Abhishek, Vaibhav Batting Flaws Highlighted: ఇంట్లో పులులు, విదేశాల్లో పిల్లుల్లాగా మారొద్దు.. అభిషేక్ ,వైభవ్ బ్యాటింగ్‌పై దిగ్గ‌జ ప్లేయ‌ర్ హెచ్చరిక

1 hour ago

స్వదేశంలో విధ్వంసం సృష్టిస్తున్న యువ ఓపెనర్లు విదేశీ పిచ్‌లపై స్వింగ్ బౌలింగ్‌ను ఎదుర్కొనే విషయంలో తమ బలహీనతలను సరిదిద్దుకోవాలని సందీప్ పాటిల్ సూచించాడు.

Former Indian Allrounder Urges Young Openers To Improve Overseas Batting:  భారత యువ డాషింగ్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీల దూకుడైన ఆటతీరును ప్రశంసిస్తూనే వారి బ్యాటింగ్‌లోని ప్రధాన లోపాలను భారత మాజీ ఆల్‌రౌండర్ సందీప్ పాటిల్ ఎత్తిచూపాడు. ఈ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు సొంతగడ్డపై ఎంత ప్రమాదకరమైన ఆటగాళ్లో, విదేశీ పిచ్‌లపై బంతి స్వింగ్ అయ్యే పరిస్థితుల్లో అంతగా ఇబ్బంది పడుతున్నారని తెలిపాడు. జూలై నెలలో జరిగిన ఇంగ్లాండ్ పర్యటనను గుర్తుచేస్తూ, భారత పిచ్‌లపై చూపించినంత ప్రభావాన్ని వీరు అక్కడ చూపలేకపోయారని వ్యాఖ్యానించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అభిషేక్ 131 పరుగులు మాత్రమే చేయగా, అదే పర్యటనలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సంచలన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ మూడు మ్యాచ్‌ల్లో కేవలం 42 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

విదేశీ టూర్లలో స్వింగ్ తిప్పలు..
ఈ ఇద్దరు యువ ఓపెనర్ల బ్యాటింగ్ తీరుపై తాజాగా మాట్లాడిన సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. "అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీల పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది. అయితే వారు ఇండియా వెలుపల ఆడినప్పుడు, బంతి కాస్త స్వింగ్ అవ్వడం మొదలైనప్పుడు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడం మనం చూశాం. ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు ఆ టెక్నికల్ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి తమ ఆటను మెరుగుపరుచుకోవాలి. ఇంట్లో పులి లాగా, విదేశాల్లో పిల్లి లాగా మారే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు" అని అతడు సూచించాడు.

పూర్తి స్వేచ్చ‌..
ఇంగ్లాండ్ టూర్ తర్వాత జింబాబ్వేపై 3-0తో భారత్ సిరీస్ గెలిచినప్పుడు వైభవ్ సూర్యవంశీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఇటీవల అఫ్గానిస్తాన్‌తో ముగిసిన మూడో టీ20లో అభిషేక్ శర్మ కేవలం 30 బంతుల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ బాది ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ తనను ఏమాత్రం ఆశ్చర్యపరచలేదని పాటిల్ పేర్కొన్నాడు. "అభిషేక్ శర్మ 30 బంతుల్లోనే సెంచరీ చేయడం, భారత జట్టు కేవలం ఆరు ఓవర్ల పవర్‌ప్లేలోనే 100 పరుగులు బాదడం అద్భుతమైన విషయం. ఆధునిక క్రికెట్‌లో యువ ఆటగాళ్లకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చారు, వారు దాన్ని సరైన రీతిలో వాడుకుంటున్నారు. అభిషేక్ అయినా, వైభవ్ అయినా వారు చూపిస్తున్న నిబద్ధత నిజంగా మెచ్చుకోదగినది" అని ప్ర‌శంసించాడు.

ఫస్ట్ బాల్ నుంచే దూకుడు..
ఈ యువ బ్యాటర్ల దూకుడుపై పాటిల్ సంతృప్తి వ్య‌క్తం చేశాడు. "వారి వద్ద అపారమైన పవర్, నాణ్యమైన నైపుణ్యం ఉన్నాయి. సగం మనసుతో ఆడటం అనే ప్రశ్నే లేదు. మొదటి బంతి నుంచే పూర్తి నిబద్ధతతో భారీ షాట్లకు వెళ్తున్నారు. తమ శక్తిసామర్థ్యాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటున్నారు" అని అతడు ప్ర‌శంసించాడు. విదేశీ గడ్డపై స్వింగ్ పరిస్థితులను తట్టుకుంటే వీరు ప్రపంచ క్రికెట్‌ను ఏలే సత్తా కలిగి ఉన్నారని సూచించాడు.

Click here to Read More
Previous Article
NZ Tour Workload Crisis Alert: కివీస్ టూర్‌లో షెడ్యూల్ రచ్చతో భారత్‌కు తలనొప్పి.. చివరి రెండు వన్డేలకు స్టార్లకు రెస్ట్ ఇచ్చే యోచన
Next Article
CM Chandrababu: గ్రే గ్రోత్ నుంచి గ్రీన్ గ్రోత్ వైపు అడుగులు - డీకేతో కలిసి ది ఎర్త్ సెంటర్‌ ప్రారంభించిన చంద్రబాబు

Related స్పోర్ట్స్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment