Khairatabad Bypoll Janasena: ఖైరతాబాద్ ఉపఎన్నిక - జనసేన పోటీ చేస్తుందా? పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఏంటి?

1 hour ago

Janasena BJP Alliance Telangana: దానం నాగేందర్ అనర్హతతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. జనసేన పోటీలో ఉంటుందా? బీజేపీతో పొత్తు సాధ్యమేనా? పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారా?

Pawan Kalyan Khairatabad Election:  హైకోర్టు తీర్పుతో దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడటం, తెలంగాణ అసెంబ్లీ ఖైరతాబాద్ స్థానాన్ని ఖాళీగా ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఖైరతాబాద్ ఉపఎన్నిక అనివార్యమైంది.  తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలక పాత్ర పోషిస్తామని, 2029 స్థానిక ఎన్నికలు, అసెంబ్లీ పోరులో గట్టిగా నిలబడతామని పవన్ కళ్యాణ్ ఇటీవల స్పష్టం చేశారు. తెలంగాణ సిద్ధాంతకర్తలు, విద్యార్థి సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ జనసేన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. ఇలాంటి సమయంలో ఖైరతాబాద్ ఉపఎన్నిక రూపంలో జనసేనకు మొదటి అసలైన పరీక్ష ఎదురైంది. పార్టీని తెలంగాణలో సీరియస్‌గా తీసుకోవాలంటే ఖైరతాబాద్ బరిలో నిలవడం తప్పనిసరి. బరి నుంచి తప్పుకుంటే ఆంధ్రకే పరిమితమైన పార్టీ  అనే ముద్రను కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతలు మరింత గట్టిగా వేసే అవకాశం ఉంది.

 బీజేపీ సింగిల్ ప్లాట్‌ఫారమ్  వైఖరి 

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి అధికారంలో ఉన్నప్పటికీ, తెలంగాణ విషయంలో బీజేపీ శ్రేణులు ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ, ఉపఎన్నికల్లో ఎలాంటి పొత్తులు లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని బిజెపి తెలంగాణ నాయకత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. గతంలో గ్రేటర్ హైదరాబాద్  ఎన్నికల సమయంలో చివరి నిమిషంలో జనసేన తప్పుకుని బీజేపీకి మద్దతు ప్రకటించింది. కానీ ఈసారి కూడా అదే పునరావృతమైతే జనసేన ఇక్కడి క్షేత్రస్థాయి క్యాడర్‌ను తీవ్రంగా నిరాశపరిచినట్లవుతుంది.  పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. ఖైరతాబాద్ బరిలో స్వయంగా అభ్యర్థిని దింపితే, బీజేపీతో గ్యాప్ వచ్చే ప్రమాదం ఉంది. పోనీ అభ్యర్థిని నిలబెట్టకుండా బీజేపీకి మద్దతు ప్రకటించి సైలెంట్ అయిపోదామంటే, పొత్తులు వద్దంటున్న బిజెపికే బలవంతంగా మద్దతు ఇస్తున్నారా  అనే విమర్శలు ఇతర పార్టీల నుంచి వస్తాయి. అందువల్ల ఉపఎన్నికలో పోటీ చేయడం ద్వారా తెలంగాణలో తమ స్వతంత్ర ఉనికిని చాటుకోవాలా లేదా సంయమనం పాటించాలా అనే ధర్మసందేహంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు.

 ఖైరతాబాద్ సామాజిక సమీకరణాలు  జనసేనకు లాభమా? 

హైదరాబాద్ నగరంలో ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఆంధ్ర మూలాలు ఉన్న ఓటర్లు  , అలాగే పవన్ కళ్యాణ్‌కు విశేషమైన అభిమాన గణం, యువత, బీసీ ఓటు బ్యాంకు గణనీయంగా ఉంది. పవన్ ప్రచారానికి వస్తే ఆ ప్రభావం ఖచ్చితంగా ఓట్లపై పడుతుంది. బిఆర్ఎస్, కాంగ్రెస్‌లపై అసంతృప్తిగా ఉండి, సాంప్రదాయకంగా బిజెపికి పడని ఓటర్లను ఆకర్షించే అవకాశం జనసేనకు ఉంది. ఖైరతాబాద్ వంటి కీలక స్థానంలో పోటీ చేయాలంటే కేవలం గ్లాస్ గుర్తు ఉంటే సరిపోదు.. గట్టి ఆర్థిక, అంగ బలం ఉన్న అభ్యర్థి కావాలో. స్థానికంగా బలం ఉన్న శ్రేణులను లేదా ఇతర పార్టీల నుంచి అసంతృప్త నేతలను ఆకర్షించి అభ్యర్థిగా నిలబెడితేనే పోరు ఆసక్తికరంగా మారుతుంది. ఒకవేళ క్యాండిడేట్‌ను నిలబెడితే, పవన్ కళ్యాణ్ వచ్చి స్వయంగా ప్రచారం చేయాల్సిందే. అలా చేయని పక్షంలో క్యాడర్‌కి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్, తెలంగాణలో ప్రచారానికి వస్తే వచ్చే రాజకీయ పొలిటికల్ మైలేజ్ అంతాఇంతా కాదు.

  జనసేన తెలంగాణ భవిష్యత్తుకు ఇదే  లిట్మస్ టెస్ట్ 

 

ఖైరతాబాద్ ఉపఎన్నిక ప్రకటనతో జనసేన ఒక కీలక మలుపు వద్ద నిలబడింది. పొత్తులతో సంబంధం లేకుండా పోటీ చేసి తమ నిజమైన ఓటు బ్యాంకు ఎంతో తేల్చుకోవడం ఒక మార్గమైతే, బీజేపీతో సామరస్యంగా చర్చించి ఏకాభిప్రాయానికి రావడం మరొక మార్గం. ఏది ఏమైనా, తెలంగాణలో తన 'సీరియస్‌నెస్'ను నిరూపించుకోవాలంటే పవన్ కళ్యాణ్ ఈ ఉపఎన్నికను తేలికగా తీసుకోలేరు. ఖైరతాబాద్ బరిలో జనసేన మార్క్ ఎలా ఉండబోతోందో రాబోయే కొన్ని రోజుల్లో తేలిపోనుంది. 

Click here to Read More
Previous Article
SIM No Service Problem: మీ ఫోన్‌ "నో సర్వీస్" అని చూపిస్తుందా?.. సిమ్ మార్చే ముందు ఈ సెట్టింగ్‌లను చెక్ చేయండి!
Next Article
Bowling Coach Reunion: చెన్నై గూటికి ఆ జట్టు మాజీ పేసర్ .. జహీర్ ఖాన్ టీమ్‌లోకి బౌలింగ్ కోచ్ గా రీ ఎంట్రీ

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment