Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    TVK Vijay Education Qualification: కాలేజీ డ్రాపౌట్ నుంచి పొలిటికల్ కింగ్‌గా దళపతి విజయ్ ప్రస్థానం ఇదే.. ఇంతకీ ఏం చదివారంటే

    1 week ago

    Tamil Nadu Election Results 2026 | కాలేజీ చదువు మధ్యలోనే ఆపేసిన దళపతి విజయ్ సినిమాల్లోకి వెళ్లి సూపర్ స్టార్ అయ్యారు. తాజాగా రాజకీయాల్లోకి వచ్చి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించారు.

    చెన్నై: తమిళనాడులో కొత్త రాజకీయం మొదలైంది. ఎన్నికల్లో తక్కువ అంచనా వేసిన రాజకీయ ప్రత్యర్థులకు తన కెపాసిటీ ఏంటో తెలిసేలా చేశాడు టీవీకే అధినేత జోసెఫ్ విజయ్. నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన దళపతి విజయ్ గత ఏడాది తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ స్థాపించి అందరి దృష్టిని ఆకర్షించారు. తాజాగా జరుగుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ పార్టీ టీవీకే ముందంజలో దూసుకెళ్తోంది. అధికార డీఎంకే మూడో స్థానానికి పరిమితం కాగా, అన్నాడీఎంకే అనూహ్యంగా రెండో స్థానంలో కొనసాగుతోంది. విజయ్ పార్టీ టీవీకే 100 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఉండగా, అన్నాడీఎంకే 70 కి పైగా, డీఎంకే 50 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కింగ్ గా నిలిచిన విజయ్ కాలేజీ డ్రాపౌట్ అని తెలిసి అంతా షాకవుతున్నారు. దళపతి విజయ్ అసలు పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. సినిమాలకు గుడ్ బై చెప్పి ప్రజల కోసం రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటిన విజయ్.. అందుకనుగుణంగా వ్యవహరించి తమిళన రాజకీయాల్లో సరికొత్త శక్తిగా ఎదుగుతున్నారు. ఎన్నికల ఫలితాల్లో టీవీకే సత్తా చాటుతుండగా.. ఆయన ఏం చదువుకున్నారని సెర్చ్ చేస్తున్న ఫ్యాన్స్.. కాలేజీ డ్రాపౌట్ అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. సినిమాల్లోకి వచ్చి సక్సెస్ అయిన విజయ్ ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి కింగ్ మేకర్‌గా మారారు. తొలి ఎన్నికతోనే సీఎం రేంజ్‌కు ఎదిగారు. 

    విజయ్ ఎడ్యుకేషన్ వివరాలు..

    టీవీకే అధినేత విజయ్ తన ప్రాథమిక విద్యను చెన్నైలోని కోడంబాక్కంలో ఉన్న ఫాతిమా స్కూల్‌లో పూర్తి చేశారు. తర్వాత ఆయన విరుగంబాక్కంలోని బాలలోక్ స్కూల్‌లో టెన్త్ వరకు చదివారు. చదువులో టాపర్ కాకపోయినా చురుకుగా ఉండేవారు. మంచి మార్కులు తెచ్చుకునే విజయ్ మనస్సు పుస్తకాల కంటే ఎక్కువగా స్టేజ్, కెమెరా వైపు మళ్లేది. ఆయన తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్ సినిమా దర్శకుడు కావడంతో నటన అనేది వారసత్వంగా వచ్చింది. స్కూల్ పూర్తయ్యాక విజయ్ చెన్నైలోని ప్రసిద్ధ లోయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్ కోర్సులో చేరారు. కానీ చదువు కంటే ఆయనకు సినిమాల్లోకి రావాలని కోరిక బలంగా ఉండేది. 

    కాలేజీ డ్రాపౌట్ ఎలా అయ్యారు ?

    కాలేజీ రోజుల్లోనే విజయ్ సినిమాల్లోకి వెళ్లాలని  వైపు మళ్లింది. షూటింగ్‌లు, ఆడిషన్స్ కు వెళ్తూ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు పెంచారు. దాంతో ఈ చదువులు అవి తన కెరీర్ కాదని, సినిమాలే కెరీర్ అని గట్టిగా ఫిక్స్ అయ్యారు. దాంతో విజయ్ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. కాలేజీ చదువు మధ్యలోనే వదిలేసి ఫోకస్ అంతా సినిమాలపైనే పెట్టారు. దాంతో కాలేజీ డ్రాపౌట్‌గా మారారు.

    సినిమాల్లో గుర్తింపు, మంచి స్టార్‌డమ్

    విజయ్ మొదట నటుడిగా నిరూపించుకున్నాడు. ఒక్కో సినిమాతో తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. విజయ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాశాయి. ఈ క్రమంలో దక్షిణాది సినీ పరిశ్రమలలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా నిలిచారు. సినిమాలతో పాటు సమాజంపై కొంత అవగాహన ఉన్న వ్యక్తిగా విజయ్ కి పేరుంది. గత పదేళ్లలో విజయ్ తీసిన సినిమాలు ఆలోచింపజేసేవిగా ఉంటాయి. యువతపై ఆయనకున్న పట్టు, సామాజిక సమస్యలపై బహిరంగంగా మాట్లాడటం సామాన్యులకు మరింత దగ్గర చేశాయి.

    గౌరవ డాక్టరేట్‌తో సత్కారం

    విజయ్ తన డిగ్రీని పూర్తి చేయలేకపోయినా సినిమాల్లో చేసిన కృషిని ఎవరూ విస్మరించలేరు. ఈ క్రమంలో 2007లో డాక్టర్ ఎం.జి.ఆర్. ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్‌తో విజయ్‌ను సత్కరించింది.

     రాజకీయాల్లో సరికొత్త ఇన్నింగ్స్

     

    రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని భావించిన విజయ్ సినిమాకు గుడ్ బై చెప్పాడు. సొంత పార్టీ 'టీవీకే'ను స్థాపించారు. అభ్యర్థుల ఎంపికలో సైతం చురుకుగా వ్యవహరించి నేడు ప్రయోజనం పొందుతున్నారు. ఇటీవల ఎగ్జిట్ పోల్స్ అన్నీ డీఎంకే అధికారం అని చెప్పగా.. వాటిని తప్పు అని నిరూపిస్తూ విజయ్ టీవీకే పార్టీ 100కు పైగా స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణం చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.

    Click here to Read More
    Previous Article
    Tamil Nadu Election Results 2026: తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో కొలత్తూరులో స్టాలిన్‌కు షాక్! డీఎంకే కోటను బ్రేక్ చేసిన విజయ్‌ టీవీకే!
    Next Article
    Rajinikanth: రజనీకాంత్‌పై విజయ్ ఫ్యాన్స్ ట్రోలింగ్... తలైవాది డబుల్ స్టాండర్డ్స్ ఆ?

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment