Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Long Island City

    -0.79°C

    Stormy
    4.12 km/h
    60%
    0.2h

    Latest

    CWG Ajaya Babu: తండ్రి బాటలోనే కొడుకు.. ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ రికార్డ్ బ్రేక్ చేస్తూ అజయ్ బాబు సిల్వర్ కైవసం

    గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026 లో వల్లూరి అజయ్ బాబు సిల్వర్ మెడల్ సాధించి తండ్రి లెగసీని కంటిన్యూ చేస్తూ ఇండియా మెడల్స్ టాలీ పెంచాడు. Ajaya Babu Wins Silver In CWG 2026:  ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ లో తండ్రి మెడల్ సాధించిన 16 ఏళ్ల తర్వాత, వల్లూరి అజయ్ బాబు గ్లాస్గో వేదికగా సోమవారం నైట్ జరిగిన మెన్స్ 79 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ లో డ్రామాటిక్ సిల్వర్ మెడల్ గెలుచుకుని హిస్టరీ క్రియేట్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ విజయనగరం డిస్ట్రిక్ట్ లోని కొండవెలగాడ విలేజ్ కి చెందిన 21 ఏళ్ల అజయ్ బాబు టోటల్ గా 330 కేజీలు (149 కేజీల స్నాచ్ + 181 కేజీల క్లీన్ అండ్ జెర్క్) ఎత్తి జస్ట్ 1 కేజీ తేడాతో గోల్డ్ మెడల్ మిస్ అయ్యాడు. మలేషియాకి చెందిన ఎర్రీ హిదాయత్ ముహమ్మద్ గోల్డ్ గెలవగా, ఇంగ్లాండ్ కి చెందిన క్రిస్ ముర్రే బ్రాంజ్ మెడల్ సాధించాడు. అజయ్ బాబు తండ్రి వల్లూరి శ్రీనివాసరావు 2010 ఢిల్లీ గేమ్స్ లో 56 కేజీల విభాగంలో బ్రాంజ్ మెడల్ గెలుచుకోగా, కొడుకు ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి సిల్వర్ మెడల్ సాధించాడు. మైండ్ బ్లోయింగ్ ఫైనల్ మ్యాచ్.. నిమిషాల్లో మారిన కామన్వెల్త్ రికార్డ్స్ఫైనల్ మ్యాచ్ లో స్నాచ్ విభాగంలో అజయ్ బాబు 145 కేజీలు ఈజీగా లిఫ్ట్ చేసి, నెక్స్ట్ అటెంప్ట్ లో 149 కేజీలు ఎత్తి నయా కామన్వెల్త్ గేమ్స్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత క్లీన్ అండ్ జెర్క్ లో మలేషియా అథ్లెట్ ముహమ్మద్ 181 కేజీలు ఎత్తగా, అజయ్ బాబు కూడా 181 కేజీలు ఎత్తి 330 కేజీల టోటల్ తో గేమ్స్ రికార్డ్ రీ-క్రియేట్ చేశాడు. అయితే ముహమ్మద్ తన లాస్ట్ అటెంప్ట్ లో 184 కేజీలు లిఫ్ట్ చేసి 331 కేజీల టోటల్ తో గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నాడు. 2025 అహ్మదాబాద్ కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్ లో 335 కేజీలు ఎత్తి గోల్డ్ గెలిచిన అజయ్ బాబు, తన సక్సెస్ గ్రాఫ్ ను గ్లాస్గో లోనూ కంటిన్యూ చేశాడు. ఒకే రోజు 6 మెడల్స్ తుఫాన్.. రికార్డుల వేటలో ఇండియా స్టార్స్సోమవారం  సింగిల్ డే లోనే ఇండియా అథ్లెట్లు ఏకంగా 6 మెడల్స్ సాధించి సూపర్ పర్ఫార్మన్స్ చూపించారు. ఉమెన్స్ షాట్‌పుట్ F57 ఫైనల్ లో షర్మిలా ధంకర్ పారా అథ్లెటిక్స్ లో ఇండియాకు హిస్టారిక్ ఫస్ట్ గోల్డ్ మెడల్ అందించింది. వెయిట్‌లిఫ్టింగ్ లో జ్ఞానేశ్వరి యాదవ్, వల్లూరి అజయ్ బాబులతో పాటు మెన్స్ హైజంప్ లో సర్వేష్ కుషారే సిల్వర్ మెడల్స్ సాధించగా, బైండియారాణి దేవి, శిల్పా షైలా బ్రాంజ్ మెడల్స్ గెలుచుకున్నారు. దీంతో ఇండియా ఓవర్‌ఆల్ మెడల్స్ టాలీ 10 కి చేరింది. మీరాబాయి చాను హ్యాట్రిక్ గోల్డ్ మ్యాజిక్.. వెయిట్‌లిఫ్టింగ్ లో 6 మెడల్స్ ధమాకాఇండియా స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను ఉమెన్స్ 48 కేజీల కేటగిరీలో టోటల్ 190 కేజీలు (85 కేజీల స్నాచ్ + 105 కేజీల క్లీన్ అండ్ జెర్క్) లిఫ్ట్ చేసి హ్యాట్రిక్ గోల్డ్ మెడల్ సాధించింది. ఇప్పటివరకు గ్లాస్గో గేమ్స్ లో ఇండియాకి వెయిట్‌లిఫ్టింగ్ విభాగం నుంచి 6 మెడల్స్ రావడం విశేషం. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026 లో ఇండియా మెడల్ విన్నర్స్ కంప్లీట్ లిస్ట్గోల్డ్ మెడల్స్: మీరాబాయి చాను (వెయిట్‌లిఫ్టింగ్ ఉమెన్స్ 48 కేజీలు) - 190 కేజీల టోటల్ తో గేమ్స్ రికార్డ్. షర్మిలా ధంకర్ (పారా అథ్లెటిక్స్ ఉమెన్స్ షాట్‌పుట్ F57) - హిస్టారిక్ ఫస్ట్ గోల్డ్. సిల్వర్ మెడల్స్: చానంబమ్ రిషికాంత సింగ్ (వెయిట్‌లిఫ్టింగ్ మెన్స్ 60 కేజీలు) - స్నాచ్ లో 121 కేజీల గేమ్స్ రికార్డ్. ముత్తుపాండి రాజా (వెయిట్‌లిఫ్టింగ్ మెన్స్ 65 కేజీలు) - 286 కేజీల టోటల్ లిఫ్ట్. జ్ఞానేశ్వరి యాదవ్ (వెయిట్‌లిఫ్టింగ్ ఉమెన్స్ 53 కేజీలు) - 199 కేజీల టోటల్ తో సిల్వర్. వల్లూరి అజయ్ బాబు (వెయిట్‌లిఫ్టింగ్ మెన్స్ 79 కేజీలు) - 330 కేజీల టోటల్ తో సిల్వర్. సర్వేష్ కుషారే (అథ్లెటిక్స్ మెన్స్ హైజంప్) - మెన్స్ హైజంప్ లో ఫస్ట్ సిల్వర్ మెడల్. బ్రాంజ్ మెడల్స్: ఝాండు కుమార్ (పారా పవర్ లిఫ్టింగ్ మెన్స్ హెవీవైట్) - 190 కేజీల లిఫ్ట్ తో ఫస్ట్ మెడల్. బైండియారాణి దేవి (వెయిట్‌లిఫ్టింగ్ ఉమెన్స్ 58 కేజీలు) - 199 కేజీల టోటల్ లిఫ్ట్. శిల్పా షైలా (పారా అథ్లెటిక్స్ ఉమెన్స్ షాట్‌పుట్ F57) - ఇండియన్ అపీల్ తర్వాత దక్కిన బ్రాంజ్ మెడల్.

    India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను

    Mirabai Chanu Wins Gold at CWG 2026 | కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి గోల్డ్ లభించింది. వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో మీరాబాయి చాను మరోసారి దేశానికి స్వర్ణం సాధించింది. India Gold Medal in Commonwealth Games 2026 | గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌ 2026లో భారత్‌కు తొలి గోల్డ్ మెడల్ లభించింది. స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను వెయిట్‌లిఫ్టింగ్‌లో స్వర్ణం సాధించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో మీరాబాయి పతకం గెలవడం ఇది వరుసగా నాలుగోసారి. గ్లాస్గోలో జరుగుతున్న క్రీడల్లో 48 కిలోల విభాగంలో మీరాబాయి చాను గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు.  మీరాబాయి చాను వరుసగా ఇదివరకే మూడు కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించింది. పవర్ లిఫ్టర్ మీరాబాయి చాను 2018, 2022, ఇప్పుడు 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా గోల్డ్‌ను కైవసం చేసుకుంది. 2014 ఈవెంట్‌లో ఆమె రన్నరప్‌గా నిలిచి రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని తెలిసిందే. 190 కిలోల బరువు ఎత్తిన వెయిట్ లిఫ్టర్ భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను స్నాచ్, క్లీన్ అండ్ జర్క్‌లో మొత్తం 190 కిలోల బరువులు ఎత్తింది. మీరాబాయి ఈ విజయం అద్భుతం అని చెప్పవచ్చు. ఎందుకంటే రెండో స్థానంలో నిలిచిన నైజీరియాకు చెందిన రూత్ న్యోంగ్ కంటే ఏకంగా 22 కిలోల ఎక్కువ బరువు ఎత్తడంవిశేషం. స్నాచ్ రౌండ్‌లో 85 కిలోల బరువు ఎత్తి కామన్వెల్త్ గేమ్స్‌లో మీరాబాయి చాను రికార్డు సృష్టించింది. ఆ తర్వాత ఆమె క్లీన్ అండ్ జర్క్ రౌండ్‌లో 105 కిలోల బరువు ఎత్తింది. ఈ విధంగా ఆమె మొత్తం 190 కిలోల బరువు ఎత్తి గోల్డ్ మెడల్‌ను కొల్లగొట్టింది. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ గెలిచిన రెండో మెడల్ ఇది. ఆమెకు ముందు పురుషుల 60 కిలోల విభాగంలో రిషికాంత్ సింగ్ రజత పతకం నెగ్గాడు.  తొలి ప్రయత్నంలో విఫలం  మీరాబాయి చాను క్లీన్ అండ్ జర్క్ రౌండ్‌లో తొలి ప్రయత్నంలోనే 105 కిలోల బరువు ఎత్తడానికి ప్రయత్నించింది. కానీ విఫలమైంది. రెండో ప్రయత్నంలో ఆమె అంతే బరువు ఎత్తి గోల్డ్‌ మెడల్ ఖాయం చేసుకుంది. ఈ మెడల్‌ను గెలిచి భారత్ పతకాల పట్టికలో ఏడో స్థానానికి చేరుకుంది. భారత్ ఇప్పటివరకు ఒక గోల్డ్, ఒక సిల్వర్, ఒక బ్రాంజ్ మెడల్ సాధించింది. ఇప్పటివరకు మీరాబాయి చాను (గోల్డ్), రిషికాంత్ సింగ్ (సిల్వర్), పారా పవర్‌లిఫ్టింగ్‌లో ఝండు కుమార్ కాంస్య పతకం దక్కించుకున్నారు.   

    Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

    BJP MP Konda Vishweshwar Reddy | జెన్ జీ విద్యార్థులు, సీజేపీ నిరసనలు విదేశీ నిధులతో నడుస్తున్నాయని, విదేశాల్లో అయితే కాల్చి పడేసేవారని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జెన్ జీ (Gen Z) విద్యార్థులు, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన నిరసనలపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో విద్యార్థుల చేత ధర్నా చేయించింది విద్రోహ శక్తులు అని, ఉద్యమంలో పాల్గొన్నది నీట్ రాసిన వారు కాదు.. గూండాలు, రొహింగ్యాలు, ఖలీస్తాన్ వాళ్లు కూడా ఉన్నారని ఆరోపించారు. ఇది భారత్ కనుక పోలీసులు కేవలం లాఠీఛార్జ్ మాత్రమే చేసి వదిలేశారని, విదేశాల్లో అయితే ఇలాంటి నిరసనకారులను కాల్చి పడేసేవారని చేవెళ్ల ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ప్రధాని మోదీని గద్దె దించాలని కుట్ర నీట్ పేపర్ లీకేజ్ అంశాన్ని అడ్డుపెట్టుకుని కొందరు రాజకీయ లబ్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రధాని మోదీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారని, అయితే ఈ ఆందోళనల వెనుక విచ్ఛిన్న శక్తులు పనిచేస్తున్నాయని మండిపడ్డారు. ఢిల్లీలో జరిగిన ధర్నాలో విదేశీ ముస్లింలు, క్రిస్టియన్లు, రొహింగ్యాలు, వేర్పాటు వాదులు పాల్గొన్నారని ఆరోపించారు. నిరసన అంటే తొలిరోజు 50 మంది కూడా రాలేదు బీజేపీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఇంకా మాట్లాడుతూ.. ‘ఢిల్లీలో మా ఇల్లు జంతర్ మంతర్‌కు సమీపంలోనే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం సీజేపీ వారికి ధర్నా చేసేందుకు ఆంక్షలు కూడా విధించలేదు. మూడు వారాల ముందే అనుమతి ఇచ్చింది. అయినప్పటికీ మొదటి రోజు ధర్నాలో కనీసం 50 మంది కూడా కనిపించలేదు. దాంతో వాళ్లు ఫోన్స్ చేసి ఖలీస్తాని వేర్పాటువాదులు, కాశ్మీర్ వాళ్లను పిలిపించారు. ఢిల్లీలో జేఎన్‌యూకు ఫోన్ చేసి విద్యార్థులను రావాలని పదే పదే అడిగారు. ఆ తరువాత అతికష్టమ్మీద 700 మంది విద్యార్థులు కనిపించారు. కానీ సోషల్ మీడియాలో 2 కోట్ల మంది ఫాలోయర్లు ఉంటే పది లక్షల మంది అయినా ఉద్యమంలో పాల్గొనాలి కదా. లేకపోతే కనీసం లక్ష మంది అయినా రావాలి. అలాంటివి ధర్నాలో కనిపించలేదు.  విదేశీ శక్తులు, తుకుడే తుకుడే గ్యాంగ్ ఆధ్వర్యంలో ఉద్యమం సోనమ్ వాంగ్‌చుక్ ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయన లేహ్ లఢఖ్ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. ఆయనతో పాటు జమ్మూకాశ్మీర్ ముస్లింలు, రోహింగ్యాలు, ఖలీస్తాన్ వేర్పాటువాదులు సహా పలు విదేశీ శక్తులు ఉద్యమంలోకి ప్రవేశించాయి. సినిమా స్టార్స్, తుకుడే తుకుడే గ్యాంగ్ ఆధ్వర్యంలోనే ఉద్యమం సాగింది. నేషనల్ కాన్ఫరెన్స్ ఒమర్ అబ్దుల్లా, ఆమ్ ఆద్మీ పార్టీలు, టీఎంసీ మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, డీఎంకే, రాహుల్ గాంధీలు ఈ ఉద్యమంలో చేరారు. ఈ ఉద్యమంలో ధనవంతులు పాల్గొంటే కూడా విదేశాల నుంచి నిధులు వచ్చాయి. అమెరికా లాంటి దేశాల్లో అయితే కాల్చిపడేేసేవాళ్లు..   జంతర్ మంతర్ వద్ద నిరసనలు హింసాత్మకంగా మారడంతోనే పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చిందని సమర్థించారు. మన దేశంలో కనుక కేవలం లాఠీఛార్జ్ మాత్రమే చేశారని.. అమెరికా లాంటి దేశాల్లో అయితే కాల్చి పారేసే వారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ వైపు దూసుకెళ్తే పోలీసులు మాత్రం ఏం చేస్తారు ? శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ పోలీసులను ఛాలెంజ్ చేసేలా అల్లరిమూకలు ప్రవర్తించాయన్నారు. కేంద్రం అనుమతి ఇచ్చిన తరువాత అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నించారని, ఈ ఉద్యమం విదేశీ నిధులతో నడిచిందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. విద్యార్థులను రెచ్చగొట్టి హింసకు ప్రేరేపించిన కాంగ్రెస్ నాయకులతో పాటు, విదేశాల నుంచి ఫండింగ్ తో జరుగుతున్న ఆందోలకు మద్దతు తెలిపిన ఇతర రాజకీయ నాయకులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

    NTR Dragon Update : ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో బాలీవుడ్ స్టార్? - యాక్షన్ సీక్వెన్స్‌పై క్రేజీ అప్డేట్ ఏంటంటే?

    Dragon Updates : ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్ మూవీపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. తాజాగా ఈ సినిమా గురించి క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. NTR Prashanth Neel Dragon Project Shooting Update : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతోన్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్. యూవత్ సినీ ప్రపంచం ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ మూవీలో ఓ కీలకపాత్ర కోసం బాలీవుడ్ స్టార్ మనోజ్ భాజ్‌పేయిని చిత్ర యూనిట్ సంప్రదించినట్లు తెలుస్తోంది. సినిమాకే ఈ రోల్ కీలకం అని తెలుస్తుండగా... ఆయన ఓకే చెబితే నెక్స్స్ షెడ్యూల్‌లోనే ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే భారీ యాక్షన్ పార్ట్స్ కంప్లీట్ కాగా ఈ నెలలో శ్రీలంకలో కీలక సీన్స్ చిత్రీకరించారు. ఇప్పుడు నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలోనే ప్లాన్ చేస్తున్నట్లు టాక్. యురోపియన్ తరహా సెట్‌లో ఓ కీలక యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్‌తో పాటు ఇతర నటులపై హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారట. ఫస్ట్ గ్లింప్స్‌తోనే మూవీలో యాక్షన్ సీక్వెన్స్ వేరే లెవల్ అని అర్థమవుతోంది. ఎన్టీఆర్‌ను ఫ్యాన్స్ ఎలా అయితే చూడాలని అనుకుంటున్నారో అలానే చూపించేలా నీల్ ప్లాన్ చేశారు. లుక్స్, స్టైల్, ఫస్ట్ గ్లింప్స్ అన్నీ భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.  పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రాబోతోన్న డ్రాగన్‌లో ఎన్టీఆర్ ల్యూగర్ (Luger) పాత్రలో నటిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్‌పై ఇదివరకు ఎప్పుడూ చూడని ఓ సరికొత్త ప్రపంచాన్నే ఇందులో చూపించనున్నట్లు గ్లింప్స్ కన్ఫర్మ్ చేసింది. కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లో బ్లడ్ బాత్ ఎన్టీఆర్ మాస్ విశ్వరూపాన్నే చూపించారు. ఓపియమ్ అనే డ్రగ్ కోసం సాగే వార్, అండర్ వరల్డ్ మాఫియా సామ్రాజ్యం బ్యాక్ డ్రాప్‌గా ఈ స్టోరీ సాగనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే, అనిల్ కపూర్, బిజు మీనన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండగా... ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలపై కల్యాణ్ రామ్, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ 11న సినిమా వరల్డ్ వైడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

    This Week Theatrical Releases : శ్రీనివాస మంగాపురం To హాలీవుడ్ అవెయిటెడ్ విజువల్ వండర్ - ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే మూవీస్

    This Week Movies : ఘట్టమనేని వారసుడు జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురంతో పాటు హారర్ థ్రిల్లర్ ఈ వారం థియేటర్లలోకి రానున్నాయి. మరి ఆ మూవీస్ లిస్ట్ ఓసారి చూస్తే... This Week Theatrical Releases Complete List : గత వారం జన నాయగన్, చెన్నై లవ్ స్టోరీ వంటి మూవీస్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయగా... మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. ఈ వారం కూడా యంగ్ హీరోస్ మూవీస్ థియేటర్లలోకి రానున్నాయి. జులై 27 నుంచి ఆగస్ట్ 1 వరకూ థియేటర్లలో రిలీజ్ కాబోయే మూవీస్ లిస్ట్ ఓసారి చూస్తే... శ్రీనివాస మంగాపురం : ఘట్టమనేని వారసుడు, సూపర్ స్టార్ మహేశ్ బాబు అన్న కుమారుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్న మూవీ శ్రీనివాస మంగాపురం. RX100, మంగళవారం మూవీస్ ఫేం అజయ్ భూపతి దర్శకత్వం వహించగా... రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ హీరోయిన్‌గా నటించారు. మోహన్ బాబు, బ్రహ్మాజీ కీలకపాత్రలు పోషించారు. లెజెండరీ నిర్మాత అశ్వనీదత్ సమర్పణలో జెమినీ కిరణ్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. జులై 30న వరల్డ్ వైడ్ మూవీ రిలీజ్ కానుంది. 418 : స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రాబోతోన్న అవెయిటెడ్ హారర్ థ్రిల్లర్ 418. ఈ మూవీకి కీర్తన్ గౌడ దర్శకత్వం వహిస్తుండగా... సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడల్ ప్రధాన పాత్రల్లో నటించారు. జులై 31న వరల్డ్ వైడ్ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. న్యూటన్స్ థర్డ్ లా : సుమంత్, జగపతి బాబు, అవసరాల శ్రీనివాస్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ న్యూటన్స్ థర్డ్ లా (Newtons Third Law). రాజేశ్ కర్ణ దర్శకత్వం వహిస్తుండగా... ఈటీవీ విన్ సహకారంతో కె హరీశ్ నిర్మిస్తున్నారు. సింజిత్ ఎర్రమిల్లి మ్యూజిక్ అందిస్తుండగా... జులై 31న సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. మా రాముడు అందరివాడు : శ్రీరామ్, స్వాతి ప్రధాన పాత్రల్లో నటించిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా మా రాముడు అందరివాడు. యద్దనపూడి మైఖేల్ దర్శకత్వం వహించగా... సుమన్, సమ్మెట గాంధీ, నాగ మహేష్, బాహుబలి ప్రభాకర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. జులై 30న (గురువారం) సినిమా థియేటర్లలోకి రానుంది. స్పైడర్ మ్యాన్ - బ్రాండ్ న్యూ డే : మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి టామ్ హాలండ్ నటిస్తోన్న నాల్గో సోలో మూవీ 'స్పైడర్ మ్యాన్ : బ్రాండ్ న్యూ డే'. డెస్టిన్ డేనియల్ క్రెటిన్ దర్శకత్వం వహిస్తుండగా... జెండయా, సాడీ సింక్, జాకబ్ బటలోన్, మార్క్ రఫాలో తదితరులు కీలకపాత్రలు పోషించారు. వరల్డ్ వైడ్ జులై 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.   STORIES YOU MAY LIKE

    Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు

    సినిమా షూటింగ్‌లో మోకాలికి గాయమై హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటుడు నందమూరి బాలకృష్ణను సీఎం చంద్రబాబు పరామర్శించారు. డాక్టర్లను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. Chandrababu Visits Balakrishna at Hospital | హైదరాబాద్‌: టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ప్రముఖ ఏఐజీ (AIG) ఆసుపత్రికి స్వయంగా వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను పరామర్శించారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఆసుపత్రికి చేరుకున్న సీఎం చంద్రబాబు, డాక్టర్లను అడిగి తన వియ్యంకుడు బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. బాలకృష్ణకు అందిస్తున్న వైద్య సేవలతో పాటు, కోలుకోవడానికి పట్టనున్న సమయం గురించి డాక్టర్లతో ప్రత్యేకంగా చర్చించారు. సర్జరీ సక్సెస్ అయిందని, ఏ ఇబ్బంది లేదని డాక్టర్లు చంద్రబాబుకు తెలిపారు. గాయం, సర్జరీ నుంచి కోలుకోవడానికి తగినంత విశ్రాంతి తీసుకోవాలని బాలకృష్ణకు సూచించారు. కొన్ని రోజులపాటు కార్యక్రమాలు వాయిదా వేసుకోవాలని సూచించిన చంద్రబాబు.. వేగంగా కోలుకుని బాలకృష్ణ తిరిగి ప్రజా జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు. సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న ఏపీ సీఎం చంద్రబాబు రాత్రి 8:40కి ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారని అధికారులు తెలిపారు. షూటింగ్ సమయంలో గాయపడిన నటుడు బాలకృష్ణ కాకినాడ పోర్టు పరిసరాల్లో జరుగుతున్న ఒక సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రమాదవశాత్తు గాయపడ్డారు. యాక్షన్ సీన్స్ చేస్తున్న సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆయన ఎడమ మోకాలి భాగంలో తీవ్రమైన వాపు రావడం, మోకాలి చుట్టూ ఉన్న కణజాలాల్లోకి రక్తం చేరడాన్ని డాక్టర్లు గుర్తించారు. సర్జరీ అవసరమని సూచించారు. వెంటనే మెరుగైన వైద్యం కోసం కాకినాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చి ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. మోకాలి కండరాల్లో ఏమైనా చిన్నపాటి చీలిక ఏర్పడి ఉండవచ్చని భావించిన డాక్టర్ల టీమ్, గత కొన్ని రోజులుగా బాలకృష్ణకు చికిత్స అందిస్తున్నారు. డాక్టర్లు చేసిన సర్జరీ సైతం సక్సెస్ అయినట్లు తెలియడంతో కుటుంబసభ్యులు, నందమూరి ఫ్యాన్స్, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆయన వేగంగా కోలుకుంటున్నారని ఏఐజీ వైద్యులు వెల్లడించారు.  

    GenZ Politics India: నాయకుల్లారా జాగ్రత్త! భారత రాజకీయాన్ని రీ-రైట్ చేస్తున్న జెన్జీ ట్రెండ్ !

    Changing Face of Indian Politics:భారత రాజకీయాల్లో జెన్జీ పెనుమార్పులు సృష్టిస్తోంది. పాత ఓటు బ్యాంకులు, పొలిటికల్ నెరేటివ్‌లకు స్వస్తి పలుకుతూ వీధిలోకి వస్తున్న యువత కొత్త ట్రెండ్ సృష్టించబోతోంది. Gen Z Youth Protests Accountability: భారత రాజకీయాల్లో పాత లెక్కలు, సాంప్రదాయ ఓటు బ్యాంకులు ,  అలవాటైన పొలిటికల్ నెరేటివ్‌లు ఇకపై చెల్లవనే సంకేతాన్ని  జెన్జీ తరం స్పష్టంగా ఇచ్చేసింది. దశాబ్దాలుగా నాయకులు వేసే ఎత్తుగడలు, ఇచ్చే హామీలు, మత-కులాధారిత సెంటిమెంట్లను ఆధారంగా చేసుకుని సాగిన రాజకీయం ముగింపు దిశగా సాగుతోంది. విద్యా వ్యవస్థలో లోపాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు , భవిష్యత్తుపై అభద్రతా భావంతో వీధిలోకి వచ్చిన ఈ యువత.. ప్రతిపక్ష రాజకీయ జెండాలను పక్కనపెట్టి కేవలం తమ డిమాండ్లపై పట్టుబట్టడం ద్వారా సరికొత్త  డిజిటల్ అడ్వర్సరీ అవతారమెత్తింది. అటు అధికార పక్షమైనా, ఇటు ప్రతిపక్షమైనా సరే.. ఈ తరం మూడ్‌ను సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఊహించని రాజకీయ మూల్యం చెల్లించుకోక తప్పదు. జెన్‌ జీ రాజకీయాల్లో ఏ ఒక్క నాయకుడో సూపర్ స్టార్ కాదు! జెన్జీ రాజకీయాల  ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో ఏ ఒక్క నాయకుడో, పార్టీయో ఏకఛత్రాధిపత్యం వహించలేరు. వీరు  నాయకరహిత పోరాటాల ను నమ్ముతారు. నేడు సోషల్ మీడియాలో జరిగే ప్రచారాలు లేదా వ్యాప్తి చెందే విజువల్స్  రైటా? రాంగా  అనే సాంప్రదాయ సత్యశోధన కంటే.. ఆ సమాచారం సృష్టించే ఒక  ఎమోషన్ ప్రాతిపదికన యువత రోడ్లపైకి వస్తున్నారు. ఒక వైరల్ రీల్ లేదా మీమ్ సెకన్లలో లక్షలాది మందిని కనెక్ట్ చేస్తోంది. ప్రభుత్వం యంత్రాంగంతో లాఠీఛార్జ్ చేయించినా లేదా డిజిటల్ సెన్సార్‌షిప్ విధించినా, అది ఆగ్రహాన్ని ఆపలేకపోగా, రివర్స్ ఎమోషన్‌ను రగిలిస్తోందని ఇటీవలి ఢిల్లీ నిరసన పరిణామాలు రుజువు చేశాయి. వారి పోరాటాలను అణచివేయడం కష్టం   జెన్జీల పోరాటాలను అణచివేయడం లేదా కంట్రోల్ చేయడం అత్యంత సంక్లిష్టం. ఎందుకంటే, పాతకాలపు విద్యార్థి సంఘాల్లా వీరికి రాజకీయ పదవుల ఆశలు ఉండవు. ప్రతిపక్షాలు ఈ ఆందోళనలను తమకు అనుకూలంగా మలుచుకుందామని చూస్తే..  మా పోరాటాన్ని పొలిటికల్ నెరేటివ్‌గా మార్చకండి  అని వారిని కూడా దూరం పెడుతున్నారు. ఫలితంగా, అధికార వర్గాలు ఈ పోరాటాలపై "ప్రతిపక్షాల కుట్ర" అనే పాత ముద్ర వేయలేకపోతున్నాయి. ఇది అటు అధికారంలో ఉన్నవారికి, ఇటు ఆశలు పెట్టుకున్న ప్రతిపక్షాలకు సింహస్వప్నంగా మారింది. ఈ తరానికి ఉన్న మరో ప్రధాన లక్షణం అతిత్వరగా స్పందించే నైజం,  జవాబుదారీతనం   డిమాండ్ చేయడం. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల వరకు వేచి చూసే ఓపిక ఈ డిజిటల్ యూత్‌కు లేదు. ఒక ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో జాప్యం, పరీక్ష నిర్వహణలో పారదర్శకత లేకపోవడం లేదా తమ హక్కులను భంగపరిచే ఏ చిన్న నిర్ణయమైనా సరే, వారు తక్షణ పరిష్కారాన్ని కోరుకుంటున్నారు. మంత్రుల రాజీనామాలు, అధికారుల సస్పెన్షన్లు వంటి కఠిన చర్యలు చూసేంత వరకు వీరు వెనక్కి తగ్గడం లేదు. రాజకీయ నాయకులు తమ మీడియా బ్రీఫింగ్‌లు, పబ్లిసిటీ స్టంట్‌లతో వీరిని మభ్యపెట్టలేరని స్పష్టమైంది. జెన్‌జీతో రాజకీయ పార్టీలు జాగ్రత్తగాఉండాల్సిందే! రాబోయే రోజుల్లో ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ప్రతీ నిర్ణయంలోనూ ఆచి తూచి వ్యవహరించాల్సిందే. "మాకు తిరుగులేదు, మా ఓటు బ్యాంక్ పద్రంగా ఉంది" అనుకునే భావజాలం ఇక పనిచేయదు. నాయకులు చేసే ప్రతీ ప్రసంగం, తీసుకునే ప్రతీ నిర్ణయం క్షేత్రస్థాయిలో ఉన్న లక్షలాది జెన్జీల స్మార్ట్‌ఫోన్‌లలో రీఫ్రేమ్ అవుతోంది. విద్యార్థులను, యువతను రెచ్చగొట్టేలా మాట్లాడితే లేదా వారి సమస్యలను తేలికగా తీసిపారేస్తే.. ఆ వ్యాఖ్యలే వారికి వ్యతిరేకంగా బిగ్గెస్ట్ పొలిటికల్ అస్త్రాలుగా మారుతున్నాయి. భారత రాజకీయ రంగం  సిస్టమ్ వర్సెస్ పీపుల్  నుంచి  సిస్టమ్ వర్సెస్ జెన్జీ గా రూపాంతరం చెందుతోంది. సిద్ధాంతాల కంటే పారదర్శకతకే ఓటు వేసే ఈ తరం, రాబోయే రోజుల్లో ప్రతి రాజకీయ నాయకుడినీ బాధ్యతాయుతంగా మార్చక తప్పని పరిస్థితిని తీసుకొచ్చింది. కాబట్టి, నేతలు వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాటా అత్యంత జాగ్రత్తగా లేకపోతే.. జెన్జీ రగిల్చే పొలిటికల్ తుఫానులో కొట్టుకుపోక తప్పదు! 

    Paper Leak New Bill: పేపర్ లీక్‌ బిల్లు.. బాధ్యులకు 10 సంవత్సరాల జైలు శిక్ష, 1 కోటి రూపాయల జరిమానా !

    PM Modi on NEET Paper Leak | పేపర్ లీక్ కు వ్యతిరేకంగా బిల్లు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.1 కోటి వరకు జరిమానా విధించాలని కేంద్రం భావిస్తోంది. న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పేపర్ లీక్‌లను అరికట్టేందుకు బిల్లు తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఉన్న కాపీయింగ్ వ్యతిరేక చట్టాలను మరింత కఠినతరం చేయనున్నారు. భవిష్యత్తులో పేపర్ లీక్ చేయాలంటేనే భయపడిపోయేలా యాంటీ పేపర్ లీక్ చట్టాన్ని తీసుకువచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, పేపర్ లీక్‌లపై ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన బిల్లులోనే సవరణలు చేసి నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నారు. నీట్ పేపర్ లీక్‌లపై ఢిల్లీలో జరుగుతున్న నిరసనల తర్వాత 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అన్యాయమైన మార్గాల నివారణ) చట్టం, 2024'లో సవరణలు తీసుకురావాలని మోదీ సర్కార్ యోచిస్తోంది. గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, కోటి రూపాయల జరిమానా..పేపర్ లీక్‌లు అడ్డుకునే బిల్లులో ప్రతిపాదిత సవరణలకు శుక్రవారం (జూలై 24) జరగనున్న క్యాబినెట్ సమావేశంలో ఆమోదం లభించవచ్చు. కొత్త సవరణల తర్వాత, పేపర్ లీక్‌లో దోషులుగా తేలిన వారికి గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష, 1 కోటి రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. అయితే, దీనిపై కేబినెట్ భేటీ తరువాతే క్లారిటీ రానుంది. కాక్రోచ్ జనతా పార్టీ నేతలతో కేంద్ర మంత్రులు చర్చలు ప్రారంభించారు. ముఖ్యంగా సీజేపీ నేతలు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సహా 3 డిమాండ్లను కేంద్రం ముందుంచారు. పేపర్ లీక్ బిల్లును ప్రస్తావించిన ప్రధాని మోదీ విద్యార్థుల నిరసనలపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అర్ధరాత్రి కీలక ప్రకటన చేశారు. వీడియోలో ఆయన మాట్లాడుతూ, 'పేపర్ లీక్ ఘటన సాధారణ విషయం కాదు. గత రెండున్నర నెలలుగా దీనిపై చర్యలు తీసుకున్నాం. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల కోసం ఆదేశాలు ఇచ్చాను. పలు శాఖలు నాకు అర్ధరాత్రి ఒక ప్రతిపాదనను అందించాయి. ఈ ప్రతిపాదనపై శుక్రవారం కేంద్ర క్యాబినెట్‌లో చర్చ జరుగుతుంది. క్యాబినెట్ సహచరుల సూచనల తర్వాత పేపర్ లీక్ బిల్లుపై తుది ప్రకటన చేస్తాం. ఆ బిల్లును వీలైనంత త్వరగా సభలో ఆమోదింపజేయడానికి ప్రయత్నిస్తాం' అని అన్నారు.   పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అన్యాయమైన మార్గాల నివారణ) చట్టం, 2024 ప్రకారం పేపర్ లీక్ కేసులలో 3 నుండి 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 10 లక్షల  వరకు జరిమానా విధించే రూల్ ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనిని మరింత కఠినతరం చేయడానికి సిద్ధమవుతోంది. లేకపోతే కొత్త బిల్లు ప్రవేశపెట్టి కఠిన చర్యలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్త సవరణలు ఏమేం ఉండవచ్చు? కేసుల వేగవంతమైన విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు ఎక్కువ అధికారాలు ఇవ్వనున్నారు. గతంలో 3 నుండి 5 సంవత్సరాల జైలు శిక్ష.. కొత్త బిల్లు ద్వారా ఇప్పుడు 5 నుండి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు.  గతంలో విధించే జరిమానా మొత్తాన్ని 10 లక్షల నుండి 1 కోటి రూపాయల వరకు పెంచవచ్చు.

    Jhandu Kumar In Commonwealth Games: కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!

    Commonwealth Games 2026 India:గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ రెండో రోజున పలువురు భారత అథ్లెట్లు అద్భుతంగా రాణించారు. పారా-పవర్‌లిఫ్టర్ ఝండు కుమార్ దేశానికి మొదటి పతకాన్ని గెలుచుకున్నాడు. Jhandu Kumar:2026 కామన్వెల్త్ క్రీడల రెండో రోజున, పారా-పవర్‌లిఫ్టింగ్‌లో కాంస్య పతకం సాధించిన ఝండు కుమార్ భారత్‌కు అతిపెద్ద విజయాన్ని అందించాడు. పారా-పవర్‌లిఫ్టింగ్‌లో దేశానికి తొలి పతకాన్ని సాధించి ఝండు చరిత్ర సృష్టించాడు. జీవితంలో ఎన్నో సవాళ్లను అధిగమించి ఈ స్థాయికి చేరుకున్న అతని ప్రయాణం స్ఫూర్తిదాయకం. ఇది అతనికి తొలి అంతర్జాతీయ పతకం. ఝండు కుమార్ బిహార్‌కు చెందిన ఒక రైతు బిడ్డ. ఝండు తన జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు, కొన్నిసార్లు తన కుటుంబాన్ని పోషించడానికి కూరగాయలు కూడా అమ్మాడు. ఆ తర్వాత, అతను ఈ-రిక్షా కూడా నడిపాడు. అయినా సరై ఆటపై తనకు ఉన్న ఆశను చంపుకోలేదు. అతను నిరంతరం కష్టపడి పనిచేశాడు, ఇప్పుడు ఆ కష్టానికి ఫలితం లభించింది. మహోన్నతమై వేదికపై పతకం గెలిచి దేశానికి కీర్తిని తెచ్చాడు. పారా-పవర్‌లిఫ్టింగ్‌లో దేశానికి తొలి పతకాన్ని ఝండు కుమార్ సాధించాడు. పురుషుల హెవీవెయిట్ విభాగంలో ఝండు కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. అతను 181, 190 కిలోగ్రాముల బరువులను విజయవంతంగా ఎత్తి, 130.9 పాయింట్లు సాధించాడు. 196 కిలోగ్రాముల వద్ద అతని చివరి ప్రయత్నం విఫలమైంది. ఈ ఈవెంట్‌లో నైజీరియాకు చెందిన ఇద్రిస్ రిలువాన్ స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా, మాథ్యూ హార్డింగ్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. అశోక్ మాలిక్ పతకాన్ని కోల్పోయాడు. అతను పురుషుల లైట్‌వెయిట్ పారా పవర్‌లిఫ్టింగ్ ఈవెంట్‌లో 143.8 స్కోరుతో నాల్గో స్థానంలో నిలిచాడు. పరంజీత్ కుమార్ 135.6 స్కోరుతో ఏడో స్థానంలో నిలిచాడు. కార్తీక్ పురుషుల 100 మీటర్ల ఫ్రీస్టైల్ ఎస్13 పారా స్విమ్మింగ్ ఈవెంట్ ఫైనల్‌లో నాల్గో స్థానంలో నిలిచాడు.

    Thanuja Puttaswamy: మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?

    Bigg Boss Thanuja Puttaswamy: 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9తో పాపులరైన కన్నడ అమ్మాయి, సీనియర్ నటి తనూజ పుట్టస్వామి. తనపై వస్తున్న ట్రోల్స్ విషయంలో గట్టిగా ఇచ్చిపడేసింది. 'బిగ్ బాస్' తెలుగు రియాలిటీ షో సీజన్ 9 ద్వారా పాపులరైన కన్నడ నటి, సీరియల్ ఆర్టిస్ట్ తనూజ పుట్టస్వామి (Thanuja Puttaswamy). ఇటీవల కాలంలో తన మీద సోషల్ మీడియాలో ఎక్కువైన విమర్శలు, ట్రోల్స్‌పై ఘాటుగా స్పందించారు. 'బిగ్ బాస్ 9'లో తనూజ రన్నరప్‌గా నిలిచి సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలు టీవీ షోలు, కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. కొంత కాలంగా సోషల్ మీడియా వేదికగా తనూజ క్యారెక్టర్‌ను బ్యాడ్ చేసేలా కామెంట్లు వస్తున్నాయి. వాటిపై ఆవిడ మౌనం వీడారు. ట్రోలర్లకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. మేమంతా బాగున్నాం... కానీ మీరే!తనూజాకు వ్యతిరేకంగా 'ముద్ద మందారం' (MM) టీమ్ సభ్యులు చాలా కుట్రలు పన్నారని... కళ్యాణ్ పడాల వచ్చిన తర్వాత పవన్ సాయిని ఆమె పూర్తిగా దూరం పెట్టారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. వాటిపై స్పందిస్తూ... ''బిగ్ బాస్ షో ముగిసి ఏడు నెలలు దాటినప్పటికీ ఇంకా దాని గురించే మాట్లాడుకోవడం విడ్డూరంగా ఉంది. షోలో పోటీ, గొడవలు ఉండవచ్చు, కానీ బయటకు వచ్చాక మేమంతా బాగున్నాం. ఒకరి సంతోషాలను, బాధలను మరొకరం పంచుకుంటున్నాం. మాకు లేని బాధ మీకెందుకు?" అని తనూజ సూటిగా ప్రశ్నించారు.కళ్యాణ్ పడాలకు ఒకానొక సమయంలో సమస్య ఎదురైతే... ఆ విషయంలో తనూజ పుట్టసామి సహాయం చేశారు. ఆ విషయం గురించి కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు. ''ఆ సమయంలో కళ్యాణ్ కు సహాయం చేయడానికి నేను పవన్ సాయి (PS)కే ఫోన్ చేశా. పవన్ సాయి కూడా ఎంతో చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించడంలో చాలా సాయం చేశారు'' అని తనూజ తెలిపారు. తన కుటుంబానికి కళ్యాణ్ పడాల బాగా తెలుసు అని, తమ మధ్య మంచి బాండింగ్ ఉందని స్పష్టం చేశారామె. పవన్ సాయి, హరితమ్మ వాళ్ళ పనుల్లో నిమగ్నమై ఉన్నారని... వాళ్ళను అనవసరంగా వివాదాల్లోకి లాగవద్దని తనూజ రిక్వెస్ట్ చేశారు.నెగిటివ్ కామెంట్లు చేసే వాళ్ళకు పనీ పాట లేదని... ఖాళీగా ఉంటే ఆశ్రమానికి వెళ్లి మెడిటేషన్ చేసుకోవాలని తనూజ ఎద్దేవా చేశారు. అభిమానులకు ఓ విన్నపం చేశారు. ''సోషల్ మీడియాలో నా మీద వచ్చే నెగిటివ్ పోస్ట్‌లను నాకు పంపించవద్దు. అవి చూసి నేను డిస్టర్బ్ అవుతాను'' అని అభిమానులకు తనూజ చెప్పారు. ప్రతి ఒక్కరినీ గౌరవించాలని, వ్యక్తులపై ద్వేషాన్ని పెంచకుండా ప్రశాంతంగా జీవించాలని చెప్పుకొచ్చారు. తన వ్యక్తిగత సంబంధాల గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని ట్రోలర్లపై తనూజ ఫైర్ అయ్యారు.  

    Jana Nayagan Box Office Collection Day 2: 'జన నాయకుడు' కలెక్షన్లు... రెండో రోజు ఢమాల్... విజయ్ సినిమాకు భారీ డ్రాప్!

    Jana Nayakudu Box Office Collection Day 2: బాక్సాఫీస్ బరిలో 'జన నాయకుడు' ఎదురీదుతోంది. రెండో రోజు సినిమా కలెక్షన్స్ భారీగా తగ్గాయి. మొదటి రోజుతో కంపేర్ చేస్తే డ్రాప్ కనిపించింది. Thalapathy Vijay Jana Nayakudu Two Days Box Office Collection: తమిళనాడు ముఖ్యమంత్రి, అభిమానుల దళపతి విజయ్ కథానాయకుడిగా నటించిన సినిమా 'జన నాయకన్'. బాక్సాఫీస్ బరిలో మొదటి రోజు అద్భుతమైన వసూళ్ళు సొంతం చేసుకుంది. రెండో రోజు వసూళ్ళ వేటలో ఎదురీదింది. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా రెండు రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది? రెండో రోజు కలెక్షన్స్ ఎంత? అనేది చూస్తే... 'జన నాయకుడు' రెండు రోజుల కలెక్షన్లు!'జన నాయకన్'ను తెలుగులో 'జన నాయకుడు'గా విడుదల చేశారు. హిందీలో 'జన నేత' పేరుతో విడుదలైంది. బాక్స్ ఆఫీస్ బరిలో ఈ సినిమా రెండో రోజు ఢమాల్ అన్నది. కలెక్షన్స్ రాబట్టడంలో, జనాలను థియేటర్లకు రప్పించడంలో ఫెయిల్ అయ్యింది. రెండో రోజు కలెక్షన్స్ చూస్తే... 'జన నాయకుడు'కు రెండో రోజు ఇండియాలో రూ. 21.15 కోట్ల నెట్ వచ్చింది. ఫస్ట్ డే నెట్ కలెక్షన్లు (రూ. 42.70 కోట్లు)తో కంపేర్ చేస్తే... 50.50 శాతం తగ్గాయి. రెండు రోజుల్లో ఇండియాలో 'జన నాయకుడు' నెట్ కలెక్షన్లు రూ. 63.85 కోట్లు. గ్రాస్ విషయానికి వస్తే... రూ. 75 కోట్లు. ఓవర్సీస్ మార్కెట్ కలెక్షన్స్ చూస్తే... రెండు రోజు రూ. 10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. దాంతో రెండు రోజుల 'జన నాయకుడు' ఓవర్సీస్ గ్రాస్ రూ. 37.50 కోట్లకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో 'జన నాయకుడు' రూ. 112.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలుగులో కలెక్షన్స్ ఎలా ఉన్నాయ్?'జన నాయకుడు'కు రెండో రోజు తమిళ వెర్షన్ నుంచి అత్యధికంగా రూ. 17.95 కోట్లు వచ్చాయి. హిందీ వెర్షన్ కేవలం రూ. 1.85 కోట్లు కలెక్ట్ చేయగా... తెలుగు వెర్షన్ రూ. 1.35 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. మొదటి రోజు తెలుగులో రూ. 2.75 కోట్ల నెట్ వచ్చింది. రెండో రోజు తెలుగులోనూ వసూళ్ళు భారీగా తగ్గాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు రాష్ట్రాల్లో రెండో రోజు 'జన నాయకుడు'కు రూ. 2 కోట్ల గ్రాస్ వచ్చింది. హైదరాబాద్‌లో 22.5, విశాఖలో 29.5, గుంటూరులో ఎవరూ ఊహించని విధంగా 47.5 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. తమిళంలో ఈవెనింగ్, సెకండ్ షోలకు 60.31 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఫ్లాప్ టాక్ వచ్చినా సరే... తమిళంలో మంచి కలెక్షన్స్ నమోదు చేస్తోంది.

    Chennai Love Story Collections: చెన్నై లవ్ స్టోరీ ఫస్ట్ డే కలెక్షన్లు... కిరణ్ అబ్బవరం సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

    Chennai Love Story Box Office Collection Day 1: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియా జంటగా నటించిన సినిమా 'చెన్నై లవ్ స్టోరీ'. మొదటి రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?  యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన తాజా సినిమా 'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story). ఆయన సరసన శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) కథానాయికగా నటించారు. రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ డ్రామా జూలై 24, 2026న థియేటర్లలో విడుదల అయ్యింది. ముందు రోజు... జూలై 23వ తేదీ రాత్రి పెయిడ్ ప్రీమియర్లు వేశారు. మొదటి రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది? అనేది చూస్తే... 'చెన్నై లవ్ స్టోరీ' @ 7.56 కోట్లుChennai Love Story First Day Collections: పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా 'చెన్నై లవ్ స్టోరీ'కి 3.13 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయని చిత్ర బృందం పేర్కొంది. వాటితో కలిపి... మొదటి రోజు సినిమా కలెక్షన్స్ ఎంత? ఇండియాలో ఎంత? ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఎన్ని కోట్లు వచ్చాయి? అనేది చూస్తే... 'చెన్నై లవ్ స్టోరీ'కి ఇండియాలో మొదటి రోజు సుమారు 4.40 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇండియా గ్రాస్ విషయానికి వస్తే... రూ. 5.06 కోట్లు.  ఓవర్సీస్ మార్కెట్ నుంచి మొదటి రోజు 'చెన్నై లవ్ స్టోరీ'కి రూ. 2.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.తొలి రోజే 'చెన్నై లవ్ స్టోరీ' రూ. 7.56 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేయడం విశేషం. హైదరాబాద్ సిటీలో రెస్పాన్స్ సూపర్!ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో 'చెన్నై లవ్ స్టోరీ' ప్రభావం చాలా అంటే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌ సిటీలో తొలి రోజు సుమారు రూ. 1.73 కోట్ల గ్రాస్ వచ్చింది. తెలంగాణలో మొత్తం మీద వచ్చిన అమౌంట్ రూ. 2.15 కోట్లు. ఆంధ్రప్రదేశ్‌లో 2 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. వైజాగ్ (రూ. 28.51 లక్షలు), విజయవాడ (రూ. 18.53 లక్షలు), గుంటూరు (రూ. 9.04 లక్షలు) వంటి నగరాల్లో మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. కర్ణాటక నుంచి ఈ సినిమాకు 50.12 లక్షల రూపాయలు రావడం విశేషం. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ సంస్థలపై సాయి రాజేష్ నీలం, ఎస్కేఎన్ నిర్మించిన చిత్రమిది. కిరణ్ అబ్బవరం కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ అండ్ బెస్ట్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.