Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Apple WWDC 2026: ఆపిల్‌ వాచ్‌ ఓఎస్‌ 27తో కొత్త ఎక్స్‌పీరియన్స్‌! మీ చేతిపై భవిష్యత్‌ టెక్నాలజీ!

    3 hours ago

    ఆపిల్‌ వార్షిక డెవలపర్‌ కాన్ఫరెన్స్‌(WWDC 2026) వేదికగా వినియోగదారుల కోసం విప్లవాత్మక మార్పులు ప్రకటించింది. సరికొత్త వాచ్‌ ఓఎస్‌ 27 అప్‌డేట్ ద్వారా మీ వ్యక్తిగత ఏఐ అసిస్టెంట్‌గా మారబోతోంది.

    • ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో సిరి ఇప్పుడు మీ వ్యక్తిగత విషయాలను అర్థం చేసుకొని మాట్లాడగలదు. 
    • పెరిమోనోపాజ్, మోనోపాజ్ ట్రాకింగ్‌తోపాటు ఏఐ ఆధారిత వర్కౌట్‌ బడ్డీ ఫీచర్లు పరిచయం చేసింది. 
    • లక్విడ్‌ గ్లాస్‌ డిజైన్, సింగిల్ ట్యాప్‌  గెస్టర్‌, డైనమిక్‌ యాప్‌ గ్రిడ్‌తో  వాచ్‌ వాడకం మరింత సులభతరం కానుంది. 

    ఆపిల్‌ వాచ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. WWDC2026లో ఆవిష్కరించింది. వాచ్‌ ఓఎస్‌ 27వినియోగదారుల అనుభవాన్ని పూర్తిగా మార్చేయనుంది. ఈ అప్‌డేట్‌లో అన్నింటికంటే ముఖ్యమైంది సిరిఏఐ. ఇది ఆపిల్  ఇంటెలిజెన్స్‌ శక్తితో పని చేస్తుంది. మునుపటిలా కాకుండా సిరి ఇప్పుడు మీ మాటలను మరింత స్పష్టంగా అర్థం చేసుకుంటుంది. మీరు ఇచ్చే ఆదేశాలను కేవలం పాటించడమే కాకుండా మీ వ్యక్తిగత అవసరాలను బట్టి సమాధానాలు ఇవ్వగలదు. నోట్స్, మెసేజ్‌ల నుంచి సమాచారాన్ని వెలికితీసి మీకు అందిస్తుంది. 

    మీ పర్సనల్ అసిస్టెంట్‌

    సిరి కోసం ఆపిల్ ఒక ప్రత్యేకమైన యాప్‌ను కేటాయించింది.ఇక్కడ మీ మాటలను ఒకే చోట భద్రంగా ఉంటాయి. దీని వల్ల పాత విషయాలను మళ్లీ అడగాల్సిన పని ఉండదు. ఈ ఏఐ ఫీచర్‌ ద్వారా ఈమెయిల్స్‌ పంపడం, ప్లేలిస్ట్‌లను మేనేజ్‌ చేయడం, ట్రావెల్‌ వివరాలను తెలుసుకోవడ వంటివి వాచ్ నుంచే సులభంగా చేయవచ్చు. మరీ ముఖ్యంగా సిరి సూచించే డైనమిక్‌ యాప్ గ్రిడ్‌ మీరు ఎక్కువగా వాడే యాప్‌లను ఆటోమేటిక్‌గా హైలెట్‌ చేస్తుంది. దీని వల్ల సమయం చాలా ఆదా అవుతుంది. 

    ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కు ఏఐ సాయం 

    ఫిట్‌నెస్‌ ప్రియుల కోసం ఆపిల్ వర్కౌట్‌ బడ్డీని అప్‌గ్రేడ్ చేసింది. ఇది మీ గత వర్కౌట్ హిస్టరీ, పేస్‌, డిస్టెన్స్‌ను విశ్లేషించి మీకు తగిన సలహాలు ఇస్తుంది. ఇండోర్‌ రన్నింగ్‌ చేసే వారికి మొబైల్ లేకపోయినా కచ్చితమైన రీడింగ్స్‌ ఇచ్చేలా అల్గారిథమ్స్‌ను మార్చారు. ఇప్పుడు ఇది స్పానిష్‌ భాషను కూడా సపోర్ట్ చేస్తుంది. మహిళల ఆరోగ్యం విషయంలో ఆపిల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. హెల్త్ యాప్‌లో పెరిమోనోపాజ్, మోనోపోజ్‌ లక్షలను ట్రాక్ చేస్తుంది. 

    ఇంటర్‌ఫేస్ మార్పులు 

    యూజర్ల కోసం ఆపిల్ సింగిల్ టాప్ గెస్చర్‌ను ప్రవేశపెట్టింది. కేవలం బొటనవేలు, చూపుడు వేలును కలిపి ఒక్కసారి ట్యాప్‌ చేస్తే స్మార్ట్ స్టాక్ విడ్జెట్స్‌ ఓపెన్ అవుతాయి. లిక్విడ్ గ్లాస్‌ ఇంటర్‌ఫేస్‌ ద్వారా డిస్‌ప్లేపై అక్షరాలు మరింత స్పష్టంగా , కాంట్రాస్ట్‌తో కనిపిస్తాయి. దీని వల్ల చదవడం సులభమవుతుంది. వాలెట్ యాప్‌లో ఇకపై కస్టమ్ పాస్‌లను క్యూఆర్ కోడ్‌ల ద్వారా స్టోర్ చేసుకోవచ్చు. లైబ్రరీ కార్డ్స్‌, మెంబర్‌షిప్ కార్డ్స్‌ అన్నీ మీ వాచ్‌లోనే ఉంటాయి. 

    కాల్‌ కాంటెక్ట్స్‌ 

    ఫోన్ కాల్స్‌  మాట్లాడుతున్నప్పుడు మీకు అవసరమైన సమాచారాన్ని వాచ్ స్క్రీన్‌పైనే చూపిస్తుంది. ఫైండ్‌ మై యాప్‌ను కూడా ఆపిల్ సరళీకరించింది. వ్యక్తులు,పరికరాలు, వస్తువులను ఒకే మ్యాప్‌ ఇంటర్‌ఫేస్‌లో చూడవచ్చు. బ్యాటరీ లైఫ్ పెంచడానికి బ్యాటరీ అప్టిమైజేషన్ రికమండేషన్స్‌ కూడా ఈ కొత్త ఓఎస్‌లో భాగమయ్యాయి. 

    ఏయే మోడల్స్ సపోర్ట్ చేస్తాయి?

    ఈ అద్భుతమైన ఫీచర్లు పొందాలంటే మీ దగ్గర ఆపిల్ వాచ్‌ సిరీస్‌ 10, 11, ఆపిల్‌ వాచ్‌ ఆల్ట్రా 2, 3, ఆపిల్ వాచ్‌ ఎస్‌ఈ 3 ఉండాలి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దీని కోసం మీ ఐఫోన్ ఐఓఎస్ 27తో పని చేస్తూ ఉండాలి. అలాగే ఐఫోన్ 11 లేదా ఆపై మోడల్స్ అవసరం. 

    Click here to Read More
    Previous Article
    Insomnia Treatment: సైడ్‌ఎఫెక్ట్స్‌ లేకుండానే నిద్రలేమి సమస్యకు పరిష్కారం! CBT-Iథెరపీ గురించి పూర్తి వివరాలు ఇవే!

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment