Bahadurpuga farmers: బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి

11 hours ago

Bahadurpuga farmers: పేదల కడుపు కొట్టి పెద్దలకు పెట్టడమే ఇందిరమ్మ రాజ్యమా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిదని బీఆర్ఎన్ నేత కార్తీక్ రెడ్డి అన్నారు.

Bahadurpuga farmers: రంగారెడ్డి జిల్లా బహదూర్‌గూడ బాధిత రైతులతో తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సమావేశం అయ్యారు. బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు, ఫ్యూచర్ సిటీ పేరిట భూములు కోల్పోతున్న రైతులతో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకుడు కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ.. "బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది. సినిమాలో వాళ్లు గుర్తింపు కోసం కొట్లాడారు, ఇక్కడ రైతులు తమ జీవనాధారమైన భూమి కోసం కోట్లాడుతున్నారు" అని పేర్కొన్నారు.

పోలీసుల పహారా ఎందుకు? 

"బహదూర్‌గూడ భూములు ప్రభుత్వానివే అయితే.. మరి పోలీసుల పహారా ఎందుకని?" కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నాలుగు తరాలుగా భూమిని సాగు చేసుకుంటున్న రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని మండిపడ్డారు. పేదల కడుపు కొట్టి పెద్దలకు పెట్టడమే ఇందిరమ్మ రాజ్యమా అని ప్రశ్నించారు. 

ఫార్మాసిటీ రద్దు పేరుతో మోసం

ఎన్నికలకు ముందు ఫార్మాసిటీని రద్దు చేస్తామని, రైతులకు తిరిగి భూములిస్తామని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ఫార్మా సిటీని ఫ్యూచర్ సిటీగా పేరు మార్చి 30 వేల ఎకరాలను లాక్కుంటున్నారని ఆరోపించారు. ఫ్యూచర్ సిటీలోని భూములన్నీ సీఎం రేవంత్ రెడ్డి తన అన్నదమ్ములకు, అనుయాయులకు కట్టబెడుతూ భూ దందాకు తెరలేపారని ధ్వజమెత్తారు. అసలు పని వదిలిపెట్టి పోలీసులు గద్దల్లా ప్రజల భూములపై పడుతున్న కాంగ్రెస్ నేతలకు వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కేసీఆర్ హయాంలో వెంటనే పరిష్కారం

"బహదూర్‌గూడ రైతుల సమస్య గతంలో కేసీఆర్ దృష్టికి తెచ్చిఉంటే కేవలం 10 నిమిషాల్లో పరిష్కరించేవారు. బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పేరుతో పేదల భూములు కొల్లగొడితే ఊరుకునేది లేదు. ఈ పేదల తరఫున పోరాడేందుకు బీఆర్‌ఎస్‌ ఎప్పుడూ ముందుంటుంది. భూములు కొనడం, అమ్మడమే రేవంత్‌రెడ్డికి తెలిసిన ఏకైక విద్య" అని కేటీఆర్ విమర్శించారు. 

పోలీసులు కాంగ్రెస్ నేతలకు వత్తాసు

"పోలీస్ స్టేషన్లలో పెట్టాల్సింది రౌడీలు, దొంగలు, క్రిమినల్స్ ఫోటోలను.. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల ఫోటోలు పెడుతున్నారు. ఈసారి పోలీసోళ్లు రైతులను ఇబ్బంది పెడితే.. వాళ్ల ఫోటోలు తీసి పెట్టుకోండి. వచ్చేది మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే.. రైతుల జోలికి వస్తే ఏ ఒక్క అధికారిని వదిలేది లేదు. పేదల కడుపు కొట్టడం.. పెద్దలకు పెట్టడమే ఇందిరమ్మ రాజ్యమా? నాలుగు తరాలుగా భూమిని సాగు చేసుకుంటున్న రైతుల భూములను లాక్కుంటున్నారు. పోలీసులు అసలు పని వదిలిపెట్టి.. గద్దల్లా ప్రజల భూములపై పడుతున్న కాంగ్రెసోళ్లకు వత్తాసు పలుకుతున్నారు" - కేటీఆర్

Click here to Read More
Previous Article
YSRCP Leaders Joining Janasena: జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
Next Article
Bone Density : ఎముకలు బలంగా ఉండాలంటే ఏం చేయాలి? బోన్ డెన్సిటీ తగ్గకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment