PM Narendra Modi birthday 2026: ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానం - 'సేవా పఖ్వాడా'తో దేశవ్యాప్త ఉత్సవాలు.. వికసిత్ భారత్ వైపు అడుగులు!

59 minutes ago

Modi Birthday: ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు. అంతేనా ప్రజాజీవితంలో 25 ఏళ్ల సుదీర్ఘ పాలనా ప్రస్థానం పూర్తయింది. దేశ రాజకీయాల్లో నరేంద్రమోదీది ప్రత్యేకమైన చరిత్ర.

PM Modi 25 years in public office Gujarat CM to PM:    భారత రాజకీయ చరిత్రలో సుదీర్ఘ కాలం పాటురాజ్యాంగబద్ధమైన ప్రజాపదవుల్లో బాధ్యతలు నిర్వర్తించిన అరుదైన నాయకులలో ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలుస్తారు. సెప్టెంబర్ 17న ఆయన జన్మదినం సందర్భంగా.. గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి ఇప్పటివరకు వరుసగా మూడుసార్లు భారత ప్రధానిగా దేశాన్ని నడిపిస్తూ ప్రజాజీవితంలో పాతికేళ్లు   పూర్తి చేసుకున్న ఘట్టం ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. పాలకుడిగా, దృఢ సంకల్పం ఉన్న సంస్కర్తగా ఆయన చూపిన నాయకత్వ పాఠవాలు భారతదేశాన్ని అంతర్జాతీయ వేదికపై అత్యంత శక్తివంతమైన దేశంగా నిలబెట్టాయి.

 గుజరాత్‌ మోడల్‌తో నరేంద్ర మోదీ రాజకీయ ప్రస్థానం      

నరేంద్ర మోదీ రాజకీయ ప్రస్థానం గుజరాత్‌ మోడల్‌తో నూతన బాటలు పరిచింది. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి.. రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం, మౌలిక వసతుల కల్పన, విద్యుత్ రంగాన్ని పటిష్టం చేయడం ద్వారా గుజరాత్‌ను ఒక పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దారు. ఆ తర్వాత 2014లో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి వరుసగా మూడు దఫాలుగా భారత్‌ను నడిపిస్తూ.. సుపరిపాలన , సుస్థిరాభివృద్ధి , చివరి వ్యక్తి వరకు సంక్షేమం  అనే సూత్రాల ఆధారంగా తనదైన ముద్ర వేశారు.

గ్లోబల్ సౌత్ నేత మోదీ

మోదీ నాయకత్వంలోని 12 ఏళ్ల కేంద్ర పరిపాలన భారతదేశ ఆర్థిక, సామాజిక స్వరూపాన్ని మూలమట్టంగా మార్చివేసింది. డిజిటల్ ఇండియా, జన్‌ధన్ యోజన, ఆయుష్మాన్ భారత్, మేక్ ఇన్ ఇండియా, పిఎం ఆవాస్ యోజన,  బ్‌కా సాత్-సబ్‌కా వికాస్ నినాదంతో చేపట్టిన సంక్షేమ పథకాలు సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను గణనీయంగా పెంచాయి. ఆర్థిక వ్యవస్థ రంగంలో భారతదేశం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడమే కాకుండా, త్వరలోనే మూడో స్థానానికి దూసుకెళ్లేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. గ్లోబల్ సౌత్ నేతగా, జి-20 అధ్యక్షతన సాధించిన దౌత్య విజయాలు మోదీ అంతర్జాతీయ ఇమేజ్‌ను శిఖరాగ్రాన నిలిపాయి.

దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు

ఈ సందర్భంగా ప్రధాని సేవలను, ప్రజాప్రతినిధిగా ఆయన నిర్వర్తించిన 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా సేవా పఖ్వాడా పేరుతో విస్తృత సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రజాసేవయే పరమావధిగా నిర్వహించే ఈ సేవా పఖ్వాడా ద్వారా రక్తదాన శిబిరాలు, ఉచిత ఆరోగ్య తనిఖీ కేంద్రాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, స్వచ్ఛతా హి సేవా పేరుతో విస్తృత పారిశుద్ధ్య డ్రైవ్‌లను చేపడుతున్నారు. రాజకీయ వేడుకగా కాకుండా  జనసేవయే ప్రభు సేవ అనే స్ఫూర్తితో సామాజిక కార్యక్రమాలుగా వీటిని నిర్వహిస్తున్నారు. రక్షణ రంగాన్ని ఆత్మనిర్భర్‌గా మార్చడం, నూతన విద్యా విధానాన్ని తీసుకురావడం, ఆర్టికల్ 370 రద్దు వంటి సాహసోపేత నిర్ణయాల ద్వారా మోదీ ప్రభుత్వం జాతీయ ప్రయోజనాలకు పెద్దపీట వేసింది. 

వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ ప్రయత్నం

 

 వికసిత్ భారత్ 2047  లక్ష్యంగా నవభారత నిర్మాణానికి ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను రూపొందించి, యువతను, స్టార్టప్ రంగాన్ని ముందుకు నడిపిస్తున్నారు. దశాబ్దాల తరబడి ఉన్న మౌలిక వసతుల సమస్యలను అధిగమిస్తూ ఎక్స్‌ప్రెస్‌వేలు, వందే భారత్ రైళ్లు, నూతన విమానాశ్రయాలు వంటి మౌలిక రంగాన్ని శరవేగంగా విస్తరించడంలో ఆయన విజన్ స్పష్టంగా కనిపిస్తుంది.   ప్రజాజీవితంలో 25 ఏళ్లు నిరంతరంగా పదవిలో ఉంటూ ప్రజాదరణను ఏమాత్రం కోల్పోకుండా నిలబెట్టుకోవడం సాధారణమైన విషయం కాదు. నిరంతర శ్రమ, కచ్చితమైన నిర్ణయాధికారం, దేశహితమే ప్రాధాన్యతగా సాగిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్థానం భారతదేశ సమగ్ర పురోగతికి సరికొత్త దిశానిర్దేశం చేస్తోంది. 

Click here to Read More
Previous Article
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
Next Article
CM Vijay Son Jason Sanjay : మా నాన్న సీఎం... ప్రమోషన్స్‌కు రారు... వద్దు కూడా - విజయ్ కొడుకు జాసన్ రియాక్షన్

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment