Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Long Island City

    -0.79°C

    Stormy
    4.12 km/h
    60%
    0.2h

    Latest

    Virat Kohli Surpasses MS Dhoni , Rohit Sharma: ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ అరుదైన రికార్డు - ధోనీ, రోహిత్ లను వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానానికి!

    రాయ్‌పూర్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో 279వ మ్యాచ్ ఆడి అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టిం Virat Kohli Surpasses MS Dhoni & Rohit Sharma To Become Most Capped Player In IPL: ఐపీఎల్ 2026 సీజన్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకున్నాడు. బుధవారం రాయ్‌పూర్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తుది జట్టులో చోటు దక్కించుకోవడంతో కోహ్లీ ఈ అరుదైన ఘనత సాధించాడు. ఇది విరాట్ కోహ్లీకి ఐపీఎల్ కెరీర్‌లో 279వ మ్యాచ్. దీనితో లీగ్ చరిత్రలోనే అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. గతంలో ఈ రికార్డు మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ పేరు మీద ఉండేది. వీరిద్దరూ తలో 278 మ్యాచ్‌లతో కోహ్లీతో సమానంగా ఉండగా, తాజా మ్యాచ్‌తో విరాట్ అందరికంటే ముందు వరుసలో నిలిచాడు. దిగ్గజాలను అధిగమించిన రన్ మెషీన్.. ఐపీఎల్ అంటేనే రికార్డుల వేదిక, అలాంటిది ఈ మెగా టోర్నీలో మోస్ట్ క్యాప్డ్ ప్లేయర్‌గా నిలవడం సామాన్యం కాదు. ఎంఎస్ ధోనీ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ స్క్వాడ్‌లో ఉన్నప్పటికీ ఈ సీజన్‌లో ఇంకా మైదానంలోకి దిగలేదు. మరోవైపు రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు. వీరిద్దరినీ వెనక్కి నెట్టి విరాట్ కోహ్లీ ఈ సరికొత్త శిఖరాన్ని చేరుకున్నాడు. రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ కోహ్లీ కెరీర్‌లో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. కేవలం ఒకే ఫ్రాంచైజీ తరపున ఇన్ని మ్యాచ్‌లు ఆడటం కోహ్లీ అంకితభావానికి నిదర్శనం అని క్రికెట్ విశ్లేషకులు కొనియాడుతున్నారు. Also Read:పవర్‌ప్లేలో నయా రికార్డు సృష్టించిన గుజరాత్ టైటాన్స్ స్పీడ్‌స్టర్ కగిసో రబాడ టాస్ గెలిచిన ఆర్సీబీ.. ప్లేఆఫ్స్ వేటలో బెంగళూరు.. ఈ కీలక మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పరిస్థితిని బట్టి చూస్తే రెండో ఇన్నింగ్స్‌లో బౌన్స్ మారే అవకాశం ఉందని, అందుకే ప్రత్యర్థిని తక్కువ పరుగులకే కట్టడి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు పాటిదార్ తెలిపాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్సీబీ 11 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో రెండో స్థానంలో ఉంది. గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఉత్కంఠభరిత విజయం సాధించిన బెంగళూరు టీమ్, అదే జోరును కొనసాగించి ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకోవాలని పట్టుదలతో ఉంది. జట్టులోని ఆటగాళ్లందరూ మంచి ఫామ్‌లో ఉండటం ఆర్సీబీకి ప్లస్ పాయింట్ అవుతోంది. Also Read:ఐపీఎల్ 2026 క్రేజ్.. టాప్-5 మోస్ట్ టాక్డ్ ప్లేయ‌ర్స్ లిస్ట్.. కోహ్లీ హవా మామూలుగా లేదుగా.. మిగతా ప్లేయర్లు ఎవరంటే! తిరుగులేని ఫామ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్.. మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే కూడా తమకు బౌలింగ్ చేయడమే ఇష్టమని చెప్పాడు. కేకేఆర్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉన్నప్పటికీ, గత నాలుగు మ్యాచ్‌ల్లో వరుస విజయాలతో దూసుకుపోతోంది. సీజన్ ఆరంభంలో తడబడిన త్రీ-టైమ్ ఛాంపియన్స్, ఇప్పుడు సరైన టైమింగ్‌లో పుంజుకున్నారు. ప్రతి మ్యాచ్‌ను ఒక్కో అడుగుగా భావిస్తూ సింపుల్‌గా ప్లాన్ చేస్తున్నామని రహానే తెలిపాడు. ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే కేకేఆర్‌కు ఈ మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం. విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించిన ఈ మ్యాచ్‌లో గెలిచి తమ విజయ పరంపరను ఐదుకు పెంచాలని కోల్‌కతా చూస్తోంది.

    Karuppu Shows Cancelled: సూర్యకు ఎదురుదెబ్బ... చిక్కుల్లో 'కరుప్పు' - మార్నింగ్ & ఓవర్సీస్ షోస్ క్యాన్సిల్

    Karuppu Release Date Latest Update: కోలీవుడ్ స్టార్ సూర్యకు ఎదురు దెబ్బ తగిలింది. ఆయన కొత్త సినిమా 'కరుప్పు' చిక్కుల్లో పడింది. మార్నింగ్ షోలు క్యాన్సిల్ అయ్యాయి. Suriya Karuppu Movie Latest Update: కోలీవుడ్ స్టార్ సూర్యకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆయన లేటెస్ట్ సినిమా 'కరుప్పు' చిక్కుల్లో పడింది. అమెరికాలో సినిమా షోలు క్యాన్సిల్ అయ్యాయి. ఒక్క అమెరికా మాత్రమే కాదు... తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా మార్నింగ్ షోస్ కూడా క్యాన్సిల్ అయ్యే పరిస్థితి. అసలు ఏమైంది? ఎందుకీ సమస్యలు? అనే వివరాల్లోకి వెళితే... 'కరుప్పు'ను చుట్టుముట్టిన ఫైనాన్షియల్ ఇష్యూలు!'కరుప్పు' సినిమాను సూర్య కజిన్స్ ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు ప్రొడ్యూస్ చేశారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై సినిమా తెరకెక్కింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ (Tamil Nadu CM Joseph Vijay) ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విడుదల అవుతున్న తొలి సినిమాగా రికార్డులకు ఎక్కింది కూడా.  'కరుప్పు' సినిమాకు విజయ్ ప్రత్యేక అనుమతులు ఇచ్చారు. ఆయన అధికారంలోకి రాకముందు తమిళనాడులో మార్నింగ్ షోస్ లేవు. పదకొండున్నర గంటలు దాటిన తర్వాత థియేటర్లలో మొదటి ఆట పడేది. విజయ్ వచ్చాక ఉదయం తొమ్మిది గంటలకు షోలు వేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. జీవో జారీ చేశారు. దాంతో త్రిష సినిమాకు విజయ్ బంపరాఫర్ ఇస్తున్నారా? అని కొందరు కామెంట్ చేశారు కూడా! అయితే... విజయ్ అవకాశం ఇచ్చినా తమిళనాట 'కరుప్పు' షోస్ పడటం లేదు. ఫైనాన్షియల్ ఇష్యూస్ కారణంగా మార్నింగ్ 9 గంటల ఆటలు రద్దు చేశారు. నిర్మాత ఎస్ఆర్ ప్రభు స్వయంగా ఆ విషయం ట్వీట్ చేశారు. Also Read: Karuppu Collections - సూర్య బాక్సాఫీస్ సత్తాకు అసలైన పరీక్ష... 'వీరభద్రుడు' అడ్వాన్స్ బుకింగ్స్ అంతేనా? అమెరికాలోనూ షోస్ క్యాన్సిల్... అక్కడ కష్టమే!తమిళనాడులో మాత్రమే కాదు... అమెరికాలోనూ 'కరుప్పు' షోస్ క్యాన్సిల్ అయ్యాయి. సాధారణంగా ఈ సమయానికి అక్కడ ప్రీమియర్స్ పడాలి. కానీ, పడలేదు. ప్రతి సినిమా విడుదలకు ముందు ఫైనాన్స్ క్లియర్ చేయాలి. కానీ, 'కరుప్పు' సినిమా నిర్మాతలకు ఫైనాన్స్ క్లియర్ చేయడంలో ఇబ్బందులు తలెత్తాయి. సుమారు 50 కోట్ల రూపాయలు బాకీలు చెల్లించాలని టాక్. దాంతో అమెరికాలో విడుదలకు ఇబ్బందులు తలెత్తాయి. అక్కడ మల్టీప్లెక్స్ ఫ్రాంచైజీ థియేటర్లు షోస్ క్యాన్సిల్ చేశాయి. ఒకవేళ క్లియరెన్స్ లభించినా సరే ఇంతకు ముందు షెడ్యూల్ చేసినన్ని షోలు ఉండవు. Also Read: Peddi Tickets Price - తెలంగాణలో 'పెద్ది'కి పెద్ద దెబ్బ... మైత్రి వర్సెస్ ఎగ్జిబిటర్స్ ఇష్యూలో చరణ్ సినిమాకు భారీ లాస్ సూర్యకు గత పదేళ్ళలో సరైన సక్సెస్ రాలేదు. 'సింగమ్ 3' తర్వాత థియేటర్లలో విడుదలైన సినిమాలు బ్లాక్ బస్టర్లు కాలేదు. దాంతో 'వీరభద్రుడు'తో విశ్వరూపం చూపిస్తారని అభిమానులు ఆశించారు. అయితే... ఈ సినిమాకు ఆదిలో హంసపాదు ఎదురైంది. సినిమా విడుదలకు సమస్యలు అడ్డు పడ్డాయి. విడుదల రోజున ఈ విధంగా జరిగితే ప్రేక్షకులలో క్రేజ్ తగ్గుతుంది. తర్వాత హిట్ టాక్ వచ్చినా సరే ఆశించిన రీతిలో జనాలు థియేటర్లకు రారు. మరి, ఈ సినిమాకు ఏం జరుగుతుందో చూడాలి.   Also Read: RGV On Bandi Bhagiratha - బండి భగీరథపై ఆర్జీవీ కామెంట్స్... సద్దాం హుస్సేన్ కొడుకుతో పోలుస్తూ ట్వీట్ - వైరల్

    Top Electric Scooters Above 120 Range: 120 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ కలిగిన టూవీలర్ ఈవీల జాబితా ఇదే! ధరలు, ఫీచర్స్ తెలుసుకోండి!

    Top Electric Scooters Above 120 Range: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. మంచి రేంజ్ ఉన్న వాటిని కొనుగోలు చేస్తున్నారు. టూవీలర్ కొనే ముందు ఇందులో ఉన్న టాప్ మోడల్స్ గురించి తెలుసుకోండి. Top Electric Scooters Above 120 Range: భారత్‌లో టూవీలర్ మార్కెట్ వేగంగా మారుతోంది. గతంలో కేవలం పెట్రోల్‌ వాహనాలకే పరిమితమైన జనం, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలవైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఇంధన సంక్షోభం, పెరుగుతున్న ధరలు, ప్రభుత్వం నుంచి ఈవీలకు లభిస్తున్న ప్రోత్సాహకాలు. ప్రస్తుతం మార్కెట్‌లో 63 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ టూవీలర్ మోడల్స్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.  సాధారణంగా పెట్రోల్‌ టూవీలర్స్‌తో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. పర్యావరణానికి ఎటువంటి హాని చేయకపోవడం మరో ప్రధాన అంశం. ఆధునిక ఈ స్కూటర్లు ఇప్పుడు ఒకసారి ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 400 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు.  Also Read:ఒకే ఛార్జ్‌పై 490 కి.మీ రేంజ్ ఇచ్చే Kia Carens Clavis Ev పై 2 లక్షలకు పైగా బెనిఫిట్స్.. ఫీచర్లు చూసి కొనేయండి టీవీఎస్‌ టీవీఎస్‌ మోటార్స్‌ కంపెనీ తన ఐక్యూబ్‌ సిరీస్‌తో టాప్‌లో దూసుకెళ్తోంది. టీవీస్ ఐక్యూబ్‌ ప్రారంభ ధర సుమారు 1,20, 653 రూపాయల. ఇందులో 3.1kWh, 3.5kWh బ్యాటరీ వేరియంట్లు ఉన్నాయి. ఇవి 12 నుంచి 145 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తాయి.  తర్వాత ఈ సిరీస్‌లో ఆకట్టుకుంటున్న మోడల్ టీవీఎస్‌ ఐక్యూబ్‌ ఎస్‌ అండ్‌ ఎస్టీ. హై ఎండ్‌ మోడల్ అయిన ఐక్యూబ్‌ ఎస్టీ 5.3 kWh బ్యాటరీతో వస్తుంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 212కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీని ధర 1, 77, 309 వరకు ఉంది. తక్కువ ధరలో మంచి రేంజ్ కావాలనుకునే వారికి టీవీఎస్ ఆర్బిట్‌ సరిగా సరిపోతుంది. ఇది 158 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంది.  బజాజ్ చేతక్‌  బజాజ్ తన ఐకానికి చేతక్‌ను ఎలక్ట్రిక్ రూపంలో తీసుకొచ్చి వినియోగదారులను ఆకట్టుకుంది. చేతక్‌ 3001 నుంచి C3501 వరకు వివిధ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటి రేంజ్‌ 127కిలోమీటర్ల నుంచి 153కిలోమీటర్ల వరకు ఉంటుంది. ధర 1,11, 785 నుంచి ప్రారంభమవుతుంది.  Also Read:మహీంద్రా కార్లపై భారీ ఆఫర్లు: ఈ మే నెలలో ఏ మోడల్‌పై ఎంత డిస్కౌంట్ ఉందో తెలుసా..! ఏథర్‌ ఎనర్జీ  ఏథర్ తన రిట్జా, 450X మోడల్స్‌తో యూత్‌ను ఆకట్టుకుంటోంది. కుటుంబ అవసరాల కోసం రూపొందించిన ఈ స్కూటర్‌ 20 కంటే ఎక్కువ వేరియంట్లలో లభిస్తుంది. దీని రేంజ్ 123కిలోమీటర్ల నుంచి 159 కిలోమీటర్లలో లభిస్తుంది. గరిష్టంగా దీని ధర రూ. 1, 87, 641 వరకు ఉంది. ఏథర్‌ 450X స్పోర్టీ లుక్‌ కోరుకునే వారి కోసం 6.4kW మోటార్‌తో 161కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే మోడల్స్ ఉన్నాయి. ఏథర్‌ 450S 1,31, 574 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. 161 కిలోమీటర్ల రేంజ్ వేరియంట్‌ను కూడా కలిగి ఉంది.  హీరో విడా  హీరో మోటోకార్ప్‌ విడా బ్రాండ్ కూడా మార్కెట్‌లో గట్టి పోటీ ఇస్తుంది. విడా vx2 142కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. దీని ధర 1, 06, 872 నుంచి ప్రారంభమవుతుంది. విడా వీ2 ప్రో&ప్లస్‌ గరిష్టంగా 165కిలోమీటర్ల రేంజ్ అందిస్తాయి.  Also Read:దేశవ్యాప్తంగా 4,874 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు - కేంద్ర ప్రభుత్వం భారీ నిధుల విడుదల ఓలా ఎలక్ట్రిక్‌ ఓలా ఎస్‌Z 64, 343 రూపాయల ప్రారంభ ధరతో వస్తోంది. 46 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇవే కాకుండా రివర్‌ ఇండి స్కూటర్‌ను ఎస్‌యూవీగా పిలుస్తారు. ఇది 163కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది. ఇది 1, 54, 893 ధరతో ప్రారంభమవుతుంది. యమహా ఈసీ06 169  కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. కోమకి ఎస్‌ఈ ఆల్ట్రా మోడల్ 418 కిలోమీటర్ల రేంజ్‌ను క్లెయిమ్ చేస్తోంది. జెలో జూప్‌ అత్యంత తక్కువ ధరలో లభించే 140 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని ధర 49, 110 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది.  Also Read:Tata Altroz CNG AMT వెర్షన్ వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లు , ధ‌ర చూసి డిసైడ్ అవ్వండి మీరు పెట్రోల్ ఖర్చుల నుంచి విముక్తి పొందాలని, పర్యావరణానికి మేలు చేయాలని భావిస్తే ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లు మంచి ఆప్షన్. టీవీఎస్ ఐక్యూబ్ వంటి నమ్మకమైన మోడల్స్ లేదా ఏథర్ రిట్జా వంటి ఫీచర్ రిచ్ స్కూటర్లు మీ ప్రయాణ అనుభవాన్ని మార్చేస్తాయి.   మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

    Petrol-Diesel Buying New Rule:చమురు సంక్షోభం నివారణకు చర్యలు! 5 వేల రూపాయలకు మించి పెట్రోల్ కొనలేరు! డీజిల్ కోటా 200 లీటర్లే!

    Petrol-Diesel Buying New Rule:పెట్రోల్, డీజిల్ సంక్షోభం ముంచుకొస్తున్న వేళ కేరళ ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది. రేషనింగ్ విధానంలో పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తోంది.  Petrol-Diesel Buying New Rule:కేరళలో పెట్రోల్, డీజిల్ కొనుగోలుకు సంబంధించిన కొత్త రూల్స్ పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు జరుగుతున్న ప్రచారం ప్రకారం రేషనింగ్ ద్వారా చమురు సరఫరా చేయనున్నారు. ఇప్పటికే ఉన్న నిల్వలు ఒక్కసారిగా తగ్గిపోకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకోబోతున్నట్టు సమాచారం.  కొత్తగా తీసుకురాబోతున్న రూల్స్ ప్రకారం ఒక్కో వ్యక్తికి గరిష్టంగా ఐదు వేల రూపాయల పెట్రోల్‌ కొట్టించుకునేందుకు మాత్రమే అనుమతి ఇస్తారు. అంతేకాకుండా, ఏ వినియోగదారుడు కూడా ఒకేసారి రెండు వందల లీటర్ కంటే ఎక్కువ డీజిల్‌ కొనుగోలు చేయలేడు. అంటే ఒక్కో వినియోగదారుడు ఐదు వేల విలువైన పెట్రోల్, 200 వందల లీటర్ల డీజిల్‌ మాత్రమే కొనుగోలు చేయగలడు. అంతకు మించి కొనుగోలు చేసేందుకు అనుమతి ఉండబోదని తెలుస్తోంది.  అంతేకాదు చమురు రవాణా విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. భారీ డ్రమ్ముల్లో, క్యాన్‌లలో లేదా పెద్ద పెద్ద కంటైనర్‌లలో పెట్రోలియం సరఫరాను పూర్తిగా నిషేధించారు. ప్రభుత్వం చెప్పడానికి ముందే పెట్రోలియం వ్యాపారుల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.  కేరళ రాష్ట్రంలో 2500 పెట్రోల్ పంపులు ఉన్నాయి. ఆయిల్ మార్కెటింగ్‌ కంపెనీలు ఎక్కువ కాలం సరఫరా చేసే పద్దతికి బదులు కేవలం రెండు మూడు రోజుల అవసరాలకు సరిపడా పెట్రోల్‌ పంపులకు నిల్వలు విడుదల చేస్తున్నాయి. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు.  ఒక వ్యక్తి ఒకేసారి వేల లీటర్ల చమురును కొనుగోలు చేస్తే, సాధారణ ప్రజలకు సరఫరా చేసే పంపు వద్ద నిల్వ వెంటనే అయిపోతుంది. దీనికి మరో కారణం ఏంటంటే, చమురు కంపెనీలు రుణ సౌకర్యాలు తొలగించి ముందస్తు చెల్లింపును తప్పనిసరి చేశాయి. దీని వల్ల చిన్న పంపు యజమానులు పెద్ద పరిమాణంలో నిల్వను ఆర్డర్ చేయడం కష్టమవుతుంది.  సాధారణ ప్రజలకు ఊరట  సాధారణ వాహహనం ఐదు వేలతో సులభంగా ట్యాంక్ నింపుకోగలదు. కాబట్టి, దీని వల్ల కారు, బైక్ లేదా ఆటో రిక్షా డ్రైవ్లపై ప్రభావం ఉండదు. అయితే సుదూర ప్రయాణాలు చేసే భారీ ట్రక్కులు, ప్రైవేటు బస్సులు, సరకు రవాణా చేసే వాహనాలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. వారి ప్రయాణాలకు రెండు వందల లీటర్ల కంటే ఎక్కువ డీజిల్ అవసరం అవుతుంది.  అయితే దేశంలో సరిపడా నిల్వలు ఉన్నాయని ప్రజలు కంగారు పడొద్దని సూచిస్తున్నారు. అయితే పరిస్థితి చేయిదాటిపోకుండా ఉండేందుకు మాత్రమే ఇలాంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అంటున్నారు. అందుకే ప్రజలు భయాందోళనలకు గురై భారీ మొత్తంలో కొనుగోళ్లు చేయొద్దని ప్రభుత్వాలు రిక్వస్ట్ చేస్తున్నాయి.  

    Vijay Deverakonda: అభిమానుల సమక్షంలో విజయ్ దేవరకొండ బర్త్ డే... రష్మికతో సందడి

    Vijay Deverakonda Birthday Celebrations: విజయ్ దేవరకొండ 37వ పుట్టినరోజు వేడుకలు అభిమానుల సమక్షంలో జరిగాయి. తన భార్య, నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో కలిసి ఆయన సందడి చేశారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కెరీర్ ప్రారంభించి పాన్ ఇండియా స్థాయికి వెళ్లిన యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). అభిమానులు కొందరు ఆయన్ను ముద్దుగా 'రౌడీ బాయ్' అంటారు. ఇవాళ (మే 9వ తేదీన) రౌడీ బాయ్ బర్త్ డే. అభిమానుల సమక్షంలో ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ పుట్టినరోజు విజయ్ దేవరకొండ అభిమానులకు ఎంతో ప్రత్యేకం అని చెప్పాలి. ఎందుకంటే... వాళ్ళ మధ్యలో కేక్ కట్ చేశారు. అంతే కాదు... తన భార్య, నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో కలిసి సందడి చేశారు.  పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ మొదటి పుట్టినరోజుఈ ఏడాది (2027) పుట్టినరోజు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda Birthday)కు మరింత ప్రత్యేకం అని చెప్పాలి. ఎందుకంటే... పెళ్లి తర్వాత ఆయన మొదటి పుట్టినరోజు ఇది. పుట్టినరోజు సందర్భంగా ఇంటికి వచ్చిన అభిమానులతో విజయ్ దేవరకొండ నేరుగా ముచ్చటించారు. వాళ్ళను కలిశారు. ముఖాముఖి మాట్లాడి... వాళ్ళతో కలిసి కేక్ కటింగ్ సెలబ్రేషన్లలో పాల్గొన్నారు. పుట్టినరోజు కావడంతో విజయ్ దేవరకొండ నివాసం వెలుపల శనివారం తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. తన కోసం వచ్చిన అభిమానులు డిజప్పాయింట్ కాకుండా బాల్కనీ నుంచి అందరికీ అభివాదం చేశారు. అప్పుడు ఆయనతో పాటు రష్మిక కూడా ఉన్నారు. ఆమె సంతోషం నవ్వులో కనిపించింది.అభిమానులతో కలిసి విజయ్ దేవరకొండ కేక్ కట్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన ఆరెంజ్ రంగు టీ షర్ట్‌లో ఉన్నారు. మరికొన్ని వీడియోలలో బ్రౌన్ కలర్ టీ షర్ట్‌లో అభిమానులకు సెల్ఫీలు ఇచ్చారు.అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా తమ్ముడు, యువ కథానాయకుడు ఆనంద్ దేవరకొండ ఓ పోస్ట్ చేశారు. విజయ్ - రష్మిక పెళ్లిలో ఇప్పటి వరకు ఎవరూ చూడని ఫోటోలను షేర్ చేశారు. విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే... శౌర్యువ్ దర్శకత్వంలో కొత్త సినిమాను ఏప్రిల్ 20న ప్రారంభించారు. ఇవాళ 'రణబాలి' టీం స్పెషల్ బర్త్ డే విషెష్ వీడియో విడుదల చేశారు. అందులో ఆయన గుర్రపుస్వారీ నేర్చుకుంటూ కనిపించారు. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో రష్మిక హీరోయిన్. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో నటిస్తున్న 'రౌడీ జనార్ధన' ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

    Bandi Bhagirath Files:బండి సంజయ్‌కు బిగ్‌షాక్! కుమారుడిపై ఫోక్సో కేసు నమోదు! హనీట్రాప్ అంటున్న భగీరథ్‌!

    Bandi Bhagirath:కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడిపై హైదరాబాద్‌లో ఫోక్సో కేసు నమోదైంది. మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడినట్టు బాలిక పేర్కొంది. ఇదంతా హానీ ట్రాప్ అంటున్నారు బండి కుమారుడ భగీరథ్ Bandi Bhagirath Files: తెలంగాణ రాజకీయాల్లో మరో కలకలం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులు, అత్యాచారం జరిగినట్టు సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. చట్టపరమైన నిబంధనల ప్రకారం, బాధితురాలు మైనర్ కావడంతో ఫోక్సో చట్టం కింద నమోదు చేశారు.  అందిన సమాచారం ప్రకారం, ఈ ఘటనలో బాధితురాలు కేవలం 17 సంవత్సరాల వయసు ఉన్న బాలిక. భగీరథ్‌ సదరు బాలికకు మద్యం తాగించి, తనపై అత్యాచారం చేసినట్టు ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. మొయినాబాద్లోని ఒక ఫామ్‌ హౌజ్‌తోపాటు మరో రెండు ప్రాంతాల్లో జరిగినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడానికి వచ్చినప్పుడు పేట్ బషీర్‌బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నిన్న అర్ధరాత్రి సుమారు 6 గంటలపాటు పోలీస్ స్టేషన్ వేదికగా హైడ్రామా నడిచింది. నిందితుడు కేంద్రమంత్రి కుమారుడు కావడంతో పోలీసులు తీసుకోవడానికి మొద వెనుకడుగు వేశారని ఆరోపణలు వచ్చాయి. అయితే బాధితుల ఒత్తిడి మేరకు పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు.  అయితే ఇదంతా హనీ ట్రాప్‌ను బండి భగీరథ్‌  కేసు నమోదు చేశారు. కరీంనగర్‌ టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ప్రకారం చాట్ల అన్వి అనే యువతి తనతో స్నేహం పేరుతో పరిచయం పెంచుకుందని, ఆ పరిచయంతో ఆమె తన కుటుంబ వేడుకలకు, గ్రూప్ మీటింగ్స్‌కు ఆహ్వానించేంది. కొన్ని పవిత్ర స్థలాలకు కూడా వెళ్లినట్టు సమాచారం. అయితే కొంత కాలం తర్వాత తన అసలు రంగును బయటపడిందని, చాట్ల అన్వి, ఆమె తల్లిదండ్రులు తన పెళ్లి విషయంలో ఒత్తిడి తీసుకువచ్చినట్టు పేర్కొన్నారు. ఈ ప్రతిపాదన తిరస్కరించంతో వారు బెదిరంపులకు దిగారు. ఒక వేళ తమ మాట వినకపోతే, వేధింపులు, శారీరక సంబంధం పెట్టుకున్నాడనే తప్పుడు ఆరోపణలతో క్రిమినల్‌ కేసులు పెడతామని వారు హెచ్చరించినట్టు ఫిర్యాదులో ఉంది.  ఈ క్రమంలో భయపడిన భగీరథ్‌, ఆరోపణల నుంచి తప్పించుకోవడానికి మొదట అన్వి తండ్రికి యాభై వేల నగదు ఇచ్చామన్నారు. అయితే వారు అంతటితో ఆగకుండా తమ డిమాండ్‌ను ఐదు కోట్లకు పెంచారని తెలిపారు. ఆ డబ్బు ఇవ్వకుంటే అన్వి తల్లి ఆత్మహత్య చేసుకుంటుందని, ఆ నెపం భగీరథ్‌పైనే వేస్తామని వారు బెదిరించినట్టు పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ద్వారా తెలుస్తోంది. 

    Rajinikanth: రజనీకాంత్‌పై విజయ్ ఫ్యాన్స్ ట్రోలింగ్... తలైవాది డబుల్ స్టాండర్డ్స్ ఆ?

    ప్రస్తుతం తమిళనాడు ఎలాంటి వాతావరణం నెలకొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి పీఠానికి అడుగు దూరంలో దళపతి విజయ్ (Thalapathy Vijay) ఆగిపోవడం, మెజార్టీ పూర్తి స్థాయిలో రాకపోవడంతో సీఎం పీఠం ఎక్కేది ఎవరు? ఏ గ్రూపు ఏ పార్టీతో ఉంటుందో? ఎవరెవరు జంప్ అవుతారు?  అసలు చివరకు సీఎం ఎవరు అవుతారు? అనే గందరగోళం నెలకొంది. ఎక్కువ సీట్లు గెలిచి పెద్ద పార్టీగా విజయ్ టీవీకే అతరించిన సంగతి తెలిసిందే. 108 స్థానాల్లో గెలిచి విజయ్ అదరగొట్టేశాడు. అయితే మ్యాజిక్ ఫిగర్ మాత్రం 118 అన్న సంగతి తెలిసిందే. దీంతో విజయ్ ఏ అడుగు వేస్తాడు? ఏ నిర్ణయం తీసుకుంటాడు? అని అంతా అనుకున్నారు. రజనీకాంత్ మద్దతు ఎవరికి?విజయ్ గురించి ఎందుకు మాటల్లేవ్?తమిళనాడులో విజయ్ కు మద్దతుగా పలువురు హీరోలు గళం విప్పుతున్నారు. లోక నాయకుడు కమల్ హాసన్ కూడా మాట్లాడారు. ఆయన స్టాలిన్ డీఎంకే పార్టీలో ఉన్నారు. అయినా సరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా విజయ్ ని గవర్నర్ ఆహ్వానించాలని చెప్పారు. అయితే రజనీకాంత్ మాత్రం మాట్లాడలేదు. ఇంకా చెప్పాలంటే స్టాలిన్ దగ్గరకు వెళ్లారు. స్టాలిన్ - రజనీకాంత్ భేటీ కీలకంగా మారింది. దీంతో బీజేపి ఆట ఆడుతోందని, రజనీని మధ్య వర్తిత్వం కోసం వాడుతోందని దారుణంగా ట్రోలింగ్ చేయడం స్టార్ట్ చేశారు. డీఎంకే, అన్నా డీఎంకేని కలిపే బాధ్యత రజనీకి ఇచ్చి ఉంటారని, కామన్ అభ్యర్థిగా రజనీకాంత్‌ను అనుకుంటున్నారని ఇలా రకరకాలుగా రూమర్లు బయటకు వచ్చాయి. దీంతో రజనీకాంత్‌ను విజయ్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోలింగ్ చేశారు. అసలు కౌటింగ్ రోజునే రజనీకాంత్ సోషల్ మీడియా ఏకిపారేసింది. రజనీ యాంటీ ఫ్యాన్స్ అంతా కూడా విమర్శించారు. అసలు ధైర్యం చేసి అడుగు ముందుకు వేసి ఉంటే... రజనీ అప్పుడే సీఎం అయ్యే వారు అంటూ కౌంటర్లు వేశారు. విజయ్ విజయాన్ని చూసి రజనీ ఓర్వలేకపోతోన్నారు అంటూ రకరకాల మీమ్స్, ట్రోల్స్ కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు స్టాలిన్, రజనీ భేటీతో ఆ ట్రోలింగ్ మరింతగా పెరిగింది. అయితే స్టాలిన్ మాత్రం డీఎంకే, అన్నా డీఎంకే కలయిక మీద వచ్చిన రూమర్లను ఖండించారు. విజయ్‌‌ని తమిళనాడు గవర్నర్ కూడా ముప్పు తిప్పలు పెడుతున్న సంగతి తెలిసిందే. మెజార్టీ లేదు.. సంఖ్యా బలం చూపించు.. అప్పుడే ప్రభుత్వ ఏర్పాటుకి అనుమతి ఇస్తానని అడ్డంగా నిలబడటం, చివరకు అసెంబ్లీలో బల నిరూపణ చేసుకో అని అవకాశం ఇవ్వడం అందరికీ తెలిసిందే. ఇక మున్ముందు తమిళ నాట ఎలాంటి చదరంగం జరుగుతుందో చూడాలి. ఇప్పటికీ రజనీకాంత్ పెదవి విప్పలేదని విజయ్ ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు.  

    TVK Vijay Education Qualification: కాలేజీ డ్రాపౌట్ నుంచి పొలిటికల్ కింగ్‌గా దళపతి విజయ్ ప్రస్థానం ఇదే.. ఇంతకీ ఏం చదివారంటే

    Tamil Nadu Election Results 2026 | కాలేజీ చదువు మధ్యలోనే ఆపేసిన దళపతి విజయ్ సినిమాల్లోకి వెళ్లి సూపర్ స్టార్ అయ్యారు. తాజాగా రాజకీయాల్లోకి వచ్చి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించారు. చెన్నై: తమిళనాడులో కొత్త రాజకీయం మొదలైంది. ఎన్నికల్లో తక్కువ అంచనా వేసిన రాజకీయ ప్రత్యర్థులకు తన కెపాసిటీ ఏంటో తెలిసేలా చేశాడు టీవీకే అధినేత జోసెఫ్ విజయ్. నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన దళపతి విజయ్ గత ఏడాది తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ స్థాపించి అందరి దృష్టిని ఆకర్షించారు. తాజాగా జరుగుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ పార్టీ టీవీకే ముందంజలో దూసుకెళ్తోంది. అధికార డీఎంకే మూడో స్థానానికి పరిమితం కాగా, అన్నాడీఎంకే అనూహ్యంగా రెండో స్థానంలో కొనసాగుతోంది. విజయ్ పార్టీ టీవీకే 100 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఉండగా, అన్నాడీఎంకే 70 కి పైగా, డీఎంకే 50 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కింగ్ గా నిలిచిన విజయ్ కాలేజీ డ్రాపౌట్ అని తెలిసి అంతా షాకవుతున్నారు. దళపతి విజయ్ అసలు పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. సినిమాలకు గుడ్ బై చెప్పి ప్రజల కోసం రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటిన విజయ్.. అందుకనుగుణంగా వ్యవహరించి తమిళన రాజకీయాల్లో సరికొత్త శక్తిగా ఎదుగుతున్నారు. ఎన్నికల ఫలితాల్లో టీవీకే సత్తా చాటుతుండగా.. ఆయన ఏం చదువుకున్నారని సెర్చ్ చేస్తున్న ఫ్యాన్స్.. కాలేజీ డ్రాపౌట్ అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. సినిమాల్లోకి వచ్చి సక్సెస్ అయిన విజయ్ ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి కింగ్ మేకర్‌గా మారారు. తొలి ఎన్నికతోనే సీఎం రేంజ్‌కు ఎదిగారు.  విజయ్ ఎడ్యుకేషన్ వివరాలు.. టీవీకే అధినేత విజయ్ తన ప్రాథమిక విద్యను చెన్నైలోని కోడంబాక్కంలో ఉన్న ఫాతిమా స్కూల్‌లో పూర్తి చేశారు. తర్వాత ఆయన విరుగంబాక్కంలోని బాలలోక్ స్కూల్‌లో టెన్త్ వరకు చదివారు. చదువులో టాపర్ కాకపోయినా చురుకుగా ఉండేవారు. మంచి మార్కులు తెచ్చుకునే విజయ్ మనస్సు పుస్తకాల కంటే ఎక్కువగా స్టేజ్, కెమెరా వైపు మళ్లేది. ఆయన తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్ సినిమా దర్శకుడు కావడంతో నటన అనేది వారసత్వంగా వచ్చింది. స్కూల్ పూర్తయ్యాక విజయ్ చెన్నైలోని ప్రసిద్ధ లోయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్ కోర్సులో చేరారు. కానీ చదువు కంటే ఆయనకు సినిమాల్లోకి రావాలని కోరిక బలంగా ఉండేది.  కాలేజీ డ్రాపౌట్ ఎలా అయ్యారు ? కాలేజీ రోజుల్లోనే విజయ్ సినిమాల్లోకి వెళ్లాలని  వైపు మళ్లింది. షూటింగ్‌లు, ఆడిషన్స్ కు వెళ్తూ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు పెంచారు. దాంతో ఈ చదువులు అవి తన కెరీర్ కాదని, సినిమాలే కెరీర్ అని గట్టిగా ఫిక్స్ అయ్యారు. దాంతో విజయ్ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. కాలేజీ చదువు మధ్యలోనే వదిలేసి ఫోకస్ అంతా సినిమాలపైనే పెట్టారు. దాంతో కాలేజీ డ్రాపౌట్‌గా మారారు. సినిమాల్లో గుర్తింపు, మంచి స్టార్‌డమ్ విజయ్ మొదట నటుడిగా నిరూపించుకున్నాడు. ఒక్కో సినిమాతో తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. విజయ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాశాయి. ఈ క్రమంలో దక్షిణాది సినీ పరిశ్రమలలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా నిలిచారు. సినిమాలతో పాటు సమాజంపై కొంత అవగాహన ఉన్న వ్యక్తిగా విజయ్ కి పేరుంది. గత పదేళ్లలో విజయ్ తీసిన సినిమాలు ఆలోచింపజేసేవిగా ఉంటాయి. యువతపై ఆయనకున్న పట్టు, సామాజిక సమస్యలపై బహిరంగంగా మాట్లాడటం సామాన్యులకు మరింత దగ్గర చేశాయి. గౌరవ డాక్టరేట్‌తో సత్కారం విజయ్ తన డిగ్రీని పూర్తి చేయలేకపోయినా సినిమాల్లో చేసిన కృషిని ఎవరూ విస్మరించలేరు. ఈ క్రమంలో 2007లో డాక్టర్ ఎం.జి.ఆర్. ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్‌తో విజయ్‌ను సత్కరించింది.  రాజకీయాల్లో సరికొత్త ఇన్నింగ్స్   రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని భావించిన విజయ్ సినిమాకు గుడ్ బై చెప్పాడు. సొంత పార్టీ 'టీవీకే'ను స్థాపించారు. అభ్యర్థుల ఎంపికలో సైతం చురుకుగా వ్యవహరించి నేడు ప్రయోజనం పొందుతున్నారు. ఇటీవల ఎగ్జిట్ పోల్స్ అన్నీ డీఎంకే అధికారం అని చెప్పగా.. వాటిని తప్పు అని నిరూపిస్తూ విజయ్ టీవీకే పార్టీ 100కు పైగా స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణం చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.

    Tamil Nadu Election Results 2026: తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో కొలత్తూరులో స్టాలిన్‌కు షాక్! డీఎంకే కోటను బ్రేక్ చేసిన విజయ్‌ టీవీకే!

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పెను సంచలనం నమోదు అవుతోంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన కంచుకోట కొలత్తూరులో వెనుకంజలో ఉన్నారు. నటుడు విజయ్ పార్టీ తమిళనాట ప్రభంజనం సృష్టిస్తోంది.  Tamil Nadu Election Results 2026: తమిళనాడు రాజకీయాల్లో నవశకం ఆరంభమైంది. దశాబ్దాల కాలంగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి తెరదించారు విజయ్. థళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయాల దిశగా దూసుకుపోతోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన సొంత నియోజకవర్గంలో వెనుకంజలో ఉండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.  కొలత్తూరులో జైంట్‌ కిల్లర్‌- స్టాలిన్‌  వెనుకంజ    తమిళనాడు రాజకీయాల్లో అత్యంత సురక్షితమైన సీటుగా భావించే కొలత్తూరు నియోజకవర్గంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ప్రస్తుతం తన సమీప ప్రత్యర్థి, టీవీకే అభ్యర్థి వీఎస్‌ బాబు చేతిలో వెనుకంజలో ఉన్నారు. తాజా ట్రెండ్స్ ప్రకారం 1200 ఓట్లకుపైగా తేడాతో వీఎస్‌ బాబు ముందంజలో ఉన్నారు. స్టాలిన్ రెండోస్థానంలో కొనసాతున్నారు.  కొలత్తూరు నియోజకవర్గం 2011 నుంచి స్టాలిన్‌కు కంచుకోటగా ఉంది. 2021 ఎన్నికల్లో ఆయన ఇక్కడ 70వేలకుపై ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే ఈసారి టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు జైంట్ కిల్లర్‌గా మారారు. ఇక్కడ ఏఐఏడీఎంకే అభ్యర్థి ఆర్ సంతానకృష్ణన్‌ మూడో స్థానంలో కొనసాగుతున్నారు.  విజయ్ టీవీకే ప్రభంజనం నటుడు విజయ్ స్థాపించిన తిమిళగ వెట్రి కళగం తన తొలి ఎన్నికల్లో అద్భుతమైన ప్రతిభ చూపారు. రాష్ట్రంలోని మొత్తం 234 స్థానాలకుగాను, టీవీకే ప్రస్తుతం 85 స్థానాల్లో ముందంజలో ఉంది. విజయ్ స్వయంగా పోటీ చేసిన రెండు నియోజకవర్గాలు, తిరుచ్చి(ఈస్ట్), పెరంబూర్‌ రెండింటిలోనూ ఆయన స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించారు.  ఈ ట్రెండ్స్‌ గనుక కొనసాగితే, తమిళనాడు రాజకీయ చరిత్రలో ఇది అతి పెద్ద మలుపుగా భావించవచ్చు. డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి పెద్ద పార్టీలను కాదని ఓటర్లు మార్పు కోరుకుంటున్నట్టు ఈ ఫలితాలు సూచిస్తున్నాయి.  ప్రస్తుతం కౌంటింగ్ సరళిని గమనిస్తే అధికార డీఎంకే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నట్టు కనిపిస్తోంది. ఆ పార్టీ కేవలం 52 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సైతం తన నియోజకవర్గమైన చెపాక్-తిరువల్లికేణిలో వెనుకంజలో ఉన్నారు. అక్కడ ఏఐడీఎంకే అభ్యర్థి ఆది రాజారాం ఆధిక్యంలో ఉన్నారు.  మరోవైపు తమిళనాడు రాష్ట్రంలో రెండో స్థానంలో 73 స్థానాలతో ఏఐడీఎంకే ఉంది. వారి మిత్ర పక్షం పీఎంకే ఆరు స్థానాల్లో లీడ్‌ సాధించింది. డీఎంకేతో పోలిస్తే ఏఐడీఎంకే మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. అయినా టీవీకే మాత్రం రెండు పార్టీలను బెంబేలెత్తిస్తోంది.  తమిళనాడు ఓటర్లు సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఆలోచించడం ఈ మార్పునకు ప్రధాన కారణం. విజయ్ తన పార్టీని డీఎంకే, అన్నా డీఎంకేకు ప్రత్యామ్నాయంగా ప్రకటించి ప్రజల్లోకి బలంగా వెళ్లారు. యువత, మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున టీవీకే వైపు మొగ్గు చూపడం వల్ల ఈ ఫలితాలు వస్తున్నట్టు తెలుస్తోంది. డీఎంకే పాలనపై వ్యతిరేకత, కొత్త నాయకత్వం కోసం ప్రజల  నిరీక్షణ విజయ్‌కు ప్లస్‌ పాయింట్‌గా మారింది.    23 ఏప్రిల్ 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రెండోసారి అధికారం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకోగా, విజయ్ రాజకీయ రంగ ప్రవేశం సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. గతంలో కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజాల తర్వాత తమిళనాడు రాజకీయ శూన్యతను ఎదుర్కొంది. ఆ శూన్యతను భర్తీ చేసే నాయకుడిగా విజయ్ ఎదిగారు. 

    Reduce Sun Tan : చేతులపై ట్యాన్ తగ్గించే హోమ్ రెమెడీస్.. హ్యాండ్స్ నల్లగా మారితే ఈ టిప్స్ ఫాలో అయిపోండి

    DIY Remedies to Sun Tan : వేసవిలో చాలామంది ఎదుర్కునే సమస్యల్లో టాన్ ఒకటి. ముఖ్యంగా చేతులు బాగా టాన్ అవుతాయి. అయితే వాటిని సహజమైన చిట్కాలతో తగ్గించుకునేందుకు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటో చూసేద్దాం.  Home Remedies to Remove Sun Tan : వేసవిలో చేతులు టాన్ అవ్వడమనేది ఎక్కువమందికి ఉండే కంప్లైంయిట్. ముఖ్యంగా బైక్, స్కూటీలు డ్రైవ్ చేసే వారికి చేతులు ఎక్కువగా టాన్ అవుతాయి. ఎంతగా అంటే బాడీ కలర్​కి, చేతులకు ఏమాత్రం సంబంధం ఉండదు. ఈ టాన్​ వదిలించకోవడం కూడా చాలా కష్టం అవుతుంది. కానీ కొన్ని ఇంటి చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.  నిమ్మకాయ, తేనె   నిమ్మరసంలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. ఇది ట్యాన్ తగ్గించడంలో మంచి ఫలితాలు ఇస్తుంది. నిమ్మరసం, తేనె సమానంగా తీసుకోవాలి. వాటిని మిక్స్​ అయ్యేలా బాగా కలిపి.. చేతులకు అప్లై చేయాలి. 15 నుంచి 20 నిమిషాలు అలాగే ఉంచి.. తర్వాత చల్లని నీళ్లతో కడగాలి. ఇలా వారానికి మూడు లేదా నాలుగు సార్లు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అయితే వెంటనే ఎండలోకి వెళ్లకపోతే మంచిది.  పాలు, పసుపు పాలలో ఉన్న లాక్టిక్ యాసిడ్ స్కిన్ ని లైట్ చేస్తుంది. పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. 2 స్పూన్ల పాలు తీసుకుని దానిలో చిటికెడు పసుపు కలపాలి. చేతులకు రాసి 20 నిమిషాలు ఉంచి.. తర్వాత చల్లటి నీళ్లతో కడగాలి. రోజూ రాత్రి పడుకునే ముందు కూడా దీనిని రాసి.. ఉదయాన్నే కడగవచ్చు.  కీరదోస జ్యూస్ కీరదోసకాయలో 95 శాతం నీళ్లు ఉంటాయి. ఇవి స్కిన్ కూలింగ్​కి, ట్యాన్ తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. దీనికోసం కీరదోస ముక్కలను నేరుగా చర్మంపై రబ్ చేయండి. లేదా జ్యూస్ తీసి కాటన్ బాల్​తో అప్లై చేయాలి. 15 నిమిషాలు ఆగి కడిగితే మంచి ఫలితాలు ఉంటాయి.  టమాటో, శెనగపిండి టమాటో లో లైకోపీన్ ఉంటుంది. ఇది నేచురల్ సన్ ప్రొటెక్టర్​గా పనిచేస్తుంది. దీనికోసం టమాటో గుజ్జులో 1 స్పూన్ శెనగపిండి కలపాలి. చేతులకు రాసి వృత్తాకారంగా స్క్రబ్ చేయాలి. 10 నిమిషాలు ఆగి కడగాలి. ఇలా వారంలో 2 లేదా 3 సార్లు చేస్తే బెటర్.  అలోవెరా జెల్ ట్యాన్ తగ్గించడంలో అలోవెరా వండర్స్ చేస్తుంది. స్కిన్​కి కూలింగ్ ఇచ్చి.. హీలింగ్ చేస్తుంది. తాజా అలోవెరా ఆకు నుంచి జెల్ తీసి.. దానిని నేరుగా చేతులకు అప్లై చేయాలి. రాత్రంతా అలా వదిలేయవచ్చు. ఉదయాన్నే కడిగితే సరిపోతుంది.  బంగాళాదుంప జ్యూస్ బంగాళాదుంపలో ఉన్న కాటకోలేస్ ఎంజైమ్ స్కిన్ ని నేచురల్​గా లైట్ చేస్తుంది. దీనికోసం బంగాళాదుంప స్లైస్ తీసి నేరుగా చర్మానికి అప్లై చేయండి. లేదా రసం తీసి అప్లై చేయండి. 20 నిమిషాలు ఆగి కడగాలి. చందనం, రోజ్ వాటర్ చందనం చర్మానికి కూలింగ్ ఇస్తుంది. ట్యాన్ తగ్గిస్తుంది. ఇది సంప్రదాయ బ్యూటీ సీక్రెట్​గా చెప్పవచ్చు. చందనం పొడిలో రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేయాలి. దానిని చేతులకు అప్లై చేసి 20 నిమిషాలు ఆగి.. చల్లటి నీళ్లతో కడగాలి. కాఫీ, కొబ్బరి నూనె స్క్రబ్ డెడ్ స్కిన్ తొలగించడానికి కాఫీ, కొబ్బరి నూనె స్క్రబ్ సూపర్ ఎఫెక్టివ్​గా చెప్పవచ్చు. 1 స్పూన్ కాఫీ పొడిలో కొబ్బరి నూనె కలపాలి. దానిని చేతులపై స్క్రబ్ చేయాలి. 10 నిమిషాలు ఆగి కడిగితే చాలు. వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేస్తే మంచిది.  మరిన్ని టిప్స్ SPF ఉండే సన్ స్క్రీన్ వాడాలి. ఎండలో వెళ్తే చేతులు కప్పుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. హార్ష్ కెమికల్ సోప్ వాడకూడదు. మాయిశ్చరైజర్ రెగ్యులర్​గా వాడితే మంచిది. ఎండలో ఎక్కువ సేపు ఉంటే ట్యాన్ మరింత డార్క్ అయిపోతుంది. అయితే ఈ టిప్స్ రెగ్యులర్​గా చేస్తేనే రిజల్ట్స్ వస్తాయి. ఒకేసారి టాన్ తొలగాలి అంటే అవ్వదు. కనీసం 2 లేదా 3 వారాలు చేస్తే.. మంచిది. ఇవి మీకు ఇబ్బంది కలిగిస్తాయనుకుంటే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి.      గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

    Beer in Summer : వేసవిలో బీర్ తాగితే నిజంగా కూల్ అవుతారా? సైడ్ ఎఫెక్ట్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

    Beer Risks in Summer : సమ్మర్లో బీర్ తాగితే బాడీ నిజంగానే కూల్ అవుతుందా? దీనివల్ల కలిగే సైడ్ ఎపెక్ట్స్ ఏంటి? ఒకవేళ బీర్ తాగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసేద్దాం.  Beer Side Effects in Heavy Heat : చాలామంది ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బీర్ తాగితే.. భలే చల్లగా ఉంటాది అని చెప్తారు. కానీ అది నిజంగా శరీరాన్ని చల్లబరుస్తుందా? లేదా కేవలం అలా అనిపిస్తుందా? దీనికి ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇస్తున్నారు నిపుణులు. అదేంటంటే.. వేసవిలో బీర్ తాగితే అది శరీరాన్ని చల్లబరచదట.. నిజం చెప్పాలంటే అది మిమ్మల్ని మరింత వేడిగా చేస్తుందట. అలా ఎందుకు జరుగుతుందో.. మరి బీర్ తాగితే కూల్ ఫీలింగ్ ఎందుకు వస్తుందో.. ఇప్పడు తెలుసుకుందాం.  బీర్ తాగినప్పుడు బాడీలో ఏమి జరుగుతుంది?   బీర్ చర్మంలోని రక్తనాళాలను వెడల్పు చేస్తుంది. దీంతో రక్తం చర్మం వైపు వచ్చి.. స్కిన్ వెచ్చగా అనిపిస్తుంది. మెదడు దీన్ని చల్లగా ఉన్నట్టు చెప్తుంది. కానీ శరీరం వేడిని బయటకు వదిలేస్తుంది. అందుకే బీర్ తాగితే చల్లగా ఉంది అనుకుంటారు. కానీ చర్మం నుంచి వేడి వెళ్లిపోతున్నప్పుడు శరీర ఉష్ణోగ్రత తగ్గదు. ఇంకా హీట్ జెనరేట్ అవుతుంది.  అలాగే ఆల్కహాల్ పిట్యూటరీ గ్రంధి నుంచి ADH (anti-diuretic hormone) విడుదలను నిరోధిస్తుంది. దీనివల్ల కిడ్నీ ఎక్కువగా నీళ్లు బయటకు పంపిస్తుంది. దీనివల్ల డీహైడ్రేట్ అవుతారు. వేడి పెరగడంతో శరీరం చెమట ద్వారా చల్లగా అవ్వడానికి ప్రయత్నిస్తుంది. కానీ చెమట మరింత ఎక్కువై డీహైడ్రేషన్​కు దారితీస్తుంది. హీట్ స్ట్రోక్ ప్రమాదం కూడా పెరుగుతుంది.  అధ్యయనాలు ఏమి చెప్తున్నాయంటే..  బీర్ తాగిన తర్వాత మొదటి 20 నిమిషాలు చల్లగా అనిపిస్తుంది. కానీ తర్వాత శరీరపు ఉష్ణోగ్రత వేగంగా పెరుగుతుంది. వేసవిలో ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉందంట. అవేంటంటే.. వేసవిలో బీర్ తాగితే వచ్చే నష్టాలు  సమ్మర్లో బీర్ తాగితే డీహైడ్రేషన్​కి గురి అవుతారు. దీనివల్ల తల నొప్పి, నోరు ఎండిపోవడం జరుగుతాయి. తల తిరగడం, వికారం, అలసట వేగంగా వస్తాయి. బాడీ హీట్ పెరుగుతుంది. సన్​స్ట్రోక్ ప్రమాదం రెండింతలు అవుతుంది. గుండెపై ఒత్తిడి పెరిగి.. బీపీలో మార్పులు వస్తాయి. శరీరం వేగంగా అలసిపోతుంది. వాంతులు కావచ్చు. అలాగే శరీరం ఎక్కువగా ఆల్కహాల్​ అబ్జార్బ్ చేసుకుంటుంది. దీంతో తక్కువ తాగినా.. కిక్ ఎక్కువగా ఎక్కేస్తుంది.  బీర్ తాగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరి సమ్మర్లో బీర్ తాగాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎంజాయ్ చేయవచ్చు. అదేంటంటే.. మీరు ప్రతి బీర్​కి ఒక గ్లాసు నీళ్లు తాగండి. ఇది డీహైడ్రేట్ సమస్యలను తగ్గిస్తుంది. డ్రింక్ చేస్తూ మధ్యలో నీళ్లు తాగితే హ్యాంగోవర్ కూడా ఉండదు. ఖాళీ కడుపుతో బీర్ తాగకపోవడమే మంచిది. ఏదైనా ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకుని.. తర్వాత తాగితే బెటర్. ఎండలో కాకుండా ఏసీ లేదా నీడ ఉన్న ప్రదేశంలోనే తాగండి. ఎండలో తాగితే హీట్ స్ట్రోక్ ప్రమాదం పెరగవచ్చు.  మీ స్టామినా కంటే తక్కువ తాగితే మంచిది. అలాగే బీర్ తాగిన వెంటనే బయటకు వెళ్లకండి. కనీసం 30 నుంచి 45 నిమిషాలు తర్వాత వెళ్లండి. బీర్ తాగిన తర్వాత నిమ్మకాయ నీళ్లు, కొబ్బరి నీళ్లు, లేదా ORS తాగితే శరీరం కోల్పోయిన్ ఎలక్ట్రోలైట్స్ తిరిగి వస్తాయి. అలాగే తాగిన తర్వాత డ్రైవ్ చేయడం అత్యంత ప్రమాదకరం. కాబట్టి బయటకు వెళ్లాల్సి వస్తే క్యాబ్ బుక్ చేసుకోండి.      గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

    Trisha Krishnan Birthday : త్రిష కృష్ణన్ 43వ బర్త్​ డే స్పెషల్.. ఆమె స్కిన్ కేర్, బ్యూటీ సీక్రెట్స్ ఇవే

    Trisha Krishnan Skin Care : 43 ఏళ్లలో కూడా త్రిష ఇంకా యంగ్​గా, ఫ్రెష్​గా మెరిసిపోతుంది. ఇంతకీ ఆమె ఫాలో అయ్యే బ్యూటీ టిప్స్ ఏంటి? అవి ఆమె గ్లామర్​కి ఎలా హెల్ప్ అయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం.  Trisha Krishnan 43rd Birthday : తెలుగు, తమిళ సినిమాల్లో అందానికి మారుపేరుగా నిలిచింది త్రిష కృష్ణన్. ఆమె వయసు పెరిగే కొద్దీ.. మరింత యంగ్​గా మారుతుంది ఈ బ్యూటీ. మే 4, 1983లో పుట్టిన ఈ భామ.. నేటితో 42 ఏళ్లు దాటి.. 43లోకి అడుగు పెట్టంది. కానీ లుక్స్​లో మాత్రం 23ని తలపిస్తుంది ఈ భామ. మరి ఈ గ్లామర్ క్వీన్ ఫాలో అయ్యే బ్యూటీ టిప్స్, స్కిన్ కేర్ సీక్రెట్స్ ఏంటో.. అవి ఆమెను యంగ్​గా ఉండడానికి ఎలా హెల్ప్ చేస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.  హైడ్రేషన్    త్రిష రోజూ కనీసం 4 లీటర్ల నీళ్లు తాగుతుంది. ఇది ఆమె స్కిన్​ని హైడ్రేటెడ్​గా, ప్లంప్​గా ఉంచుతుంది. దీనికి తోడు ఆరెంజ్ జ్యూస్, దానిమ్మ జ్యూస్, గ్రీన్ టీ కూడా తాగుతుంది. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. టీ, కాఫీలు తీసుకోదు.  స్కిన్ గ్లో సీక్రెట్ విటమిన్ సి పుష్కలంగా ఉండే ఫుడ్స్ తీసుకుంటుంది. సిట్రస్ ఫ్రూట్స్ అంటే నిమ్మకాయ, ఆరెంజ్ తీసుకుంటే స్కిన్​లో చాలా మంచి మార్పులు వచ్చాయని తెలిపింది త్రిష. స్కిన్ గ్లో చేయడంతోపాటు, కళ్లు కూడా మంచిగా ఉంటాయని తెలిపింది. స్కిన్ కేర్ బేసిక్స్ త్రిష స్కిన్ కేర్ రొటీన్ చాలా సింపుల్​గా ఉంటుంది. క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ బాగా ఫాలో అవుతుంది. డీప్ క్లెన్సింగ్, మాయిశ్చరైజింగ్, సన్ ప్రొటెక్షన్ స్కిన్ కేర్​లో కీలకమైనవని చెప్తోంది. నేచురల్, కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుందట.  ఫిట్ నెస్ ఫ్రీక్ త్రిష ఫిట్​నెస్​కి బాగా ప్రయారిటీ ఇస్తుంది. యోగా, పైలేట్స్, డాన్సింగ్ రెగ్యులర్​గా చేస్తుంది. వ్యాయామం వల్ల కొల్లాజెన్ ప్రొడక్షన్ పెరిగి.. స్కిన్ టైట్​గా, గ్లోయింగ్​గా మారుతుందని నమ్ముతుంది. ఫ్రీహ్యాండ్ ఎక్సర్సైజ్, కార్డియో, స్విమ్మింగ్ కూడా చేస్తుంది. నిద్రే ప్రధానం రాత్రి 7 నుంచి 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకుంటుంది. దీనివల్ల స్కిన్ ని రిఫ్రెష్​గా, గ్లోయింగ్​గా అవుతుందని చెప్తుంది.  నో జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ పూర్తిగా మానేసి.. న్యూట్రిషన్ అధికంగా ఉండే హెల్తీ మీల్స్ తింటుంది. బ్రేక్ ఫాస్ట్ హెవీగా తీసుకుంటుందట. అవి రోజంతా ఎనర్జీ ఇస్తాయని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.  స్ట్రెస్ మేనేజ్మెంట్ మెడిటేషన్, రీడింగ్, ఫ్యామిలీతో సమయం గడపడం ద్వారా ఒత్తిడి అదుపులోకి తెచ్చుకుంటానని తెలిపింది. స్ట్రెస్ వల్ల ముఖం మీద ఫైన్ లైన్స్, డల్ స్కిన్ వస్తాయని కాబట్టి వీలైనంత వరకు ఒత్తిడి తగ్గించుకోవాలని తెలిపింది.  లెస్ ఈజ్ మోర్! త్రిష హెవీ మేకప్ వాడదు. ఐలైనర్, లిప్ బామ్​తో సింపుల్ లుక్ మెయింటెయిన్ చేస్తుంది. ఇది స్కిన్​కి మంచిది. రెగ్యులర్ లుక్ కోసం ఫౌండేషన్​తో పాటు ఐలైనర్, మాస్కారా, లిప్ గ్లాస్ వాడుతుంది.