Rains In AP and Telangana: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీ, తెలంగాణలో 4 రోజులపాటు వర్షాలు, ఆరెంజ్ అలర్ట్ జారీ

1 hour ago

Telangana Rains | అల్పపీడనం తూర్పు, మధ్య బంగాళాఖాతంలో సోమవారం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో 4 రోజులపాటు వర్షాలు కురవనున్నాయి.

Heavy Rains in Andhra Pradesh | అమరావతి: ఉత్తర అండమాన్, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా పయనించి, తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది మరింత బలపడి సెప్టెంబర్ 21న తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. అనంతరం ఇది మంగళవారానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారి, పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బుధవారం నాటికి దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర తీరాలకు సమీపంలో ఉన్న పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
అల్పపీడనంతో నెలకొన్న తాజా వాతావరణ పరిస్థితుల కారణంగా ఏపీలో 4 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సోమవారం, మంగళవారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవనుండగా, బుధవారం, గురువారాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ సమయంలో తీరం వెంట గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. మఖ్యంగా సోమవారం నాడు అల్లూరి సీతారామరాజు, పోలవరం, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

తెలంగాణలో 3 రోజులపాటు భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో తెలంగాణలో 3 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సెప్టెంబర్ 23, 24, 25 తేదీల్లో ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా ప్రయాణించి, 22 నాటికి తీవ్ర వాయుగుండంగా మారి, 23వ తేదీ ఉదయానికి ఉత్తర ఆంధ్రప్రదేశ్- దక్షిణ ఒడిశా తీరాల సమీపానికి చేరుకుంటుందని అంచనా వేశారు. 

ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, ఖమ్మం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జనగామ జిల్లాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేశారు. సోమవారం  ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

 

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో అత్యధికంగా 13.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని పెద్దకొత్తపల్లి, కోడేరు మండలాల్లోనూ భారీ వర్షం కురిసింది. నారాయణపేట, వనపర్తి, సంగారెడ్డి, సిద్దిపేట, రంగారెడ్డి, జగిత్యాల, ములుగు, ఖమ్మం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయని అధికారులు తెలిపారు. 

Click here to Read More
Previous Article
Sharmila Daughter Wedding: కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. YSRకు ఫస్ట్ కార్డ్
Next Article
Danam Nagender Khairatabad bypoll: ఖైరతాబాద్ ఉపఎన్ని ఖాయమే - సుప్రీంలో ఊరట కష్టమే - కాంగ్రెస్‌కే ఎడ్జ్ ఉందా?

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment