Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    FIFA World Cup 2026 Prize Money: ఫీఫా 2026 ప్రైజ్ మనీ గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు! టీ20 వరల్డ్ కప్ కంటే 60 రెట్లు ఎక్కువ!

    6 hours ago

    FIFA World Cup 2026 Prize Money: ఫీఫా 2026 మరికాసేపట్లో ప్రారంభం కానుంది. అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నమెంట్‌లో మొత్తం 48 జట్లు పాల్గొంటాయి.

    FIFA World Cup 2026 Prize Money: ఫీఫా ప్రపంచ కప్‌ 2026 భారత్ కాలమానం ప్రకారం గురువారం అర్థరాత్రి  ప్రారంభమవుతుంది. యునైటెడ్ స్టేట్స్, కెనడా, మెక్సికో ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నమెంట్‌లో మొత్తం 48 జట్లు పాల్గొంటాయి. 2026 ఫీఫా ప్రపంచ కప్‌ ప్రారంభానికి ముందు ప్రైజ్‌మనీ గురించి చర్చ జరుగుతోంది. దీనిపై ఫీఫా కీలక ప్రకటన చేసింది.  

    గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బహుమతి చాలా పెంచుతున్నట్టు ఫీపా ప్రకటించింది. 2022 ఫీఫా ప్రపంచ కప్ ఖతార్‌లో జరిగింది. 2022లో అర్జెంటీనా విజేతగా నిలిచింది. 2022 ఫీఫా ప్రపంచ కప్ బహుమతి మొత్తంతో పోలిస్తే, 2026 బహుమతి మొత్తం సుమారు 50 శాతం పెరిగింది. 2026 ఫీఫా ప్రపంచ కప్ ప్రైజ్ మనీ మొత్తం $655 మిలియన్లు, ఇది భారత రూపాయలలో రూ. 6241 కోట్లకు సమానం. 2022 ఫీఫా ప్రపంచ కప్ బహుమతి మొత్తం $440 మిలియన్లు.

    2026 టీ20 ప్రపంచ కప్ విజేత అయిన భారత జట్టు ప్రైజ్ మనీతో పోలిస్తే, 2026 ఫీఫా ప్రపంచ కప్ ప్రైజ్ మనీ సుమారుగా 60 రెట్లు ఎక్కువ. 2026 టీ20 ప్రపంచ కప్‌కు భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది, ఈ మ్యాచ్‌లో భారత జట్టు గెలవడంలో సూర్యకుమార్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు.

    వరుసగా రెండుసార్లు టీ20 ప్రపంచ కప్ గెలిచిన తొలి దేశంగా భారత్ నిలిచింది. అంతేకాకుండా, స్వదేశంలో ట్రోఫీని గెలుచుకున్న తొలి జట్టు కూడా భారతే. 2026 టీ20 ప్రపంచ కప్ ప్రైజ్ మనీ $11.25 మిలియన్లు కాగా, అందులో భారత్‌కు $2.63 మిలియన్లు లభించాయి. భారత రూపాయలలో దీని మొత్తం విలువ ₹24.28 కోట్లు.

    ఫీఫా ప్రపంచ కప్ 2026 బహుమతి డబ్బు పంపిణీ

    • ఛాంపియన్ – రూ. 476 కోట్లు 
    • రన్నరప్ – రూ. 314 కోట్లు
    • మూడో స్థానం – రూ. 276 కోట్లు
    • నాలుగో స్థానం – రూ. 257 కోట్లు
    • క్వార్టర్-ఫైనల్స్ (5వ-8వ స్థానం) – ఒక్కో జట్టుకు రూ. 181 కోట్లు
    • రౌండ్ ఆఫ్ 16 (9వ-16వ స్థానం) – ఒక్కో జట్టుకు రూ. 143 కోట్లు
    • రౌండ్ ఆఫ్ 32 (17వ-32వ స్థానం) – ఒక్కో జట్టుకు రూ. 105 కోట్లు 
    • గ్రూప్ దశ నుంచి నిష్క్రమణ (33వ-48వ స్థానం) – ఒక్కో జట్టుకు రూ. 86 కోట్లు
    Click here to Read More
    Previous Article
    Bharat Future City Hyderabad:ఫ్యూచర్ సిటికి తరలిపోనున్న తెలంగాణ సచివాలయం! సీఎం, డిప్యూటీ సీఎంలకు ఛాంబర్లు సిద్దం!
    Next Article
    Reduce Blood Sugar Levels : మందులు లేకుండానే షుగర్ లెవెల్స్ తగ్గాలా? రోజుకు 15 నిమిషాలు ఈ పని చేస్తే చాలు అంటున్న నిపుణులు

    Related స్పోర్ట్స్ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment