Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌

    1 hour ago

    AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎన్‌సీసీఎఫ్‌ భాగస్వామ్యంతో వెయ్యి మీ మార్ట్ స్టోర్‌లు ఏర్పాటు చేయనుంది. మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకే 70 నుంచి 250 సరకును పంపిణీ చేయనున్నారు.

    AP Mee Mart: నగరాల్లో కనిపించే డీ మార్ట్, స్టార్ మార్కెట్‌, రత్నదీప్‌ లాంటి సూపర్ మార్కెట్‌లు చూసే ఉంటారు. అదే తరహా మార్కెట్‌లను ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్వర్టర్‌లోనే వెయ్యికిపైగా  మీ మార్ట్‌ పేరుతో స్టోర్‌లను ప్రారంభించబోతోంది. మీ ఊరి చివర సూపర్‌ మార్కెట్‌ తరహా ఎక్స్‌పీరియన్స్‌తో ఇవి అందుబాటులోకి రానున్నాయి.పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో వీటిని నడపబోతున్నారు. 

    ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ సామాన్యుడి పాకెట్‌కు ఉపశమనం కలిగిస్తూ, మీ మార్ట్‌ పేరుతో సంచలనాత్మక విప్లవానికి శ్రీకారం చుట్టింది. డిపార్టమెంట్‌ ఆఫ్‌ కన్స్యూమర్ అఫైర్స్ పరిధిలోని నేషనల్‌్ కో ఆపరేటివ్ కన్స్యూమర్‌ ఫెడరేషన్ ఆఫ్‌ ఇండియా(NCCF) భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చౌకధరల డిపోలను లాజిస్టిక్‌ రీటైల్‌ పవర్‌ హౌస్‌లుగా మారుస్తున్నారు. ఈ క్వాటర్‌లోనే కంగా వెయ్యి మీ మార్ట్‌లను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఓపెన్ మార్కెట్‌లలో ప్రైవేట్‌ రిటైలర్లకు గట్టి పోటీని ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధమైంది.

    రేషన్ దుకాణాల రీ బ్రాండింగ్‌- మీ మార్ట్ కాన్సెప్ట్‌ ఏంటి?

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సాంప్రదాయ ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) రూపురేఖను పూర్తిగా మార్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కేవలం నెలకు ఒకసారి బియ్యం, కందిపప్పు తీసుకొని తలపులు మూసేసే రేషన్ షాపులను, నెల పొడవునా తెరిచి ఉంచే మోడర్న్‌ కమ్యూనిటీ రిటైల్ హబ్స్‌గా తీర్చిదిద్దడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. 

    ఈ నయా మోడల్‌లో భాగస్వామ్య ఒప్పందం కోసం ఏపీ పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ హెచ్‌. కన్నబాబు, ఎన్‌సీసీఎఫ్‌ మేనేజింగ్ డైరెక్టర్‌ అనీస్‌్ జోసెఫ్‌లు న్యూఢిల్లీలో పౌరసరఫరాల శా మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో చారిత్రాత్మక ఎంఓయూపై సంతకాలు చేశారు. మీ మార్ట్‌.. నీది, నాది, మనందరిది. అనే ఆకర్షణీయమైన ట్యాగ్‌లైన్‌తో రూపుదిద్దుకోనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా తొలి దశలో 70కిపైగా ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులు నేరుగా కస్టమర్ల చేతికి రానున్నాయి. 

    ఈ నెట్‌వర్క్ ద్వారా పప్పు దినుసులు, వంటనూనెలు, సుగంధ ద్రవ్యాలు, ప్యాకేజ్డ్‌ పిండి ఉత్పత్తులు, పర్సనల్‌ కేర్ సోప్‌లు, డిటర్జెంట్‌లు వంటి ప్రతి రోజూ అవసరమయ్యే వస్తువులను   బల్క్‌ ప్రొక్యూర్మెంట్‌ పద్ధతిలో సేకరించి పంపణీ చేస్తారు.

    ఇప్పుడున్న షాపింగ్ మాల్స్‌కు మీ మార్ట్‌ ఎలా పోటీ ఇస్తుంది?

    సాధారణంగా ఈ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లు లేదా ప్రైవేట్‌ సూపర్ మార్కెట్‌లు బల్క్‌్ ఆర్డరింగ్‌ ద్వారా పొందే డిస్కౌంట్‌ ప్రయోజనాన్ని కస్టమర్లకు కొంతమేర ఇస్తుంటాయి. అయితే ఎన్‌సీసీఎఫ్‌ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నేషనల్‌ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ కావడం వల్ల, రైతులు, విత్తన శుద్ధి సంస్థల నుంచి నేరుగా పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంది. దళారుల ప్రాసెస్ లేకపోవడం వల్ల ల్యాండిగ్‌ కాస్ట్‌ భారీగా తగ్గుతుంది. ఫామ్‌గేట్ నుంచి నేరుగా కొనుగోలు చేయడం వల్ల ఇంటర్మీడియరీ కమీషన్లు పూర్తిగా రద్దు అవుతాయి. ప్రతీ ప్రొడక్షన్ ఎంఆర్పీపై బహిరంగ మార్కెట్‌ లేదా స్థానిక షాపుల ధరలతో పోలిస్తే రూ. 3 నుంచి ఐదు రూపాయల వరకు తగ్గింపు లభిస్తుంది. ప్రైవేట్‌ బ్రాండ్లలో జరిగే కల్తీలకు తావులేకుండా ఎన్‌సీసీఎఫ్‌ ప్రయోగశాలల్లో క్వాలిటీ టెస్ట్‌ అయిన గ్రేడ్‌ ఏ దినుసులనే ప్యాక్ చేసి సప్లై చేస్తారు. ప్రారంభంలో 70 నాణ్యమైన కేటగిరీల నుంచి రాబోయే రోజుల్లో ఈ ప్రొడక్ట్‌ బాస్కెట్‌ను 250రకాల ప్రొడక్ట్స్‌కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

    తొలి దశలో ఏ ఏ జిల్లాల్లో ప్రారంభించనున్నారు?

    రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 30వేల చౌక ధరల దుకాణాల్లో ఒకేసారి కాకుండా, శాస్త్రీయంగా దశలవారీగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లాలో లాలుపురంలో మొదటి మమీ మార్ట్‌ను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించి పైలట్‌ రన్ నిర్వహించారు. ఇది విజయవంతం కావడంతో ఇప్పుడు తొలి విడత కింద గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలను ఎంపిక చేశారు. ఈ క్వార్టర్‌లోనే వెయ్యి దుకాణాలను పూర్తి స్థాయి రూపాంతరం తీసుకురాగా, వీటిలో 553 దుకాణాలు ఇప్పటికే మౌలిక సదుపాయాలతో సిద్ధమయ్యాయి. ప్రతి మీ మార్ట్‌ను ఎలక్ట్రానిక్ పపాయింట్ ఆఫ‌ సేల్‌ మెషిన్‌, క్యూఆర్ కోడ్‌ స్కానర్లతో అనుసంధానిస్తున్నారు.  

    డీలర్లకు లభించే ప్రయోజనాలేంటి?

    కేవలం నెలలో పది రోజులు మాత్రమే రేషన్ సరకులు ఇచ్చే డీలర్లకు ఇకపై ముప్ఫై రోజులూ రీటైల్ కస్టమర్లకు సరుకులు విక్రయించే స్థిరమైన వ్యాపారం చేయవచ్చు. ఎన్‌సీసీఎఫ్‌ నుంచి లభించే సరకులు విక్రయంపై డీలర్లకు ప్రత్యక్ష వ్యాపార మార్జిన్ లభిస్తుంది. ఆర్బీఐ డిటిజల్‌ రూపాయి ప్లాట్‌ఫామ్‌కు ఈ షాపులను లింక్ చేయడం ద్వారా డిజిటల్‌ సబ్సిడీలను కస్టమర్లు సులభంగా వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. 

    మీ మార్ట్‌ పెద్ద సైజు కిరాణా కొట్టు మాత్రమేనా?

    మీ మార్ట్‌ అనేది కేవలం భౌతిక కిరాణా కొట్టు మాత్రమే కాదు. ఇది అత్యంత టెక్నాలజీతో రూపొందించిన స్మార్ట్ రీటైల్ అవుట్‌లెట్. బియ్యం, సరకుల సంచులై ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌లను ముద్రించడం ద్వారా రీసైక్లింగ్‌, బ్లాక్ మార్కెటింగ్‌, అక్రమ రవాణాను వంద శాతం అరికడుతున్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా వచ్చే నగదు సాయాన్ని డిజిటల్ రూపాయి రూపంలో నేరుగా మీ మార్ట్‌ వాలెట్‌కు అనుసంధానించే వ్యవస్థను రూపొందిస్తున్నారు. ఏ షాపులో ఎంత స్టాక్ ఉంది. ఏ వస్తువుకు డిమాండ్ ఎక్కువగా ఉందో ఆటోమేటిక్‌ రిప్లెనిష్‌మెంట్‌ సిస్టమ్‌ ద్వారా సీఎస్డీ ట్రాక్ చేస్తుంది. 

    మీ మార్ట్‌లో కొనుగోలు చేయడానికి కేవలం రేషన్ కార్డుదారులు మాత్రమే అర్హులు కాదు. సామాన్య పౌరులు ఎవరైనా సరే ఓపెన్ మార్కెట్‌ కంటే తక్కువ ధరలకే బ్రాండెడ్‌ నాణ్యమైన నిత్యావసర సరకులను ఇక్కడ కొనుగోలు చేయవచ్చు. 

    Click here to Read More
    Previous Article
    AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
    Next Article
    Healthy Night Routine : మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment