Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Drink Too Much Tea : టీ ఎక్కువగా తాగుతున్నారా? నిద్రలేమి, రక్తహీనతతో పాటు ఈ సమస్యలు రావొచ్చంటున్న వైద్యులు

    7 hours ago

    Side Effects of Drinking Too Much Tea : సందర్భం ఏదైనా టీ తాగే అలవాటు మీకు ఉంటే.. ఈ విషయాలపై కచ్చితంగా ఫోకస్ చేయాలని వైద్యులు చెప్తున్నారు. లేదంటే ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు.

    Risks of Excess Tea Consumption : ఉదయం లేవగానే టీ, సాయంత్రం మరో కప్పు టీ.. ఇలా రోజులో చాలామందికి టీ తాగడం ఒక అలవాటుగా మారిపోయింది. పరిమితంగా తీసుకుంటే టీ ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనాలు అందించినప్పటికీ.. అధికంగా తాగితే మాత్రం శరీరంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్‌కు చెందిన సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ కె. శేషి కిరణ్ మాట్లాడుతూ.. టీని మితంగా తీసుకుంటే పెద్దగా ఇబ్బంది ఉండదని, కానీ రోజులో ఎక్కువ టీ తాగితే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు.

    కెఫిన్ ఎక్కువైతే..

    టీలో కెఫిన్ అనే పదార్థం ఉంటుంది. రోజులో ఎక్కువ మొత్తంలో టీ తాగితే శరీరంలో కెఫిన్ మోతాదు పెరిగే ప్రమాదం ఉంది. దీని వల్ల ఆందోళన, అసహనం, చిరాకు, గుండె వేగంగా కొట్టుకోవడం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. కొందరిలో నిద్రలేమి సమస్య కూడా ఏర్పడుతుంది. నిద్ర సరిగా లేకపోతే ఏకాగ్రత తగ్గడం, మూడ్ మార్పులు, రోగనిరోధ

    ఐరన్ శోషణపై ప్రభావం

    టీలో టానిన్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఆహారంలో ఉండే ఐరన్ శరీరానికి సరిగా శోషించకుండా అడ్డుకోవచ్చు. ముఖ్యంగా మొక్కల ఆధారిత ఆహారాల్లో ఉండే నాన్-హీమ్ ఐరన్‌పై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

    శాకాహారులు, నెలసరి సమయంలో అధిక రక్తస్రావం ఉండే మహిళలు, ఇప్పటికే ఐరన్ లోపం లేదా రక్తహీనతతో బాధపడుతున్నవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా భోజనం చేసిన వెంటనే టీ తాగడం ఐరన్ శోషణను మరింత తగ్గిస్తుందని చెప్తున్నారు. 

    జీర్ణ సమస్యలు

    టీని అధికంగా తాగడం వల్ల కొందరిలో జీర్ణ సంబంధ సమస్యలు కూడా రావచ్చు. ముఖ్యంగా ఖాళీ కడుపుతో టీ తాగడం లేదా చాలా స్ట్రాంగ్ టీ తీసుకోవడం వల్ల వికారం, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు తలెత్తవచ్చు. అలాగే కెఫిన్‌కు సున్నితంగా స్పందించే వ్యక్తుల్లో తల తిరగడం, గుండె వేగం పెరగడం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు.

    గర్భిణులు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?

    గర్భిణీ స్త్రీలు టీ తీసుకునే పరిమాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అధిక కెఫిన్ తీసుకోవడం వల్ల గర్భధారణ సమయంలో కొన్ని సమస్యల ప్రమాదం పెరిగే అవకాశం ఉందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. అందువల్ల గర్భిణులు వైద్యుల సూచన మేరకు మాత్రమే టీ తీసుకోవడం మంచిదని డాక్టర్ కె. శేషి కిరణ్ సూచించారు.

    అలవాటు పడకండి

    రోజూ ఎక్కువ మొత్తంలో కెఫిన్ తీసుకోవడం వల్ల శరీరం దానికి అలవాటు పడే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఒక్కసారి అకస్మాత్తుగా టీ తాగడం తగ్గిస్తే లేదా పూర్తిగా మానేస్తే తలనొప్పి, అలసట, చిరాకు, ఏకాగ్రత లోపం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

    రోజులో ఎంత టీ తాగాలి?

    ఆరోగ్యవంతులైన పెద్దలు పరిమితంగా టీ తాగితే ఎలాంటి సమస్యలు ఉండవు. కాబట్టి రోజుకు ఒకటి లేదా రెండు కప్పులు తాగాలి. అంతేకాకుండా టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యానికి మేలు చేయవచ్చు. అయితే ఏదైనా ఎక్కువైతే సమస్యే. అందుకే రోజులో టీ పరిమాణాన్ని నియంత్రించడం, నిద్రకు ముందు టీ తాగకపోవడం, భోజనానికి ముందు లేదా వెంటనే తర్వాత టీ తీసుకోకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు లేకుండా టీని ఆస్వాదించవచ్చు.క శక్తి బలహీనపడటం వంటి సమస్యలు వస్తాయని తెలిపారు డాక్టర్ శేషి కిరణ్. 

    Click here to Read More
    Previous Article
    High Tension in Tadipatri: తాడిపత్రిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్.. భారీగా పోలీసు బందోబస్తు!
    Next Article
    Virat Kohli New Pastel Hairstyle: గాయంతో టీమ్‌కు దూరమైనా తగ్గేదేలే, సరికొత్త పేస్టెల్ హెయిర్ కలర్ లుక్‌లో కింగ్ కోహ్లీ.. ఫోటోలు వైరల్!

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment