Paradise KCR Role: కేసీఆర్ బయోపిక్‌కు పర్ఫెక్ట్ యాక్టర్ దొరికేశాడు

1 hour ago

Priyadarshi KCR Role: 'ప్యారడైజ్'లో ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో ప్రియదర్శి నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి. భవిషత్తులో కేసీఆర్ బయోపిక్ తీస్తే ఆయన పర్ఫెక్ట్ అంటున్నారంతా.

Priyadarshi Gets Applause For KCR Role: హీరోగా నేచురల్ స్టార్ నానికి 'ది ప్యారడైజ్' ఎంత పేరు తీసుకు వచ్చిందనేది పక్కన పెడితే... కమెడియన్ కమ్ కథానాయకుడు ప్రియదర్శి పులికొండ (Priyadarshi Pulikonda)కి మాత్రం మంచి పేరు వచ్చింది. ఆయన సీన్స్ నెట్టింట వైరల్ అవ్వడమే కాదు... విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయి. కేసీఆర్ బయోపిక్‌కు పర్ఫెక్ట్ యాక్టర్ దొరికేశాడని అంటున్నారంతా!

పేరుకు శంకరన్న... కానీ గుర్తొచ్చేది కేసీఆరే!
Priyadarshi Role In Nani Paradise Explained: 'ది ప్యారడైజ్' సినిమాలో ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో ప్రియదర్శి పులికొండ కనిపించారు. ఆయన లుక్ చూసిన ప్రతి ఒక్కరికీ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (Kalvakuntla Chandrashekar Rao) గుర్తుకు వస్తారు.
కేసీఆర్ ముక్కు నుంచి హెయిర్ స్టైల్ వరకు... ప్రియదర్శిని చూస్తే ఆయన గుర్తుకు వచ్చేలా డిజైన్ చేశారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఉద్యమం చేశారు. మాట ఇస్తే దాని కోసం ఎంత దూరమైనా సరే వెళతానని ప్రజలకు వాగ్దానం చేయడంతో పాటు దాన్ని నిలబెట్టుకున్న నాయకుడిగా ప్రియదర్శి పాత్రను చూపించారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. కేసీఆర్‌కు ఓ రేంజ్‌లో ఎలివేషన్ ఇచ్చారు.

కేసీఆర్ బయోపిక్‌కు పర్ఫెక్ట్ క్యాండిడేట్!
'ది ప్యారడైజ్' విడుదల ముందు వరకు ప్రియదర్శి క్యారెక్టర్‌కు దర్శక నిర్మాతలు రివీల్ చేయలేదు. సీక్రెట్‌గా ఉంచారు. పెయిడ్ ప్రీమియర్లు చూసిన జనాలు ఆ రోల్ చూసి సర్‌ప్రైజ్ అయ్యారు. ప్రియదర్శి లుక్ ఆడియన్స్ అందరికీ తెలుసు. హాస్యనటుడిగా పలు పాత్రలతో ప్రేక్షకులను నవ్వించారు. 'బలగం' వంటి సినిమాల్లో హీరోగానూ నటించి తన సత్తా చాటారు. 

లుక్ పరంగా ప్రియదర్శి ప్రయోగాలు చేసిన సందర్భాలు అరుదు అని చెప్పాలి. 'ది ప్యారడైజ్' కోసం తన లుక్ పూర్తిగా మార్చేశారు. ప్రోస్థెటిక్ మేకప్ ఉపయోగించి ముక్కు కొంచెం పెద్దగా కనిపించేలా చేశారు. హెయిర్ స్టయిల్ విషయంలోనూ కేసీఆర్‌ను గుర్తు చేశారు. దాంతో 'ప్యారడైజ్' చూశాక... భవిషత్తులో కేసీఆర్ బయోపిక్ తీస్తే, ప్రియదర్శి పర్ఫెక్ట్ ఛాయస్ అనే మాట ప్రేక్షకుల నోటి నుంచి వినబడుతోంది. ఆయన ఆ స్థాయిలో స్టాండర్డ్స్ సెట్ చేశారు. 'ది ప్యారడైజ్' వల్ల లాభపడిన నటీనటులు ఎవరైనా ఉన్నారంటే? అందులో ప్రియదర్శి పేరు ఫస్ట్ వినిపిస్తోందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. కేసీఆర్ బయోపిక్ తీయాలని ప్రయత్నించే దర్శక రచయితలు ప్రియదర్శిని సంప్రదించడం మంచిది. సోనీలివ్ వెబ్ సిరీస్ 'మయసభ'లోనూ కేసీఆర్ రోల్ ఉంటుంది. అందులో చేసిన నటుడు కూడా కేసీఆర్‌ను మ్యాచ్ చేశారు. అయితే, ఆయనకు ఇమేజ్ లేకపోవడం మైనస్.

Click here to Read More
Previous Article
Pumpkin Seeds Benefits : 30 రోజులు గుమ్మడి గింజలు తింటే శరీరంలో జరిగే మార్పులు ఇవే.. బరువు తగ్గుతారా?
Next Article
Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేషుడి దర్శనం బంద్ - శుక్రవారం మధ్యాహ్నంలోపే నిమజ్జనం పూర్తి - ఏర్పాట్లు ఇవే!

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment