Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Karuppu Shows Cancelled: సూర్యకు ఎదురుదెబ్బ... చిక్కుల్లో 'కరుప్పు' - మార్నింగ్ & ఓవర్సీస్ షోస్ క్యాన్సిల్

    1 day ago

    Karuppu Release Date Latest Update: కోలీవుడ్ స్టార్ సూర్యకు ఎదురు దెబ్బ తగిలింది. ఆయన కొత్త సినిమా 'కరుప్పు' చిక్కుల్లో పడింది. మార్నింగ్ షోలు క్యాన్సిల్ అయ్యాయి.

    Suriya Karuppu Movie Latest Update: కోలీవుడ్ స్టార్ సూర్యకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆయన లేటెస్ట్ సినిమా 'కరుప్పు' చిక్కుల్లో పడింది. అమెరికాలో సినిమా షోలు క్యాన్సిల్ అయ్యాయి. ఒక్క అమెరికా మాత్రమే కాదు... తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా మార్నింగ్ షోస్ కూడా క్యాన్సిల్ అయ్యే పరిస్థితి. అసలు ఏమైంది? ఎందుకీ సమస్యలు? అనే వివరాల్లోకి వెళితే...

    'కరుప్పు'ను చుట్టుముట్టిన ఫైనాన్షియల్ ఇష్యూలు!
    'కరుప్పు' సినిమాను సూర్య కజిన్స్ ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు ప్రొడ్యూస్ చేశారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై సినిమా తెరకెక్కింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ (Tamil Nadu CM Joseph Vijay) ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విడుదల అవుతున్న తొలి సినిమాగా రికార్డులకు ఎక్కింది కూడా. 

    'కరుప్పు' సినిమాకు విజయ్ ప్రత్యేక అనుమతులు ఇచ్చారు. ఆయన అధికారంలోకి రాకముందు తమిళనాడులో మార్నింగ్ షోస్ లేవు. పదకొండున్నర గంటలు దాటిన తర్వాత థియేటర్లలో మొదటి ఆట పడేది. విజయ్ వచ్చాక ఉదయం తొమ్మిది గంటలకు షోలు వేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. జీవో జారీ చేశారు. దాంతో త్రిష సినిమాకు విజయ్ బంపరాఫర్ ఇస్తున్నారా? అని కొందరు కామెంట్ చేశారు కూడా! అయితే... విజయ్ అవకాశం ఇచ్చినా తమిళనాట 'కరుప్పు' షోస్ పడటం లేదు. ఫైనాన్షియల్ ఇష్యూస్ కారణంగా మార్నింగ్ 9 గంటల ఆటలు రద్దు చేశారు. నిర్మాత ఎస్ఆర్ ప్రభు స్వయంగా ఆ విషయం ట్వీట్ చేశారు.

    Also Read: Karuppu Collections - సూర్య బాక్సాఫీస్ సత్తాకు అసలైన పరీక్ష... 'వీరభద్రుడు' అడ్వాన్స్ బుకింగ్స్ అంతేనా?

    అమెరికాలోనూ షోస్ క్యాన్సిల్... అక్కడ కష్టమే!
    తమిళనాడులో మాత్రమే కాదు... అమెరికాలోనూ 'కరుప్పు' షోస్ క్యాన్సిల్ అయ్యాయి. సాధారణంగా ఈ సమయానికి అక్కడ ప్రీమియర్స్ పడాలి. కానీ, పడలేదు. ప్రతి సినిమా విడుదలకు ముందు ఫైనాన్స్ క్లియర్ చేయాలి. కానీ, 'కరుప్పు' సినిమా నిర్మాతలకు ఫైనాన్స్ క్లియర్ చేయడంలో ఇబ్బందులు తలెత్తాయి. సుమారు 50 కోట్ల రూపాయలు బాకీలు చెల్లించాలని టాక్. దాంతో అమెరికాలో విడుదలకు ఇబ్బందులు తలెత్తాయి. అక్కడ మల్టీప్లెక్స్ ఫ్రాంచైజీ థియేటర్లు షోస్ క్యాన్సిల్ చేశాయి. ఒకవేళ క్లియరెన్స్ లభించినా సరే ఇంతకు ముందు షెడ్యూల్ చేసినన్ని షోలు ఉండవు.

    Also Read: Peddi Tickets Price - తెలంగాణలో 'పెద్ది'కి పెద్ద దెబ్బ... మైత్రి వర్సెస్ ఎగ్జిబిటర్స్ ఇష్యూలో చరణ్ సినిమాకు భారీ లాస్

    సూర్యకు గత పదేళ్ళలో సరైన సక్సెస్ రాలేదు. 'సింగమ్ 3' తర్వాత థియేటర్లలో విడుదలైన సినిమాలు బ్లాక్ బస్టర్లు కాలేదు. దాంతో 'వీరభద్రుడు'తో విశ్వరూపం చూపిస్తారని అభిమానులు ఆశించారు. అయితే... ఈ సినిమాకు ఆదిలో హంసపాదు ఎదురైంది. సినిమా విడుదలకు సమస్యలు అడ్డు పడ్డాయి. విడుదల రోజున ఈ విధంగా జరిగితే ప్రేక్షకులలో క్రేజ్ తగ్గుతుంది. తర్వాత హిట్ టాక్ వచ్చినా సరే ఆశించిన రీతిలో జనాలు థియేటర్లకు రారు. మరి, ఈ సినిమాకు ఏం జరుగుతుందో చూడాలి.

     

    Also Read: RGV On Bandi Bhagiratha - బండి భగీరథపై ఆర్జీవీ కామెంట్స్... సద్దాం హుస్సేన్ కొడుకుతో పోలుస్తూ ట్వీట్ - వైరల్

    Click here to Read More
    Previous Article
    Top Electric Scooters Above 120 Range: 120 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ కలిగిన టూవీలర్ ఈవీల జాబితా ఇదే! ధరలు, ఫీచర్స్ తెలుసుకోండి!
    Next Article
    Virat Kohli Surpasses MS Dhoni , Rohit Sharma: ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ అరుదైన రికార్డు - ధోనీ, రోహిత్ లను వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానానికి!

    Related సినిమా Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment