AP Home Guards: హోంగార్డులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కానిస్టేబుల్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు

1 hour ago

AP Constable Jobs | ఏపీలో పోలీస్ డ్రైవర్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో హోంగార్డులకు 10 శాతం ప్రత్యేక రిజర్వేషన్ వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు చేయడంతో వారికి ఊరట కలుగుతోంది.

AP Home Guards | అమరావతి: రాష్ట్రంలో సేవలు అందిస్తున్న హోంగార్డుల సంక్షేమం దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానం ద్వారా భర్తీ చేసే పోలీస్ స్టయిఫండరీ కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులలో హోంగార్డులకు 10 శాతం ప్రత్యేక రిజర్వేషన్‌ కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ జీవో జారీ చేసింది. గతంలో ఈ విభాగంలో ఉన్న రిజర్వేషన్ నిబంధనలను సవరిస్తూ తీసుకొచ్చిన ఈ నూతన నోటిఫికేషన్, రాబోయే, ప్రస్తుతం జరుగుతున్న రిక్రూట్‌మెంట్‌లో హోంగార్డులకు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.

మాజీ సైనికులు, ఇతర కేటగిరీలకు ఇచ్చే ప్రత్యేక రిజర్వేషన్లు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. అదే సమయంలో డ్రైవింగ్ సామర్థ్యం కలిగిన హోంగార్డులకు పోలీస్ విభాగంలో శాశ్వత ఉద్యోగ అవకాశాలు దక్కేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
పోలీస్ శాఖలో డ్రైవర్లుగా చేరాలనుకునే హోంగార్డులకు ఈ 10 శాతం కోటా భారీ ఊరటనివ్వడమే కాకుండా, వారి నియామకాలలో ప్రాధాన్యత లభించేలా చేస్తుంది. స్టయిఫండరీ ట్రైనీ కానిస్టేబుల్ (డ్రైవర్) ఎంపిక ప్రక్రియలో హోంగార్డులు ఆ రిజర్వేషన్ కోటాలో అర్హత సాధించి పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో సేవలు అందించేందుకు మార్గం సుగమం చేస్తుంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై హోం గార్డులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Click here to Read More
Previous Article
Telangana Section 22A registration guidelines: తెలంగాణలో సెక్షన్ 22-A ప్లాట్లకు రిజిస్ట్రేషన్ల ఊరట - ఆక్రమిత భూములను ఎలా కాపాడతారు ?
Next Article
Nara Lokesh News: ఏపీలో క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులు చేపట్టండి.. టోరెంట్ గ్రూప్ చైర్మన్‌ను కోరిన మంత్రి నారా లోకేష్

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment