Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Reduce Blood Sugar Levels : మందులు లేకుండానే షుగర్ లెవెల్స్ తగ్గాలా? రోజుకు 15 నిమిషాలు ఈ పని చేస్తే చాలు అంటున్న నిపుణులు

    6 hours ago

    Easy Trick to Reduce Blood Sugar Spikes : రోజుకు కేవలం 15 నిమిషాల నడిస్తే.. రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ అవుతాయా? డాక్టర్లు ఏమంటున్నారు.. నడకకు, మధుమేహానికి ఉన్న లింక్ ఏంటో చూసేద్దాం. 

    15 Minute Walk Can Help Reduce Blood Sugar : మధుమేహం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్న ఆరోగ్య సమస్యల్లో ఒకటి. షుగర్ ఉన్న చాలామంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి మందులపై ఆధారపడుతుంటారు. అయితే లైఫ్​స్టైల్లోని కొన్ని మార్పులు కూడా షుగర్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటి వాటిలో నడక ఒకటి.

    రోజుకు కేవలం 15 నిమిషాలు నడిస్తే.. రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగానే తగ్గించుకోవచ్చని ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ బ్రిజ్‌మోహన్ అరోరా వెల్లడించారు. అసలు నడకకు, మధుమేహానికి ఉన్న సంబంధం ఏంటి? షుగర్ ఎలా కంట్రోల్ అవుతుందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

    నడకతో షుగర్ ఎలా తగ్గుతుంది?

    నడక ప్రారంభించిన వెంటనే శరీరంలోని కండరాలు ఎక్కువ గ్లూకోజ్‌ను ఉపయోగించడం మొదలుపెడతాయి. రక్తంలో ఉన్న చక్కెరను కండరాలు స్పాంజ్‌లా గ్రహిస్తాయని డాక్టర్ అరోరా చెబుతున్నారు. దీంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సహజంగానే తగ్గుతాయి. ఒక వ్యక్తి 15 నిమిషాల నడకతో.. కంటిన్యూయస్ గ్లూకోజ్ మానిటర్ (CGM) డేటాలో గ్లూకోజ్ స్థాయిలు చెక్ చేసుకుంటే.. అది 107 mg/dL నుంచి 96 mg/dLకు తగ్గుతుందని ఆయన వెల్లడించారు.

    భోజనం తర్వాత నడిస్తే..

    భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఈ సమయంలో 10 నుంచి 15 నిమిషాల పాటు నడవడం వల్ల ఆ గ్లూకోజ్‌ను కండరాలు వినియోగించుకుంటాయి. దీంతో భోజనం తర్వాత వచ్చే షుగర్ స్పైక్స్‌ను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ప్రీడయాబెటిస్, టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి ఈ అలవాటు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

    నడక వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు

    నడక కేవలం షుగర్‌ను తగ్గించడమే కాదు.. శరీరంలోని ఇన్సులిన్ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా నడిస్తే.. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్, పొట్ట చుట్టూ ఉండే కొవ్వు క్రమంగా తగ్గుతుంది. ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువు అదుపులో ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుంది. నిద్ర నాణ్యత మెరుగై మానసిక ఆరోగ్యం బాగుంటుంది. 

    ఎక్కువసేపు నడవాలా?

    మంచి ఫలితాలు రావాలంటే గంటల తరబడి నడవాలని అనుకుంటారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజులో గంటలు నడవడం కంటే.. రోజూ 10 నుంచి 15 నిమిషాల నడకతో ప్రారంభించినా మంచి ఫలితాలు కనిపిస్తాయని చెప్తున్నారు. 

    మొదట రోజుకు 10-15 నిమిషాలతో ప్రారంభించండి. వారానికి కనీసం 150 నిమిషాల మోస్తరు వ్యాయామం లక్ష్యంగా పెట్టుకోండి. స్టెప్స్‌ను ట్రాక్ చేయడానికి స్మార్ట్‌వాచ్ లేదా మొబైల్ యాప్ ఉపయోగించండి. ఉదయం, లంచ్ బ్రేక్ లేదా సాయంత్రం వేళల్లో వాక్ చేయండి. రోజుకు 30 నిమిషాలు లేదా 10 వేల అడుగుల లక్ష్యాన్ని పూర్తి చేయండి. నడకకు ముందు, తర్వాత స్ట్రెచింగ్ చేస్తే మంచిది. సౌకర్యవంతమైన షూలు వేసుకోండి. 

    Click here to Read More
    Previous Article
    FIFA World Cup 2026 Prize Money: ఫీఫా 2026 ప్రైజ్ మనీ గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు! టీ20 వరల్డ్ కప్ కంటే 60 రెట్లు ఎక్కువ!
    Next Article
    Indian Seafarers Killed Oman:హొర్మూజ్ సమీపంలో నౌకలపై అమెరికా క్షిపణి దాడులు! ముగ్గురు భారతీయ నావికా సిబ్బంది మృతి!

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment