితో సామాజిక కార్యక్రమాలుగా వీటిని నిర్వహిస్తున్నారు. రక్షణ రంగాన్ని ఆత్మనిర్భర్‌గా మార్చడం, నూతన విద్యా విధానాన్ని తీసుకురావడం, ఆర్టికల్ 370 రద్దు వంటి సాహసోపేత నిర్ణయాల ద్వారా మోదీ ప్రభుత్వం జాతీయ ప్రయోజనాలకు పెద్దపీట వేసింది.  వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ ప్రయత్నం    వికసిత్ భారత్ 2047  లక్ష్యంగా నవభారత నిర్మాణానికి ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను రూపొందించి, యువతను, స్టార్టప్ రంగాన్ని ముందుకు నడిపిస్తున్నారు. దశాబ్దాల తరబడి ఉన్న మౌలిక వసతుల సమస్యలను అధిగమిస్తూ ఎక్స్‌ప్రెస్‌వేలు, వందే భారత్ రైళ్లు, నూతన విమానాశ్రయాలు వంటి మౌలిక రంగాన్ని శరవేగంగా విస్తరించడంలో ఆయన విజన్ స్పష్టంగా కనిపిస్తుంది.   ప్రజాజీవితంలో 25 ఏళ్లు నిరంతరంగా పదవిలో ఉంటూ ప్రజాదరణను ఏమాత్రం కోల్పోకుండా నిలబెట్టుకోవడం సాధారణమైన విషయం కాదు. నిరంతర శ్రమ, కచ్చితమైన నిర్ణయాధికారం, దేశహితమే ప్రాధాన్యతగా సాగిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్థానం భారతదేశ సమగ్ర పురోగతికి సరికొత్త దిశానిర్దేశం చేస్తోంది. 

YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?

Vizianagaram YSRCP: విజయనగరం జిల్లా వైఎస్సార్‌సీపీలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బొత్స బంధువు బడ్డుకొండ అప్పలనాయుడిపై వేటు, చిన్న శ్రీను రాజీనామా తర్వాత జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. YS Jagan Vs Botsa Satyanarayana North Andhra: ఉమ్మడి విజయనగరం జిల్లా రాజకీయాల్లో దశాబ్దాలుగా తిరుగులేని రాజకీయ చక్రవర్తి గా వెలుగొందిన బొత్స సత్యనారాయణ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అధినాయకత్వం నుంచి అనూహ్యమైన షాక్‌లు తగులుతున్నాయి. జిల్లాపై బొత్స కుటుంబానికి ఉన్న ఏకఛత్రాధిపత్యానికి స్వస్తి పలుకుతూ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చాలా వేగంగా క్షేత్రస్థాయి మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇటీవల బొత్స మేనల్లుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు   వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసి అధికార టీడీపీలో చేరిపోయిన వెంటనే.. ఆ ప్రభావం బొత్స కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడిపై పడింది. నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి బడ్డుకొండను తొలగించి, గదల సన్యాసినాయుడిని కొత్త సమన్వయకర్తగా నియమించడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. మజ్జి శ్రీనివాసరావు, బడ్డుకొండ అప్పల్నాయుడు వియ్యంకులు కూడా.  బొత్స రాజకీయంపై జగన్‌కు స్పష్టత ఉందా?  ఈ నిర్ణయం వెనుక వైఎస్ జగన్ సుదీర్ఘ రాజకీయ వ్యూహం దాగి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.  2024 ఎన్నికల ఓటమి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పలువురు సీనియర్లు జంప్ అవుతున్న వేళ, బొత్స కుటుంబం కూడా రేపో మాపో వైఎస్సార్‌సీపీని వీడుతుందనే ప్రచారం బలపడింది. ముఖ్యంగా చిన్న శ్రీను టీడీపీలోకి వెళ్లడంతో, ఆ కుటుంబం ఇప్పటికే  గోడ మీద పిల్లి లా వ్యవహరిస్తోందని అధిష్ఠానం భావిస్తోంది. దాంతో, వాళ్లు పార్టీ వీడే వరకు వేచి చూసి నియోజకవర్గాల్లో పార్టీని ఖాళీ చేయడం కంటే,  వారే వెళ్లేలోపే తమ మార్క్ ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని సిద్ధం చేయాలి  అనే కఠిన నిర్ణయానికి జగన్ వచ్చినట్లుగాచెబుతున్నారు.  బొత్స పట్టు తగ్గించే ప్లాన్  బొత్స కుటుంబం వైఎస్సార్‌సీపీలో కొనసాగినప్పటికీ, వారి  కనుసన్నల్లోనే జిల్లా రాజకీయాలు నడవాలనే పాత ఫార్ములాకు స్వస్తి పలకడమే జగన్ వ్యూహం. అందుకే విజయనగరం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్ష పదవిని చిన్న శ్రీను నుంచి తప్పించి మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌కు అప్పగించారు. మరోవైపు బొత్స బంధువు బడ్డుకొండను నెల్లిమర్ల నుంచి పక్కన పెట్టడం ద్వారా.. పార్టీలో ఏ ఒక్కరిపై ఆధారపడబోమనే స్పష్టమైన సంకేతాన్ని పంపారు. పార్టీ వేదికలపై బొత్స సత్యనారాయణ, బడ్డుకొండ అప్పలనాయుడు కన్నీటి పర్యంతమవుతూ ఆవేదన వ్యక్తం చేసినప్పటికీ, అధిష్ఠానం మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కొన్ని గంటల వ్యవధిలోనే శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.  జగన్ ప్రయత్నాలు ఫలిస్తాయా?    ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఈ పరిణామాలు కొత్త సమీకరణాలకు దారితీస్తున్నాయి. బొత్స కుటుంబ పట్టున్న స్థానాలను ఒక్కొక్కటిగా విడదీస్తూ, ద్వితీయ శ్రేణి నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా జగన్ జిల్లాలో సరికొత్త వైఎస్సార్‌సీపీ క్యాడర్‌ను నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది బొత్స వర్గాన్ని  డిఫెన్స్‌లో పడేసింది. తము పార్టీలో ఉంటూనే తమ ప్రత్యర్థులకు బాధ్యతలు అప్పగిస్తుంటే.. ఇక పార్టీలో కొనసాగాలా వద్దా అనే పునరాలోచనలో బొత్స సత్యనారాయణ పడేలా అధినాయకత్వపు చర్యలు ఉన్నాయి. వారు వెళ్లేలోపే సొంత సామ్రాజ్యాన్ని పునర్నిర్మించుకోవడం  అనే క్రాస్ స్ట్రాటజీని జగన్ అమలు చేస్తున్నారు. ఒకవేళ బొత్స సత్యనారాయణ కుటుంబం వైఎస్సార్‌సీపీని వీడినా, జిల్లాలో పార్టీ పూర్తిగా పడిపోకుండా ముందస్తుగా కొత్త నాయకులను నిలబెట్టాలనే ఆలోచన స్పష్టమవుతోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి విజయనగరంలో బొత్స వర్గం లేకపోయినా నిలబడేలా వైఎస్సార్‌సీపీ వేస్తున్న ఈ పాచికలు ఉత్తరాంధ్ర రాజకీయ రణరంగాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి.   

AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

AP Police Recruitment: ఏపీలో పోలీసు ఉద్యోగాలు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులకు ఏపీఎస్ఎల్పీఆర్బీ నోటిఫికేషన్ ఇచ్చింది. AP Police Recruitment: ఏపీలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. మంగళవారం 892 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. తాజాగా బుధవారం 2050 ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులకు రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (APSLPRB) ద్వారా  ప్రకటన విడుదల చేసింది. పోలీసు డిపార్ట్మెంట్ మొత్తం 438 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు ఉన్నాయి. వీటిలో సివిల్‌ విభాగంలో 253, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌లో 116, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌‌లో 9, కమ్యూనికేషన్స్‌‌లో 50, పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌లో 10 పోస్టులు ఉన్నాయి.  1,156 కానిస్టేబుల్ ఉద్యోగాలు అలాగే 1,156 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందులో సివిల్‌, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌, ఫైర్‌, జైళ్ల విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. పోలీస్‌ కమ్యూనికేషన్స్‌ విభాగంలో 200 కానిస్టేబుల్‌ పోస్టులు ఉన్నాయి. పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌లో డ్రైవర్లు, మెకానిక్‌ ఉద్యోగాలు ఉన్నాయి. పీటీవో విభాగంలో 15 మెకానిక్స్‌, 198 డ్రైవర్‌, 43 సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టులకు బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటికి త్వరలో రాత పరీక్ష తేదీల వివరాలను ప్రకటించనున్నారు.  పోస్టుల వివరాలు ఇలా ఎస్ఐ (SPF) - 9 ఎస్ఐ (కమ్యూనికేషన్) - 50 ఎస్ఐ (PTO) - 10 సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ - 43 పీసీ (సివిల్/ఏఆర్) - 827 ఫైర్‌మెన్‌- 158 వార్డర్ - 171 పీసీ (కమ్యూనికేషన్) - 200 పీసీ (మెకానిక్స్‌, డ్రైవర్లు) - 213 ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్‌ అప్లికేషన్ విధానం, ప్రిలిమినరీ రాత పరీక్ష తేదీలను APSLPRB ప్రకటించనుంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత పోస్టుల వారీగా విద్యార్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు, సెలెక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ విధానం, దరఖాస్తు తేదీలను పూర్తిగా పరిశీలించి అప్లై చేసుకోవచ్చు. 

Fauzi Release Update: జనవరి బరిలో ప్రభాస్ 'ఫౌజీ'? సంక్రాంతి సినిమాలకు టెన్షన్?

Fauzi Release On January: డిసెంబర్ మొదటి వారంలో ప్రభాస్ 'ఫౌజీ' విడుదల అయ్యే అవకాశాలు లేవని క్లారిటీ వచ్చింది. జనవరిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఫిల్మ్ నగర్ లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే? రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ' (Fauzi Movie). ప్రీ ఇండిపెండెన్స్ నేపథ్యంలో బ్రిటీషర్లపై తిరుగుబాటు చేసిన ఓ భారతీయ సైనికుడి కథతో తెరకెక్కుతోంది. ఈ సినిమా విడుదల తేదీపై ఫిల్మ్ నగర్ వర్గాల్లో లేటెస్ట్ బజ్ ఏమిటంటే? డిసెంబర్ రేసు నుంచి వాయిదా!'ఫౌజీ' సినిమాను డిసెంబర్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి తొలుత ప్లాన్ చేశారు. అయితే... ఫిల్మ్ నగర్ లేటెస్ట్ అప్డేట్స్ చూస్తే రిలీజ్ అయ్యే ఛాన్సు కనిపించడం లేదు. 'ఫౌజీ' విడుదల వాయిదా పడిందని సమాచారం అందడంతో డిసెంబర్ 4న తమ సినిమాలను విడుదల చేయడానికి నాగ చైతన్య (వృషకర్మ), విశ్వక్ సేన్ (లెగసీ) రెడీ అవుతున్నారు. మరి ప్రభాస్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అంటే కొత్త న్యూస్ వినబడుతోంది. అసలు ఫౌజీ ఎందుకు వాయిదా పడింది?'ఫౌజీ'లో విడుదల వాయిదా పడటానికి ప్రధాన కారణం సిజిఐ, గ్రాఫిక్స్ వర్క్స్ అని తెలుస్తోంది. ప్రభాస్ తన షూటింగ్ వర్క్ అంతా నవంబర్ నాటికి పూర్తి చేస్తారని ముందు అనుకున్నప్పటికీ... దర్శకుడు హను రాఘవపూడి అవుట్‌ పుట్ క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడటం లేదని, అందువల్ల సినిమా పూర్తి అవ్వడానికి మరికొంత సమయం అవసరం అవుతుందని, అందుకే సినిమా విడుదల వాయిదా వేశారని సమాచారం. జనవరి 26న విడుదల... సంక్రాంతి టెన్షన్?డిసెంబర్ నెలలో థియేటర్లలో 'ఫౌజీ' వచ్చే అవకాశం లేదు. దాంతో మరో విడుదల తేదీ కోసం దర్శక నిర్మాతలు చూస్తున్నారు. వచ్చే ఏడాది (2027) రిపబ్లిక్ డే (జనవరి 26న) సినిమాను థియేటర్లలోకి తీసుకు వస్తే బావుంటుందని భావిస్తున్నారట. ఒకవేళ అది నిజమైతే సంక్రాంతి సినిమాలకు టెన్ష తప్పదని చెప్పాలి. జనవరి 10 నుంచి 15 మధ్యలో నాలుగైదు సినిమాలు విడుదల కానున్నాయి. థియేటర్లలోకి ఎక్కువ సినిమాలు వస్తే కలెక్షన్లు షేర్ చేసుకోవాల్సి వస్తుంది. థియేట్రికల్ రన్ ఎక్కువ రోజులు ఉంటే బడ్జెట్ రికవరీ చేసుకోవచ్చు. ఇప్పుడు సంక్రాంతి సినిమాలు వచ్చిన రెండు మూడు వారాలకు 'ఫౌజీ' లాంటి పెద్ద సినిమా వస్తే... సంక్రాంతి సినిమాలు చూసేందుకు థియేటర్లకు వచ్చే జనాల సంఖ్య తక్కువ. అప్పుడు వాటికి టెన్షన్ తప్పదు. ఒకవేళ 'ఫౌజీ' విడుదల తేదీ మారితే... ఓటీటీ డీల్, డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కూడా మారే అవకాశం ఉంది. మార్చి 2027లో విడుదల కావాల్సిన ప్రభాస్ 'స్పిరిట్' కూడా వాయిదా పడొచ్చు.

Suriya Jyothika: సూర్య, జ్యోతికకు మళ్ళీ పెళ్ళి... పిల్లల సాక్షిగా మళ్ళీ ప్రమాణం... వెడ్డింగ్ వీడియో వైరల్

Suriya Jyothika Wedding: సెప్టెంబర్ 11 2006న వివాహ బంధంతో సూర్య, జ్యోతిక ఒక్కటి అయ్యారు. పెళ్ళై 20 ఏళ్ళు పూర్తైన సందర్భంగా మళ్ళీ పెళ్ళి చేసుకుందీ జంట. ఆ వీడియో వైరల్ అవుతోంది. భార్యాభర్తలు ఎలా ఉండాలి? ఒకరినొకరు ఎలా సపోర్ట్ చేసుకోవాలి? పిల్లల కెరీర్, పెంపకంలో బాధ్యతలు ఎలా పంచుకోవాలి? వంటి విషయాల్లో భారతీయ చిత్ర పరిశ్రమలో ఇతర ప్రముఖులకు, ప్రేక్షకులకు ఆదర్శంగా నిలుస్తున్న జంటల్లో కోలీవుడ్ స్టార్ సూర్య శివ కుమార్, హీరోయిన్ జ్యోతిక జంట ఒకటి. సెప్టెంబర్ 11 2006న వివాహ బంధంతో వీళ్ళిద్దరూ ఒక్కటయ్యారు. వివాహమై 20 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మళ్ళీ పెళ్ళి చేసుకుందీ జంట. పిల్లల సాక్షిగా పెళ్ళి... వీడియో వైరల్!ఆదర్శ దంపతులుగా పేరు పొందిన సూర్య, జ్యోతిక... భార్యాభర్తలుగా తమ 20 ఏళ్ళ వివాహ ప్రయాణాన్ని వేడుకలా జరుపుకొన్నారు. విదేశాల్లోని ఓ చర్చిలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేశారు. ఈ వేడుకలో జ్యోతిక వైట్ కలర్ వెడ్డింగ్ గౌనులో మెరిశారు. సూర్య కూడా వైర్ కలర్ సూట్, బ్లాక్ ట్రౌజర్ ధరించి హ్యాండ్సమ్‌గా కనిపించారు.సూర్య, జ్యోతికల వివాహ వార్షికోత్సవ వేడుకకు వాళ్ళ పిల్లలు దియా, దేవ్... ఇంకా సూర్య సోదరుడు కార్తీతో పాటు ఇతర కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధు మిత్రులు హాజరయ్యారు. ఈ సెలబ్రేషన్స్ వీడియోను జ్యోతిక సోషల్ మీడియాలో షేర్ చేశారు. ''ది సీక్వెల్... మా 20 ఏళ్ల ప్రేమ ప్రయాణాన్ని వేడుకగా జరుపుకొంటున్నాం'' అని క్యాప్షన్ ఇచ్చారు. నిస్వార్థమైన ప్రేమకు ప్రతిబింబంఈ వేడుక ఓ పరిపూర్ణమైన వివాహానికి సంకేతం కాదని... ఓ జంట అసమానతలు, సర్దుబాట్లు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, త్యాగాలు, నిస్వార్థమైన ప్రేమను ప్రతిబింబించే వేడుక అని జ్యోతిక పేర్కొన్నారు. అంతే కాకుండా... తనను తన కంటే ఎక్కువగా గౌరవించే వ్యక్తి భర్తగా లభించడం వరమని, సూర్యతో ఉన్న స్నేహాన్ని, బంధాన్ని ఎల్లప్పుడూ గౌరవిస్తానని జ్యోతిక వెల్లడించారు. సూర్య, జ్యోతిక ప్రయాణం 1999లో వచ్చిన 'పూవెల్లామ్ కేట్టుప్పార్'తో ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత 'ఉయిరిలే కలందదు', 'కాక కాక' (తెలుగులో వెంకటేష్ హీరోగా రీమేక్ అయిన 'ఘర్షణ'), 'పేరళగన్', 'మాయావి', 'సిల్లును ఒరు కాదల్' వంటి చిత్రాల్లో కలిసి నటించారు. హీరో హీరోయిన్లుగా మొదలైన ప్రయాణం... తర్వాత ప్రేమగా మారింది. ఆ ప్రేమను పెళ్ళి పీటల వరకు తీసుకు వెళ్ళారు. సెప్టెంబరు 11, 2006న వివాహ బంధంతో ఒకటయ్యారు. ఆ మరుసటి ఏడాది (2007లో) కుమార్తె దియా, 2010లో కుమారుడు దేవ్ జన్మించారు. పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళు నటనకు దూరంగా ఉన్నారు జ్యోతిక. మళ్ళీ '36 వయదినిలే'తో రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం తమిళ, హిందీ సినిమాలతో బిజీగా ఉన్నారు.

Enquiry On Erravalli Farmhouse: కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై ఎంక్వైరీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు.. 30 రోజులు డెడ్‌లైన్

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిధిలోని వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణల ఆరోపణలపై సమగ్ర విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. KCRs Erravalli Farmhouse | హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు చెందిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిధిలోని భూములపై సమగ్ర విచారణకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆదేశాలు జారీ చేశారు. వందల ఎకరాల ప్రభుత్వ భూమి కేసీఆర్ ఫామ్‌హౌస్ ఆధీనంలో ఉందనే ఆరోపణలు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సభలో స్పష్టం చేశారు. కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ సరిహద్దులు, ఆక్రమణలపై 30 రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని రెవెన్యూ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. నిబంధనల ప్రకారం మాజీ సీఎం కేసీఆర్‌కు తక్షణమే నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు. నిర్ణీత సమయంలోగా విచారణ పూర్తి చేయడంలో ఏమైనా నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులైన అధికారులు, సంబంధిత మంత్రులపై కూడా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ధరణి, ఉద్యమం పేరుతో ఆస్తుల కూడబెట్టుడుపై విమర్శలుతెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని కేసీఆర్ భారీగా ఆస్తులను కూడబెట్టారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబానికి వివిధ ప్రాంతాల్లో సుమారు 440 ఎకరాల భూమి ఉందని, కేసీఆర్ దంపతులు, కేటీఆర్ కుటుంబసభ్యుల పేరు మీద ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాల స్థిరాస్తులు ఉన్నాయో సీఎం సర్వే నంబర్లతో సహా సభలో వెల్లడించారు. నిబంధనల ప్రకారం 27 ఎకరాలు మాత్రమే ఉండాల్సిన కేసీఆర్ దంపతులకు 67 ఎకరాల భూమి ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ భూమి అని తేలితే పేదలకు పంపిణీ కేసీఆర్ ఫామ్‌హౌస్ ఆధీనంలో సుమారు 700 ఎకరాల వరకు విస్తరించి ఉందని, అందులో దాదాపు 340 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందనే ఆరోపణలు ఉన్నాయని వెల్లడించారు. ఈ ఫామ్‌హౌస్ భూమి వెనుక ఉన్న అసలు కథేంటో తేల్చాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. అధికారుల దర్యాప్తులో కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిధిలో ఉన్న భూమి ప్రభుత్వ భూమిగా తేలితే, ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామన్నారు. ఆ భూమిని ఎర్రవెల్లి ఫాం హౌస్ వద్ద నిరసన తెలిపిన దళితులకు, పేదలకు పంచుతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పేదల హక్కులను కాపాడటమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని సీఎం పేర్కొన్నారు.  ప్రతిపక్ష నేతలపై భూక్రమణ ఆరోపణలు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బిఆర్ఎస్ నాయకులు భూ అక్రమాలు చేశారని ఆరోపిస్తూ.. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇనాం భూములను తన పేరు మీదకు మార్చుకున్నారని పేర్కొన్నారు.  రోహిన్ రెడ్డి అసైన్డ్ భూముల్లో ఫామ్‌హౌస్ నిర్మించుకున్నారని.. బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం కేటాయించిన భూములతో పాటు ఎల్బీనగర్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ వంటి నేతలు ప్రభుత్వ భూములను యథేచ్ఛగా కొల్లగొట్టారని ధ్వజమెత్తారు.   భూదాన్ భూములపై రాజకీయంపై రేవంత్ విమర్శలురాష్ట్రంలో 74 ఎకరాల భూదాన్ భూములపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గతంలో తీవ్రంగా పోరాటం చేశారని, కానీ ప్రస్తుతం ఆ భూములు అన్యాక్రాంతమైపోయాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మాజీ మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలను ఉద్దేశించి తాను ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. సీఎల్పీ నాయకుడిగా ఉన్న ఒక దళితుడికి అన్యాయం చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవులు అనుభవించారని, దోరల వద్ద బానిసలుగా ఉండాలనుకుంటే ఉండవచ్చని ఘాటుగా వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డి సొంత గ్రామంలోని ఆక్రమణకు గురైన భూములపై విచారణ జరిపించాలని ముందుగా సబితా ఇంద్రారెడ్డి కోరాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.  

Polavaram MLA Chirri Balaraju: సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్

రిటైర్డ్ టీచర్ సమస్యపై ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సామాన్యుడిలా మారువేషంలో బుట్టాయగూడెం ఎమ్మార్వో ఆఫీస్‌కు వెళ్లి మెరుపు తనిఖీ చేశారు. Polavaram MLA Chirri Balaraju | పోలవరం: ఏలూరు జిల్లాలో పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వినూత్న రీతిలో రంగంలోకి దిగారు. ఎవరికీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా బుట్టాయగూడెం తహసీల్దార్ కార్యాలయానికి ఒక సామాన్య పౌరుడిలా మారువేషంలో వెళ్లి అధికారులతో పాటు ప్రజలును ఆశ్చర్యపరిచారు. స్థానిక రిటైర్డ్ టీచర్ ఒకరు తన భూమికి సంబంధించిన పని కోసం ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా అధికారులు పట్టించుకోకపోలేదు. దాంతో విసుగు చెందిన ఆయన చివరికి కూటమి ఎమ్మెల్యేను ఆశ్రయించి తన గోడు వెళ్లబోసుకున్నారు. అధికారుల తీరుపై నిశిత పరిశీలన ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో స్వయంగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్న జనసేన ఎమ్మెల్యే బాలరాజు నేరుగా ఆయనే క్షేత్రస్థాయిలో సామాన్యుడిలా రంగంలోకి దిగారు. బుట్టాయగూడెం ఎమ్మార్వో ఆఫీసులో సుమారు గంటపాటు ప్రజల మధ్య ఉండి, అధికారుల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలకు రెవెన్యూ సేవలు సకాలంలో అందుతున్నాయా లేదా, సిబ్బందికి టైంకు అందుబాటులో ఉంటున్నారా అని స్వయంగా పరిశీలించారు. పంచె, టీషర్టు ధరించి.. తలపై క్యాప్, ముఖానికి మాస్క్ ధరించి ఎమ్మార్వో  అక్కడికి వచ్చిన ప్రజలను సైతం అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయని ఆరా తీశారు. విషయం తెలిసి అధికారులు షాక్   తాను ఎవరో చెప్పి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అధికారులకు షాకిచ్చారు. అనంతరం తన రాకను వెల్లడించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిరంతరం ఆఫీసుల చుట్టూ తిప్పించుకోకుండా ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. బాధితుడైన రిటైర్డ్ టీచర్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని  అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తీసుకున్న ఆకస్మిక తనిఖీ, అది కూడా మారువేషంలో రావడంతో  స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Smart Kitchen Appliances : స్మార్ట్ కిచెన్ హ్యాక్స్.. వంటగదిలో ఈ పరికరాలు ఉంటే ఈజీగా కుక్ చేసుకోవచ్చు

Kitchen Appliances : వంటగదిలో మనం రోజూ ఉపయోగించే పరికరాలు.. మన పనిని తగ్గించేలా ఉండాలి. అందుకే కిచెన్​లో ఈ 5 పరికరాలు ఉండేలా చూసుకోండి. ఇవి వంటను త్వరగా, ఈజీగా చేయడంలో హెల్ప్ చేస్తాయి.  Must-Have Kitchen Appliances : కిచెన్ చిన్నగా ఉన్నా.. పెద్దగా ఉన్నా కొన్ని పరికరాలు వంటగదిలో పెట్టుకుంటే వంటను చేసుకోవడం సులభం అవుతుంది. సరైన పరికరాలను ఎంచుకోవడం ద్వారా టైమ్, ఎనర్జీని సేవ్ చేసుకోగలుగుతారు. టీ, బ్రేక్​ఫాస్ట్, కూరగాయలు కట్ చేయడం, చిరుతిళ్లు చేయడం వంటి అనేక పనులను సులభంగా చేసేలా కొన్ని పరికరాలు హెల్ప్ చేస్తాయి. ఇవి ఇంట్లో ఉండేవారికే కాదు.. పీజీలు, హాస్టళ్లు, అద్దె ఇళ్లు, స్టూడియో అపార్ట్‌మెంట్లలో ఉండేవారికి కూడా హెల్ప్ అవుతాయి. కాబట్టి రోజూవారీ వంటల్లో ఉపయోగపడేలా.. తక్కువ స్థలం తీసుకునే పరికరాలు ఏంటో.. అవి వంటకి ఎలా హెల్ప్ అవుతాయో ఇప్పుడు చూసేద్దాం.  ఎగ్ బాయిలర్..  కిచెన్లో ఎగ్ బాయిలర్ ఉంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గుడ్లు ఉడకబెట్టడం, మోమోలు లేదా ఇడ్లీలను స్టీమ్ చేయడం, కూరగాయలు వండటం, పిల్లల ఆహారాన్ని తయారు చేయడం వంటి పనులకు దీనిని ఉపయోగించవచ్చు. చాలావరకు మార్కెట్లలో 3-ఇన్-1 మల్టీ-కుక్కర్ ఎగ్ బాయిలర్స్ అందుబాటులో ఉంటాయి. ఇవి 900 నుంచి.. 2,200 రేంజ్లో అందుబాటులో ఉంటాయి.  యాక్టివ్ బ్లెండర్.. మీ కిచెన్లో మిక్సర్, స్మూతీ మేకర్, ట్రావెల్ బాటిల్‌ పెట్టేందుకు స్థలం లేకపోతే.. యాక్టివ్ బ్లెండర్ తీసుకోవచ్చు. దీనిని స్మూతీలు, ప్రోటీన్ షేక్‌లు, మ్యాంగో లస్సీ, గ్రీన్ జ్యూస్, చట్నీలు, మసాలా పేస్ట్‌లు, కాఫీ పొడిని తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. యాక్టివ్ బ్లెండర్ రెండు ఫుడ్-గ్రేడ్ జార్‌లు, ప్రత్యేక బ్లేడ్‌లతో వస్తుంది. వీటి ధర 1,995 నుంచి మొదలై.. 2,747 వరకు అందుబాటులో ఉంటాయి. ఎలక్ట్రిక్ చాపర్.. ప్రతిరోజూ ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, కూరగాయలను తరగడం పెద్ద పనిగా ఉంటుంది. కానీ ఎలక్ట్రిక్ చాపర్ ఈ పనిని క్షణాల్లో పూర్తి చేయగలదు. ఎలక్ట్రిక్ వెజిటబుల్ చాపర్లో స్టెయిన్‌లెస్ స్టీల్ బ్లేడ్, ఒక విస్కింగ్ డిస్క్, 0.4 లీటర్ల గిన్నె ఉంటాయి. ఇవి తరగడమే కాకుండా.. చట్నీ బేస్‌లను తయారు చేయడానికి, కూరగాయలను తరగడానికి, గుడ్లు లేదా క్రీమ్‌ను గిలకొట్టడానికి హెల్ప్ చేస్తాయి.  ఎలక్ట్రిక్ కెటిల్  టీ, కాఫీ, నూడుల్స్, ఇన్‌స్టంట్ సూప్ లేదా వేడి నీటి కోసం ఎలక్ట్రిక్ కెటిల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గ్లాస్ కెటిల్‌కు 1.8-లీటర్ల సామర్థ్యం ఉంటుంది. దీనిని ఉపయోగించి మరిగించడం, ఆవిరి మీద ఉడికించడం, వండటం వంటి ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. మినీ ఎయిర్ ఫ్రైయర్ మినీ ఎయిర్ ఫ్రైయర్‌ను ఉపయోగించి సమోసాలు, పకోడీలు, కట్‌లెట్‌లు, పనీర్ టిక్కా, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్, మఖానా వంటి స్నాక్స్‌ను తయారు చేసుకోవచ్చు. ఈ స్నాక్స్‌ను తక్కువ నూనెతో లేదా నూనె లేకుండా తయారు చేసుకోవచ్చు. మినీ ఎయిర్ ఫ్రైయర్‌లో 180 నుంచి 200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత సెట్టింగ్, 30 నిమిషాల టైమర్తో హాయిగా కుక్ చేసుకోవచ్చు.  మరిన్ని పరికరాలు.. బ్రెడ్ టోస్ట్ చేయడానికి, శాండ్‌విచ్‌లను వేడి చేయడానికి, తక్కువ పరిమాణంలో కుకీలు లేదా కప్‌కేక్‌లు తయారు చేయడానికి, చీజ్ లేదా చికెన్‌ను గ్రిల్ చేయడానికి ఒక చిన్న టోస్టర్ గ్రిల్లర్ తీసుకోవచ్చు. గ్యాస్ కనెక్షన్ లేకపోయినా లేదా అదనపు బర్నర్ అవసరమైనా, పోర్టబుల్ ఇండక్షన్ కుక్కర్ కూడా ఒక ప్రత్యామ్నాయం. దీనిని అన్నం, పప్పు, కూరగాయలు, తడ్కా వండటానికి మరియు పాలను వేడి చేయడానికి ఉపయోగించవచ్చు. ఇలాంటి ఎలక్ట్రిక్ వస్తువులను కిచెన్లో పెట్టుకుంటే.. వంట వేగంగా, సులభంగా చేసుకోగలుగుతారు.  

Samson Explosive Fifty: అఫ్గాన్‌ను చిత్తు చేసి సిరీస్ కొల్లగొట్టిన భారత్, శ్రేయ‌స్ ఖాతాలో స్వదేశంలో తొలి ట్రోఫీ .. స‌త్తా చాటిన నితీశ్, అభిషేక్, ఇషాన్..

సంజూ శాంసన్ కేవలం 22 బంతుల్లోనే 57 రన్స్ చేసి దంచికొట్టడంతో భారత్ రెండో టీ20లో ఏడు వికెట్లతో అఫ్గానిస్తాన్‌ను చిత్తు చేసి సిరీస్ గెలిచింది. India Clinch Afghanistan T20 Series Behind Samson Masterclass: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమ్ ఇండియా పూర్తి ఆధిపత్యం కనబరిచింది. అఫ్గానిస్తాన్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. 2019 తర్వాత సొంతగడ్డపై ఇప్పటివరకు ఒక్క ద్వైపాక్షిక టీ20 సిరీస్ కూడా ఓడిపోని రికార్డును భారత్ నిలబెట్టుకుంది. స్వదేశంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత జట్టుకు ఇదే తొలి సిరీస్ విజయం కావడం విశేషం. అంత‌కుముందు టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన ఆఫ్గాన్.. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9  వికెట్ల‌కు 158 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ క‌మ్ కెప్టెన్ ఇబ్ర‌హీం జ‌ద్రాన్ (37) టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. బౌల‌ర్ల‌లో తెలుగు స్టార్ నితీశ్ రెడ్డి, మూడు వికెట్ల‌తో స‌త్తా చాటాడు. అనంత‌రం టార్గెట్ ను కేవ‌లం 14.5 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల‌కు 163 ప‌రుగులు చేసి పూర్తి చేసింది. సంజూ శాంస‌న్ సూప‌ర్బ్ ఫిఫ్టీ (22 బంత‌ల్లో 57, 7 ఫోర్లు, 4 సిక్స‌ర్లు)తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. బౌల‌ర్ల‌లో ర‌షీద్ ఖాన్ కు మూడు వికెట్లు ద‌క్కాయి. నితీశ్ కు ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ద‌క్కింది. 20 బంతుల్లోనే సంజూ హాఫ్ సెంచరీ.. విమర్శలకు బ్యాట్‌తో సమాధానంతొలి మ్యాచ్‌లో విఫలమై తీవ్రమైన ఒత్తిడిలో పడ్డ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ..  ఈ మ్యాచ్ చేజింగ్ లో అద్భుతంగా పుంజుకున్నాడు. ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడినా, ఆ తర్వాత బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 20 బంతుల్లోనే అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్న సంజూ, మొత్తం 22 బంతుల్లోనే 57 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అవతలి ఎండ్‌లో మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 19 బంతుల్లో 39 పరుగులు చేసినప్పటికీ, శాంసన్ ఆడిన ఇన్నింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు ఏకంగా 88 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి పవర్‌ప్లే ముగిసే సమయానికి స్కోరును 82 పరుగులకు చేర్చారు. 160 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఎంతో సులువుగా ఛేదించి విజయాన్ని నమోదు చేసింది. నితీష్ రెడ్డి కెరీర్ బెస్ట్ బౌలింగ్.. అంత‌కుముందు ఫ‌స్ట్ బ్యాటింగ్ చేపట్టిన అఫ్గానిస్తాన్ భారత బౌలర్ల ధాటికి మరోసారి తక్కువ స్కోరుకే పరిమితమైంది.  భారత యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ మూడు కీలక వికెట్లు నేలకూల్చాడు. పేస్ గుర్రం అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాడు. దీంతో అఫ్గాన్ బ్యాటర్లు భారీ భాగస్వామ్యాలు నిర్మించలేకపోయారు.   సిరీస్ కైవసం.. నామమాత్రంగా మారిన ఆఖరి పోరుమొదటి మ్యాచ్‌లో 157 పరుగులను 14 ఓవర్ల లోపే ఊదేసిన భారత బ్యాటింగ్ లైనప్, రెండో పోరులోనూ అదే విధ్వంసాన్ని కొనసాగించి విజయాన్ని తేలిక చేసింది. దీంతో మూడో టీ20 నామమాత్రపు మ్యాచ్‌గా మారింది. ఇదే వేదిక‌పై గురువారం మూడో మ్యాచ్ జ‌రుగుతుంది.  

PMFME Scheme: ఫుడ్ బిజినెస్ చేసేవారికి గుడ్ న్యూస్.. రూ. 10 లక్షల రుణంపై 35% సబ్సిడీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

PMFME Scheme: పుడ్ బిజినెస్ చేసేవారికి కేంద్ర ప్రభుత్వం పీఎంఎఫ్ఎంఈ స్కీమ్ ద్వారా 35 శాతం సబ్సిడీతో రూ.10 లక్షల వరకూ రుణాలు అందిస్తుంది. PMFME Scheme: కొత్తగా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? లేదా ఉన్న బిజినెస్‌ను మరింత విస్తరించాలనుకుంటున్నారా? అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ బంపర్ ఆఫర్ మీ కోసమే.  MSME పథకం కింద ఫుడ్ బిజినెస్, కేటరింగ్ లేదా ప్రాసెసింగ్ రంగంలో ఉన్నవారికి రూ. 10 లక్షల వరకు సబ్సిడీ లోన్స్ లభిస్తున్నాయి. అంతేకాదు, ఇందులో ఏకంగా 35% వరకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. ఈ లోన్ పొందడానికి సరైన బిజినెస్ ప్లాన్, GST, ప్రాజెక్ట్ రిపోర్టు సిద్ధం చేసుకుంటే ప్రాసెస్ చాలా ఈజీ అవుతుంది. పన్నులు తగ్గించుకోవడమే కాకుండా ఆర్థికంగా స్థిరపడటానికి ఇది ఒక గొప్ప అవకాశం.    కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో PMFME పథకం ఫుడ్ బిజినెస్ చేసేవారికి భారీ ఆర్థిక సబ్సిడీ లభిస్తోంది. కొత్తగా ఫుడ్ బిజినెస్ ప్రారంభించేవారితో పాటు, ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించుకోవాలనుకునే వారికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. అర్హతలు & సబ్సిడీ వివరాలు ప్రాజెక్ట్ ఖర్చుపై 35% వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. గరిష్టంగా రూ. 10 లక్షల వరకు క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ ఉంటుంది. దరఖాస్తుదారుడు ప్రాజెక్ట్ విలువలో కేవలం 10% మాత్రమే సొంతంగా పెట్టుబడి పెట్టాలి. మిగిలిన 90% మొత్తాన్ని బ్యాంకులు రుణంగా మంజూరు చేస్తాయి.  అర్హులు  18 ఏళ్లు పైబడిన వ్యక్తులు, కొత్త ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టేవారు, మహిళా స్వయం సహాయక బృందాలు (SHGs), రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (FPOs) ఈ సబ్సిడీకి అర్హులు.  వ్యాపారాలు  బేకరీలు, పికిల్స్ తయారీ, మిల్లెట్స్ అండ్ స్నాక్స్ తయారీ, మసాలా పొడుల తయారీ, డెయిరీ ఉత్పత్తులు, పండ్ల రసాలు, ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు.  లోన్   మొత్తం ప్రాజెక్ట్ వ్యయం - రూ. 10,000,00 దరఖాస్తుదారు వాటా (10%) - రూ. 1,00,000 బ్యాంకు రుణం (90%) - రూ. 9,00,000 ప్రభుత్వ సబ్సిడీ (35%) - రూ. 3,50,000 కావాల్సిన పత్రాలు  ఆధార్ కార్డు, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కనీసం 8వ తరగతి పాస్ లేదా పదో తరగతి సర్టిఫికెట్  డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్  కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ పాస్‌బుక్, షాపు రెంటల్ అగ్రిమెంట్ అప్లై చేయడం ఎలా?  PMFME పోర్టల్ https://pmfme.mofpi.gov.in/ ఓపెన్ చేయండి. మీ మొబైల్ నంబర్, ఆధార్ వివరాలతో అప్లికెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.మీ పర్సనల్ డీటైల్స్, ఫుడ్ బిజినెస్ రకం, అంచనా ప్రాజెక్ట్ ఖర్చు వివరాలను నమోదు చేయాలి.అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. అప్లికేషన్ సమర్పించిన తర్వాత నోడల్ ఏజెన్సీ లేదా జిల్లా పరిశ్రమల కేంద్రం (DIC) అధికారులు పరిశీలించి, అనుమతి కోసం సంబంధిత బ్యాంకులకు పంపుతారు.

Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!

Tata Sons Chairman Chandrasekaran:భారతీయ కార్పొరేషన్ దిగ్గజం టాటా సన్స్‌ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు. నోయల్‌తో విభేదాలు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.  Tata Sons Chairman Chandrasekaran Resigns:ఆగస్టు 12, 2026 ఉదయం దేశీయ వ్యాపార రంగంలో ఎవరూ ఊహించని వార్త షేర్ మార్కెట్‌ను షేక్ చేసింది సుమారు 9 ఏళ్లుగా టాటా గ్రూప్‌ను తిరుగులేని రీతిలో నడిపిస్తున్న ఎన్ చంద్రశేఖరన్, టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తన పదవీ కాలం ఫిబ్రవరి 2027 వరకు ఉన్నప్పటికీ గడువు కంటే ముందే ఆయన వైదొలగడం సంచలనంగా మారింది.  ఆగస్టు 18న జరగాల్సిన కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశానికి కేవలం కొన్ని రోజుల ముందు ఈ రాజీనామా సమర్పించడం వెనుక తీవ్రమైన అంతర్గత సంక్షోభం దాగి ఉందని స్పష్టమవుతోంది. అయితే గ్రూప్‌ కార్యకలాపాల్లో ఆకస్మిక అస్థిరత రాకుండా ఉండేందుకు, తన ప్రస్తుత టర్మ్‌ ముగిసే వరకు బాధ్యతల్లో సహాయకారిగా ఉంటానని చంద్రశేఖరన్‌ బోర్డుకు తెలిజేశారు.  నోయెల్‌ టాటా కోల్డ్ వార్‌ చంద్రశేఖరన్ నిష్కృమణకు కేవం వ్యక్తిగత కారణాలు మాత్రమే కాకుండా, గ్రూప్‌లోని అత్యున్నత స్థాయి వ్యక్తుల మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలే కీలకమని తెలుస్తోంది. ప్రధానంగా టాటా ట్రస్ట్స్‌ ఛైర్మన్ నోయెల్‌ టాటాతో ఆయనకు ఉన్న వ్యూహాత్మక వైరుధ్యాలు ఈ సంక్షోభానికి పునాది వేశాయి.  చంద్రశేఖరన్ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టాటా న్యూ సూపర్ యాప్‌ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. ఇ- కామర్స్‌ సెమికండక్టర్‌ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టినప్పటికీ , తక్షణ లాభాలు రాకపోవడంపై నోయెల్ టాటా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం టాటా సన్స్‌ను స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేయాల్సి ఉండగా, దీనిని నోయెల్ టాటా వర్గం వ్యతిరేకించింది. టాటా సన్స్‌ ఎప్పటికీ ఐపీవోకి తీసుకెళ్లకూడదనే కఠిన షరతుపై సంతకం చేయడానికి చంద్రశేఖర‌న్ నిరాకరించడం విభేదాలను మరింత ముదిరాయి.  టాటా సన్స్‌ బోర్డులో టాటా ట్రస్ట్స్‌కు ఉండాల్సిన ప్రాతినిధ్యం, నిర్వహణ అధికారుల విషయంలో ఛైర్మన్‌ చంద్రశేఖర్, ట్రస్టీల మధ్య గత కొంతకాలంగా సఖ్యత లోపించింది.  ఏజీఎం ఓటింగ్ ముప్పు ఆగస్టు 18న జరగనున్న ఏజీఎంలో చంద్రశేఖరన్‌ డైరెక్టర్‌గా తిరిగి ఎన్నిక కావాల్సి ఉంది. అయితే 66 శాతం కంటే ఎక్కువ వాటా కలిగి ఉన్న టాటా ట్రస్ట్స్‌ ప్రతినిధులు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉందని సంకేతాలు అందాయి. ఓటింగ్ ద్వారా పదవి నుంచి  తొలగించడం కంటే గౌరవప్రదంగా రాజీనామా చేయడమే మేలని చంద్రశేఖరన్ భావించినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రశేఖర్ 9 ఏళ్లలో సాధించిన విజయాలు 2017లో సైరస్ మిస్త్రీ వివాదం తర్వాత బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖరన్, టాటా గ్రూప్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. ఆయన హయాంలో గ్రూప్ మార్కెట్‌ విలువ 400 బిలియన్ల మార్కును దాటింది. దశాబ్దాల తర్వాత ఎయిర్‌ ఇండియాను తిరిగి టాటా గూటికి చేర్చడం ఆయన సాధించిన అతి పెద్ద విజయం. టాటా మోటార్స్‌ను ఎలక్ట్రిక్‌ వాహనాల మార్కెట్‌లో లీడర్‌గా నిలపడమే కాకుండా, దేశీయ చిప్‌ తయారీకి పునాదులు వేశారు. ఐటీ రంగంలో టీసీఎస్‌ లాభాలను స్థిరంగా ఉంచుతూ గ్రూప్‌ ఆర్థిక పునాదిని బలోపేతం చేశారు.  మార్కెట్‌ ప్రభావం చంద్రశేఖరన్ రాజీనామా వార్త బయటకు రాగానే టాటా గ్రూప్ షేర్లు కుప్పకూలాయి. టీసీఎస్‌ 2.5 శాతం, టాటా మోటార్స్‌ 3.2 శాతం, టాటా పవర్‌ 2.9శాతం మేర నష్టపోయాయి. ఇన్వెస్టర్లలో నెలకొన్న అనిశ్చితి కారణంగా అమ్మకాల ఒత్తిడి పెరిగింది.  తదుపరి బాధ్యతలు ఎవరికి? ప్రస్తుతం నోయెల్ టాటా పేరు రేసులో ఉన్నప్పటికీ, ఆయన నేరుగా బాధ్యతలు చేపడతారా లేదా మళ్లీ చంద్రశేఖరన్ లాంటి ఒక ప్రొఫెషనల్‌ లీడర్‌ను బయటి నుంచి ఎంపిక చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.     

Sugar Price Hike: మళ్లీ పెరిగిన చక్కెర ధరలు; ప్రస్తుతం ధర ఎంత ఉందంటే?

Sugar Price Hike: రక్షాబంధన్, గణేష్ చతుర్థి పండుగలు సమీపిస్తుండటంతో, చక్కెర ధరలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. మంగళవారం ధరలు మళ్లీ పెరగడంతో, సాధారణ కొనుగోలుదారులలో ఆందోళన నెలకొంది. Sugar Price Hike: పండుగ సీజన్ సమీపిస్తున్న కొద్దీ, చక్కెర ధరలు తగ్గడానికి బదులుగా పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. సోమవారం కిలో సగటు ధర 63.05 రూపాయలు ఉండగా, మంగళవారం రిటైల్ చక్కెర ధరలు దాదాపు ఒక రూపాయి పెరిగి కిలోకు సుమారు 64 రూపాయలకు చేరాయి.  ధరలు వేగంగా పెరుగుతున్నాయి వినియోగదారుల వ్యవహారాల శాఖ (ధరల పర్యవేక్షణ విభాగం) డేటా ప్రకారం, ఆగస్టు 25న అఖిల భారత చక్కెర సగటు ధర కిలోకు ₹63.97గా ఉంది. ఇది నెల రోజుల క్రితం కిలోకు ₹48.81గా ఉన్న ధర కంటే 31% అధికం. గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ధర 38% ఎక్కువ. ఏడాది క్రితం ఇదే సమయంలో చక్కెర కిలోకు ₹46.31 ధరకు లభించేది.  అందుబాటులో ఉన్న డేటాను ఉటంకిస్తూ, సోమవారం చక్కెర గరిష్ట విక్రయ ధర కిలోకు ₹76 కాగా, 'మోడల్ రేటు' కిలోకు ₹65గా ఉందని పీటీఐ వార్తా సంస్థ నివేదించింది. గత కొన్ని రోజులుగా మిల్లుల వద్ద ధరలు తగ్గాయని ప్రభుత్వం, చక్కెర పరిశ్రమ సంఘాలు తెలిపాయి. అయితే, చిల్లర మార్కెట్‌పై దీని ప్రభావం ఇంకా కనిపించాల్సి ఉంది.  టోకు ధరలు తగ్గుతున్నాయి లెక్కల ప్రకారం, సోమవారం చక్కెర టోకు ధర కిలోకు ₹59.23గా ఉంది. నెల రోజుల క్రితం ఇది కిలో ₹45.35గా, ఏడాది క్రితం కిలో ₹43.01గా ఉండేది. చక్కెర దిగుమతులకు అనుమతినిస్తూ, స్పెక్యులేషన్,  నిల్వలపై ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యల తర్వాత, చక్కెర మిల్లు ధర 18% తగ్గి కిలోకు ₹55కి చేరిందని సోమవారం ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు. గత వారం, చక్కెర మిల్లు ధర కిలోకు రికార్డు స్థాయిలో ₹67కి చేరుకుంది.  ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంది? ప్రజలకు ఉపశమనం కలిగించి, పెరుగుతున్న ధరలను అరికట్టడానికి, చక్కెర దిగుమతులపై సుంకం విధించకపోవడం సహా ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో సరఫరాను పెంచేందుకు, చాలా కాలం తర్వాత 10 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చక్కెరను సుంకం లేకుండా దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రభుత్వం చక్కెర నిల్వలపై పరిమితులను కూడా విధించింది. చక్కెర డీలర్లకు 400 టన్నుల నిల్వ పరిమితిని నిర్దేశించారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి, బేకరీలు, మిఠాయి తయారీదారుల వంటి పెద్ద పారిశ్రామిక వినియోగదారులు 15 రోజుల కంటే ఎక్కువ కాలం నిల్వలను ఉంచుకోవడానికి అనుమతి లేదు.   చక్కెర నిల్వలను, బ్లాక్ మార్కెట్‌ను నివారించేందుకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త బృందాలు మిల్లులను సందర్శించి, చక్కెర నిల్వలను తనిఖీ చేస్తున్నాయి.

Gold Price September 2026: సెప్టెంబర్‌లో బంగారం ధరలు పెరుగుతాయా, తగ్గుతాయా? కీలక అంచనా!

Gold Price Prediction September 2026: బంగారం 3 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. సెప్టెంబర్‌లో  డాలర్, వడ్డీ రేట్లు, ప్రపంచ ఉద్రిక్తతలు, బులియన్ మార్కెట్, ప్రాపంచిక జ్యోతిష్యం గురించి తెలుసుకోండి. సెప్టెంబర్ 2026 బంగారం ధర అంచనా: బంగారం ధరలు మరోసారి అందర్నీ ఆశ్చర్యపరిచాయి. కేవలం కొన్ని ట్రేడింగ్ సెషన్లలోనే భారీగా పెరిగిన తర్వాత, బంగారం 3 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఇప్పుడు, అతిపెద్ద ప్రశ్న సెప్టెంబర్ గురించే. ఈ పెరుగుదల ధోరణి కొనసాగుతుందా, లేక అధిక ధరల వద్ద లాభాల స్వీకరణ తిరిగి ప్రారంభమవుతుందా? మార్కెట్ పరిస్థితులు , గ్రహ సూచనలు ఈ నెలంతా తీవ్రమైన హెచ్చుతగ్గులతో ఉంటుందని సూచిస్తున్నాయి, కానీ ఏకపక్ష ర్యాలీని కాదు. ప్రస్తుతం బంగారం ఏ స్థాయిలో ఉంది? ఆగస్టు 24న అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ బంగారం ధరలు ఔన్సుకు $4,650కి చేరాయి. మే మధ్యకాలం తర్వాత ఇదే అత్యధిక స్థాయి. ఒక్క గత వారంలోనే బంగారం ధరలు ఐదు శాతానికి పైగా పెరిగాయి. దీని ప్రభావం భారతదేశంలో కూడా స్పష్టంగా కనిపించింది. ఆగస్టు 24న, MCXలో 10 గ్రాముల బంగారం ధర సుమారు ₹163,870కి చేరుకుంది. IBJA ప్రకారం, 999 స్వచ్ఛత గల బంగారం ఉదయం ధర 10 గ్రాములకు ₹162,603గా ఉండగా, సాయంత్రం ధర ₹162,154గా ఉంది. ఇందులో జీఎస్టీ , ఆభరణాల తయారీ ఛార్జీలు కలపలేదు. అయితే, ఆగస్టు 25న అంతర్జాతీయ మార్కెట్ తన గరిష్ట స్థాయిల నుంచి స్వల్పంగా క్షీణించింది. బంగారం సుమారు 0.2 శాతం తగ్గి దాదాపు $4,640కి చేరింది. దీని అర్థం ర్యాలీ బలంగానే ఉన్నప్పటికీ, మార్కెట్ అధిక స్థాయిల వద్ద సంకోచాన్ని ప్రదర్శించడం ప్రారంభించింది. అకస్మాత్తుగా ఎందుకు అంతగా పెరిగింది? ఈ పెరుగుదలకు కేవలం పండుగ డిమాండ్ మాత్రమే కారణం కాదు. ప్రపంచ మార్కెట్లో డాలర్ బలహీనపడటం ఒక ప్రధాన కారణం. డాలర్ పడిపోయినప్పుడు, ఇతర కరెన్సీలలో బంగారం ధర సాపేక్షంగా తగ్గుతుంది. దీనివల్ల దాని డిమాండ్ పెరగవచ్చు. దీర్ఘకాలిక బాండ్ల కొనుగోళ్లను పెంచాలన్న అమెరికా ప్రభుత్వ ప్రణాళిక, డాలర్ , ప్రభుత్వ రుణాలపై కూడా ఆందోళనలను రేకెత్తించింది. అంతేకాకుండా, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, కొత్త ఆంక్షల అవకాశం, సురక్షిత ఆస్తిగా బంగారానికి డిమాండ్‌ను పెంచాయి. మార్కెట్ ఇప్పుడు యూఎస్ ద్రవ్యోల్బణ డేటాను , ఫెడరల్ రిజర్వ్ వైఖరిని నిశితంగా గమనిస్తోంది. ద్రవ్యోల్బణం పెరిగి, వడ్డీ రేట్లను అధికంగా ఉంచే సూచనలు ఉంటే, బంగారం లాభాలు దెబ్బతినవచ్చు. బంగారం క్రమమైన వడ్డీని అందించదు, కాబట్టి పెరుగుతున్న బాండ్ దిగుబడులు తాత్కాలికంగా దాని ఆకర్షణను తగ్గించగలవు. భారతదేశంలోని రూపాయి, డాలర్ మారకపు రేట్లు కూడా ముఖ్యమైనవి. అంతర్జాతీయ బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, రూపాయి బలహీనపడటం దేశీయ ధరలను మరింత పెంచవచ్చు. బులియన్ నిపుణులు దేని కోసం చూస్తున్నారు? మీడియా , మార్కెట్ నివేదికల ప్రకారం, సెంట్రల్ బ్యాంక్ డిమాండ్, అమెరికా రుణాల గురించిన ఆందోళనలు, బలహీనమైన డాలర్  భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారానికి మద్దతు ఇవ్వగలవు. ధర $4,700 దాటితే, అది తదుపరి పెరుగుదలకు మార్గాన్ని తెరుస్తుందని వారు భావిస్తున్నారు. మరోవైపు, టీడీ సెక్యూరిటీస్ మరింత జాగ్రత్తగా ఉంది. వారి ప్రకారం, బంగారం ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఒక రక్షణగా ఉన్నప్పటికీ, పెరుగుతున్న వడ్డీ రేట్లు దాని పెరుగుదలను నిలిపివేయగలవు. చాలా అధిక లక్ష్యానికి వేగంగా పెరుగుతుందని ఆశించడం తొందరపాటు అవుతుందని ఆ సంస్థ భావిస్తోంది. దీని అర్థం ఏంటంటే, ర్యాలీకి ఆస్కారం ఉందని నిపుణులు భావిస్తున్నప్పటికీ, ప్రస్తుత గరిష్ట స్థాయి నుంచి భారీ పతనం కంటే, మొదట లాభాల స్వీకరణ జరిగి, ఆ తర్వాత కొత్త దిశ ఏర్పడే అవకాశమే ఎక్కువగా ఉంది. మేదిని జ్యోతిష్యం ఏమి సూచిస్తుంది? లౌకిక జ్యోతిష్యశాస్త్రంలో బంగారం ప్రధానంగా సూర్యుడు , బృహస్పతితో ముడిపడి ఉంటుంది. శుక్రుడు మార్కెట్ డిమాండ్, విలాసం   ఆభరణాల వ్యాపారాన్ని సూచిస్తాడు. బుధుడు వ్యాపారం , రోజువారీ మారుతున్న భావోద్వేగాలతో సంబంధం కలిగి ఉంటాడు. భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ జాతకంలో వృషభ రాశి లగ్నంగా ఉంది. సంపద  మార్కెట్ విలువకు ప్రాతినిధ్యం వహించే రెండవ ఇంటికి బుధుడు అధిపతి. అందువల్ల, బంగారానికి సూచిక అయిన గురుడు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. 2026 ఆగస్టు 15వ తేదీ జాతకంలో లగ్నంగా సింహరాశి ఉంది. లగ్నానికి అధిపతి సూర్యుడు, వార్షిక జాతకంలో గురుడు కర్కాటక రాశిలో ఉచ్ఛస్థితిలో ఉన్నాడు. ఇది భవిష్యత్తులో విలువైన లోహాల ధరలకు బలమైన మద్దతును సూచిస్తుంది. అయితే, సంపదకు నిలయమైన కన్యారాశిలో ఉన్న శుక్రుడు  ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 9 వరకు కొనసాగే రాహువు ముద్రా దశ, ఈ పరిస్థితిని అస్థిరంగా మారుస్తున్నాయి. రాహువు ఆకస్మిక మార్కెట్ హెచ్చుతగ్గులు, పుకార్లు, భయం, వేగవంతమైన లాభాల స్వీకరణతో ముడిపడి ఉంటుంది. అందువల్ల, సెప్టెంబర్‌లో బంగారం ధర సరళరేఖలో పెరిగే అవకాశం లేదు.  ఆగష్టు 28న జరిగిన చంద్రగ్రహణం తరువాత, సెప్టెంబర్ ప్రారంభంలో మార్కెట్ కార్యకలాపాలు అసాధారణంగా ఉండవచ్చు. మొదటి వారంలో గరిష్ట స్థాయిల నుంచి తగ్గుదల లేదా ధరలో ఆకస్మిక మార్పు సంభవించవచ్చు. నెల మధ్య నాటికి, సూర్యుని బలమైన ప్రభావం బంగారం పెరుగుదలకు మరింత కారణమైంది. సెప్టెంబర్ 17వ తేదీన సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించిన తర్వాత, మార్కెట్ దృష్టి డేటా, డాలర్ ,వడ్డీ రేట్లపైకి వేగంగా మళ్లవచ్చు. సెప్టెంబర్  పూర్తి సంకేతం   సెప్టెంబర్‌లో బంగారం ధరలలో వచ్చిన గణనీయమైన పెరుగుదల ఇంకా పూర్తిగా ముగిసినట్లు కనిపించడం లేదు. అయితే, ఆగస్టులో కనిపించినటువంటి భారీ పెరుగుదల పునరావృతం కావడం కష్టంగా ఉండవచ్చు. నెల ప్రారంభంలో , చివరిలో లాభాల స్వీకరణ ఒత్తిడి పెరగవచ్చు, అయితే మధ్యలో మళ్లీ ధరలు పుంజుకోవచ్చు. మొత్తంమ్మీద.. సెప్టెంబర్ నెల సూచిస్తున్నదేంటంటే..పెరిగిన ధరలు కొనసాగవచ్చు, కానీ ఈ క్రమంలో తీవ్రమైన తగ్గుదలలు, పునరుద్ధరణలు రెండూ ఉంటాయి. వాస్తవ దిశను అమెరికా ద్రవ్యోల్బణం, ఫెడ్ వైఖరి, డాలర్, బాండ్ దిగుబడులు, భౌగోళిక రాజకీయ సంఘటనలు , రూపాయి కదలికలు నిర్ణయిస్తాయి.