Bank Employees Strike: బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా, నేటి నుంచి సేవలు యథాతథం

1 hour ago

Bank Employees Strike Postponed |యూ బ్యాంకింగ్ వినియోగదారులకు సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండదని, బ్యాంక్ ఉద్యోగుల సమ్మె తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రకటించాయి.

Bank Employees Strike Deferred | న్యూఢిల్లీ: బ్యాంక్ ఎంప్లాయిస్ సమ్మె చివరి నిమిషంలో వాయిదా పడింది. సోమవారం, మంగళ , బుధవారాల్లో జరగాల్సిన సమ్మెను వాయిదా వేస్తున్నట్టు యునైటెడ్ ఫొరమ్స్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆదివారం రాత్రి ప్రకటించింది. శనివారం సెలవుపై UFBU - ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) కలిసి ఉన్నతస్ధాయి కమిటి ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాయి. ఆ కమిటి నిర్ణయం తరువాత సమ్మెపై తదుపరి కార్యాచరణ ఉంటుందని బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్స్ స్పష్టంచేశాయి. దాంతో సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజులపాటు జరగాల్సిన బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా వేసుకోవడంతో సేవలు యథాతథంగా కొనసాగనున్నాయి. 

కోట్లాది మంది బ్యాంక్ కస్టమర్లు 3 రోజుల సేవల అంతరాయాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న సమయంలో గుడ్ న్యూస్ వచ్చింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) తో జరిగిన  చర్చల అనంతరం యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(UFBU) తమ దేశవ్యాప్త సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసింది. UFBU విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఆదివారం రాత్రి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌తో బ్యాంక్ యూనియన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ చర్చల అనంతరం ఇరువర్గాలు కొన్ని కీలక నిర్ణయాలకు అంగీకరించాయి. అన్ని శనివారాలను బ్యాంక్ సెలవులుగా ప్రకటించే (5 రోజుల వర్కింగ్) అంశాన్ని పరిశీలించేందుకు IBA, UFBU లతో కూడిన ఒక సంయుక్త కమిటీని తక్షణమే ఏర్పాటుకు అంగీకరించాయి. ఈ కమిటీ అన్ని అవకాశాలను అధ్యయనం చేసి, భాగస్వాములందరితో మాట్లాడి.. ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తుంది.

మరోవైపు స్కేల్ IV, అంతకంటే ఎక్కువ కేడర్ అధికారులకు వర్తించే PLI (పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్) స్కీమ్‌లో మార్పులు చేయడంపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియయేషన్ తో చర్చలు సైతం ప్రారంభం కానున్నాయి. తద్వారా వారి ఆందోళనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. మార్చి 8, 2024 నాడు పేర్కొన్న ఇతర పెండింగ్ సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరించడంపై చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలు ఫలించడంతో తాత్కాలికంగా తమ నిరసనలు, సమ్మెను విరమిస్తున్నట్లు UFBU ఆదివారం రాత్రి ప్రకటించింది. 

"5 రోజుల బ్యాంకింగ్ సేవల డిమాండ్‌ను సమీక్షించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసేందుకు IBA అంగీకరించింది. ఈ కమిటీలో UFBU ప్రతినిధులకు అవకాశం కల్పిస్తాం. భాగస్వాములందరినీ సంప్రదించిన తర్వాత కమిటీ ఈ డిమాండ్‌పై చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటుంది" అని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ అధ్యక్షుడు పేర్కొన్నారు. 

నేటి నుంచి ప్రారంభం కావాల్సిన సమ్మె
అన్ని బ్యాంకుల్లో వారానికి 5 రోజుల వర్కింగ్ డేస్ అమలు చేయడంతో పాటు సీనియర్ అధికారుల నూతన ప్రోత్సాహక పథకంలో (ఇన్సెంటివ్ స్కీమ్) మార్పులు చేయాలన్న డిమాండ్లపై  బ్యాంక్ యూనియన్లు అతిపెద్ద సమ్మెకు వెళ్లాలని భావించాయి. ముఖ్యంగా ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న ఫైవ్ డే బ్యాంకింగ్‌ను సాధించుకోవడానికి బ్యాంక్ ఉద్యోగులు సమ్మె బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే ఐబీఏతో జరిగిన చర్చల్లో కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో బ్యాంక్ యూనియన్స్ ప్రతినిధులు ప్రస్తుతానికి శాంతించారు.

Click here to Read More
Previous Article
Danam Nagender mind game: దానం నాగేందర్ బిగ్ మైండ్ గేమ్ - ఖైరతాబాద్ ఉపఎన్నిక వేళ మంత్రి పదవి షరతు.. కాంగ్రెస్ హైకమాండ్‌కు షాక్!?
Next Article
Crime Thriller OTT : 18 ఏళ్ల తర్వాత హిట్ జోడీ - 'కొత్త బంగారు లోకం' బాలు, స్వప్న క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment