Dipke CJP: 40 గంటల్లో రాజీనామా చేసి వెళ్లిపో - సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు సీజేపీ దీప్కే డెడ్‌లైన్

2 hours ago

CEC resignation: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు. రాజీనామాకు 48 గంటల అల్టిమేటం ఇచ్చారు. లేకపోతే దేశవ్యాప్త నిరసనలు చేస్తామని హెచ్చరించారు.

Nationwide protests EC India Gyanesh Kumar resignation:  భారత ప్రధాన ఎన్నికల కమిషనర్  జ్ఞానేష్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని సీజేపీ  వ్యవస్థాపకుడు, ప్రముఖ సామాజిక కార్యకర్త అభిజిత్ దీప్కే చేసిన వ్యాఖ్యలు దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ దుమారాన్ని రేపాయి. జ్ఞానేష్ కుమార్ దేశంలోనే అత్యంత పెద్ద దేశద్రోహి అని, భారత ప్రజాస్వామ్యానికి ఆయనే అతిపెద్ద ముప్పు అని దీప్కే తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఈసీ పదవికి ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో  సంచలన ప్రకటన చేశారు.

భారత ఎన్నికల సంఘం  విశ్వసనీయతను, పారదర్శకతను జ్ఞానేష్ కుమార్ పూర్తిగా దెబ్బతీశారని అభిజిత్ దీప్కే ఆరోపించారు. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రక్రియలో ఈవీఎం ల నిర్వహణ, విపక్షాల ఫిర్యాదులపై స్పందన,   అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం వంటి అంశాలపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు వెన్నెముక లాంటి ఎన్నికల సంఘాన్ని సీఈసీ తన చర్యల ద్వారా బలహీనపరుస్తున్నారని, ఇది దేశ భద్రతకు మరియు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతమని దీప్కే వాదించారు.
ఈ డిమాండ్‌పై స్పందిస్తూ, సీఈసీ జ్ఞానేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయడానికి అభిజిత్ దీప్కే 48 గంటల గడువు  విధించారు. ఈ 48 గంటల్లోగా ఆయన తప్పుకోకపోతే, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు,  ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని వర్గాల ప్రజలను, విపక్షాలను ఏకం చేసి, ఈ ఎన్నికల కమిషనర్ తీరుకు వ్యతిరేకంగా రోడ్లపైకి వస్తామని దీప్కే స్పష్టం చేశారు. రాబోయే 48 గంటలు దేశ రాజధానిలో ఎన్నికల సంఘం మరియు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. అభిజిత్ దీప్కే హెచ్చరించినట్లు దేశవ్యాప్త నిరసనలు ప్రారంభమైతే, అది పెద్ద రాజకీయ ఉద్రిక్తతలకు దారితీయవచ్చు.  
భారత ఎన్నికల సంఘంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ అమలు, ఓటర్ల జాబితాల సవరణపై తీవ్ర వివాదం రాజుకుంది. ఓటర్ల జాబితా నుంచి 12 కోట్లకు పైగా ఓట్లను తొలగించారని, ఎన్నికల వ్యవస్థ కేంద్రీకరణ పెరిగిందని ఆరోపణలు రావడం ప్రధాన కారణం. దానికితోడు ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్‌లో, మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్లు  సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి  కూడా సీఈసీ నిర్ణయాలు, ఫారమ్-6 నిబంధనల మార్పులపై 10 నెలల వ్యవధిలో దాదాపు 14 సార్లు అధికారికంగా తమ తీవ్ర అభ్యంతరాలను నమోదు చేసినట్లు వెలువడిన నివేదికలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. ఈ పరిణామాలు దేశ రాజధానిలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. విపక్షాలు , వివిధ హక్కుల సంఘాలు సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా స్వరం పెంచగా, సీజేపీ ఇచ్చిన 48 గంటల గడువుతో రాబోయే రోజుల్లో ఢిల్లీ వేదికగా దేశవ్యాప్త ఆందోళనలు తీవ్రతరమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి.

Click here to Read More
Previous Article
Danam Nagender:ఉపఎన్నికల్లో పోటీ చేస్తా.. ఏ పార్టీనో తరవాత చెబుతా - క్లారిటీ మిస్సయిన దానం
Next Article
Veeramani POCSO case: ఈ గ్రానైట్ కింగ్ .. తమిళనాడు ఎప్‌స్టీన్ - బాలికలపై అఘాయిత్యాలు - అరెస్ట్

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment