Bluetooth LE: బ్లూటూత్ LE అంటే ఏమిటి?.. నార్మల్ బ్లూటూత్ కంటే ఇది ఎందుకు భిన్నమైంది?

2 hours ago

Bluetooth LE: తక్కువ విద్యుత్‌తో వైర్‌లైస్ కనెక్టివిటీ కోసం వాడేదే బ్లూటూత్ LE. దీని ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం.

Bluetooth LE: ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్‌లు, వైర్‌లెస్ సెన్సార్‌లు ఇలా అనేక డివైజ్‌లు కనెక్ట్ చేయడానికి బ్లూటూత్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. అయితే, బ్లూటూత్ రకాల్లో తరచుగా వినబడే ఒక ముఖ్యమైన పదం 'బ్లూటూత్ LE'. పేరులో ఉన్నట్లే, ఇది తక్కువ విద్యుత్‌తో వైర్‌లెస్ కనెక్షన్‌లను అందించడానికి దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

బ్లూటూత్ LE అంటే ఏమిటి?

బ్లూటూత్ LE అనగా బ్లూటూత్ లో ఎనర్జీ (Bluetooth Low Energy). ఎక్కువ సమయం పాటు బ్యాటరీపై పనిచేయాల్సిన, నిరంతర సమయం పాటు ఒక నిర్ణీత వ్యవధిలో మాత్రమే డేటా ట్రాన్స్‌ఫర్ చేయాల్సిన డివైజ్‌ల కోసం దీనిని రూపొందించారు. స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ ట్రాకర్‌లు, వైర్‌లెస్ సెన్సార్‌లు, స్మార్ట్ హోమ్ ప్రొడెక్ట్స్, హెల్త్ మానిటరింగ్ డివైజ్‌లలో ఉపయోగిస్తారు. ఈ పరికరాలు నిరంతరం డేటాను పంపవు. అతి తక్కువ మొత్తంలో డేటాను మాత్రమే ఫోన్‌కు లేదా ఇతర పరికరాలకు బదిలీ చేస్తాయి, కాబట్టి వీటికి ఎక్కువ ఎనర్జీ అవసరం ఉండదు.  

సాధారణ బ్లూటూత్  

 నార్మల్ బ్లూటూత్‌ను కంటిన్యూగా, హై వాల్యూమ్ డేటా, ఆడియో ట్రాన్స్‌ఫర్ కోసం ఉపయోగిస్తారు. నిరంతర కనెక్షన్ వల్ల ఎక్కువ బ్యాటరీ వినియోగిస్తుంది. వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లు, స్పీకర్‌లు, పెద్ద ఫైళ్ల ట్రాన్స్‌ఫర్‌కు ఉపయోగపడుతుంది. 

బ్లూటూత్ LE  ముఖ్య విషయాలు 

1. రేంజ్ - బ్లూటూత్ LE అనగానే దీని పరిధి చాలా తక్కువగా ఉంటుందని అనుకోవడం పొరపాటే. రేంజ్ అనేది కేవలం దాని ఎనర్జీపై మాత్రమే ఆధారపడి ఉండదు. బ్లూటూత్ వెర్షన్, హార్డ్‌వేర్, యాంటెన్నా చుట్టూ ఉండే వాతావరణాన్ని బట్టి రేంజ్ మారుతుంది. అవసరమైనప్పుడు మాత్రమే లో ఎనర్జీతో కమ్యూనికేట్ చేయడమే దీని ప్రధాన లక్ష్యం.

2. LE ఆడియో - గతంలో బ్లూటూత్ LEని కేవలం సెన్సార్లు, తక్కువ డేటా కనెక్షన్‌లకే పరిమితం చేసినప్పటికీ, కొత్తగా వచ్చిన 'LE ఆడియో' దీని రేంజ్ పెంచింది. ఇది LC3 కోడెక్ వంటి టెక్నాలజీలో ఉపయోగిస్తుంది. తక్కువ డేటా రేట్లలో కూడా బెస్ట్ ఆడియో క్వాలిటీని అందిస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో రాబోయే వైర్‌లెస్ ఇయర్ బడ్స్, హెడ్‌ఫోన్‌లలో బ్యాటరీ బాగా ఆదా అవ్వడమే కాకుండా అనేక కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి.

బ్లూటూత్ LE స్ట్రాంగ్ పాయింట్ లో ఎనర్జీ కనెక్టివిటీ. ప్రతిరోజూ ఛార్జింగ్ పెట్టలేని చిన్న చిన్న గాడ్జెట్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇంటెర్నెట్ ఆఫ్ థింగ్స్ డివైజ్‌ను సమర్థవంతంగా పనిచేయడానికి బ్లూటూత్ LE టెక్నాలజీ ఎంతో కీలకంగా మారనుంది. 

Click here to Read More
Previous Article
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
Next Article
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?

Related బిజినెస్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment