Khairatabad Ganesh Immersion: ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర లైవ్ ఇక్కడ చూడండి.. భారీగా తరలివచ్చిన భక్తులు

1 hour ago

Khairatabad Ganesh Procession | ఖైరతాబాద్ 69 అడుగుల గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైంది. భారీ టస్కర్ వాహనంపై విగ్రహాన్ని సిద్ధం చేసిన నిర్వాహకులు, నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు.

Hyderabad Ganesh Immersion Highlights | హైదరాబాద్‌ నగరంలో గణేశ్ నిమజ్జన కోలాహలం కనిపిస్తోంది. ట్యాంక్ బండ్ పరిసరాలకు భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే పేరుగాంచిన ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైంది. ఇప్పటికే గణేశుడి విగ్రహాన్ని టస్కర్ వాహనంపైకి చేర్చిన నిర్వాహకులు, వాహనం చుట్టూ వెల్డింగ్ పనులను పూర్తి చేశారు. ఈ 69 అడుగుల భారీ గణేష్ విగ్రహ నిమజ్జనం కోసం ఎన్టీఆర్ మార్గ్ వద్ద భారీ క్రేన్లను అధికారులు సిద్ధం చేశారు. ఇందులో ప్రత్యేకంగా కేటాయించిన క్రేన్ నంబర్ 5 వద్ద ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం జరగనుంది. వినాయక చవితి తొలి రోజు నుంచి పూజలు అందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. ప్రభుత్వం సైతం ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటించింది.

వాస్తవానికి ఉదయం 6 గంటలకే ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైంది. ప్రతి ఏడాది శోభాయాత్రకు ముందురోజు రాత్రి ఖైరతాబాద్ గణేషుడ్ని టస్కర్ పైకి ఎక్కించేవారు.  గణేషుడి విగ్రహాన్ని లిఫ్ట్ చేసే క్రేన్‌లో సాంకేతిక సమస్య వచ్చింది. నిమజ్జనం ప్రక్రియలో ఉపయోగించే బాహుబలి క్రేన్ పైప్ విరగడంతో ఈ సమస్య వచ్చినట్లు సిబ్బంది తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల సమయానికి నిమజ్జన ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. 
మరోవైపు, లక్షలాది మంది భక్తుల నడుమ సాగే ఈ గణేశ్ ఊరేగింపు, నిమజ్జన వేడుకల కోసం సిటీ పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నగరం నలుమూల నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్ భక్తులు వస్తుంటారని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని కమిషనరేట్ల పరిధిలో సుమారు 45 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధానంగా భక్తులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చే హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లోనే ప్రత్యేకంగా వెయ్యి మంది పోలీసులను విధుల్లో ఉంచారు.

Click here to Read More
Previous Article
Clove Benefits : లవంగం రోజుకు ఒకటి తింటే ఆరోగ్యానికి కలిగే లాభాలు ఏంటో తెలుసా?

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment