Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Reduce Sun Tan : చేతులపై ట్యాన్ తగ్గించే హోమ్ రెమెడీస్.. హ్యాండ్స్ నల్లగా మారితే ఈ టిప్స్ ఫాలో అయిపోండి

    1 week ago

    DIY Remedies to Sun Tan : వేసవిలో చాలామంది ఎదుర్కునే సమస్యల్లో టాన్ ఒకటి. ముఖ్యంగా చేతులు బాగా టాన్ అవుతాయి. అయితే వాటిని సహజమైన చిట్కాలతో తగ్గించుకునేందుకు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటో చూసేద్దాం. 

    Home Remedies to Remove Sun Tan : వేసవిలో చేతులు టాన్ అవ్వడమనేది ఎక్కువమందికి ఉండే కంప్లైంయిట్. ముఖ్యంగా బైక్, స్కూటీలు డ్రైవ్ చేసే వారికి చేతులు ఎక్కువగా టాన్ అవుతాయి. ఎంతగా అంటే బాడీ కలర్​కి, చేతులకు ఏమాత్రం సంబంధం ఉండదు. ఈ టాన్​ వదిలించకోవడం కూడా చాలా కష్టం అవుతుంది. కానీ కొన్ని ఇంటి చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. 

    నిమ్మకాయ, తేనె

     

    నిమ్మరసంలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. ఇది ట్యాన్ తగ్గించడంలో మంచి ఫలితాలు ఇస్తుంది. నిమ్మరసం, తేనె సమానంగా తీసుకోవాలి. వాటిని మిక్స్​ అయ్యేలా బాగా కలిపి.. చేతులకు అప్లై చేయాలి. 15 నుంచి 20 నిమిషాలు అలాగే ఉంచి.. తర్వాత చల్లని నీళ్లతో కడగాలి. ఇలా వారానికి మూడు లేదా నాలుగు సార్లు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అయితే వెంటనే ఎండలోకి వెళ్లకపోతే మంచిది. 

    పాలు, పసుపు

    పాలలో ఉన్న లాక్టిక్ యాసిడ్ స్కిన్ ని లైట్ చేస్తుంది. పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. 2 స్పూన్ల పాలు తీసుకుని దానిలో చిటికెడు పసుపు కలపాలి. చేతులకు రాసి 20 నిమిషాలు ఉంచి.. తర్వాత చల్లటి నీళ్లతో కడగాలి. రోజూ రాత్రి పడుకునే ముందు కూడా దీనిని రాసి.. ఉదయాన్నే కడగవచ్చు. 

    కీరదోస జ్యూస్

    కీరదోసకాయలో 95 శాతం నీళ్లు ఉంటాయి. ఇవి స్కిన్ కూలింగ్​కి, ట్యాన్ తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. దీనికోసం కీరదోస ముక్కలను నేరుగా చర్మంపై రబ్ చేయండి. లేదా జ్యూస్ తీసి కాటన్ బాల్​తో అప్లై చేయాలి. 15 నిమిషాలు ఆగి కడిగితే మంచి ఫలితాలు ఉంటాయి. 

    టమాటో, శెనగపిండి

    టమాటో లో లైకోపీన్ ఉంటుంది. ఇది నేచురల్ సన్ ప్రొటెక్టర్​గా పనిచేస్తుంది. దీనికోసం టమాటో గుజ్జులో 1 స్పూన్ శెనగపిండి కలపాలి. చేతులకు రాసి వృత్తాకారంగా స్క్రబ్ చేయాలి. 10 నిమిషాలు ఆగి కడగాలి. ఇలా వారంలో 2 లేదా 3 సార్లు చేస్తే బెటర్. 

    అలోవెరా జెల్

    ట్యాన్ తగ్గించడంలో అలోవెరా వండర్స్ చేస్తుంది. స్కిన్​కి కూలింగ్ ఇచ్చి.. హీలింగ్ చేస్తుంది. తాజా అలోవెరా ఆకు నుంచి జెల్ తీసి.. దానిని నేరుగా చేతులకు అప్లై చేయాలి. రాత్రంతా అలా వదిలేయవచ్చు. ఉదయాన్నే కడిగితే సరిపోతుంది. 

    బంగాళాదుంప జ్యూస్

    బంగాళాదుంపలో ఉన్న కాటకోలేస్ ఎంజైమ్ స్కిన్ ని నేచురల్​గా లైట్ చేస్తుంది. దీనికోసం బంగాళాదుంప స్లైస్ తీసి నేరుగా చర్మానికి అప్లై చేయండి. లేదా రసం తీసి అప్లై చేయండి. 20 నిమిషాలు ఆగి కడగాలి.

    చందనం, రోజ్ వాటర్

    చందనం చర్మానికి కూలింగ్ ఇస్తుంది. ట్యాన్ తగ్గిస్తుంది. ఇది సంప్రదాయ బ్యూటీ సీక్రెట్​గా చెప్పవచ్చు. చందనం పొడిలో రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేయాలి. దానిని చేతులకు అప్లై చేసి 20 నిమిషాలు ఆగి.. చల్లటి నీళ్లతో కడగాలి.

    కాఫీ, కొబ్బరి నూనె స్క్రబ్

    డెడ్ స్కిన్ తొలగించడానికి కాఫీ, కొబ్బరి నూనె స్క్రబ్ సూపర్ ఎఫెక్టివ్​గా చెప్పవచ్చు. 1 స్పూన్ కాఫీ పొడిలో కొబ్బరి నూనె కలపాలి. దానిని చేతులపై స్క్రబ్ చేయాలి. 10 నిమిషాలు ఆగి కడిగితే చాలు. వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేస్తే మంచిది. 

    మరిన్ని టిప్స్

    SPF ఉండే సన్ స్క్రీన్ వాడాలి. ఎండలో వెళ్తే చేతులు కప్పుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. హార్ష్ కెమికల్ సోప్ వాడకూడదు. మాయిశ్చరైజర్ రెగ్యులర్​గా వాడితే మంచిది. ఎండలో ఎక్కువ సేపు ఉంటే ట్యాన్ మరింత డార్క్ అయిపోతుంది. అయితే ఈ టిప్స్ రెగ్యులర్​గా చేస్తేనే రిజల్ట్స్ వస్తాయి. ఒకేసారి టాన్ తొలగాలి అంటే అవ్వదు. కనీసం 2 లేదా 3 వారాలు చేస్తే.. మంచిది. ఇవి మీకు ఇబ్బంది కలిగిస్తాయనుకుంటే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. 

     

     

    గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

    Click here to Read More
    Previous Article
    Beer in Summer : వేసవిలో బీర్ తాగితే నిజంగా కూల్ అవుతారా? సైడ్ ఎఫెక్ట్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
    Next Article
    Tamil Nadu Election Results 2026: తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో కొలత్తూరులో స్టాలిన్‌కు షాక్! డీఎంకే కోటను బ్రేక్ చేసిన విజయ్‌ టీవీకే!

    Related లైఫ్‌స్టైల్ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment