NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?

2 hours ago

NRI Become IAS: ఎన్ఆర్ఐలు యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలు రాయొచ్చా? ఐఏఎస్ అవ్వొచ్చా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ ఆర్టికల్‌లో ఆ విషయాలు తెలుసుకుందాం.

NRI Become IAS: విదేశాలలో ఉంటున్న ఎన్ఆర్ఐల్లో చాలా మందికి తాము కూడా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అవ్వాలనే కోరిక ఉంటుంది. అయితే NRI అనే పదం గురించి చాలా గందరగోళం ఉంది, ఎందుకంటే దీనిని తరచుగా OCI, PIO వంటి ఇతర వర్గాలతో కలిపి చెప్పడంతో గందరగోళానికి గురవుతారు. యూపీఎస్సీ పరీక్ష నియమాలు ఎన్నారై, ఓసీఐ కార్డుదారులకు భిన్నంగా ఉన్నప్పటికీ, సివిల్ సర్వీసెస్ పరీక్షను ఎవరు రాయవచ్చు, ఐఏఎస్ అధికారి కావడానికి కావాల్సిన అర్హతలు ఏంటో తెలుసుకుందాం. 

ఎన్నారై అంటే ఎవరు? యూపీఎస్సీకి అర్హుడా?

ఎన్నారై అంటే భారత పౌరుడై ఉండి, ప్రస్తుతం చదువులు లేదా ఉద్యోగం కోసం విదేశాలలో నివసిస్తున్న వ్యక్తి. ఎన్నారైలు భారత పౌరసత్వం కలిగి ఉంటారు కాబట్టి వాళ్లు యూపీఎస్సీ పరీక్షకు హాజరవడానికి అర్హులు అవుతారు. వయస్సు,  విద్యార్హతలతో సహా ఇతర అర్హతలు ఉంటే ఎన్నారైలు యూపీఎస్సీ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సహా అన్ని సర్వీసులకు అప్లై చేసుకోవచ్చు.

OCIకి నిబంధనలు  

ఎన్నారైలతో పోలిస్తే, ఓసీఐ (ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా) కార్డుదారులకు నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. యూపీఎస్సీ నిబంధనల ప్రకారం ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి సర్వీసులకు అభ్యర్థులు భారత పౌరులై ఉండాలి. కాబట్టి ఓసీఐ కార్డుదారులు ఈ మూడు సర్వీసులకు అర్హులు కాదు. అయితే, యూపీఎస్సీ ద్వారా భర్తీ చేసే కొన్ని ఇతర కేంద్ర సర్వీసులకు నేపాల్, భూటాన్ పౌరులు కూడా అర్హులు. కానీ, ఐఏఎస్, ఐపీఎస్ సర్వీసులు ప్రత్యేకంగా భారతీయులకు మాత్రమే రిజర్వ్ చేశారు. 

ఎన్నారైలకు నిబంధనలు 

UPSC నిబంధనల మేరకు ఎన్నారైలు పరీక్ష రాయడానికి అనుమతించినప్పటికీ, వారికి ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు, కోటాలు ఉండవు. నీట్ లేదా ఇతర పరీక్షలలో ఎన్నారై కోటాలు ఉన్నట్లుగా, UPSCలో అలాంటి కోటాలు ఉండవు. అభ్యర్థులు జనరల్ లేదా వారి రిజర్వేషన్ కేటగిరీ కింద పోటీపడాలి. అంతేకాకుండా, UPSC ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల కోసం విదేశాలలో ఎలాంటి ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేయదు. అభ్యర్థులు పరీక్ష రాయడానికి భారత్ కు రావాల్సి ఉంటుంది. ఎన్నారై అభ్యర్థి విదేశీ యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేసి ఉంటే, ఫారం నింపే ముందు, అతను అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ నుండి ధృవీకరణ పత్రాన్ని పొందాలి. తద్వారా అతని డిగ్రీ భారత్ లో గుర్తింపు పొందుతుంది. 

ఐఏఎస్ అవ్వొచ్చా?

IAS అధికారుల కోసం UPSC మూడు దశల్లో ప్రిలిమ్స్, మెయిన్స్,ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు ఉంటాయి, మెయిన్స్‌లో వ్యాసంతో సహా వివిధ సబ్జెక్టులను కవర్ చేసే రాత పరీక్షలు ఉంటాయి. ఈ రెండు దశల్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత, అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఈ మూడు దశల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ ను రూపొందిస్తారు.  అభ్యర్థి ర్యాంకును బట్టి IAS, IPS, IFS సర్వీసులో వారి రిక్రూట్మెంట్ ఉంటుంది. 

Click here to Read More
Previous Article
Bluetooth LE: బ్లూటూత్ LE అంటే ఏమిటి?.. నార్మల్ బ్లూటూత్ కంటే ఇది ఎందుకు భిన్నమైంది?
Next Article
EPFO Wage Ceiling Hike: ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు

Related ఎడ్యుకేషన్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment