Bigg Boss Season 10 Today Promo 2: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: కెప్టెన్సీ పోగొట్టుకున్నా ఆ పదవి కోసం ముకేశ్ గొడవ! చేతులారా చేసుకున్నాడా!

54 minutes ago

Bigg Boss Season 10 Sep 29th Promo 2: ముకేశ్ కెప్టెన్ అపూర్వ తన గదిలోకి అందరికీ పర్మిషన్ ఇస్తుందని గొడవ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ప్రోమో ఆసక్తికరంగా మారింది.

Bigg Boss Season 10 Letest Promo 2: బిగ్‌బాస్ ఇంట్లో నాలుగో వారం టోటల్‌ డామినేషన్‌ మొదలైంది. ఇప్పటికే ఇంట్లో రెండు టీమ్స్‌గా విడదీసిన బిగ్‌బాస్ వాళ్లతో రకరకాల ఆటలు ఆడిస్తున్నారు. ఇక ముకేశ్ విషయానికి వస్తే కెప్టెన్సీ దక్కిందని సంతోషించేలోపే.. ముకేశ్ గౌడ చేతుల్లో నుంచి కెప్టెన్ కుర్చీ జారిపోయింది. కానీ కెప్టెన్సీ పోయిన తర్వాతే ముకేశ్ అసలు ఆట మొదలుపెట్టాడా? అనే ప్రశ్న ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకు ముకేశ్‌ కెప్టెన్‌ అయిన అపూర్వతో పెట్టుకుంటున్న గొడవలే నిదర్శనం. ఈ కెప్టెన్సీ విషయంలోనే తాజాగా అపూర్వతో ముకేశ్ మరో గొడవ పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోని బీబీ టీం విడుదల చేసింది. ఎంతో ఇంట్రస్టింగ్‌గా ఉన్న ఆ  ప్రోమోలో ఏం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
 
ప్రోమోలో ఉంది ఇదే..

మొదటి నుంచీ ముకేశ్ గౌడ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గానే కనిపిస్తూ వచ్చాడు. ‘గుప్పెడంత మనసు’ సీరియల్ ద్వారా వచ్చిన క్రేజ్‌తో హౌస్‌లోకి అడుగుపెట్టిన ముకేష్‌కి మొదటి నుంచే మంచి ఫాలోయింగ్ ఉంది. దానికి తోడు ఫస్ట్ స్టార్ అందుకోవడం.. వెంటనే కెప్టెన్ అవ్వడం.. ఇలా వరుసగా వచ్చిన అవకాశాలతో ముకేశ్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే ఎంత క్రేజ్ వచ్చిందో... అంతే స్థాయిలో నెగిటివ్ ట్రోలింగ్ కూడా ఎదురైంది. మబ్బు, మబ్బేష్ అంటూ కొందరు ముకేష్‌ని ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కెప్టెన్సీ కూడా చేజారిపోవడంతో.. ముకేష్‌లో మరో కోణం బయటకు వస్తున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా మిథిలేష్ 15 లక్షల ప్రైజ్ మనీ తీసుకుని హౌస్ నుంచి వెళ్లిపోయిన సమయంలో ముకేశ్ రియాక్షన్ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. మిథిలేష్ డబ్బులు తీసుకెళ్లిన విషయాన్ని ముకేశ్ తనకు సంబంధించిన విషయంలానే ఫీల్ అయినట్టుగా కనిపించాడు. ఇక ఇప్పుడు కెప్టెన్సీ విషయంలో జరిగిన సంఘటన మరింత ఆసక్తిని పెంచింది. 
తాజా ప్రోమోలో అపూర్వ.. సుధీర్‌ని కెప్టెన్సీ సింహాసనంపై కూర్చోబెడుతుంది. ‘నిన్న నువ్వు ఆడిన ఆటకి ఈ సింహాసనంలో కూర్చునే అర్హత నీకుంది’ అంటూ సుధీర్‌కి చెప్తుంది. అది చూసిన ముకేశ్ మాత్రం వెంటనే ప్రశ్నించాడు. ‘కెప్టెన్ అయిన తర్వాత కదా? అక్కడ కూర్చొవాలి’ అంటూ తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశాడు. దానికి సుధీర్ కూడా వెనక్కి తగ్గకుండా.. ‘కెప్టెన్ ఇష్టం కదా’ తను కూర్చొమంటే కూర్చొన్నా అంటూ సమాధానం ఇచ్చాడు. ఇక అపూర్వ కూడా ముకేశ్ మాటలపై అసహనం వ్యక్తం చేసింది. ‘నేను కెప్టెన్సీ ఎలా చేయాలో కూడా మీరే చెప్తారా?’ అంటూ ముకేష్‌ని ప్రశ్నించింది. కానీ ముకేశ్ మాత్రం ఆ విషయాన్ని అంత తేలిగ్గా వదల్లేదు. సుధీర్‌ని కూర్చోబెట్టడమే కాకుండా.. ఆ తర్వాత వర్షిణిని కూడా అదే సింహాసనంపై కూర్చొని కెప్టెన్ అపూర్వతో మాట్లాడటంతో  ముకేశ్ మరోసారి రియాక్ట్ అయ్యాడు. ‘అతన్ని కూర్చోబెట్టావ్.. ఆమెను కూర్చోబెట్టావ్.. మరి నేను కూడా కూర్చుంటా’ అంటూ అడుగుతాడు. వాళ్లు వాష్‌ రూం వాడుకోవడానికి వచ్చారు అని అపూర్వ అంటే నేను వెళ్లాలి అంటాడు. సరే వర్షిణి వచ్చిన తర్వాత వెళ్లండి అని అపూర్వ అంటే ఆ గదిలో  వెయిట్ చేస్తా అని ముకేశ్ అంటాడు. దానికి అపూర్వ ఒప్పుకోకపోవడంతో చూశావా చూశావా నన్ను వెళ్లనీయడం లేదు అని ముకేశ్ ఝాన్సీతో చెప్పి గొడవ మొదలు పెడతాడు. అక్కడే మాటల యుద్ధం మరో మలుపు తిరిగింది. వర్షిణి కూర్చోవడానికి తన అనుమతి తీసుకుందా? అని ముకేశ్ ప్రశ్నించగా.. అపూర్వ మాత్రం తన అనుమతి తీసుకోలేదని చెప్పింది. దీంతో ముకేశ్ మరింతగా నిలదీశాడు. ఇదే సమయంలో రోహిత్ కూడా మధ్యలోకి రావడంతో.. వ్యవహారం మరింత పెద్దదైంది. ‘ఎందుకు ఫేవరిజం చూపిస్తున్నారు? అందరినీ లోపలికి రానిస్తున్నారు.. నన్ను మాత్రం ఎందుకు రానివ్వడం లేదు?’ అంటూ ముకేశ్ తన అసహనాన్ని బయటపెట్టాడు. అంతేకాదు... కెప్టెన్‌గా అపూర్వ ఉన్నప్పుడు రోహిత్ ఎందుకు మధ్యలోకి వస్తున్నాడంటూ అతనిపైనే ప్రశ్నలు సంధించాడు. దీంతో ప్రోమో పూర్తయిపోతుంది. 
మొత్తానికి ఒక చిన్న సింహాసనం గొడవ.. కెప్టెన్సీ అధికారాలు, ఫేవరిజం, పర్మిషన్ అంటూ పెద్ద రచ్చగా మారిపోయింది. కెప్టెన్సీ ముకేశ్ చేతుల్లో లేకపోయినా.. ఆ కెప్టెన్సీ చుట్టూ జరుగుతున్న గొడవల్లో మాత్రం ముకేశ్ కీలకంగా మారిపోయాడు. మరి కెప్టెన్సీ పోయిన తర్వాత ముకేశ్ గేమ్ ఎలా మారబోతుంది? అతని దూకుడు హౌస్‌లో కొత్త కాంట్రవర్సీకి దారితీస్తుందా? లేక ఇదే అతని గేమ్‌కి కొత్త టర్నింగ్ పాయింట్ అవుతుందా?

Click here to Read More
Previous Article
Onions Price: ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం

Related బిగ్‌ బాస్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment