Telangana Section 22A registration guidelines: తెలంగాణలో సెక్షన్ 22-A ప్లాట్లకు రిజిస్ట్రేషన్ల ఊరట - ఆక్రమిత భూములను ఎలా కాపాడతారు ?

1 hour ago

22A prohibited land relaxation: తెలంగాణలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అనుమతులున్న 22-A ఆస్తుల రిజిస్ట్రేషన్లపై రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే చెరువులు, వక్ఫ్ భూములను ఎలా రక్షిస్తారు?

HMDA GHMC DTCP approved plots 22A registration:  రిజిస్ట్రేషన్ల చట్టంలోని  సెక్షన్ 22-A అంశంపై రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రియల్ ఎస్టేట్  , మిడిల్ క్లాస్ ప్లాట్ల యజమానుల్లో రిలీఫ్ కలిగిందింది.  జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ ,  స్థానిక పురపాలక వర్గాలు గతంలోనే చట్టబద్ధమైన ప్లానింగ్ అనుమతులు ఇచ్చి ఉంటే.. సదరు స్థలాలు లేదా భవనాలు నిషేధిత ఆస్తుల  జాబితాలో కనిపించినప్పటికీ వాటి రిజిస్ట్రేషన్లకు తక్షణమే అనుమతి ఇవ్వాలని రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్నాళ్లూ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో తిరగలేక చుక్కలు చూసిన లక్షలాది మంది మధ్యతరగతి కొనుగోలుదారులకు ఇది కొండంత ఊరట నిచ్చిన మాట వాస్తవమే.

నిజమైన నిషేధ భూముల సంగతేంటి? 

అయితే, నాణేనికి రెండో వైపు చూస్తే.. ఈ సడలింపు వెలువడగానే ప్రజల్లో, ముఖ్యంగా పర్యావరణ నిపుణులు, రియల్ ఎస్టేట్ విశ్లేషకుల్లో  సందేహాలు మొదలయ్యాయి.  చట్టబద్ధమైన ప్లానింగ్ అథారిటీల ప్లాన్ లేదా లేఅవుట్ అనుమతి ఉంటే చాలు.. చెరువులు, కుంటలు, బఫర్ జోన్లు, వక్ఫ్ భూములు, అసైన్డ్ మరియు ప్రభుత్వ స్థలాల్లో జరిగిన అక్రమ నిర్మాణాలకు కూడా రిజిస్ట్రేషన్ ద్వారా చట్టబద్ధత వచ్చేస్తుందా?  అనేది ప్రధానమైన సంశయం.గతంలో కొందరు అవినీతి అధికారులు, ప్రైవేటు బిల్డర్లతో కుమ్మక్కై చెరువుల ఎఫ్‌టీఎల్  పరిధిలోనూ, వక్ఫ్ స్థలాల్లోనూ ఏకాంబ్రంగా ప్లానింగ్ అనుమతులు తెచ్చుకున్న దాఖలాలు లేకపోలేదు.

సాంకేతిక సమస్యల కారణంగానే ఇబ్బందులు

 ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న అసలు కారణం, దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది.  ధరణి పోర్టల్,   అంతకుముందు జరిగిన ల్యాండ్ రికార్డుల ల్యాప్స్ వల్ల, సిటీలోని హోల్ సర్వే నంబర్ ఆధారంగా మొత్తం లేఅవుట్‌ను 22-A జాబితాలో పెట్టేశారు. ఉదాహరణకు, ఒక సర్వే నంబరులో 10 ఎకరాల భూమి ఉంటే.. అందులో అర ఎకరం ప్రభుత్వ సీలింగ్ భూమి లేదా అసైన్డ్ ల్యాండ్ ఉందనే కారణంతో, మిగిలిన 9.5 ఎకరాల్లో దశాబ్దాల క్రితం లేఅవుట్ వేసి అనుమతులు పొందిన వెయ్యి మంది అమాయక ప్లాట్ల యజమానుల రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. అటువంటి బాధితులను ఈ నరకం నుంచి కాపాడటమే ఈ నయా పాలసీ ముఖ్య ఉద్దేశం.

బ్లైండ్ అప్రూవల్స్ ఇవ్వడం లేదంటున్న అధికారులు

ఇక ఆక్రమణలను లేదా నిషేధిత ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవడానికి ప్రభుత్వం  బ్లైండ్ అప్రూవల్స్  ఇవ్వడం లేదని స్పష్టం చేస్తోంది. అప్లికెంట్లు కేవలం ప్లానింగ్ పత్రం చూపించడమే కాకుండా, సదరు ఆస్తికి సంబంధించిన పాత చట్టబద్ధమైన లింక్ డాక్యుమెంట్లను   సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, సక్రమమైన ఆస్తులకు మాత్రమే మార్గం సుగమం చేయడానికి ప్రతీ జిల్లాలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్ , హెచ్‌ఎండీఏ, పురపాలక సంస్థ ప్రతినిధులతో కూడిన ప్రత్యేక జిల్లా స్థాయి కమిటీలను   ఏర్పాటు చేశారు. ఈ కమిటీల ద్వారా ఫ్రాడ్ పత్రాలు, ప్రభుత్వ లేదా చెరువు ఆక్రమణ ఆరోపణలు ఉన్న కేసులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఆమోదం తెలపనున్నారు.

అధికారుల పాత్ర కీలకం

 

మరోవైపు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రా  బృందాలు ఒకవైపు ఆక్రమణలను కూల్చేస్తుంటే, మరోవైపు 22-A పేరుతో దశాబ్దాలుగా నలిగిపోతున్న నిజమైన కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ సడలింపు ఇవ్వడం ఒక రకంగా  క్యారెట్ అండ్ స్టిక్ వ్యూహమే అని భావించవచ్చు. ప్రభుత్వ లేదా సహజ వనరుల భూములను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, బ్యూరోక్రసీ లోపాల వల్ల నష్టపోయిన సాధారణ పౌరులకు సకాలంలో ఊరట కల్పిస్తూనే, చెరువులు, అసైన్డ్ భూముల రక్షణపై ప్రత్యేక నిఘా ఉంచుతామని సర్కార్ స్పష్టం చేస్తోంది.  ఈ నిర్ణయం రాత్రికి రాత్రే అన్ని ఆస్తుల ఆక్రమణలకు చెక్ పెట్టడమో లేదా చట్టబద్ధత ఇవ్వడమో చేయదు. అసలైన భూ యజమానులకు ఎన్నాళ్లో నిరీక్షించిన హక్కులను పునరుద్ధరిస్తూనే, దొంగ పత్రాలతో అనుమతులు పొందిన అక్రమార్కులను కట్టడి చేసే బాధ్యత ఇప్పుడు కొత్తగా ఏర్పాటైన జిల్లా కమిటీల పారదర్శకతపై ఆధారపడి ఉంటుంది.

Click here to Read More
Previous Article
Khairatabad Ganesh Immersion: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్‌ మహాగణపతి.. బైబై గణేశా అంటూ వీడ్కోలు పలికిన భక్తులు
Next Article
AP Home Guards: హోంగార్డులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కానిస్టేబుల్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment