Anumana Pakshi Review - 'అనుమాన పక్షి' రివ్యూ: ప్రతిదీ అనుమానించే కుర్రాడు... DJ Tillu దర్శకుడి కొత్త సినిమా ఎలా ఉందంటే?

1 hour ago

Anumana Pakshi Review Telugu: రాగ్ మయూర్ హీరోగా 'డీజే టిల్లు' ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన సినిమా 'అనుమాన పక్షి'. సెప్టెంబర్ 25న విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే?

Rag Mayur Anumana Pakshi Movie Review In Telugu: 'సినిమా బండి'తో రాగ్ మయూర్ మంచి పేరు తెచ్చుకున్నారు. 'కీడా కోలా', 'శుభం' సినిమాల్లో కీలక పాత్రలు చేశారు. ఇప్పుడు ఆయన హీరోగా నటించిన సినిమా 'అనుమాన పక్షి'. మెరిన్ ఫిలిప్ హీరోయిన్. 'డీజే టిల్లు' ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ నిర్మించారు. సెప్టెంబర్ 25న విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకోండి.

కథ (Anumana Pakshi Story): సన్నీ (రాగ్ మయూర్)కు అనుమానం ఎక్కువ. సమయం, సందర్భం లేకుండా ప్రతి క్షణం, ప్రతి విషయంలో అనుమానం వ్యక్తం చేస్తుంటాడు. అటువంటి సన్నీకి ఓ రోజు కశ్మీర్ నుంచి మెసేజ్ వస్తుంది. సన్నీ చేసిన ఓ పని వల్ల నష్టపోతాడు అనంత్ (చరిత్). ఒంటరి అవుతాడు. కశ్మీర్ రమ్మని, లేదంటే ఆత్మహత్య చేసుకుని నీ పేరు రాస్తా అని అనంత్ బెదిరించడంతో వర్మ (ప్రిన్స్), మరొక స్నేహితుడితో కలిసి వెళతాడు.

కశ్మీర్ వెళ్లిన సన్నీకి కన్య (మెరిన్ ఫిలిప్) పరిచయం అవుతుంది. ప్రేమలో పడతాడు. అంతా హ్యాపీ అనుకున్న సమయంలో వర్మ మరణిస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఆ రిసార్టుకు విశాఖ పోలీస్ వాసు (అజయ్), అతని భార్య సుజాత (రాశి) వస్తారు. సుజాతకు ఆత్మలతో మాట్లాడగల శక్తులు ఉన్నాయి. వర్మ మరణించాడని సుజాత పసిగడుతుంది.

వర్మ మృతికి కారణం ఏమిటి? ఆ సమస్య నుంచి సన్నీ ఎలా బయట పడ్డాడు? కన్యతో అతని ప్రేమ కథ సుఖాంతం అయ్యిందా? లేదా? వాసు ఏం చేశాడు? అనేది సినిమా.

విశ్లేషణ (Anumana Pakshi Review In Telugu): సోషల్ మీడియా యుగంలో లైక్స్, కామెంట్స్, షేర్స్ కోసం పరితపించే జనాలు ఎంతో మంది. వైరల్ అవ్వాలని రకరకాల కంటెంట్స్ చేయడం, పోస్ట్ చేయడం, నలుగురిలో నవ్వుల పాలు కావడం... తరచూ కనిపించే దృశ్యాలే. అయితే... వైరల్ అవ్వాలని ప్లాన్ చేస్తే కాలేరు. నిజాయతీగా ప్రయత్నిస్తే, ఆ కంటెంట్ బావుంటే వైరల్ అవుతుంది. అది దర్శకుడు విమల్ కృష అర్థం చేసుకున్నట్టు లేరు. తమ సినిమా విజయం సాధించాలని, సన్నివేశాలు వైరల్ అవ్వాలనే తాపత్రయం తప్ప... కంటెంట్ బావుందా? లేదా? ఈ జోక్ నవ్విస్తుందా? లేదా? అనేది చూసుకోలేదు.

హీరో వరకు ఓ కాన్సెప్ట్ అనుకున్నారు. ప్రతి క్షణం, ప్రతి విషయాన్ని అనుమానించే కుర్రాడు... తన మనసులో మొలకెత్తిన ప్రతి అనుమానాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. ఆ క్యారెక్టరైజేషన్ వరకు ఓకే. కానీ సన్నివేశాల్లో స్టఫ్ ఉండాలి కదా! హీరో వ్యక్తం చేసే అనుమానాలు కానీ, ఆ సన్నివేశాలు కానీ అస్సలు నవ్వించలేదు. పైగా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉన్నాయి. కశ్మీర్ వెళ్లిన తర్వాత కూడా కథలో కథలిక రాలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని ఓ పోలీస్ క్యారెక్టర్ చేసే రీల్స్ మరింత విసుగు తెప్పించాయి. కామెడీ సినిమాలు ప్రేక్షకులకు నచ్చాలంటే సింపుల్ రూల్ ఒక్కటే... జోక్స్ పేలాలి. సన్నివేశాలు నవ్వించాలి. ఈ సినిమాలో ఆ రెండూ జరగలేదు. కామెడీ లేనప్పుడు కథలో లూప్ హోల్స్ మీద ఆడియన్స్ అటెన్షన్ పడుతుంది. ఇందులోనూ అటువంటది జరుగుతుంది. రమ్యను వర్మ ఎందుకు అంత ప్రేమించాడు? మరొకర్ని ప్రేమించిన అమ్మాయి హీరోకి ఎందుకు ముద్దు పెట్టింది? వంటివి రాకపోవు. 

శ్రీచరణ్ పాకాల సంగీతంలో గుర్తుండే పాటలు లేవు. కొన్ని సన్నివేశాల్లో నేపథ్య సంగీతం అసలు నచ్చలేదు. శ్రీచరణ్ మ్యూజిక్ చేశాడంటే నమ్మలేం. దర్శక రచయిత విమల్ కృష్ణ కథ, కథనాల్లో క్లాప్స్ కొట్టి ఎంజాయ్ చేసేంత కామెడీ మోమెంట్స్ లేవు. కెమెరా వర్క్ సోసోగా ఉంది. కశ్మీర్ ఎంట్రీ సన్నివేశాల్లో ఏఐ విజువల్స్ ఎందుకో అర్థం కాదు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టు ఉన్నాయి.

కామెడీ వర్కవుట్ అయితే ఆర్టిస్టులకు పేరు వస్తుంది. అలా జరగలేదు గనుక వాళ్ల ప్రయత్నం వృథా అయ్యింది. రాగ్ మయూర్ వెరైటీ డ్రెస్సింగ్ కొంత రిజిస్టర్ అవుతుంది. కశ్మీర్ సన్నివేశాల్లో అజయ్ కాస్ట్యూమ్స్ కూడా! హీరోయిన్ మెరిన్ ఫిలిప్ తన పాత్రకు తగ్గట్టు నటించారు. ఆమె వల్ల ఆ పాత్రకు యాడ్ అయిన వాల్యూ ఏమీ లేదు. సీనియర్ హీరోయిన్ రాశి, ప్రిన్స్, బ్రహ్మాజీ తదితరులు ఉన్నా ఎవరికీ సరైన సన్నివేశాలు పడలేదు.

Click here to Read More
Previous Article
CSK Big Responsibility: ఫ్లెమింగ్ స్థానాన్ని భర్తీ చేయడం పెద్ద సవాల్.. సీఎస్కే బాధ్యతలపై తొలిసారి నోరు విప్పిన జహీర్ ఖాన్
Next Article
Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమా పెద్దలకు మాత్రమే... ట్రైలర్‌లో ఫస్ట్ సీన్ చూస్తే క్లారిటీ వస్తుందిగా

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment