Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Bandi Bhagirath Files:బండి సంజయ్‌కు బిగ్‌షాక్! కుమారుడిపై ఫోక్సో కేసు నమోదు! హనీట్రాప్ అంటున్న భగీరథ్‌!

    4 days ago

    Bandi Bhagirath:కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడిపై హైదరాబాద్‌లో ఫోక్సో కేసు నమోదైంది. మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడినట్టు బాలిక పేర్కొంది. ఇదంతా హానీ ట్రాప్ అంటున్నారు బండి కుమారుడ భగీరథ్

    Bandi Bhagirath Files: తెలంగాణ రాజకీయాల్లో మరో కలకలం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులు, అత్యాచారం జరిగినట్టు సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. చట్టపరమైన నిబంధనల ప్రకారం, బాధితురాలు మైనర్ కావడంతో ఫోక్సో చట్టం కింద నమోదు చేశారు. 

    అందిన సమాచారం ప్రకారం, ఈ ఘటనలో బాధితురాలు కేవలం 17 సంవత్సరాల వయసు ఉన్న బాలిక. భగీరథ్‌ సదరు బాలికకు మద్యం తాగించి, తనపై అత్యాచారం చేసినట్టు ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. మొయినాబాద్లోని ఒక ఫామ్‌ హౌజ్‌తోపాటు మరో రెండు ప్రాంతాల్లో జరిగినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడానికి వచ్చినప్పుడు పేట్ బషీర్‌బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నిన్న అర్ధరాత్రి సుమారు 6 గంటలపాటు పోలీస్ స్టేషన్ వేదికగా హైడ్రామా నడిచింది. నిందితుడు కేంద్రమంత్రి కుమారుడు కావడంతో పోలీసులు తీసుకోవడానికి మొద వెనుకడుగు వేశారని ఆరోపణలు వచ్చాయి. అయితే బాధితుల ఒత్తిడి మేరకు పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. 

    అయితే ఇదంతా హనీ ట్రాప్‌ను బండి భగీరథ్‌  కేసు నమోదు చేశారు. కరీంనగర్‌ టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ప్రకారం చాట్ల అన్వి అనే యువతి తనతో స్నేహం పేరుతో పరిచయం పెంచుకుందని, ఆ పరిచయంతో ఆమె తన కుటుంబ వేడుకలకు, గ్రూప్ మీటింగ్స్‌కు ఆహ్వానించేంది. కొన్ని పవిత్ర స్థలాలకు కూడా వెళ్లినట్టు సమాచారం. అయితే కొంత కాలం తర్వాత తన అసలు రంగును బయటపడిందని, చాట్ల అన్వి, ఆమె తల్లిదండ్రులు తన పెళ్లి విషయంలో ఒత్తిడి తీసుకువచ్చినట్టు పేర్కొన్నారు. ఈ ప్రతిపాదన తిరస్కరించంతో వారు బెదిరంపులకు దిగారు. ఒక వేళ తమ మాట వినకపోతే, వేధింపులు, శారీరక సంబంధం పెట్టుకున్నాడనే తప్పుడు ఆరోపణలతో క్రిమినల్‌ కేసులు పెడతామని వారు హెచ్చరించినట్టు ఫిర్యాదులో ఉంది. 

    ఈ క్రమంలో భయపడిన భగీరథ్‌, ఆరోపణల నుంచి తప్పించుకోవడానికి మొదట అన్వి తండ్రికి యాభై వేల నగదు ఇచ్చామన్నారు. అయితే వారు అంతటితో ఆగకుండా తమ డిమాండ్‌ను ఐదు కోట్లకు పెంచారని తెలిపారు. ఆ డబ్బు ఇవ్వకుంటే అన్వి తల్లి ఆత్మహత్య చేసుకుంటుందని, ఆ నెపం భగీరథ్‌పైనే వేస్తామని వారు బెదిరించినట్టు పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ద్వారా తెలుస్తోంది. 

    Click here to Read More
    Previous Article
    Rajinikanth: రజనీకాంత్‌పై విజయ్ ఫ్యాన్స్ ట్రోలింగ్... తలైవాది డబుల్ స్టాండర్డ్స్ ఆ?
    Next Article
    Vijay Deverakonda: అభిమానుల సమక్షంలో విజయ్ దేవరకొండ బర్త్ డే... రష్మికతో సందడి

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment