CM Vijay Son Jason Sanjay : మా నాన్న సీఎం... ప్రమోషన్స్‌కు రారు... వద్దు కూడా - విజయ్ కొడుకు జాసన్ రియాక్షన్

57 minutes ago

Sundeep Kishan Sigma : తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ సంజయ్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్న మూవీ సిగ్మా. సందీప్ కిషన్ హీరోగా చేస్తున్నారు. తెలుగు ప్రమోషన్స్‌లో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

Director Jason Sanjay Reaction On CM Vijay Movies : టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా... తమిళనాడు సీఎం, కోలీవుడ్ స్టార్ విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకత్వంలో రాబోతోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సిగ్మా. ఈ మూవీ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుండగా... తెలుగు ప్రమోషన్స్ కోసం జాసన్ హైదరాబాద్ వచ్చారు. సందీప్ అండ్ టీంతో పాటు ప్రెస్ మీట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సినిమాతోనే ఆయన డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు.

'నాన్న సినిమాల ఇంపాక్ట్'

'మీ తండ్రి విజయ్ సినిమాల ప్రభావం మీపై ఎంత వరకు ఉంటుంది?' అని రిపోర్టర్ ప్రశ్నించగా... కచ్చితంగా ఉంటుందని సమాధానమిచ్చారు జాసన్ సంజయ్. 'సిగ్మా మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ ప్రభావం ఎంతవరకూ ఉంటుందో అందరితో పాటు నాకు తెలుస్తుంది. నా యంగ్ ఏజ్ నుంచి ఆయన సినిమాల ప్రభావం నాపై ఉంది. నా తండ్రి సినిమాలనే కాకుండా సాధారణంగా సినిమాలంటే నాకు చాలా ఇష్టం.

 

అందుకే ఈ రోజు డైరెక్టర్‌గా మారా. యంగ్ ఏజ్‌లో ఓ మూవీ కోసం సెట్స్‌లో ఎంతోమంది కలిసి వర్క్ చేయడం దగ్గరి నుంచి చూశా. అప్పటి నుంచి సినిమా అంటే ఇష్టం పెరిగింది.' అని అన్నారు. ఇక, సిగ్మా మూవీలో సోషల్ ఎలిమెంట్ లేదని... అయితే, ఓ వ్యక్తి తన ఐడెంటిటీ కోసం చేసిన పోరాటమే ప్రధానాంశం అని చెప్పారు. అలాగే, తనకు తెలుగులో మర్యాద రామన్న, మహేశ్ బాబు ఖలేజా మూవీస్ ఇష్టమని తెలిపారు.

'ఆయన సీఎం... ప్రమోషన్స్‌కు రారు'

తమిళనాడు సీఎంగా తన తండ్రి విజయ్‌కు ఎన్నో బాధ్యతలు ఉంటాయని... ఆయన సినిమా ప్రమోషన్స్‌కు రారని తెలిపారు జాసన్ సంజయ్. 'సీఎంగా ఆయనకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి. అందుకే ఆయన సినిమా ప్రమోషన్స్‌కు రారు. అయినా వద్దు కూడా. ఆయన ఫ్యాన్సే నాకిచ్చిన సపోర్ట్. చిన్నప్పటి నుంచీ ఆయన సినిమాలు చూస్తూ పెరిగా. డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. అందుకే ఇటువైపు అడుగులు పడ్డాయి. భవిష్యత్తులో హీరోగానూ చేసే ఛాన్స్ ఉంది.' అని అన్నారు.

జాసన్ సంజయ్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా రాబోతోంది హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సిగ్మా (Sigma). ఈ సినిమాలో సందీప్ సరసన ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా చేస్తున్నారు. రాజు సుందరం, సంపత్ రాజ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఎస్ థమన్ మ్యూజిక్ అందించగా... లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించారు. అక్టోబర్ 2న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click here to Read More
Previous Article
PM Narendra Modi birthday 2026: ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానం - 'సేవా పఖ్వాడా'తో దేశవ్యాప్త ఉత్సవాలు.. వికసిత్ భారత్ వైపు అడుగులు!
Next Article
Anant Nag : నటుడు అనంత్ నాగ్‌కు ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం - ప్రధాని మోదీ సహా ప్రముఖుల విషెష్

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment