Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమా పెద్దలకు మాత్రమే... ట్రైలర్‌లో ఫస్ట్ సీన్ చూస్తే క్లారిటీ వస్తుందిగా

1 hour ago

Dorothy Censor Talk: కీర్తీ సురేష్ ప్రధాన పాత్రలో కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన 'డోరతీ' సెన్సార్ పూర్తి అయ్యింది. 'ఎ' సర్టిఫికెట్ వచ్చింది. ట్రైలర్ ఫస్ట్ సీన్ చూసిన జనాలకు షాకింగ్ అనిపించలేదు.

మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తమిళ్ సినిమా 'డోరతీ' (Dorothy). ఈ శుక్రవారం (సెప్టెంబర్ 25న) రిలీజ్. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సెన్సార్ బోర్డు) నుంచి 'ఎ' సర్టిఫికేట్ లభించింది. మూవీ ట్రైలర్ చూసిన జనాలకు అదేమీ షాకింగ్ అనిపించలేదు. వై? ఎందుకు? అంటే...

పెద్దల సినిమా చూసే చిన్న పిల్లలు!
'డోరతీ' సినిమాలో సనంత్, రిషికాంత్ హీరోలు. వాళ్ళిద్దరి చిన్నతనం నుంచి పెరిగి పెద్దయిన తర్వాత రౌడీలుగా మారే వరకు సినిమాలో చూపించినట్టు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. వాళ్ళిద్దరి జీవితంలోకి ఓ అమ్మాయి (కీర్తీ సురేష్) వచ్చిన తర్వాత ఏమైంది? ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు - మనస్పర్థలు వచ్చాయి? అనేది స్టోరీ పాయింట్. ఈ కథను దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కాస్త ఘాటుగా తీశారని ట్రైలర్ బట్టి క్లారిటీ వచ్చింది. కొన్నాళ్ళ క్రితం థియేటర్లలో పెద్దల కోసం తీసిన మలయాళ సినిమాలను ప్రదర్శించేవారు. అటువంటి ఓ సినిమాకు చిన్న పిల్లలు వెళ్లినట్టు ట్రైలర్ ప్రారంభంలో చూపించారు. ఓ హీరో కళ్ళు మూసుకుంటే... మరొకరు మనం తర్వాత చేయాలి కాబట్టి చూడమని చెబుతాడు. అందువల్ల, ఈ సినిమాకు సెన్సార్ నుంచి 'ఎ' సర్టిఫికెట్ రావడంలో తప్పేమీ లేదని ట్రేడ్ వర్గాల్లో వినబడుతోంది.
సెన్సార్ బోర్డ్ నుంచి కటింగ్స్ తర్వాత వచ్చిన 'డోరతీ' ఫైనల్ కట్‌ చూస్తే... ఈ మూవీ రన్ను టైమ్ రెండు గంటల 26 నిమిషాల (146 నిమిషాలు) ఉంది. సినిమాలో చూపించిన వయలెన్స్, సమాజంలోని మానవ సంబంధాల వల్ల 'ఎ' సర్టిఫికెట్ వచ్చిందని చిత్ర బృందం చెబుతోంది. ఏది ఏమైనా... కీర్తీ సురేష్ సినిమా పెద్దలకు మాత్రమే. అదీ సంగతి.

Click here to Read More
Previous Article
Anumana Pakshi Review - 'అనుమాన పక్షి' రివ్యూ: ప్రతిదీ అనుమానించే కుర్రాడు... DJ Tillu దర్శకుడి కొత్త సినిమా ఎలా ఉందంటే?
Next Article
Egg Maggi Recipe : ఎగ్ మ్యాగీ రెసిపీ.. ఇలా చేస్తే టేస్టీగా, స్పైసీగా ఉంటుంది.. ఇంట్లోనే చేసుకోండిలా

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment