Trophy Celebrations Viral Video: పాక్ బోర్డు చీఫ్‌కు మరోసారి టీమ్ ఇండియా షాక్.. వాటర్ బాటిల్‌తో హర్మన్‌ప్రీత్ సేన వినూత్న సంబరాలు

21 hours ago

శ్రీలంకపై ఘన విజయం సాధించిన భారత మహిళల జట్టు పాకిస్తాన్ బోర్డు చీఫ్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ఆసియా కప్ ట్రోఫీని తిరస్కరించింది. అయిత వేడుక‌ల‌ను భిన్నంగా జ‌రుపుకుంది.

Women In Blue Replicate Men Team Stance In Dubai: మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ పోరులో శ్రీలంకపై 72 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి ఎనిమిదోసారి ట్రోఫీని ముద్దాడిన భారత మహిళల జట్టు ఒక సంచలన నిర్ణయంతో వార్తల్లో నిలిచింది. పురుషుల జట్టు తరహాలోనే హర్మన్‌ప్రీత్ కౌర్ సేన కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా విజేత ట్రోఫీని స్వీకరించేందుకు నిరాకరించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ చారిత్రక విజయం నమోదైన అనంతరం, భారత జట్టు తమ నిర్ణయానికి కట్టుబడి ఉండటంతో నఖ్వీ వేదిక నుంచి వెనుదిరిగాడు. దీంతో జట్టుకు అధికారికంగా ట్రోఫీ అందకపోయినా, మైదానంలో టీమ్ ఇండియా సంబరాలకు ఏమాత్రం లోటు రాలేదు.

వాటర్ బాటిల్‌తో ట్రోఫీ సెలబ్రేషన్స్.. వైరల్ వీడియో
అధికారిక ట్రోఫీ చేతికి రాకపోవడంతో టీమ్ ఇండియా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వినూత్నంగా స్పందించింది. ఒక వాటర్ బాటిల్‌ను ట్రోఫీలా గాల్లోకి ఎత్తుతూ సహచర ఆటగాళ్లతో కలిసి కెమెరాలకు పోజులిచ్చింది. బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియోలో భారత క్రీడాకారిణులు నవ్వులు, కౌగిలింతలతో తమ చారిత్రక విజయాన్ని గ్రాండ్‌గా జరుపుకోవడం కనిపించింది. 2025 మెన్స్ ఆసియా కప్‌లో పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యం తర్వాత భారత పురుషుల జట్టు ప్రారంభించిన ఈ సంప్రదాయాన్ని మహిళల జట్టు కూడా కొనసాగించింది.

దేశ ప్రజల మనోభావాలకే ప్రాధాన్యం.. దేవజిత్ సైకియా క్లారిటీ
ఈ వ్యవహారంపై బీసీసీఐ గౌరవ కార్యదర్శి దేవజిత్ సైకియా పిటిఐతో మాట్లాడారు. "ప్రస్తుత పరిస్థితులు, దేశంలో ఉన్న ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిణామాల మధ్య ఆ పద్ధతిలో ట్రోఫీని అందుకోవడం సరైంది కాదని భావించాం. ఈ విషయాన్ని ముందే ఏసీసీకి స్పష్టంగా సమాచారం అందించాం. ఇది పూర్తిగా మా సంస్థాగత నిర్ణయం మాత్రమే తప్ప, టోర్నమెంట్ లేదా ఆటగాళ్లు లేదా క్రీడకు వ్యతిరేకమైనది కాదు" అని ఆయ‌న‌ పేర్కొన్నారు.

మైదానంలో తగ్గని జోష్.. ఎనిమిదోసారి కిరీటం
రాజకీయ ఉద్రిక్తతల నడుమ మైదానంలో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన పూర్తి ఆధిపత్యం కనబరిచింది. ట్రోఫీ ప్రజెంటేషన్ గందరగోళం పక్కన పెడితే, రికార్డు స్థాయిలో ఎనిమిదో ఆసియా కప్ సొంతం చేసుకున్న భారత అమ్మాయిల ఆటతీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఓవ‌రాల్ గా ప‌దిసార్లు టోర్నీ జ‌రిగితే, ప‌దిసార్లూ ఫైన‌ల్ కు చేరిన టీమిండియా.. ఎనిమిదిసార్లు విన్న‌ర్ గా, రెండుసార్లు ర‌న్న‌ర‌ప్ గా నిలిచింది.   

Click here to Read More
Previous Article
Tim Cook Net Worth: Apple మాజీ సీఈవో టిమ్ కుక్ నికర ఆస్తి విలువ ఎంత? సంస్థలో ఇక నుంచి కొత్త ఇన్నింగ్స్
Next Article
Dhoni CSK Stake: CSKలో 25 శాతం వాటా అడిగాడా..? ధోని షేర్ల వ్యవహారంపై మేనేజ్‌మెంట్ క్లారిటీ!!

Related స్పోర్ట్స్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment